ఎన్నడూలేని విధంగా తెలంగాణా ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో 60 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికే కేటయించడానికి రెడీ అవుతున్నది. ఈ సొమ్మును ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి, పంటల బీమాకు పెద్ద పీట వెయ్యడానికి, రైతు బీమాకు సంబంధించి ప్రీమియం బాధ్యత సర్కారు వహించడానికి, ఉద్యాన పంటల సాగులో కొత్త ఊపును తేవడానికి కేటాయించడానికి సిద్ధం అవుతున్నారు. వీటన్నింటితో పాటు పామాయల్ సాగు కోసం వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం కూడా జరిగింది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ తన ప్రాధాన్యతలను ఆర్థిక శాఖకు తెలియచేయడం జరిగింది.

10 Jul, 2024
