సమస్య:
- ఏటిక పాములు (ASCARIA) తల్లి గర్భంలో వుండగానే పిండంలోకి ప్రవేశిస్తాయి.
- దూడ చిన్న ప్రేగులలో చేరి 10 రోజులలో పెద్దవై గ్రుడ్లు పెట్టటం మొదలు పెడతాయి.
- ఈ ఏటిక పాములు దూడల పొట్టలోకి కొన్ని విషపదార్థాలను విరజిమ్ముతాయి.
కారణాలు :
- ఏటిక పాములు తెల్లగా, గుండ్రంగా, బారుగా వుంటాయి.
- ఏటిక పాముల గుడ్లతో కలుషితమైన ఆహారం తినటం, నీరు త్రాగటం.
- త్రాగే నీటి వలన అవి ప్రేగులలో స్థావరం ఏర్పరచుకొని, తిరిగి కొన్ని లక్షల గుడ్లు పెట్టటం ద్వారా వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి.
పేడ పరీక్షించి వ్యాధి నిర్ధారించవచ్చు
పరిష్కారాలు:
హోమియో: ఏదైనా ఒక మందు
కాల్కేరియా కార్బ్ 30 మందు 10 మాత్రలు చొ॥ 2 వారాలకొకసారి తినిపించాలి. లేదా సిన / మెర్క్ సాల్/ సాంటోనినం / నేట్రం ఫాస్ / అబ్రోటనం / టెల్లురియం 30 పొటెన్సీ మందులలో ఏదైనా ఒక మందు 10 మాత్రలు చొప్ప్పున 5 రోజులు తినిపించాలి.
అల్లోపతి:
ఏటిక పాముల నివారణ
- మొదటిసారి 8వ రోజున పైపరజిన్ ఆడిపేట్ (PIPERAZINE ADIPATE) 10 గ్రా॥ పొడిని గానీ, 10 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
- రెండవ సారి 20 వ రోజున పైపరజిన్ ఆడిపేట్ (PIPERAZINE ADIPATE) 10 గ్రా॥ పొడిని గానీ, 10-15 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
- మడవ సారి 40 వ రోజున ఎఫ్ – జోల్ (F-ZOLE) 10 గ్రా॥ పొడిని గానీ, 10 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
- నాలుగవ సారి 60 వ రోజున ఎ జోల్ (A-ZOLE) 10 గ్రా॥ పొడిని గానీ, 10 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
- అయిదవ సారి 90 వ రోజున ఎఫ్ – జోల్ (F-ZOLE) 10 గ్రా॥ పొడిని గానీ, 15 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
- ఆరవ సారి 6 నెలలకు ఆల్బెండజోల్ (ALBENDAZOLE) 150 మి.గ్రా. 2 బిళ్ళలు తినిపించాలి.
- లివోమిక్స్ (LIVOMIX) / లివ్ (LIVE) – 52 టానిక్ రోజుకు 50 మి.లీ. చొ॥న 5 రోజులు త్రాగించాలి.
……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

