నూజివీడు మార్కెట్ యార్డు ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి మామిడి రైతులు, వ్యాపారులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చ జరిగింది. వచ్చే మామిడి సీజనుకు నూజివీడులో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటుకు, అభివృద్ధికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని, ఫ్రూట్ కవర్లు అందించటానికి చర్యలు తీసుకుంటామని, మామిడి రైతులకు అవసరమయిన అన్ని సౌకర్యాలు కల్పించటానికి, నూజివీడు మామిడికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు రావడానికి తగిన చర్యలు వ్యవసాయ శాఖ మంత్రితో సంప్రదించి తీసుకుంటామని రైతులకు మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.

5 Jul, 2024
