కౌంజు పిట్టలనే ‘క్వయిల్’, ‘పరిఘ’ పకక్షులు అని అంటారు. ఇవి చూడడానికి చిన్నగా, మన పిచుకుల మాదిరిగా/కొంచెం పెద్దవిగా ఉండి, కరెంటు తీగల మీద అలా తారసపడుతూ ఉంటాయి. అయితే అవి అడవి జాతికి చెందినవి. అయితే షెడ్డులో పెంచుకోవడానికి అనువైన రకం ఒకటి జపనీస్ క్వయిలు.
ఈ జపనీస్ క్వయిలును మాంసం మరియు గ్రుడ్ల ఉత్పాదన / రెండింటి కొరకు పెంచుకొనవచ్చును. మిగతా కోళ్ళ రకాలతో పోల్చినట్లయితే క్వయిల్/కౌంజు పిట్టలకు వ్యాధి నిరోధక చాలా ఎక్కువ, ఎటువంటి టీకాలు అవసరం లేదు. ఈ పిట్టలు 5 వారాల వయస్సుకే మాంసం కొరకు అమ్మవచ్చును. ఆరవ వారం నుండి ఇవి గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి.
ఐదు వారాల వయస్సులో ఇవి 180-220 గ్రా. వరకు బరువు తూగుతాయి. మరియు వీటి మాంసంలో మాంసకృత్తులు మిగతా కోళ్ల మాంసం కంటే అధిక మోతాదులో లభిస్తాయి. దేశంలో మొత్తం పౌల్ట్రీ పాపులేషన్‌లో 1.8% కౌంజు పిట్టలు ఉన్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన తలసరి ఆదాయం కలిగిన అవగాహనల మూలాన నేడు రైతులు ప్రత్యామ్నాయ కోళ్ల పెంపకం పట్ల మక్కువ చూపిస్తున్నారు. అటువంటి వాటిలో కౌంజు పిట్టల పెంపకం ఒకటి.

కౌంజు పిల్లల పెంపకం :
కౌంజు పిట్టలు ఉదర భాగం బూడిద రంగు కలిగి శరీరం మొత్తం ముదురు నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. బయట మార్కెట్ నందు ఒక రోజు వారి పిల్లలు లభ్యం అవుతాయి. పిల్లలు 7-9 గ్రా. బరువు ఉండి సున్నితంగా ఉంటాయి. వీటికి మొదటి వారంలో 95-99 ఫారెన్‌హీట్ వరకు వేడిని అందించాలి. మొదటి వారంలో తీసుకునే జాగ్రత్తలు దాదాపు ఫారం కోడి పిల్లల బ్రూడింగ్ మాదిరిగానే చేసుకోవాలి. కాకపోతే కౌంజు పిట్టల యొక్క చిన్నపాటి శరీరం వలన వాటికీ మాములు ఇతర కోడి పిల్లల కంటే అధిక ఉష్ణోగ్రతను అందించాలి.
ఒక్కొక్క బ్రూడర్ 100-150 అంగుళాలు వెడల్పుగా ఉన్నట్లయితే దానితో 250-300 వరకు పిల్లలను ఉంచవచ్చును. మొదటి వారం తరువాత నుండి ఉష్ణోగ్రతను 5 ఫారెన్‌హీట్ చొప్పున తగ్గిస్తూ అది 70, 75 ఫారెన్‌హీట్ వచ్చే వరకు బ్రూడింగ్ చేయాలి. దాదాపు 3 వారాల వయస్సు వచ్చేసరికి ఈకలు బాగా పెరిగి మగ, ఆడ కౌంజులను వేరుచేయుటకు అవుతుంది (లింగబేధం తెలుస్తుంది).
సాధారణంగా ఆడ పకక్షులు ఉదర భాగంలో ఉండే ఈకలపైన నల్లటి మచ్చలు ఉండి మగ వాటి కంటే అధిక బరువు తూగుతాయి. మగ పకక్షులు ఉదర భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. 5 వారాల వయస్సు వచ్చేసరికి ఆడ కౌంజులు 220 గ్రా.ల వరకు, మగవి దాదాపు 180-190 గ్రా. వరకు బరువు తూగుతాయి. వీటిని 4/5 వారాల వయస్సులో మాంసం కొరకు వినియోగించవచ్చు. 5 వారాల వరకు ఇవ్వవలసిన దాణాలో దాదాపు 26-28% వరకు మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. ఒక బ్రాయిలర్ కోడిని పెంచేటటువంటి స్థలం (1 చ. అడుగు) దాదాపు 5 కౌంజు పిట్టలను పెంచడానికి సరిపోతుంది.
గ్రుడ్లు పెట్టే కోళ్ల పెంపకం:

కౌంజు పిట్టలు ఆరవ వారం నుండే గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. అవి 13 నుండి 14 వారాలు వచ్చే సరికి గ్రుడ్లు ఉత్పత్తి 90-95% నికి చేరుతుంది. సంవత్సరానికి దాదాపు 250-270 గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గుడ్లు 10 నుండి 12 గ్రా. బరువు ఉండి, పెంకు కొంచెం దళసరిగా, నల్లని మచ్చతో కూడి ఉంటుంది.
పోషకాల పరంగా చూసుకొన్నట్లయితే కోడి గ్రుడ్లు కంటే 2% మాంసకృత్తులు కౌంజు పిట్టల గుడ్ల నుండి లభ్యమవుతాయి. ఈ గ్రుడ్లను బోండాలు వంటివి వేసుకోవడానికి వినియోగిస్తారు. వీటి యొక& చిన్నసైజు వలన పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. కౌంజు పిట్టలు 3 వారాల వయస్సు నిండిన తరువాత నుండి ఎగరడం మొదలు పెడతాయి. కనుక కౌంజులను తప్పనిసరిగా గృహవసతి కల్పించాలి. బ్రాయిలర్ కోళ్లకు ఉపయోగించునటువంటి షెడ్డును కౌంజు పిట్టల పెంపకానికి వాడుకొనవచ్చు. గ్రుడ్లను తినడానికి మాత్రమే వినియోగించేటట్లు అయితే మగ కౌంజులను 5వ వారంలో మాంసం కొరకు అమ్మివేయవచ్చును.
లేదా గ్రుడ్లను పొదగవేయాలి అనుకునేవారు ఒక మగ కౌంజుకు, 1 లేదా 2 ఆడ కౌంజులు ఉండునట్లుగా చూసుకోవాలి. ఈ థలో కౌంజులను డీప్‌లిట్టర్ పద్ధతిలో గని లేదా కేజెస్ నందు గని పెంచుకోవచ్చు.
కౌంజు గుడ్డు నుండి పిల్ల రావడానికి 18 రోజుల సమయం పడుతుంది. ప్రత్యుత్పత్తికి వినియోగించే కౌంజులకు ఇతర కౌంజుల కంటే ఎక్కువ ఖనిజ లవణాలు, విటమిన్లను అందించాలి.
ఇంక్యూబేటర్ నందు గ్రుడ్లను పొదగా వేసేటప్పుడు మొదటి 15 రోజుల వరకు 99-99.5 డిగ్రీ ఫారెన్‌మీట్ ఉష్ణోగ్రత, 70-75% తేమ, 2/3 తెరిచిన వెంటిలేటర్స్ మరియు గ్రుడ్లను నిలువుగా ఉంచి, రోజుకు 7-8 సార్లు విడిగా త్రిప్పాలి. చివరి 3 రోజులలో 99.8-99 డిగ్రీ ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత, 88-90′ తేమ, 1/3 తెరిచినా వెంటిలేటర్స్, మరియు గ్రుడ్లను అడ్డంగా హాచరీట్రేల నందు ఉంచాలి. 18వ రోజు తదుపరి పిల్లలు గ్రుడ్ల పెంకును పగుల గొట్టుకుని బయటకు వస్తాయి. వాటిలో చిన్నగా, బలహీనంగా, కాళ్ళు పడిపోయిన పిల్లలను వేరుచేయాలి. మిగిలిన పిల్లలను రైతులకు అమ్మడం కానీ లేదా వేరే ఇంకొక బ్యాచ్‌ను కానీ మొదలు పెట్టవచ్చు. సాధారణంగా కౌంజు పిట్టలలో వ్యాధులు తక్కువ. కౌంజుల పెంపకం చేపట్టినపుడు అక్కడ లభించు నీటి వసతి, నాణ్యత పరిశీలించుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిలో తగు మోతాదులో శానిటైజర్స్ వాడాలి. నెలలో విడిగా 3 రోజులు బి-కాంప్లెక్స్‌ను నీటి ద్వారా అందించుట మేలు. ప్రతి 3 నెలలకు ఒకసారి డి-వార్మింగ్ చేస్తే మేలు.
కౌంజు పిట్టల పోషణ :

కౌంజు పిట్టలకు మిగతా కోళ్ల కంటే కొంచెం అధిక మోతాదులో మాంసకృత్తులు అవసరం అవుతాయి. బయట మార్కెట్ నందు ప్రత్యేకంగా కౌంజు పిట్టల దాణా లభించునట్లయితే దొరికిన దాణాకి కొద్ది మోతాదులో అవసరం మేరకు సోయా చెక్కను కలిపి వాడుకోవాలి.
సాధారణంగా కౌంజులు మొదటి 5 వారాల వయస్సు వరకు 550-600 గ్రా. వరకు దాణా తింటాయి. కోడి ఒకటికి ఆ తదుపరి అనగా గ్రుడ్లు పెట్టు థలో దాదాపు రోజుకు కోడికి సగటున 25 గ్రా. దాణా అవసరం అవుతుంది. దాదాపు సగటున కౌంజు పెట్టకు గుడ్ల థలో 10 నుండి 11 కిలోల దాణా అవసరం అవుతుంది.
కౌంజు పిట్టల దాణా :

తరాలు అనగా: లైసిన్, మిథియోనిన్, బికాంప్లెక్స్, విటమిన్లు, ఫాట్ సాల్యుబుల్ విటమిన్లు, కోలిన్ క్లోరైడ్, ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఉంటాయి. దాణా ఖర్చు మొత్తం పెట్టుబడిలో 70-75% వరకు ఉంటుంది. కనుక దాణా తయారీ విధానంలోను, దాణా అందించే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మేత తొట్లలో 2/3 వంతు వరకు మాత్రమే దాణా నింపాలి. రోజుకు 3 సార్లుగా దాణా అందించాలి. షెడ్డు నందు తగినంత గాలి, వెలుతురు ఉండునట్లు చేసుకోవాలి. గ్రుడ్లు పెట్టు కౌంజులకు రోజు మొత్తం మీద 16 గంటలు వెలుతురు ఉండునట్లు చూడాలి.
కౌంజు పిట్టల పెంపకం ఆదాయ వ్యయాలు: 10000 కౌంజులకు
షెడ్డు నిర్మాణానికి: 10000 కౌంజులకు: 40,000.00 నీటి వసతి కరెంటు వసతి.
నికర ఖర్చులు :
ఒక రోజు వయస్సు గల కౌంజు ధర: 8.00 þ 10000 = 80,000.00 దాణా ఖర్చు 5 వారాల వరకు 550 గ్రా. þ 10000þ30/1000 = 1,65,000.00 ఇతర ఖర్చులు (లిట్టర్, కరెంటు చార్జీలు, బికాంప్లెక్స్) రూ.2 / కోడికి = 20,000.00
మొత్తం ఖర్చు = 2,65,000
ఆదాయం: 10,000 కౌంజులకు 5% మరణాలు అయినా మార్కెట్‌కు తరలించే సంఖ్య 9,500 ఒక్కొక్క కౌంజు రూ. 35/- చొప్పున = 3,32,500 అనగా 10,000 కౌంజులను పెంచుకున్నట్లు అయితే వాటిని 5 వారాలకు అమ్మడం ద్వారా దాదాపు రూ. 67,500/- (3,32,500 – 2,65,000) ఆదాయాన్ని 5 వారాలలో పొందవచ్చు. పైన తెలిపిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో మార్కెట్ చేసుకున్నట్లయితే కౌంజులు పెంపకాన్ని ఒక ఉపాధిగా చేపట్టి లాభాలు గడించవచ్చు.
డా. నాగరాజ కుమారి కళ్ళం,
ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, అసోసియేట్ ప్రొఫెసర్,
కోళ్ల శాస్త్ర విభాగం, ఎన్టీఆర్ పశువైద్య కళాశాల, గన్నవరం – 521101.
