ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద ఈనెల 5వ తారీఖున రైతుల బ్యాంకు ఖాతాలో రూ. 2000/-లు జమ కానున్నాయి. దేశంలోని 9.5 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 2000/-ల చొప్పున బదిలీ చేస్తారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడి మహారాష్ట్రలోని వాషిమ్ నుండి అక్టోబర్ 5న రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. కొత్తగా ఈ పథకంలోకి అర్హత పొందాలనుకునే రైతులు అక్టోబరు 5 లోపు బ్యాంకు ఖాతా యొక్క లి-దిగిబీ ని పూర్తి చేయడం తప్పనిసరి. లి-దిగిబీ తో పాటు పి.యం. కిసాన్ లబ్దిదారుడు భూమి ధృవీకరణను పొందడం కూడా అవసరం. రైతుల బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానించడం కూడా చాలా ముఖ్యం.

1 Oct, 2024
