ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో భారీ పెరుగుదలను నమోదు చేసి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గణాంకశాఖ నివేదిక వెల్లడి చేసింది. ఆక్వారంగంలో గత పన్నెండేళ్లుగా మొత్తం స్థూల ఉత్పత్తి విలువలో ఏపీ ఎక్కడా తగ్గలేదు. క్రమంగా ఉత్పత్తి పెరుగుతూనే ఉంది.
చేపలు, రొయ్యల ఉత్పత్తిలో వాటా (శాతంలో)
రాష్ట్రం 2011-12 2022-23
ఆంధ్రప్రదేశ్ 17.7 40.9
పశ్చిమబెంగాల్ 24.6 14.4
ఒడిశా 3.9 4.9
బీహార్ 4.5 4.5
అస్సాం 5.5 4.1
‘ఉద్యాన’ ఉత్పత్తులలో వృద్ధి
పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో పశ్చిమబెంగాల్, తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర ఉన్నాయి. గత 12 ఏళ్ళల్లో మధ్యప్రదేశ్ వాటా 6.3% నుంచి 10.9 శాతానికి, యూపీ 7.2 నుంచి 10.5కి చేరగా, మహారాష్ట్ర వాటా 10.4 నుంచి 9.9 శాతానికి తగ్గింది. ఏపీ వాటా 5.8 నుంచి 8.2 శాతానికి పెరిగింది.
పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఏపీ వాటా
సంవత్సరం వాటా (శాతంలో)
2011-12 5.8
2022-23 8.2
పశుగణ ఉత్పత్తిలో నాలుగో స్థానం
మరోవైపు పశుగణ ఉత్పత్తిలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ తొలి స్థానంలో ఉండగా, యూపీ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్ర ఐదో స్థానం దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పశుగణ ఉత్పత్తి విలువలో ఏపీ వాటా 2011-12 నుంచి 2022-23కు 7.0% నుంచి 7.8% మాత్రమే పెరిగింది.

