భారత పాడి పరిశ్రమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు ‘శ్వేత విప్లవం 2.0’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. మహిళా సాధికారత, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. 67,930 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల కంప్యూటీకరణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను విడుదల చేశారు. శ్వేత విప్లవం 2.0 కింద రాబోయే ఐదేళ్ళలో డెయిరీ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణ 50 శాతం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు నిధులు సమకూరుస్తుంది.

20 Sep, 2024
