నేలవేము మొక్కల్లో వున్న “ఆండ్రోగ్రాఫోలిడ” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో కషాయంగా కానీ, “పంచపత్ర కషాయం”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు. నేలవేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి.
తయారీ విధానం : ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయ్యే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కి. నేలవేము ఆకులు అవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీ. నీటిలో ఒక గంటసేపు మరిగించాలి. ఈ విధంగా మరిగించిన కషాయం సుమారు 5 లీ. వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బు పొడి లేదా 50 గ్రా. కుంకుడు కాయల రసాన్ని కలపాలి. దీనికి 100 లీ. నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో సాయంత్రంవేళ పిచికారి చేయాలి. కషాయం బాగా మరుగుతున్నపుడు మధ్య మధ్యలో కర్రతో బాగా కలుపుతూ వుండాలి.
నేలవేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్ల కంకి)ను నివారించవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
కషాయం తయారు చేసేటప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకోవాలి.
పంట దశ, పురుగు ఉధృతిని బట్టి ఈ కషాయాన్ని 2-3 సార్లు ఉపయోగించవచ్చు.
సాధారణ నామం : బ్లూ పీ / బటర్‌ఫ్లైపీ శాస్త్రీయ నామం : క్లిటోరియా టెర్నేటియా కుటుంబం: ఫాబేసి
శంఖుపుష్పం ఒక బహువార్షిక హెర్బల్ మొక్క. ఆకులు అండాకారంలో ఉంటాయి. ఇది ఒక తీగ లేదా క్రీపర్‌లా పెరుగుతుంది. ఈ మొక్కలో కొట్ట వచ్చినట్లు కనిపించేవి వాటి ముదురు నీలం రంగు పూలు. అవి 4 సెం.మీ. పొడవు, 3 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కొన్ని రకాలు తెలుపు రంగు పూలు పూస్తాయి. కాయలు 5-7 సెం.మీ. పొడవుండి, ప్రతి కాయలో 6 నుండి 10 గింజలుంటాయి. లేత కాయలను తింటారు. దీనిని అలంకరణ మొక్కగా పెంచుతారు. దీని వేర్లు రైజోబియంతో కలిసి జీవిస్తూ పరస్పర సహకారమందించుకుంటాయి.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వాపు, నొప్పిని తగ్గిస్తుంది.
రక్తం పడే మొల్లల చికిత్సలో ఉపయోగిస్తారు. మొల్లలను ఆకుల కషాయంతో శుభ్రపరుస్తారు. మొత్తం మొక్క పేస్టుని మొల్లలపై పూస్తారు.
తలనొప్పి నివారణకు ఆకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేస్తారు.
రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ చికిత్సలో థామాసాతో మరగించిన నూనెతో మర్ధన చేస్తారు.
నోటిలోపల వాపుకు ఆకు కషాయంతో పుక్కిలిస్తారు. గాయాలను శుభ్రపరచడానికి కూడా ఈ కషాయాన్ని ఉపయోగిస్తారు. చీము ఏర్పడకుండా నివారిస్తుంది.
వ్యవసాయరంగంలో
శంఖుపుష్పం ద్రావణం నుండి తయారు చేసిన మేళనం కీటకనాశక చర్య మరియు / లేదా వికర్షక చర్య మరియు / లేదా పురుగు గుడ్లు పెట్టకుండా నిరోధించడం మరియు / లేదా గుడ్లు పెట్టే స్థానంపై ప్రభావం చూపడం మరియు / లేదా పురుగు మొక్కపై తినకుండా అవరోధించడం వంటి చర్యల ద్వారా పురుగులనరికడుతుంది.
ఈ మేళనం కీటకనాశక చర్య ద్వారా వ్యవసాయ పంటలనాశించే పెద్ద పురుగులు, లార్వాలను లేదా రసంపీల్చే పురుగులను నివారిస్తుంది. దీనిని ప్రత్తి పంటనాశించే హెలికోవర్మా ఆర్మిజరాపై ఉపయోగించి ప్రయోగాలు చేశారు. (రాబర్ట్ మెన్సా, 2012).
శంఖు పుష్పం గింజల ద్రావణం రైజోక్టోనియా సొలాని పై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
ద్రావణంలోని ప్రోటీన్ ఫినోటిన్ చిక్కుడునాశించే ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు శిలీంద్రం, కొల్లెటోట్రైకం లిండముథియానం మరియు బాక్టీరియల్ బ్లెåట్‌కారకం క్ౙాంతో మోనాస్ ఆక్సొనోపొడిస్ ఫేసియోలి; వరి నాశించే బైపొలారిస్ ఒరైజే, పైరిక్యులేరియా గ్రిసియా, బ్రాకియేరియా స్పీ, నాశించే రైజోక్టోనియా సొలానిలపై శిలీంద్రనాశక, బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది. ఈ ప్రోటీన్ జాబ్రోటెస్ సబ్‌ఫాసియేటస్ మరియు అకాంతోసీలిడియస్ ఒబెక్టస్ బ్రూచిడ్ల మొదటి దశ లార్వాలపై అధిక విష ప్రభావాన్ని ప్రదర్శించింది (కెలెము, అతని అనుచరులు, 2004).
శంఖుపుష్పం ఆకు ద్రావణాలు మలేరియా, ఫైలేరియా జ్వరం, ఎన్సెఫెలైటిస్, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాప్తి చేసే వాహకాలు ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ పెద్ద పురుగుల విడుదలను అరికట్టింది (అరివోలి, అతని అనుచరులు, 2015).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
రైతులు, పశుపోషకులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మన దేశ వ్యవసాయం, పశుపోషణ రెండూ వాతావరణ పరిస్థితులపై ఎంతో ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, నీటి లభ్యత వంటి అంశాలు పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులకు కారణమయ్యే ముఖ్యమైన సహజ పరిస్థితుల్లో ఎల్‌నినో (El Niño) ఒకటి.
ఎల్‌నినో ప్రభావం నేరుగా ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా కనిపించదు. అయితే ఇది ప్రపంచ వాతావరణ నమూనాల్లో మార్పులకు కారణమై, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షపాతంలో మార్పులు కలిగించవచ్చు. ఈ మార్పులు వ్యవసాయంతో పాటు పశుసంపదపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఎల్‌నినో అంటే ఏమిటి? ఎల్‌నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ పరిస్థితి.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే ఈ మార్పులు వాతావరణంలోని గాలి ప్రసరణ, మేఘాల ఏర్పాట్లు మరియు వర్షపాత నమూనాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతంలో అసాధారణ మార్పులు సంభవించవచ్చు.
భారతదేశంలో కూడా ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షపాతంలో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఎల్‌నినో సంవత్సరంలో భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో కరువు లేదా తక్కువ వర్షపాతం తప్పనిసరిగా జరుగుతుందని చెప్పలేం. ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి.
ఎల్‌నినో వల్ల పశుసంపదకు కలిగే ప్రధాన సమస్యలు ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం లేదా వర్షపాతం తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడితే పశుపోషణలో అనేక సవాళ్లు ఎదురవుతాయి.
అధిక ఉష్ణోగ్రతలు – Heat Stress పశువులకు అధిక ఉష్ణోగ్రతలు చాలా ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా పాడి పశువులు, అధిక పాల ఉత్పత్తి కలిగిన ఆవులు మరియు గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి. వాతావరణణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పశువులు తమ శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థాయిలో ఉంచుకోవడానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి.
Heat Stress వచ్చినప్పుడు: • మేత తీసుకోవడం తగ్గుతుంది. • నీరు ఎక్కువగా తాగుతాయి. • శ్వాస వేగం పెరుగుతుంది. • నోటి ద్వారా ఎక్కువగా శ్వాస తీసుకోవచ్చు. • నీడను ఆశ్రయిస్తాయి. • పాల దిగుబడి తగ్గవచ్చు. • పునరుత్పత్తి సామర్థ్యం ప్రభావితమవుతుంది. • గర్భధారణ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల వేసవిలో పశువులకు నీడ, గాలి ప్రసరణ మరియు తగినంత నీరు అందించడం అత్యంత ముఖ్యమైన విషయం.
నీటి కొరత వర్షపాతం తగ్గడం వల్ల చెరువులు, బోర్లు, బావులు మరియు ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంటుంది.
పశువులకు నీరు కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాదు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియ, పాల ఉత్పత్తి మరియు శరీరంలోని అనేక జీవక్రియలకు నీరు అవసరం. వేడి వాతావరణంలో నీటి అవసరం మరింత పెరుగుతుంది.
అందువల్ల రైతులు: “నీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇవ్వడం” కాకుండా “ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం” అనే పద్ధతిని పాటించాలి. నీటి తొట్లను ప్రతిరోజూ శుభ్రం చేయాలి. నీరు మురికిగా ఉండకుండా చూడాలి.
పశుగ్రాస కొరత వర్షపాతం తగ్గితే పచ్చిమేత ఉత్పత్తి తగ్గుతుంది. పంటల దిగుబడి తగ్గడం వల్ల పంట అవశేషాల లభ్యత కూడా ప్రభావితమవుతుంది. దీంతో: పచ్చిమేత తగ్గుతుంది → మేత ధర పెరుగుతుంది → పశువుల పోషణ ఖర్చు పెరుగుతుంది. పచ్చిమేత కొరత ఏర్పడినప్పుడు పశువులకు కేవలం పొడి మేత మాత్రమే ఇవ్వడం వల్ల సమతుల్య పోషణ అందకపోవచ్చు. అందువల్ల రైతులు ముందుగానే: • ఎండుగడ్డి • పంట అవశేషాలు • సైలేజ్ • హే • పచ్చిమేత విత్తనాలు • అవసరమైన concentrate feed వంటి వాటిని ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాలి.
పాల ఉత్పత్తిపై ప్రభావం Heat Stress వల్ల పశువులు సాధారణంగా మేత తీసుకోవడం తగ్గిస్తాయి. మేత తీసుకోవడం తగ్గితే శరీరానికి అందే పోషకాలు తగ్గుతాయి. దీని ప్రభావం పాల ఉత్పత్తిపై పడవచ్చు. ప్రత్యేకంగా అధిక పాలిచ్చే పశువుల్లో: వేడి ఒత్తిడి → Feed intake తగ్గడం → శక్తి లోపం → పాల ఉత్పత్తి తగ్గే అవకాశం అలాగే పాలలో కొవ్వు, ప్రోటీన్ వంటి నాణ్యతా అంశాలు కూడా పశువు ఆరోగ్యం మరియు ఆహారంపై ఆధారపడి మారవచ్చు.
పశువుల పునరుత్పత్తిపై ప్రభావం అధిక ఉష్ణోగ్రతలు పశువుల reproductive performance ను కూడా ప్రభావితం చేయవచ్చు. వేడి కాలంలో: • Heat signs స్పష్టంగా కనిపించకపోవచ్చు. • Estrus duration తగ్గవచ్చు. • Conception rate తగ్గవచ్చు. • Early embryonic loss ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల రైతులు వేసవిలో ఈస్ట్రస్ గుర్తింపు, సరైన సమయానికి కృత్రిమ గర్భధారణ మరియు గర్భ నిర్ధారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
గొర్రెలు మరియు మేకలపై ప్రభావం ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, మేత కొరత మరియు నీటి కొరత ఏర్పడితే గొర్రెలు, మేకలు కూడా ప్రభావితమవుతాయి. ముఖ్యంగా చిన్న వయస్సు పిల్లలు, గర్భిణీ జంతువులు మరియు బలహీనమైన జంతువులు ఎక్కువ జాగ్రత్త అవసరమైనవి. వీటిలో: • మేత తీసుకోవడం తగ్గడం • బరువు పెరుగుదల తగ్గడం • డీహైడ్రేషన్ • బలహీనత • ఉత్పాదకత తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి గొర్రెలు, మేకలకు ఉదయం మరియు సాయంత్రం మేత అందించడం, మధ్యాహ్నం వేడి సమయంలో నీడ కల్పించడం మంచిది.
కోళ్లపై ప్రభావం అధిక ఉష్ణోగ్రతలు కోళ్లలో కూడా Heat Stress కు కారణమవుతాయి. Heat Stress సమయంలో: • Feed intake తగ్గుతుంది. • Water intake పెరుగుతుంది. • Egg production తగ్గవచ్చు. • Egg shell quality ప్రభావితమవుతుంది. • Mortality పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి poultry sheds లో ventilation చాలా ముఖ్యమైనది. షెడ్‌లో గాలి సరిగా ప్రసరించేలా చూడాలి. తాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
వ్యాధులపై ప్రభావం వాతావరణ మార్పులు పశువుల ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపవచ్చు. అధిక వేడి, పోషక లోపాలు, నీటి కొరత వంటి పరిస్థితులు పశువులపై stress పెంచవచ్చు. అందువల్ల రైతులు సాధారణ vaccination schedule ను పాటించాలి. అలాగే: టీకాలు అవసరమైనప్పుడు డీవార్మింగ్ ఈగలు, పేలు, ఇతర ectoparasites నియంత్రణ షెడ్ పరిశుభ్రత అనారోగ్య పశువులను ముందుగా గుర్తించడం వంటి చర్యలు చేపట్టాలి.
పశువులకు నీడ కల్పించడం వేసవి పరిస్థితుల్లో పశువులకు మంచి నీడ చాలా అవసరం. షెడ్: • గాలి ప్రసరణకు అనుకూలంగా ఉండాలి. • పైకప్పు అధిక వేడిని లోపలికి రానివ్వకుండా ఉండాలి. • పశువులకు తగినంత స్థలం ఉండాలి. • నేల పొడిగా, పరిశుభ్రంగా ఉండాలి. సాధ్యమైన చోట్ల చెట్లను పెంచడం ద్వారా సహజ నీడను కూడా కల్పించవచ్చు.
పశువులను చల్లబరచడం అధిక వేడి సమయంలో పశువులను చల్లబరచడానికి నీటితో శరీరాన్ని తడపడం లేదా సరైన పద్ధతిలో cooling చేయడం ఉపయోగపడుతుంది. అయితే షెడ్‌లో తేమ ఎక్కువగా పేరుకుపోకుండా గాలి ప్రసరణ కూడా ఉండాలి. నీరు + నీడ + గాలి ప్రసరణ + సరైన cooling అనేవి Heat Stress నియంత్రణలో ముఖ్యమైన అంశాలు.
రైతులు ముందుగానే చేయాల్సిన ప్రణాళిక ఎల్‌నినో లేదా ఇతర వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి రైతులు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి.
రైతుల కోసం ముఖ్యమైన సూచనలు నీటి ప్రణాళిక: వేసవి ప్రారంభానికి ముందే పశువుల తాగునీటి వనరులను సిద్ధం చేసుకోవాలి. మేత ప్రణాళిక: అవసరమైన పచ్చిమేత, ఎండుమేత మరియు సైలేజ్‌ను ముందుగానే నిల్వ చేసుకోవాలి. షెడ్ నిర్వహణ: గాలి ప్రసరణ మరియు నీడ ఉండేలా షెడ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఆరోగ్య నిర్వహణ: టీకాలు, పరాన్నజీవుల నియంత్రణ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు కొనసాగించాలి.
పాలిచ్చే పశువులపై ప్రత్యేక శ్రద్ధ: అధిక పాలిచ్చే ఆవులు, గేదెలకు నీరు, మేత మరియు cooling పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గర్భిణీ పశువులు: గర్భిణీ పశువులకు వేడి ఒత్తిడి రాకుండా ప్రత్యేక సంరక్షణ ఇవ్వాలి. చిన్న పిల్లలు: దూడలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలను అధిక వేడి మరియు డీహైడ్రేషన్ నుంచి రక్షించాలి.
మొత్తం మీద, ఎల్‌నినో అనేది సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులతో ప్రారంభమయ్యే ఒక సహజ వాతావరణ పరిస్థితి. దీని ప్రభావం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు మరియు నీటి లేదా మేత లభ్యతలో సమస్యలు ఏర్పడితే పశుసంపదపై వాటి ప్రభావం గణనీయంగా ఉండవచ్చు. ముందుగానే ప్రణాళిక చేసుకుంటే వాతావరణ మార్పుల వల్ల పశువులపై వచ్చే ఒత్తిడిని చాలా వరకు తగ్గించవచ్చు. “వాతావరణాన్ని మనం నియంత్రించలేం… కానీ వాతావరణ మార్పులకు పశుసంపదను సిద్ధం చేయగలం.” రైతు ముందుచూపుతో నీరు, మేత, షెడ్ మరియు పశువుల ఆరోగ్యాన్ని నిర్వహిస్తే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పశుసంపదను ఆరోగ్యంగా, ఉత్పాదకంగా కాపాడుకోవచ్చు.
డా. జి. రాంబాబు, పశు వైద్యాధికారి, కడప జిల్లా, ఫోన్: 9618499184, 9494588885
తయారుచేయు విధానం ఉసిరికాయలను కడిగి, తేమ లేకుండా ఆరబెట్టి, రోట్లో ఒక్కొక్కటి దంచుకుంటూ దానిలోని గింజలను తీసివేయాలి. ఇప్పుడు ఆ ముక్కలను చిన్న జార్లో వేసుకొని దానిలోనే కారప్పొడి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలను వేసుకొని, కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాతకి కొత్తిమీర, నువ్వుల నూనె కలుపుకొని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినవచ్చు.
కావాల్సిన పదార్థాలు
ఉసిరికాయలు – కొన్ని
కారంపొడి – సరిపడునంత
ఉప్పు – తగిన మోతాదులో
జీలకర్ర – పావు టీ స్పూన్
ధనియాలు – పావు టీ స్పూన్
వెల్లుల్లిపాయలు – ఐదారు
నువ్వుల నూనె – కొద్దిగా
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
రచన: సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గొర్రెలు మేకల పాత్ర: పాడిపరిశ్రమ తరువాత రైతులు, గ్రామీణ యువత అత్యధికంగా ఆసక్తి చూపుతున్న అనుబంధ రంగం గొర్రెలు, మేకల పెంపకం. తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు అందించే ఈ రంగం చిన్న, సన్నకారు, భూమిలేని రైతులకు జీవనోపాధిగా మారింది. దేశంలో 20వ పశుగణన ప్రకారం గొర్రెల సంఖ్య సుమారు 7.43 కోట్లు (మొత్తం పశుసంపదలో 13.83%) కాగా, మేకల సంఖ్య 14.89 కోట్లు (27.74%)గా నమోదైంది. ప్రపంచంలో మేకల పెంపకంలో భారతదేశం మొదటి స్థానంలో, గొర్రెల పెంపకంలో మూడో స్థానంలో నిలుస్తోంది. కేంద్ర పశుసంవర్థక శాఖ ప్రాథమిక గణాంకాల (BAHS 2024–25) ప్రకారం, దేశ మొత్తం మాంసోత్పత్తిలో గొర్రెల వాటా 11.29%, మేకల వాటా 15.06%గా ఉంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక గొర్రెల జనాభా కలిగిన రాష్ట్రంగా, గొర్రెల మాంసోత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఈ గణాంకాలే ఈ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయి.
దేశంలో జనాభా (20వ పశుగణన) గొర్రెలు: 7.43 కోట్లు (13.83%) మేకలు: 14.89 కోట్లు (27.74%)
ప్రపంచంలో స్థానం గొర్రెలు: 3వ స్థానం మేకలు: 1వ స్థానం
మొత్తం మాంసోత్పత్తిలో వాటా (2024–25) గొర్రెలు: 11.29% మేకలు: 15.06%
తొలకరి వర్షాలు తెచ్చే సవాళ్లు: మన రైతులు ఎక్కువగా గొర్రెలు, మేకలను ఆరుబయట మేపే సంప్రదాయ పద్ధతిని లేదా ఉదయం పచ్చికభూముల్లో మేపి రాత్రి కొట్టాల్లో బంధించే పాక్షిక సాంద్ర పద్ధతిని పాటిస్తారు. తొలకరి జల్లులకు కొత్తగా మొలకెత్తిన లేత పచ్చిగడ్డిని మేయడం, గుంతల్లో నిల్వ ఉన్న మురికినీటిని తాగడం, వర్షాలకు ఎక్కువసేపు తడవడం వంటివి జీవాలలో అనేక వ్యాధులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ కాలంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ఈగలు, దోమలు వంటి బాహ్యపరాన్న జీవులు కూడా విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా చిటుక వ్యాధి, గాలికుంటు వ్యాధి, నీలినాలుక, పారుడు రోగం (పిపిఆర్), కాలిపుండు, గొంతువాపు లాంటి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరుగుతుంది.
తరచుగా కనిపించే ప్రధాన వ్యాధులు
బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు చిటుక వ్యాధి (ఎంటిరోటాక్సీమియా): క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ టైప్-డి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. తొలకరి జల్లులకు మొలచిన లేత గడ్డిని అధికంగా తినడం ఇందుకు ప్రధాన కారణం. అన్ని వయసుల గొర్రెలు, మేకలు దీని బారిన పడతాయి. హఠాత్తుగా మరణించే ప్రమాదం ఉన్నందున తొలకరికి ఒక నెల ముందే టీకా వేయించడం ఏకైక రక్షణ మార్గం.
కాలిపుండు వ్యాధి: బురద, చిత్తడి నేలల్లో ఎక్కువసేపు తిరగడం వల్ల గిట్టల మధ్యభాగం కందిపోయి, జీవాలు కుంటుతూ నడుస్తాయి. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేసి, పశువైద్యుని సలహాతో యాంటీబయోటిక్స్ వాడాలి.
వైరస్‌ల వల్ల కలిగే వ్యాధులు పారుడు రోగం (పిపిఆర్): గొర్రెలు, మేకల్లో అత్యధిక నష్టాన్ని కలిగించే వ్యాధి ఇది. అధిక జ్వరం, ముక్కు నుంచి స్రావాలు, నోటిపూత, రక్తపు విరేచనాలు దీని లక్షణాలు. చికిత్స లేని ఈ వ్యాధికి నివారణే ఏకైక మార్గం. మూడు నెలలు దాటిన పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి పిపిఆర్ వ్యాధిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో జాతీయ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
నీలినాలుకవ్యాధి(Bluetongue): క్యులికోయిడ్స్ (Culicoides) అనే చిన్న దోమల కాటు ద్వారా వ్యాపించే ఆర్బోవైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రధానంగా గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది. అధిక జ్వరం, నాలుక నీలిరంగులోకి మారడం, పెదవులు మరియు ముఖం వాచిపోవడం, నోటిలో పుండ్లు, గిట్టల వద్ద వాపు, కుంటుతూ నడవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నివారణకు మూడు నెలల వయస్సు దాటిన పిల్లలకు నీలినాలుక టీకా వేయించి, ఒక నెల తర్వాత బూస్టర్ డోసు ఇవ్వాలి. అదనంగా దోమల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.
గాలికుంటువ్యాధి(FMD): ఇది అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ వ్యాధి. గొర్రెలు, మేకల నోరు, నాలుక, పెదవులు మరియు గిట్టల మధ్య బొబ్బలు, పుండ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఫలితంగా జీవాలు మేత మేయలేకపోవడం, కుంటుతూ నడవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స లేదు. క్రమం తప్పకుండా ఎఫ్‌ఎమ్‌డి టీకాలు వేయించడం, వ్యాధి సోకిన జీవాలను వెంటనే వేరు చేయడం, పరిశుభ్రత మరియు బయోసెక్యూరిటీ చర్యలు పాటించడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ● టీకాలు సకాలంలో వేయించడం: తొలకరి ప్రారంభానికి ఒక నెల ముందే చిటుక వ్యాధి, గాలికుంటు, పారుడు రోగం, నీలినాలుక వ్యాధుల నివారణ టీకాలను పశువైద్యుని సలహాతో వేయించుకోవాలి.
గొర్రెలు మరియు మేకలకు సిఫార్సు చేయబడిన టీకాల పట్టిక:
వ్యాధి: చిటుక వ్యాధి (ఎంటిరోటాక్సీమియా – ET) మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–4 నెలల వయస్సులో బూస్టర్ డోసు: 21–30 రోజుల తర్వాత తదుపరి టీకా: ప్రతి సంవత్సరం, ముఖ్యంగా వర్షాకాలానికి ఒక నెల ముందు
వ్యాధి: పారుడు రోగం (PPR) మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3 నెలల వయస్సు తర్వాత బూస్టర్ డోసు: అవసరం లేదు తదుపరి టీకా: ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి
వ్యాధి: గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD) మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–4 నెలల వయస్సులో బూస్టర్ డోసు: 21–30 రోజుల తర్వాత తదుపరి టీకా: ప్రతి 6 నెలలకు ఒకసారి
వ్యాధి: నీలినాలుక వ్యాధి (Bluetongue) (వ్యాధి ప్రబల ప్రాంతాల్లో) మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3 నెలల వయస్సు తర్వాత బూస్టర్ డోసు: 1 నెల తర్వాత తదుపరి టీకా: ప్రతి సంవత్సరం
వ్యాధి: గొర్రె మశూచి (Sheep Pox) (గొర్రెలకు మాత్రమే) మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–5 నెలల వయస్సులో బూస్టర్ డోసు: అవసరమైతే పశువైద్యుని సలహా మేరకు తదుపరి టీకా: ప్రతి సంవత్సరం
వ్యాధి: మేక మశూచి (Goat Pox) (మేకలకు మాత్రమే) మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–5 నెలల వయస్సులో బూస్టర్ డోసు: అవసరమైతే పశువైద్యుని సలహా మేరకు తదుపరి టీకా: ప్రతి సంవత్సరం
● నట్టల నివారణ: తొలకరి ప్రారంభానికి ముందే పశువైద్యుని సూచన మేరకు నట్టల నివారణ మందులను వాడాలి. లేత గడ్డి మేయడం వల్ల అంతరపరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. ● కొట్టాల నిర్వహణ: కొట్టాలు పొడిగా, తేమ లేకుండా ఉండేలా చూసుకోవాలి. మలమూత్రాలను ఎప్పటికప్పుడు తొలగించి, ప్రతి 15 రోజులకు ఒకసారి సున్నం లేదా బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. కొట్టాల్లోకి గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా నిర్మాణం ఉండాలి; లేకుంటే అమ్మోనియా శాతం పెరిగి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ● బాహ్యపరాన్న జీవుల నివారణ: ఈగలు, దోమల నివారణకు ప్రతి 15 రోజులకు ఒకసారి మలాథియాన్, బ్యూటాక్స్, అమిత్రాజ్ వంటి కీటకనాశనులను కొట్టాల్లో పిచికారీ చేయాలి. ● గిట్టల సంరక్షణ: బురద, చిత్తడి నేలల్లో మేపే రైతులు ఫుట్ బాత్‌లలో పొటాషియం పర్మాంగనేట్ లేదా జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వాడి, గిట్టల వ్యాధులను నివారించుకోవాలి. ● మేత జాగ్రత్తలు: బూజు పట్టిన, తడిసిన మేతను గొర్రెలకు, మేకలకు వేయకూడదు — ఇది అఫ్లాటాక్సికోసిస్ అనే ఫంగల్ వ్యాధికి దారితీస్తుంది. వీలైనంత వరకు ఎండిన, నాణ్యమైన మేతనే అందించాలి. ● కొత్త జీవాల నిర్బంధం (క్వారంటైన్): సంతలో కొత్తగా కొనుగోలు చేసిన జీవాలను వెంటనే మందలో కలపకూడదు. వాటిని కొన్ని రోజులు వేరుగా ఉంచి, అవసరమైన టీకాలు వేయించి, ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే మందలో చేర్చాలి. ● వ్యాధిగ్రస్త జీవాల నిర్వహణ: వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆ జీవిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. నోటిపూత వల్ల మేత తినలేని జీవాలకు జావ, ఓఆర్‌ఎస్ ద్రావణం అందించాలి. ● గొర్రె పిల్లల సంరక్షణ: తొలకరి జల్లుల వల్ల గొర్రె పిల్లల్లో ఊపిరితిత్తుల వ్యాధులు అధికంగా వచ్చి 30% వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. పిల్లలను తడవకుండా, చలి తాకకుండా ప్రత్యేక శ్రద్ధతో పెంచాలి. ● వెంటనే వైద్య సహాయం: ఏ చిన్న అనుమానం వచ్చినా ఆలస్యం చేయకుండా సమీప పశువైద్యాధికారిని సంప్రదించి తగిన చికిత్స అందించాలి.
ప్రభుత్వ తోడ్పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం (NADCP) ద్వారా గాలికుంటు, బ్రూసెల్లోసిస్ వంటి వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు అందిస్తోంది. అలాగే పారుడు రోగం (పిపిఆర్) నిర్మూలన కార్యక్రమం, గొర్రెలు మేకల మశూచి, నీలినాలుక వ్యాధుల నివారణకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ద్వారా క్రమం తప్పకుండా టీకా శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని తమ మందలను రక్షించుకోవాలి.
ముగింపు “చికిత్స కన్నా నివారణ మేలు” అనే సూత్రాన్ని గొర్రెలు, మేకల పెంపకందారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. తొలకరి ప్రారంభంలోనే తగిన టీకాలు, నట్టల నివారణ మందులు, పరిశుభ్రమైన కొట్టాల నిర్వహణ వంటి యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో తమ మందలను వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు. తద్వారా ఆశించిన దిగుబడిని, మెరుగైన ఆదాయాన్ని పొంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించవచ్చు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాము. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందుబాటులో ఉండేలా చూడడం మరియు పోషకాహారం, ఆహార భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే నేటి పరిస్థితుల్లో ఆహార భద్రత అంటే కేవలం ప్రతి ఒక్కరి కడుపు నింపడం మాత్రమే కాదు. పోషకమైన ఆహారం, ఆహార వైవిధ్యం, స్థానిక ఆహార వ్యవస్థల పరిరక్షణ కూడా ఆహార భద్రతలో అంతర్భాగాలే.
ఆహారం నుంచి పోషకాహారం వైపు ఒక కుటుంబానికి తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ ఆహారంలో అవసరమైన పోషకాలు లేకపోతే పూర్తి ఆరోగ్యం సాధ్యం కాదు. నేడు పోషకాహార లోపంతో పాటు అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి.
మన రోజువారీ ఆహారంలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు మరియు తగినంత నీరు ఉండాలి. కేవలం కడుపు నిండేలా ఆహారం తీసుకోవడం కాకుండా, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. దీనికోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సమతుల్య ఆహారం అంటే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సరైన పాళ్లలో అందేలా తీసుకునే ఆహారం.
అందుకే మన ఆహారంలో ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, నట్స్ మరియు నూనె గింజలు వంటి వివిధ ఆహార సమూహాల నుండి ఆహారం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా స్థానికంగా, కాలానుగుణంగా లభించే ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో కుటుంబ ఆహార వైవిధ్యాన్ని పెంచు కోవచ్చు.
చిరుధాన్యాలు పరిమాణంలో చిన్న, పోషకాల్లో మిన్న మన పూర్వీకుల ఆహారంలో ఒకప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలు ముఖ్యమైన భాగంగా ఉండేవి. మారుతున్న ఆహార అలవాట్లతో వాటి వినియోగం తగ్గినా, ప్రస్తుతం ఆరోగ్యకరమైన మరియు సుస్థిరమైన ఆహార వ్యవస్థలలో చిరుధాన్యాల ప్రాధాన్యం మళ్లీ పెరుగుతోంది. చిరుధాన్యాలు ఆహారంలో వైవిధ్యాన్ని పెంచడమే కాకుండా అధిక మొత్తంలో కాల్షియమ్, ఐరన్, పీచు వంటి పోషకాలను అందిస్థాయి. వీటితో రొట్టెలు, సంగటి, అంబలి లాంటి పాతకాల వంటలే కాకుండా చిన్నపిల్లలు ఇష్ట పడేలా బిస్కెట్లు, కేకులు, మిక్స్చర్, దోసెలు, ఇడ్లీలు వంటి అనేక రకాల పోషకాహార పదార్థాలను తయారు చేయవచ్చు.
పొలాల్లో వైవిధ్యం పెరిగితే, తినే పళ్లెంలోనూ వైవిధ్యం పెరుగుతుంది. ఆహార భద్రతకు పునాది పొలాల్లోనే ఉంటుంది. ఒకే పంటపై ఆధారపడకుండా ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, కూరగాయలు మరియు ఇతర పంటలను కలిపి సాగు చేసే మిశ్రమ పంటలు, రైతులకు ఆహారం భద్రత మరియు ఆదాయ వనరులను అందిస్తాయి.
ఇలాంటి పద్ధతులు పంటల వైవిధ్యాన్ని పెంచడంతో పాటు స్థానిక జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి దోహదపడతాయి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా విభిన్న పంటలను సాగు చేయడం రైతుల ఆహార మరియు జీవనోపాధి భద్రతను బలోపేతం చేయగలదు. పొలాల్లో పంటల వైవిధ్యాన్ని, ఇళ్లలో ఆహార వైవిధ్యాన్ని పెంపొందించినప్పుడే నిజమైన ఆహార భద్రత సాధ్యమవుతుంది. స్థానికంగా లభించే ఆకుకూరలు మరియు సాగు చేయబడని ఆకుకూరలు పోషకాల గనులు
గ్రామీణ ప్రాంతాల్లో అడవి సోయకూర, పున్నగంటి, బంకంటి, దూసరి, ఏలకచెవుల కూర, జొన్నచెంచలి, సన్న పయాల, తుమ్మి కూర, ఉత్తరేణి, ఎన్నాద్రి, బచ్చలి కూర, దొగ్గలి, పుండి, నేల ఉసిరి, గురుమాషి, చెన్నంగి, తడక దొబ్బుడు, చిత్రమాలం, అంగి భంగి, గంగా వాయిలి వంటి ఎన్నో రకాల సాగుచేయబడని ఆకుకూరలును చూడవచ్చు. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు. ఇటువంటి ఆకుకూరల్లో అనేకమైన పోషకాలు ఉంటాయి. తరతరాలుగా గ్రామీణ కుటుంబాలు వీటిని గుర్తించి, సేకరించి, వివిధ వంటకాలలో ఉపయోగిస్తూ వచ్చారు. అయితే ఆధునిక వ్యవసాయంలో విపరీతమైన మందులు పిచికారి చేయడం వలన ఇటువంటి వనరులను కోల్పోవాల్సి వస్తుంది. సాగుచేయని ఆకుకూరల గురించి అవగాహన కల్పించడం, సురక్షితమైన వినియోగ పద్ధతులను ప్రోత్సహించడం, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా ఆహార వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆకు కూరలను ముందుగా శుభ్రం చేసి తరువాత తరగడం ద్వారా పోషకాలను కోల్పోము. సన్నగా తరిగన తర్వాత నీటితో శుభ్రం చేయడం ద్వారా నీటిలో కరిగే విటమిన్లను కోల్పోతాం.
ఆహార వృథాను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రపంచంలో ఒకవైపు అనేక మంది ప్రజలకు తగిన ఆహారం అందకపోతుండగా, మరోవైపు ఉత్పత్తి చేసిన ఆహారంలో కొంత భాగం వృథా అవుతోంది. ఆహారాన్ని వృథా చేయడం అంటే కేవలం ఆహారాన్ని మాత్రమే కోల్పోవడం కాదు; దాని కోసం వినియోగించిన నీరు, భూమి, శ్రమ, శక్తి మరియు రైతుల కష్టం కూడా వృథా అవుతున్నాయి.
అందువల్ల అవసరానికి తగినంత ఆహారాన్ని మాత్రమే వండటం, మిగిలిన ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయడం, అందుబాటులో ఉన్న పదార్థాలను సృజనాత్మకంగా ఉపయోగించడం మరియు ఆహారాన్ని గౌరవించడం ప్రతి కుటుంబం బాధ్యత.
ఎం.హేమలత (గృహ విజ్ఞాన శాస్త్రవేత్త), డా సి. వర ప్రసాద్ (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి), జీ. శైలజ (ఉద్యాన శాస్త్రవేత్త), మరియు వి. రమేష్ (సేద్య విభాగ శాస్త్రవేత్త) డిడిఎస్ -కృషి విజ్ఞాన కేంద్రం, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
వడిసె కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ మరల పుట్టించు ఒక చిన్న చెట్టు. బెరడు ముదురు గోధుమ రంగు, ఎరుపు రంగుతో కూడిన నలుపు రంగులో గరుకుగా ఉండి, నలుచదరపు కొయ్య పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడి, రబ్బరులాగా, గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో 1.53 అం. పొడవు, రంగుతో ఆకు మొదలులో గుత్తులుగా ఏర్పడతాయి. క్యాప్సూల్ కొయ్యలాగా తొడిమ లేకుండా, గుండ్రంగా, 3 లేదా 4 చీలిన భాగాలు కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో దీని విషపూరిత స్వభావం ఒక సమస్య.
సాధారణ నామం : గరారి శాస్త్రీయ నామం : క్లిస్టాంతస్ కోల్లినస్ కుటుంబం: ఫిల్లాంతేసి
ఉపయోగాలు : వ్యవసాయరంగంలో
వడిసాకు డికాక్షన్ (50%) వరి నాశించే తాటాకు తెగులు (హిస్పా), ఆకుచుట్టు పురుగు, కాండంతొలుచు పురుగులను నివారించింది. ప్రత్యేకంగా గొట్టం పురుగు (నిమ్‌ఫ్యులా డిపంక్టాలిస్)ని సమర్ధవంతంగా నివారించింది. ఈ ద్రావణాన్ని ఒకసారి పిచికారి చేస్తే అన్ని పురుగులు 12 గంటలలో సంహరించబడ్డాయి.. పంటకోత వరకు పురుగులు ఆశించలేదు (భారతి అహిర్వార్, ఆమె అనుచరులు, 2011).
జార్ఖండ్‌లోని రాంచి జిల్లాకి చెందిన రైతులు వరిలో ఉల్లికోడు నివారణకు వడిసాకులను సేకరించి ఎకరానికి 40 కి. చొప్పున వేస్తారు.
100 చ.మీ.కి 5 కి. వడిసె తాజా ఆకులను చల్లి గొట్టం పురుగుని నివారించవచ్చు. (శ్రీవాస్తవ, అతని అనుచరులు, 2009)
వడిసె ఆకులోని రసాయనాలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులను, పిండినల్లులను, లద్దె పురుగులు / లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తాయి. దీనిని జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు.(నమ్రతాకుమారి, ఆమె అనుచరులు, 2016).
వడిసె మొక్కలోని పాలిఫినాలిక్ పదార్థం పల్స్ బీటిల్, చెదలు, ప్రత్తి ఆకు తినే ఆర్మివర్మ్‌పై కీటకనాశక చర్య ప్రదర్శించింది. అనేక నిల్వ ధాన్యాలనాశించే పురుగుల లార్వాలను సంహరించే శక్తిని ప్రదర్శించింది (పరితోష్ భట్టాచార్య, 2016).
తోటకూర పంటపై వడిసె ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి తోటకూర ఆకులను తినే లార్వా (హైమెనియా రికర్వాలిస్)ల సంఖ్యను తగ్గించవచ్చు. (అరివుడైనంబి, అతని అనుచరులు, 2010)
వడిసె లేత కొమ్మలను, పొడి ఆకుపొడిని వరి పొలంలో పురుగుల నివారణకు, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు. (సౌమిత్‌బెహరా, అతని అనుచరులు, 2006).
వడిసె ఆకులనుపయోగించి హెర్బల్ ద్రావణం తయారు చేసి అనేక పురుగులను నివారించవచ్చు.
హెర్బల్ ద్రావణం తయారు చేసే పద్ధతి : కావలసిన పదార్థాలు : వడిసె ఆకులు – 1కి. ఉమ్మెత్త కాయలు – 1 కి. మధుక లాంగిఫోలియాపిండి – 1 కి. గన్నేరు పప్పు – 1 కి. పొగాకు రద్దు – 500 గ్రా. సున్నం – 250 గ్రా. ఆవుమూత్రం – 5 లీ. మట్టికుండ – 1
తయారు చేసే పద్దతి :
ఒక మట్టి కుండలో వడిసె మొక్క ఆకులు, సన్నగా తరిగిన ఉమ్మెత్త కాయల ముక్కలు, గన్నేరు గింజలు అన్నింటినీ నూరి, మధుకలాంగి ఫోలియాపిండి, పొగాకు రద్దు, సున్నం కలిపి 5 లీ. ఆవు మూత్రం పోయాలి.
మట్టి పాత్రను మూతతో కప్పి ఎరువు గుంత / మట్టిలో 7 రోజులు పూడ్చి ఉంచాలి.
పై మిశ్రమాన్ని వడపోసి 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి పిచికారి చేసి అన్ని పురుగులను నివారించవచ్చు.
వడిసె ఆకులు వికర్షక చర్యతో చెదలను అరికడతాయి.
వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగు నివారణకు ఎకరానికి 80 కి. వడిసె ఆకులను వేయాలి.
పశ్చిమ బెంగాల్‌కి చెందిన పురులియా గ్రామ రైతులు వరి చేలో ఎకరానికి 150 కి. వడిసె ఆకులను వేసి పసుపుపచ్చ కాండంతొలుచు పురుగు, గొట్టపు పురుగు, హిస్పాలను సమర్ధవంతంగా నివారించడమేగాక 20-40% అధిక దిగుబడులను పొందారు (కళ్యాణ్ కెవికె, పశ్చిమబెంగాల్, 2017)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
వాము – ఒక టీ స్పూను (ఇసుక, మట్టి లేకుండా చూసుకోవాలి)
రాళ్ళ ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – అరకప్పు
తయారుచేయు విధానం: వాము కారంలో పచ్చిమిర్చిఎక్కువ ఉండాలి. వాము తక్కువ ఉండాలి. ఎందుకంటే వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనిని తక్కువగా వేసుకోవాలి.
వాము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో వాము పొడిని బాగా కలిపి ఒక ప్లేట్‌లో ఈ వాము పొడిని పలుచగా పరిచి బాగా ఎండబెట్టుకోవాలి. ఏమాత్రం తేమ ఉండకూడదు. అంటే ఆ మిశ్రమం బాగా క్రిస్పీగా ఎండాలి. అప్పుడు గాజు సీసాలో పోసి నిలువ చేసుకోవాలి. స్టీలు డబ్బాలో పోయకూడదు. ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఎండిన పొడిని అలాగే అన్నంలోకి, టిఫిన్స్‌లోకి వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.
లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
తయారీ విధానం : ఈ పదార్థాలన్నింటినీ దోరగా వేయించి మెత్తగా పొడిచేసి 1 కిలో ఆవు నెయ్యి, ఒక కిలో తేనెతో కలిపి పేస్టు తయారు చేసి, ఈ పేస్టుని 100 కిలోల ఆవుపేడ, 1000 లీ. నీటిలో కలిపి ఒక ఎకరాలోని మిరప మొక్కలకు వేరుకు అందేలా పోసినట్లయితే బొబ్బర తెగులు నివారణకు అవకాశాలు ఉన్నాయని కోయంబత్తూర్‌కి చెందిన సేంద్రియ వ్యవసాయ రైతు నవనీత్ కృష్ణన్ తెలిపారు. దీనిని మొక్కలు నాటిన నెల రోజులలో అందిస్తే ఫలితాలు బాగుంటాయన్నారు.