శ్రీ బి ఉదయ్ భాస్కర్ 01 అక్టోబర్ 2024న నాబార్డ్, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం యొక్క చీఫ్ జనరల్ మేనేజర్ (CGM)గా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ ఉదయ్ భాస్కర్‌కు డెవలప్మెంట్ బ్యాంకింగ్‌లో 31 సంవత్సరాల గొప్ప అనుభవం ఉంది. ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ANGRAU)లో వ్యవసాయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు.
1993లో కర్ణాటక రాష్ట్రంలో నాబార్డ్‌లో చేరిన శ్రీ ఉదయ్ భాస్కర్ జార్ఖండ్, కర్ణాటక, APలోని ప్రాంతీయ కార్యాలయాలు మరియు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన నాబార్డ్‌లో గ్రామీణ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్, రీఫైనాన్స్, క్రెడిట్ ప్లానింగ్, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, MSME సెక్టార్, గ్రామీణ సహకార సంస్థల అభివృద్ధి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, తదితర రంగాలలో వివిధ రకాలైన పోర్ట్‌ఫోలియోలను వివిధ ఉన్నత స్థానాల్లో నిర్వహించారు.
ఆయన నాబార్డ్, వరంగల్ (పూర్వం AP) లో జిల్లా అభివృద్ధి అధికారిగా (DDM) కూడా పనిచేశారు. జిల్లాలో వాటర్‌షెడ్ మరియు గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) స్థాపన మరియు అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత అభివృద్ధి, SHG- బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలు, ఆర్ధిక సమ్మేళనం, మొదలైన అనేక కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు.

3 Oct, 2024
