పంటలను ఆశిస్తున్న చీడపీడలను గుర్తించి త్వరితగతిన నివారణ సలహాలు, సూచనలు అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ DPPQS, ICAR శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ (NPSS) మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆడిటోరియంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతులమీదుగా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. రైతులు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లోని స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ పంటపొలాల్లో చీడపీడలను ఫొటోలు తీసి NPSS యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. వెంటనే ఆ తెగుళ్ళను గుర్తించటంతోపాటు సమగ్ర సస్యరక్షణ సూచనలు రైతులకు అందుతాయి. దేశవ్యాప్తంగా చీడపీడల సమాచారం ఫరీదాబాద్‌లోని DPPQS కేంద్ర కార్యాలయంలో నిక్షిప్తం చేసి ఉండటం వల్ల ఏ ప్రాంతంలోని చీడపీడల గురించి అడిగినా వెంటనే సూచనలు అందుతాయి.

16 Aug, 2024
