1. బొడ్డు నుండి 4 అంగుళాలు వదలి దారంతో ముడి వేసి, ముడి క్రింద బొడ్డు కత్తిరించాలి.
  2. ఈనిన వెంటనే బొడ్డుకు టింక్చర్ అయోడిన్ రాయాలి.
  3. టెట్‌వ్యాక్ (TETVAC) ఇంజక్షను ధనుర్వాతం రాకుండా పుట్టిన 2,3 రోజులలో చేయించాలి.
  4. పుష్కలంగా రోజుకు 3 లీటర్లకు మించకుండా జున్ను పాలు త్రాగించాలి.
  5. ఇన్‌ఫెరాన్ (INFERON) ఇన్‌జెక్షన్ 3వ రోజు, 7వ రోజు కండకు IM గా చేయించాలి.
  6. దూడలకు కొమ్ములు రాకుండా (DEBUDDING OF HORNS) చేయడం మంచిది.
  7. పశువులు ఒకదానిని మరొకటి పొడుచుకోవటం ద్వారా కొమ్ముల వల్ల గాయాలు, ప్రమాదాలు జరుగుతాయి. కొమ్ముల వల్ల మనుషులకు కూడా గాయాలు ఏర్పడతాయి.
  8. కొమ్ములు రాకుండా చేయటానికి దూడకు వారం రోజుల వయసు అనుకూలమైన సమయం.
  9. వారం రోజుల వయస్సులో కొమ్ములు చిన్న బుడిపెలుగా వుంటాయి.
  10. చిన్న ఇనుప బిళ్ళను ఎర్రగా కాల్చి కొమ్ము బుడిపె మీద తాకించితే, కొమ్ము కుదురు మాడిపోయి కొమ్ములు పెరగవు.
  11. కొమ్ము బుడిపె మీద కాస్టిక్ సోడా (CAUSTIC SODA) ను పట్టకారుతో పట్టుకొని రుద్దితే కొమ్ములు పెరగవు.
  12. DEBUDDER అనే విద్యుత్ పరికరం ఉపయోగించటం సులభం.
  13. కొమ్ము బుడిపె వరకు మాత్రమే కాల్చాలి
  14. బుడిపెలు కాల్చిన తరువాత పోవిడిన్ (POVIDONE) మందు రాయాలి.
  15. ప్రతి రోజూ పోవిడిన్ (POVIDONE) గానీ నూనెలో కలిపిన పసుపు గానీ రాయాలి.
  16. టెటనస్ టాక్సాయిడ్ (TETANUS TOXOID) ఇంజక్షను చేయాలి.
  17. మడు రోజులు టెట్రాసైక్లిన్ పొడి తినిపించాలి.
  18. మట్టి తినకుండా మతికి చిక్కం గానీ, బుట్ట గానీ కట్టాలి.
  19. ఏ కారణంగానైనా పరాన్న జీవుల భారం వున్నట్లుగా అనుమానం వుంటే, పశువైద్యుని సంప్రదించి, పరాన్నజీవుల భారాన్ని అంచనా వేసి, తదనుగుణంగా మందులను వాడాలి.
  20. బాహ్యపరాన్న జీవులను నిర్మూలించాలి.
  21. దూడకు గానీ, తల్లికి గానీ జ్వరం వచ్చినా, పాలను త్రాగించటం మానవలసినవసరం లేదు. ఎటువంటి సమస్యా కలగదు.
  22. రెండు వారాల వయసు నుండి లేత పిల్లి పెసర, బొబ్బర, చిప్పర, గరిక వంటి పశుగ్రాసాలు గానీ, ఎండు జనుము వంటి పప్పు జాతికి చెందిన పశుగ్రాసాలు కొద్ది కొద్దిగా తినిపించటం ప్రారంభించాలి. దీని వల్ల మేత పట్ట్టి, త్వరగా జీర్ణశక్తి పెరుగుతుంది.
  23. 20 రోజుల వయస్సు నుండి దూడల దాణా (CALF STARTER) ను తినిపించవచ్చు.
  24. రెండు నెలల వయస్సు నుండి సమతుల దాణా మిశ్రమం తినిపించవచ్చు.. నిదానంగా అప్పటి నుండి పాలు తగ్గించవచ్చు.
  25. రోజుకు కనీసం రెండు గంటలకు తక్కువ కాకుండా దూడలకు వ్యాయామం అవసరం.
  26. పశుశాలలలో సాల్ట్ బ్రిక్స్ (SALT BRICKS) / మినరల్ బ్రిక్స్ (MINERAL BRICKS) / సైంధవ లవణం (ROCK SALT) గడ్డలు దూడలు నాకటానికి వీలుగా అందుబాటులో వుంచాలి.
  27. దూడకు తల్లి దగ్గర పాలు మాన్పించిన తరువాత కేవలం గడ్డి, దాణా మీద మాత్రమే ఆధారపడుతుంది. కనుక దాణా మోతాదు కొద్దికొద్దిగా పెంచుతూ దూడ పెరుగుదలను గమనించాలి.
    ……………………………………………………………………………………
    రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.