మనుషులలో కరోనా వైరస్ లాగానే పశుగణాలను కూడా వేధిస్తున్న అంటువ్యాధుల్లో మహా ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని ఆంగ్లంలో ‘ఫుట్ అండ్ మౌత్ డిసీజ్’ అని అంటారు.
కలుషితమైన గాలి ద్వారా సోకే ఈ గాలికుంటు వైరస్ వ్యాధి ఒకప్పుడు మార్చి నుండి సెప్టెంబర్ మాసాల మధ్య వ్యాపించేది, కానీ ఈ మధ్యకాలంలో ఏడాది పొడవునా పశువులు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి పశువులలోనే కాక సన్నజీవాలకు వ్యాప్తి చెందుతుంది.
పరిచయం: ఎఫ్.యం.డి. (ఫుట్ అంట్ మౌత్ డిసీజ్) అనగా గాలికుంటు వ్యాధి అని అంటారు. ఈ వ్యాధి ముఖ్యంగా వైరస్ (జుచీశినీళిఖీరిజీతిరీ) వలన వ్యాప్తి చెందుతుంది. ఎఫ్.యం.డి. (గాలికుంటు వ్యాధి) అనేది వేగంగా ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాప్తి చెందును. (ఇది ఇన్ఫెక్షియస్ మరియు కంటేజియస్ వ్యాధి). ఈ వ్యాధి ప్రత్యేకంగా రెండు గిట్టలు కలిగినటువంటి జంతువులు ఉదా: ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులకు వ్యాపిస్తుంది.
కారకము
- ఈ వ్యాధి 7 రకములు కలిగి ఉన్న జుచీశినీళిఖీరిజీతిరీ వలన కలుగుతంది.
- మన దేశంలో ం, జు, ్పు, జురీరిబి-| రకాలు వలన వ్యాప్తి చెందుతుంది.
- ఈ వ్యాధి పశువులకు అన్నింటికీ సోకుతుంది కానీ. ఈ వ్యాధి బారిన పడినటువంటి పశవుల మరణాలు చాలా తక్కువగా ఉంటాయి.
వ్యాధి వ్యాప్తి
- పశువులు తినే గడ్డి, మేత, కలుషితమైన గాలి ద్వారా సోకే అవకాశం కలదు. అలాగే పశువుల శాఖలో పనిచేయువారి వలన, గడ్డి కోయు యంత్రాల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
- తల్లి పాల ద్వారా దూడలకు వ్యాప్తి చెంది మొత్తం పశుగణం అంతా వ్యాధిబారిన పడే ప్రమాదం కలదు. కావున రైతులు జాగ్రత్త వహించి, తగిన నివారణ చర్యలు ముందుగా తీసుకోవలెను.
వ్యాధి లక్షణాలు:
- వ్యాధి సోకిన పవువులు ఈ క్రింది తీవ్రమైన లక్షణాలను చూపుతాయి.
- ఈ వ్యాధిబారిన పడిన పశువులు అధిక జ్వరం (105-106 డిగ్రీ ఫారెన్‌హీట్) (40-41 డిగ్రీ సెంటీగ్రేడ్)తో బాధపడుతుంటాయి. మరియు మేత తినడం ఆపివేయును.
- పాలిచ్చే పశువుల యందు పాలదిగుబడి గణనీయంగా తగ్గిపోవును.
- ఒకటి లేదా రెండు రోజులలో జ్వరం తగ్గుముఖం పట్టినప్పటికీ నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి ఉండును, నోటి నుండి తీగల వంటి జొల్లు కారడం మరియు అధికంగా లాలాజలం ఊరడం అనేది జరుగుతుంది.
- వ్యాధి సోకిన పశువు నోరు తెరచి గమనించినట్లయితే నోటి లోపల మరియు నాలుకపై పుండ్లు (1-2 సెం.మీ. డయామీటర్) కనిపించును. అంతేకాక గిట్టల మధ్యన పుండ్లు ఉండటంవలన పశువు సరిగా నడవలేక పోతుంది. వీటిని గమనించిన వెంటనే పశువైద్యులని సంప్రదించాలి.
చికిత్స: పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో గిట్టల మధ్య పుండ్లను బాగా శుభ్రంగా కడగవలెను.
- నోటిలోని పుండ్లను ఉప్పు నీటితో కడగవలెను. అలాగే బోరిక్ పౌడర్+గ్లిసరిన్ పేస్ట్‌ను పూత ముందుగా రాసినట్లయితే పుండ్లు తగ్గుముఖం పడతాయి.
- నోటిలో పుండ్లు ఉండటం చేత మేత తీసుకొనలేవు కాబట్టి మెత్తటి పదార్థాలను అనగా రాగి జావ త్రాగించడం వంటివి, గంజి లాంటి ద్రవ పదార్థాలను మేతగా ఇవ్వవలెను.
- పుండ్ల పైన ఈగలు వాలకుండా మరియు యాంటిసెప్టిక్ ఆయింట్‌మెంట్‌లని ఉపయోగించవలెను.
- బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆంటిబయోటిక్ మందులు మరియు శ్రీఐజు|ఈని మూడు నుండి ఐదు రోజుల వరకు వాడవలెను.
- ఈ వ్యాధి సోకడం వలన శక్తి కోల్పోతాయి. కాబట్టి మల్టీ విటమిన్ సిరప్‌లు మరియు లివర్ టానిక్ మందులను వాడుకోవలెను.
నివారణ చర్యలు
- వ్యాధి సోకిన తరువాత మందులు వాడినప్పటికీ తక్కువ ఫలితాలను ఇచ్చును. కాబట్టి ముందస్తు టీకాలు వేయించుకోవాలి.
- ఈ వ్యాధి సోకకుండా ఉండుటకు వేయు టీకాలు ముఖ్యంగా రెండు దఫాలుగా వేస్తారు. అనగా 6 నెలలకి ఒకసారి టీకాలు వేయించుకోవాలి.
- ఈ వ్యాధి సోకకుండా వేయు టీకా మందులను ఫిబ్రవరి/మార్చి మరియు ఆగస్టు/సెప్టెంబర్ మాసాల యందు వేస్తూ ఉంటారు.
- చిన్నపాటి జ్వరం మరియు పాలు తగ్గినప్పటికీ అధైర్యపడకుండా ఈ టీకాలు వేయించుకున్నట్లయితే పశువులలో ఈ వ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చును.
- 4 నెలలు మరియు ఆపై వయస్సు కలిగిన దూడలకి, పశువులకి టీకాలు వేయించాలి.
నియంత్రణ: వ్యాధి సోకిన పశువుల నుండి ఆరోగ్యకరమైన పశువులను దూరంగా ఉంచాలి. పశువులు ఉండు ప్రదేశం నందు వాషింగ్ సోడా లేదా సున్నం పిచికారి చేయడం వలన వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన పశువులకు కూడా టీకాలు వేయించాలి.
డా. యం. వెంకట ప్రసన్న, ఎం.వి.ఎస్.సి., పశువైద్యురాలు, మైదుకూరు. సెల్: 83097 24436

