గోదావరి నదిపై కడుతున్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఉత్తరాంధ్రకు నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకుగాను పురుషోత్తమ పట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా 2,500 క్యూసెక్కుల గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని అనకాపల్లి పర్యటనలో చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమకాలువ 214 కి.మీ. మేర నిర్మించాలి. ముందు 800 కోట్ల రూపాయలతో 93 కి.మీ. వరకు కాలువను నిర్మించుకుంటే 2.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందివ్వటానికి అవకాశం ఉంది కనుక ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు.

12 Jul, 2024
