దీపావళి పండుగ ముంగిట ప్రధాని మోదీ కర్షకులకు తీపి కబురు చెప్పారు. ఆరు రబీ పంటలకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పంటల మద్దతు ధరలను ఉత్పాదక వ్యయం కన్నా 5 రెట్లు అధికంగా ఉండేలా చూస్తామన్న హామీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గోధుమ, శనగ, మసూర్ దాల్, ఆవాలు, బార్లీ, కుసుమ పంటల మద్దతు ధరలను పెంచింది. వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే 2025-26 మార్కెటింగ్ ఏడాది కోసం ఈ ధరలను నిర్ణయించింది.


