ఔషధమొక్క… పులివాయి / గొల్లపుల్లేడు / బండేడ

గొల్లపుల్లేడు 1-3 మీ. ఎత్తు పెరిగే ఒక పొద లేక 9 మీ. ఎత్తు పెరిగే ఒక చిన్న చెట్టు. ఆకులు వివిధ రూపాలలో ఉంటాయి. కొన్ని ఆకులు అండాకారంలో ఉంటాయి. మరికొన్ని బల్లెం ఆకారంలో ఉంటాయి. ఆకులు 4-7.5 సెం.మీ. పొడవు, 1-1.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి, రెసిన్ లాంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఆకులు తోలు లాగా గట్టిగా ఉంటాయి. పూలు సాధారణంగా కొమ్మల చివర ఏర్పడతాయి. పూలు పసుపు రంగు నుండి నారింజ ఎరుపు రంగులో ఉంటాయి. కాయ 1.5 సెం.మీ. వెడల్పున్న కాప్సూల్. కాయలు ఎరుపు రంగులో ఉండి పండినపుడు గోధుమరంగులోకి మారతాయి.

సాధారణ నామం : హాప్‌బుష్ శాస్త్రీయ నామం : డోడొనియా విస్కోసా కుటుంబం: సాపిండేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయ ఔషధరంగంలో గొల్లపుల్లేడు అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. దీనిని అనేక జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. కాండం లేదా ఆకుల కషాయాలను గొంతునొప్పి చికిత్సలో ఉపయోగిస్తారు. కాండాన్ని కీళ్ళ నొప్పుల నివారణకు ఫ్యూమిగెంట్‌గా ఉపయోగిస్తారు.
  • వేరు కషాయాన్ని జలుబు పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఆకులను దురద, జ్వరం, వాపులు, నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. ఆకులు, వేర్లను పంటి నొప్పులు, తలనొప్పి నివారణకు ఉపయోగిస్తారు. మొక్కభాగాల నుండి తయారు చేసిన లోషన్‌ని బెణుకులు, కాలిన గాయాలు, వ్రణాల చికిత్సకు ఉపయోగిస్తారు. అజీర్తి, అల్సర్లు, డయేరియా, మలబద్ధకం వంటి జీర్ణాశయ సమస్యలను ఆకులు లేదా వేర్ల కషాయం త్రాగించి నివారిస్తారు. ఈ మొక్క వేర్ల కషాయం లేదా తాజా వేర్లను బాలింతలు పాల ఉత్పత్తి పెరగడానికి తీసుకుంటారు. పూల నుండి తయారు చేసిన పానీయాన్ని టానిక్‌గా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • గొల్లపుల్లేడు పెట్రోలియం ఈథర్ ద్రావణం (3%) ప్రత్తి, బెండ, వంగ పంటలనాశించే మచ్ౘ్ల కాయతొలుచు పురుగు, ఈరియాస్ విట్టేల్లా పై అత్యధిక యాంటీఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • గొల్లపుల్లేడు ద్రావణం అలసంద బీటిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను 100% చంపింది (డిమెట్రి, అతని అనుచరులు, 2015).
  • లెపిడాప్టెరా పురుగులపై ఈ మొక్క కీటకనాశన లక్షణాలు రిపోర్టు చేయబడ్డాయి (మలర్‌వన్నన్ అండ్ సుభాషిణి, 2007; మలర్ వన్నన్, అతని అనుచరులు, 2008, 2009, షార్బి, అతని అనుచరులు, 2009).
  • ఈ మొక్క నుండి అనేక ఫ్లేవనాయిడ్లు, డైటెర్పెనిక్ యాసిడ్లు, సపోనిన్లు వేరు చేయబడ్డాయి (నియు, అతని అనుచరులు, 2010).
  • ఇథనాల్ ఆకు ద్రావణం రొఫాలోసైఫం మేడిస్ (పేనుబంక), ఎపిలాక్న పీన్యులేట (అక్షింతల పురుగు)లను పంటల ఆకులపై రసం పీల్చకుండా, తినకుండా డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. ఇతర ఫ్రాక్షన్స్ మైజస్ పెర్సికె (పేనుబంక), స్పోడోప్టెరా లిట్టురాలిస్ (లద్దెపురుగు) పైన కూడా డిటరెంట్ చర్యలను ప్రదర్శించాయి. ఆకు ద్రావణం నుండి వేరు చేసిన మిశ్రమం, లుపియాల్, మైజస్ పెర్సికె, ఎపిలాక్న పీన్యులేట రెండింటిపై డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. స్టిగ్మాస్టెరాల్ మిశ్రమం కేవలం పేనుబంక పురుగులపైన మాత్రమే డిటరెంట్ చర్య ప్రదర్శించింది. స్టిగ్మాస్ 7ఎన3ఆల్ కేవలం మైజస్‌పెర్సికె పైన మాత్రమే ఈ చర్య ప్రదర్శించింది. కాంపౌండ్ (మిశ్రమం) 4 కేవలం ఎపిలాక్న పీనిక్యులేట పైన మాత్రమే డిటరెంట్ చర్య ప్రదర్శించింది (మార్టినడయాజ్, అతని అనుచరులు, 2015).
  • ఈ మొక్క ఆకుల పెట్రోలియం ఈదర్, హెక్సేన్, క్లోరోఫాం, ఎసిటోన్, నీటి ద్రావణాలు క్షేత్ర ప్రయోగాలలో ఈరియాస్ విట్టేటు లార్వాలను సమర్ధవంతంగా అరికట్టాయి (మలర్వన్నన్, అతని అనుచరులు, 2007). అంతేగాక ఈ ద్రావణాలు హెలికోవర్ప ఆర్మిజరా గుడ్లపై గుడ్లనాశక చర్యను కూడా ప్రదర్శించాయి (మలర్వన్నన్, 2003)
  • ఆకులు, కాడల నుండి తీసిన ద్రావణాలు పేనుబంక (రొపాలోసైఫం పడి, మైజస్‌పెర్సికె) పురుగులు, అక్షింతలపురుగు (ఎపిలాక్న పీనిక్యులేట)పై మంచి డిటరెంట్ చర్యను ప్రదర్శించాయి. ప్రయోజనకర తేనెటీగల (ఎపిస్ మెల్లిఫెర్)కు ఎటువంటి హాని కలిగించలేదు (కాస్టిల్లో, అతని అనుచరులు, 2009).
  • గింజల ద్రావణం సైటోఫిలస్ ఒరైజె పై బలమైన స్పర్శ చర్యను ప్రదర్శించింది (జావొ, అతని అనుచరులు, 2006).
  • గొల్లపల్లేడు మొక్క క్రూడ్ ద్రావణం చెదలు, ఒడొంటోటెర్మస్ ఒబెసస్ వర్కర్ పురుగులను చంపింది. చెట్లలో చెదలు చేసే టనెల్ నిర్మాణాన్ని కూడా నివారించింది. దీనిని చెదల నివారణకు శక్తివంతమైన పురుగు మందుగా కూడా ఉపయోగించవచ్చు. (నిసార్, అతని అనుచరులు, 2015).
  • కోళ్ళ నుండి వేరు చేసిన సాల్మొనెల్లా స్పీసీస్ పెరుగుదలని గొల్లపల్లేడు మొక్క ఇథనాల్ ద్రావణం 71.19% అరికట్టింది. ఈ ఔషధ మొక్క నుండి తయారు చేసిన సహజ మందులు యాంటిబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వలన వైద్యరంగంలో ఉపయోగించవచ్చు. (ఆల్‌బకర్, అతని అనుచరులు, 2014).
  • గొల్లపల్లేడు ఆకుల ద్రావణం ట్రోగోడెర్మా గ్రానోరియం 3వ దశ లార్వాలను వికర్షణ చర్య ద్వారా సమర్ధవంతంగా నివారించింది (యూసఫ్ అండ్ సత్తి, 2012).
    ……………………………………………………………………………………………………………………………..
    రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పంటల కోతకు మరియు నూర్పిడికి ఉపయోగించే యంత్రాలు

  • పంట కోత కోసే పరికరము (రీపర్) :
    ధర : 1,20,000-1,50,000/-
    ఈ యంత్రంతో రోజుకు 10 ఎకరాల వరకు వరి కోత కోయవచ్చు; వరి, గోధుమ, బార్లీ తదితర ధాన్యపు పంటల కోతకు ఉపయోగిస్తారు.
  • మిని కంబైన్డ్ హార్వెస్టర్ :
    ధర : 20,00,000-25,00,000/-
    సామర్థ్యం : 1.5 ఎకరాలు/గంటకి
    కంబైన్ హార్వెస్టర్ వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటలను కోయడానికి, నూర్పిడి చేసి గింజలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కోత, నూర్పిడి, గింజల శుభ్రపరిచే పనులను ఒకేసారి నిర్వహిస్తుంది
  • కంబైన్డ్ హార్వెస్టర్ :
    ధర : 25,00,000-35,00,000/-
    సామర్థ్యం : సుమారు 2.5–3.7 ఎకరాలు/గంటకు
    ఈ యంత్రంలో వరి కోత కోయడం, నూర్పిడి చేయడం మరియు చెరగడం ఒకేసారి జరుగుతుంది. యంత్రాన్ని వరి, గోధుమ, మరియు మొక్కజొన్న పంటలను కోసేందుకు ఉపయోగించవచ్చు.
  • మల్టీక్రాప్ థ్రెషర్
    ధర : 5,00,000-7,00,000/-
    ఒకే యంత్రంతో వివిధ పంటల నూర్పిడి చేయవచ్చు; నూర్పిడి పనిని వేగంగా పూర్తి చేసి, కూలీల అవసరాన్ని తగ్గించవచ్చు.
    వరి: సుమారు 1 ఎకరం/గంట; మొక్కజొన్న: గంటకు 70–80 బస్తాలు
  • వరిగడ్డి కట్టలు కట్టే యంత్రము :
    ధర : 3,00,000-4,00,000/-
    సామర్థ్యం : 1.2–1.7 ఎకరాలు/గంటకు
    ఈ యంత్రం వరిగడ్డిని సేకరించి, కట్టలు కట్టి బయటకు విడిచిపెడుతుంది; ఒక్కో కట్ట బరువు 20–50 కిలోల వరకు ఉంటుంది.
  • రీపర్ కం బైండర్ :
    ధర : 3,00,000-4,00,000/-
    ఈ యంత్రం ద్వారా ఒక రోజుకి 3 నుండి 5 ఎకరాలు వరకు వరి కోత నిర్వహించవచ్చు. ఈ యంత్రం ద్వారా వరి మరియు గోధుమ పంటలను సమర్థంగా కోతచేయవచ్చు.

పి. బాబు, ఎన్. కిశోర్, ఎన్. సత్తిబాబు, మరియు ఎన్. రాజ కుమార్,
కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, ఆంధ్ర ప్రదేశ్. మరింత సమాచారం కొరకు ఫోన్ : 8639279098

Read More

ప్రమాదవశాత్తు పశువు యూరియా తింటే ఏమి చేయాలి?

వ్యవసాయ రంగంలో మరియు పాడి పరిశ్రమలో పశువుల పోషణ ఎంతో కీలకమైనది. పశువులకు సరైన ఆహారం, దాణా అందించడంలో చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ, వాటి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పశువులు ప్రమాదవశాత్తు యూరియా లేదా యూరియా కలిపిన దాణాను ఎక్కువగా తిన్నట్లయితే, వాటి శరీరంలో విషతుల్యత (Urea Toxicity) పెరిగి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాయి. కొన్నిసార్లు సరైన సమయంలో స్పందించకపోతే పశువులు మృత్యువాత పడే అవకాశం కూడా ఉంది.

ఈ సమస్యను నివారించడానికి మరియు పశువుల ప్రాణాలను కాపాడడానికి వివిధ వైద్య విధానాలలో (గృహ వైద్యం, హోమియోపతి, అల్లోపతి) అందుబాటులో ఉన్న అత్యవసర ప్రథమ చికిత్సల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  1. గృహ వైద్యం (Home Remedies)
    ప్రాథమికంగా పశువు యూరియా తిన్నట్లు గుర్తించిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ క్రింది గృహ చికిత్సలను అందించవచ్చు:
    • చింత పండు 10 నుండి 20 గ్రాములు మెత్తగా కొట్టి ఒక లీటరు నీటిలో కలిపి త్రాగించాలి.
    • లేదా పాలు ఒక లీటరు, రెండు కోడి గుడ్ల తెల్ల సొన, ఒక లీటరు వంట నూనె కలిపి త్రాగించమనాలి.
    • వీలైతే ఒక లీటరు కొబ్బరి నీళ్ళు త్రాపాలి.
    • ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి.
  2. హోమియోపతి చికిత్స (Homeopathic Treatment)
    హోమియోపతి విధానంలో క్రింది మందులను సూచించిన మోతాదులో ఇవ్వవచ్చు:
    • కార్బాలిక్ ఆసిడ్ 200 / టెరిబిన్సన్ 200 / క్లోరాల్ హైడ్రేట్ 200 – వీటిలో ఏదైనా ఒకటి 10 మాత్రలు ప్రతి రెండు గంటలకు ఒకసారి తినిపించాలి.
  3. అల్లోపతి చికిత్స (Allopathic Treatment)
    అత్యవసర పరిస్థితులలో అల్లోపతి వైద్య విధానం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు:
    • వెంటనే చల్ల నీరు 10-20 లీటర్ల దాకా త్రాగించాలి.
    • 4-5 లీటర్ల వెనిగర్ త్రాగించాలి.
    • ఇంజెక్షన్ అట్రోపిన్ సల్ఫేట్, నార్మల్ సలైన్, న్యూరోవెట్, ప్రిడ్నిసలోన్ లను డాక్టర్ ను సంప్రదించి అవసరం మేరకు వాడాలి.

గొర్రెలకు / మేకలకు తగు జాగ్రత్తలు
పైన పేర్కొన్న చికిత్స విధానం గొర్రెలకు మరియు మేకలకు కూడా వర్తిస్తుంది. కాకపోతే పరిస్థితిని బట్టి మందు వాడే మోతాదును తగ్గించాలి. పశువుల పెంపకందారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, యూరియా వంటి రసాయనాలు పశువులకు అందుబాటులో లేకుండా భద్రపరచడం ఉత్తమం.

డాక్టర్. జి. రాంబాబు , పశు వైద్యాధికారి, కడప. 9618499184

Read More

లేగ దూడలకు కళ్ళు కనపడకపోవటం, రేచీకటి, అంధ త్వం(NIGHT BLINDNESS)

లక్షణాలు:
కళ్ళు కనపడకపోవటం, నడక తడబాటు వుండటం, వస్తువులను గుర్తించలేక గుద్దుకోవటం, కళ్ళు నీరు కారటం, కాళ్ళు బాగా పైకి ఎత్తి జాగ్రత్తగా నడవటం.

కారణాలు:
పుర్రెకు సంబంధించిన ఎముకలు సరిగా పెరగక, కంటి నరాలు కుంచించుకు పోవటం.
కొన్ని దూడలకు వంశానుగతంగా జన్యుదోషం వల్ల వస్తుంది.
కొన్ని దూడలకు పుట్టిన వారం రోజుల వయస్సులోనే కళ్ళు కనపడవు.
తల్లి చూడిగా వున్నపుడు పచ్చి మేత మేపకపోవటం వల్ల కలిగే ‘ఎ’ విటమిన్ లోపం.

పశువైద్యుని సంప్రదించాలి. వ్యాధి ఖేదాత్మక పరిశీలన అవసరం.
ఈ వ్యాధిని ENCEPHALITIS, DISEASES of orbit, retina, optic nerve, localised infectionsగా భ్రమించే అవకాశం వుంది.

పరిష్కారాలు:

  1. కంటి నరం దెబ్బ తింటే వైద్యం ఫలించదు.
  2. జున్నుపాలు పుష్కలంగా త్రాగించాలి.

ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం

గృహవైద్యం:

  1. రోజుకు 100 గ్రా॥ చొప్పున సజ్ౙ పిండి లేదా చోడి పిండి లేదా రాగి పిండి తినిపించాలి.
  2. నీరుల్లి రసం ఒకటి రెండు చుక్కలు కంట్లో వెయ్యాలి.
  3. ఆముదం, ఉప్పు, కుంకుమ పువ్వు నూరి, శనగ గింజంత కంట్లో పెట్టాలి.
  4. పటిక లేదా పసుపు 10 గ్రా॥, శుభ్రమైన కాచి చల్లార్చిన నీళ్ళలో నానబెట్టి, ఒక రాత్రి వుంచి, తేర్చి 2 చుక్కలు రోజూ 3 పర్యాయాలు కంట్లో వేయాలి.
  5. కళ్ళలో ఆవు నెయ్యి 2 చుక్కలు వేసి కన్నుపై చన్నీళ్ళు చల్లాలి.

పెరటి వైద్యం:

  1. పచ్చి మేత, మొలకలు, అవిశ, ములగ మొదలైన ఆకులు మేపాలి.
  2. అవిసె పువ్వులో గుప్పెడు, ఆవాలు 5 గ్రా॥, తమలపాకులు 10, దేశవాళీ గోంగూర గుప్పెడు, ఒక నీరుల్లిపాయ నూరి, రోజుకు ఒక పర్యాయం తినిపించాలి.
  3. ముచ్చిలి గుంటలో ఆముదం రాసి, బొక్కెనాకు తొక్కి, ముచ్చిలి గుంటలో పెట్టి కట్టు కట్టాలి.
  4. ములగాకు లేదా అవిసెపూల రసం తేనెతో కలిపి కంట్లో వెయ్యాలి.
  5. నల్ల ఉమ్మెత్త ఆకు రసం, అల్లం రసంలో కలిపి కంట్లో వేయాలి.

ఔషధాలు :

  1. గానుగ వేరు తేనెతో అరగదీసి ఆ గంధం కంట్లో పెట్టాలి.
  2. చింత ఆకు 10గ్రా॥ కాచి చల్లార్చిన నీళ్ళలో నానబెట్టి, ఒకరాత్రి వుంచి, తేర్చి 2 చుక్కలు కంట్లో వేయాలి.

మూలికావైద్యం:

  1. జాజికాయ తేనెతో అరగదీసి ఆ గంధం కంట్లో పెట్టాలి.
  2. చేప నూనె రెండు చుక్కలు కంట్లో వెయ్యాలి, చేప నూనె రోజుకు 10 మి.లీ. చొ॥న త్రాగించాలి.

హోమియో:
ఏదైనా ఒక మందు

  1. ఫాస్పరస్ 30 లేదా కాస్టికం 30 లేదా సైలీషియ 30 లేదా నేట్రం మర్ 30 లేదా యుఫ్రెషియ 30 లేదా లైకోపోడియం 30 మందు, 5 బిళ్ళలు చొ॥న రోజుకు 2 పర్యాయాలు నెల రోజులు తినిపించాలి.
  2. నేట్రం ఫాస్ 6X + కాల్కేరియా ఫాస్ 6X + ఫెర్రం ఫాస్ 6X + కాలి సల్ఫ్ 6X + కాలి మర్ 6X + నేట్రం సల్ఫ్ 6X + కాల్కేరియా ఫ్లోర్ 6X + కాల్కేరియా సల్ఫ్ 6X + మాగ్ ఫాస్ 6X + నేట్రం మూర్ 6X + సల్ఫర్ 6X – ఈ ఔషధాల మిశ్రమం 10 మాత్రలు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా 10 రోజులు తినిపించాలి.

అల్లోపతి:

  1. పరాన్నజీవులను నిర్మూలించాలి.
  2. విటామిక్స్ లిక్విడ్ (VITAMIX LIQUID) వంటి మందు ఉదయం 5 మి.లీ., సాయంత్రం 5 మి.లీ. చొ॥న, 5 రోజులు త్రాగించాలి.
  3. విటమిన్ ‘ఎ’ ఇంజక్షను 2 మి.లీ. కండకు (I/Mగా) రోజు విడిచి రోజు 5 ఇంజక్షన్లు చేయించాలి.

జాగ్రత్తలు:

  1. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి.
  2. దూడను వదలకుండా, జాగ్రత్తగా దగ్గరుండి తీసుకువెళ్ళాలి.
  3. నెలలు నిండిన చూడి ఆవుకు పరాన్నజీవుల నిర్మూలనకై మందు వాడాలి.
  4. 8వ నెల చూడి ఆవుకు విటమిన్ ‘ఎ’ ఇంజక్షను వారానికి 2 మి.లీ. చొ॥న కండకు (I/Mగా) 4 ఇంజక్షన్లు చేయించాలి.

…………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

లేగ దూడలు తెల్లగా, జిగురుగా పారుట (CALF Scours)

సమస్య:
తెల్లగా, పచ్చగా విరేచనాలు
జిగురుగా పారటం
పేడ భరించరాని దుర్వాసన
జ్వరం వుండవచ్చు.

కారణాలు:
పాలు జీర్ణం కాక పోవటం,
అపరిశుభ్ర పొదుగు, పరిసరాలు,
E.COLI; SALMONELLA సూక్ష్మక్రిముల వల్ల,
పాలు ఎక్కువ తక్కువగా వదలటం, త్రాగటం

పశువైద్యుని సంప్రదించాలి. వ్యాధి భేదాత్మక పరిశీలన అవసరం.
ఈ వ్యాధిని అంతర పరాన్న జీవుల భారం, పాలు మిక్కుటంగా త్రాగటం, E.COLI; Salmonellosis; Coccidiosis; Cryptospordium; streptococcusలుగా భ్రమించే అవకాశం వుంది.

పరిష్కారాలు:

ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం:

  1. చింతపండు పులుసు 15 గ్రా॥, ఉప్పు 15 గ్రా॥ కలిపి ఒకే పర్యాయం త్రాగించాలి.
  2. కొర్ర పిండి 50 గ్రా॥, పసుపు 5 గ్రా॥, వెన్న 5 గ్రా॥ కలిపి 2 రోజులు తినిపించాలి.
  3. మజ్జిగ అరలీటరులో 10 గ్రా॥ పసుపు కలిపి రోజుకు 2 సార్లు త్రాగించాలి.
  4. పాలు పలుచగా చేసి గోరు వెచ్చగా త్రాగించాలి.
  5. ఉప్పు 5 గ్రా॥, సోడా ఉప్పు 5 గ్రా॥, గ్లూకోజు 25 గ్రా॥, ఒక లీటరు గోరు వెచ్చని నీటిలో కరిగించి ఈ విధంగా తయారు చేసిన ద్రవాన్ని రోజుకు 2,3 పర్యాయాలు త్రాగించాలి. లేదా ఒక లీటరు నీళ్ళలో 50 గ్రా॥ ఉప్పు, 10 గ్రా॥ల బెల్లం లేదా పంచదార కలిపి రోజుకు 2,3 పర్యాయాలు త్రాగించాలి.
  6. వాము 10 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥ కలిపి తినిపించాలి.

పెరటివైద్యం:

  1. గుప్పెడు దానిమ్మ, తంగేడు చిగుళ్లు 100 గ్రా॥ పెరుగులో కలిపి తినిపించాలి
  2. 10 ఆకులు గోంగూర, గాడిదగడపాకు, 50 మి.లీ. ఆముదం కలిపి తినిపించాలి.

ఓషధులు:

  1. ఇప్ప చెక్క లేదా పాల చెక్క 10 గ్రా॥ పసుపు 10 గ్రా॥ ముద్ద చేసి, పెరుగులో కలిపి తినిపించాలి.
  2. బలుసు, నేరేడు, తంగేడు ఆకులు ఒక్కొక్కటి 20 గ్రా॥ దంచి, ముద్ద చేసి 2,3 రోజులు తినిపించాలి.
  3. వెదురాకు పసరు 10 మి.లీ., పసుపు 5 గ్రా॥ కలిపి త్రాగించాలి.
  4. మామిడి జీడి, నేరేడు గింజలు సమపాళ్ళలో నూరి, ఆ పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  5. కొడిసెపాల చెట్టు చిగుళ్ళు 5-10 గ్రా॥ నూరి, మజ్జిగతో కలపి రెండు పర్యాయాలు త్రాగించాలి.

మూలికావైద్యం:

  1. గంధ కఛూరాలు, గుగ్గిలం, పటిక బెల్లం సమపాళ్ళలో నూరిన పొడి 10 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  2. శొంఠి, బూరుగు బంక, దానిమ్మ గింజలు, సోంఫు, జీలకర్ర, ధనియాలు సమపాళ్ళలో నూరి, ఆ పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి ఉదయం, సాయంత్రం త్రాగించాలి.
  3. మారేడు కాయ గుజ్జు 50 గ్రా॥, గంధ కఛూరాలు 50గ్రా॥, తుంగ ముస్తలు 50 గ్రా॥, యాలకులు 10 గ్రా॥, పటిక బెల్లం 100 గ్రా॥ నూరిన పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  4. యాలకులు, పటిక బెల్లం, ఉసిరికాయ సమపాళ్ళలో నూరిన పొడి 20 గ్రాములు నీళ్ళలో కలిపి త్రాగించాలి.

హోమియో: క్రింది మందులలో ఏదైనా ఒక మందు

  1. మెర్క్ కార్ 200 లేదా మెర్క్ సాల్ 200 లేదా పోడోఫైలం 200 లేదా ఆర్సెనికం ఆల్బం 200 పూటకు 5 మాత్రలు చొ॥న ఉదయం, సాయంత్రం 3 రోజులు తినిపించాలి.
    పై మందులకు తగ్గకపోతే,
  2. చైన 30 + నేట్రం ఫాస్ 30 + ఆంటిమోనియం క్రూడం 30 పూటకు 5 మాత్రలు చొ॥న ఉదయం, సాయంత్రం 3 రోజులు ద్రవ సమతుల్యత పునరుద్ధరించబడే వరకు తినిపించాలి.
  3. వ్యాధి నిరోధక టీకా: సైకోటిక్ కో 30 / స్ట్రెప్టోకోకినం 30 / ఈ. కొలై నోసోడ్ 30 ఏదైనా ఒక మందు దూడ పుట్టిన వెంటనే మొదటి మోతాదు, అప్పటి నుండి 24 గంటలకు 2వ మోతాదు, 48 గంటలకు 3వ మోతాదు, 72 గంటలకు 4 వ మోతాదు చొప్పున తినిపించాలి. 4. వెరాట్రం ఆల్బం / కార్బో వెజ్ / పైరోజెన్ / డల్కమార / కాంఫొరా / కాల్కేరియా ఫాస్ / రూస్ టాక్స్ 30 లలో ఏదైనా ఒక మందు 5 మాత్రలు చొప్పున ఉదయం, సాయంత్రంగా 5 రోజులు తినిపించాలి.
  4. బయో కెమికల్ సముదాయం: నేట్రం ఫాస్ 3X + కాల్కేరియా ఫాస్ 3X + ఫెర్రం ఫాస్ 3X + కాలి ఫాస్ 3X + కాలి సల్ఫ్ 3X + నేట్రం సల్ఫ్ 3X ఈ ఔషధాల మిశ్రమం 10 మాత్రలు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా 10 రోజులు తినిపించాలి.

అల్లోపతి:

  1. హాల్‌క్వినాల్ (HALQUINOL) 1-2 బిళ్ళలు తినిపించాలి.
  2. 50 గ్రా॥ల పంచదారను 9 గ్రా॥ ఉప్పుతో కలిపి 1 లీటరు నీటిలో కరిగించి త్రాగించాలి.
  3. రాగి లేదా నూకల జావకు గ్లూకోజు, ఉప్పు కలిపి లేదా ఎలక్ట్రాల్ (ELECTRAL) పొడి కలిపి త్రాగించాలి.
  4. హిస్టానిల్ (HISTANIL) ఇంజక్షను చేయించాలి.
  5. అవసరాన్ని బట్టి రింగర్స్ లాక్టేట్ (RINGER’S LACTATE) మరియు డెక్స్‌ట్రోజ్ నార్మల్ సెలైన్ (DEXTROSE NORMAL SALINE) ఇంజక్షను రక్తంలోకి (।/V గా) ఎక్కించాలి.

జాగ్రత్తలు:
జున్నుపాలు పుష్కలంగా త్రాగనివ్వాలి.
క్రమపద్ధతిలో అంతరపరాన్న జీవులను నిర్మూలించాలి.
మట్టి తినకుండా మతికి బుట్ట కట్టాలి.
పరిసరాలు శుభ్రంగా వుంచాలి, తల్లి పొదుగు పొటాషియం పర్మాంగనేట్ లోషన్‌తో శుభ్రపరచాలి.

…………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… పులిదుంప

ఇది 5 మీ. ఎత్తు వరకు పెరిగే తీగ జాతి మొక్క. తీగకు బాగా ముళ్ళుంటాయి. ఎడమవైపుకు మెలి తిరుగుతుంది. కణుపుకు ఒకటి చొప్పున పత్రములు వస్తాయి. బల్బిల్స్ ఉండవు. దుంపలు కొద్దిగా నొక్కబడి, గుండ్రంగా ఉంటాయి. అప్పుడప్పుడు గుండ్రటి తమ్మెలుగా కనపడుతుంది. భూమికి దగ్గరగా లోపల తయారవుతుంది. దుంప చర్మం ఎండుగడ్డి లేదా బూడిద రంగులోను, లోపలి కండ నిమ్మ పసుపు రంగులో ఉండి విషపూరితంగా ఉంటుంది. దుంపలలో అల్బుమినాయిడ్లు (7.2 -9.12%), బూడిద (4.054-.61%), కొవ్వు (0.97-1.1%), కార్బోహైడ్రేట్లు (81.45-81.89%), పీచు (3.28-6.28%), భాస్వరము (0.52-0.77%) కలిగి ఉంటాయి. దీని దుంప కంద దుంపను పోలియుంటుంది. ఈ దుంప పులి అడుగువలె ఉంటుంది కనుక దీనిని పులి దుంప అంటారు.

సాధారణ నామం : టైగరఫుట్ డయాస్కోరియా, తెల్లగినిగెడ్డలు శాస్త్రీయ నామం : డయోస్కోరియా హిస్పిడ కుటుంబం: డయోస్కోరియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దుంపలలో డయాస్కోరిన్ అనబడు విషపదార్థం (0.19%) ఉంటుంది.
  • ఇది విషపూరితమైన దుంప. దీని రసం పాము కాటుకు విరుగుడుగా వాడుతారు. కరువు పరిస్థితులలో దీనిని ఏడు దినాలపాటు పారే నీళ్ళలో నానబెట్టి వండుకుని తింటారు.

వ్యవసాయరంగంలో …

  • పులిదుంప నీటి ఆధారిత క్రూడ్ ద్రావణం (5%) కర్రపెండలాన్నాశించు పొలుసు పురుగు, సూడౌలాకాస్పిస్ పెంటగోనాని అత్యంత సమర్ధవంతంగా నివారించింది (వాస్క్వెజ్, 1991).
  • పులిదుంప దుంపలో ఉండే టోటాకోరిన్ అనే రసాయనం (5%) ద్రావణం పేను బంకను అత్యంత సమర్ధవంతంగా నివారించింది. కాని 25% వరి నల్లులను మాత్రమే చంపింది (సులిట్, 1967).
  • స్పోడోపైరాలిట్టొరాలిస్ లార్వాలు డయోస్కోరియా బటాటాస్ ఆకులను ఆహారంగా తీసుకోలేవు (వాడ, అతని అనుచరులు, 1970).
  • పులిదుంప దుంప నుండి వేరు చేసిన డయాస్కోరిన్, డయాస్కోరిన్ ఎనఆక్సైడ్ క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్, ఫ్లూటెల్లాక్ౙెåలోస్టెల్లా, రైస్ ఆర్మివర్మ్, సూడలెటియాసపరేట లార్వాలను ఆకులను తినకుండా నివారించాయి (బనాగ్, అతని అనుచరులు, 2005).
  • పులిదుంపని ఎలుకల నివారణలో ఉపయోగిస్తారు (కటెగొరి, 2017).
  • పులిదుంప మిథనాల్ ద్రావణంలోని ఆల్కలాయిడ్ 8ఎ’ క్యాబేజి పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాక్ౙెåలోస్టెల్లాపై ఆల్కలాయిడ్ ‘బి’ కన్నా బలమైన ఫీడింగ్ డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. (అలెక్సి, అతని అనుచరులు).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వర్మీవాష్‌: రైతుల పాలిట జీవామృతం

ప్రస్తుత వ్యవసాయంలో పెరుగుతున్న సాగు ఖర్చులు, రసాయనిక ఎరువులు పురుగు మందులపై అధికంగా ఆధారపడటం, నేలలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం, నేల జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, పంటల పెరుగుదలకు తోడ్పడే పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్న రైతులకు ‘వర్మీవాష్’ (Vermiwash) ఒక అద్భుతమైన ద్రవ సేంద్రీయ ఎరువుగా, సంజీవనిలా ఉపయోగపడుతోంది. తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే లేదా పొలం గట్టునే సులభంగా తయారుచేసుకోగలిగే ఈ సిసలైన ‘జీవామృతం’ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వానపాములు రైతుల మిత్రులుగా ప్రసిద్ధి చెందాయి. సేంద్రీయ వ్యవసాయంలో వానపాముల ద్వారా సేంద్రియ వ్యర్థాలను విలువైన ఎరువుగా మార్చే వర్మీకంపోస్టు తయారీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకంగా నిర్వహించిన వానపాముల బెడ్ల నుంచి సేకరించే ద్రవాన్ని వర్మీవాష్ అంటారు. వర్మీవాష్‌ అనేది వానపాముల ద్వారా తయారయ్యే అత్యంత ముఖ్యమైన ఉత్పత్తి.

వానపాముల శరీరం నుండి తయారయ్యే వర్మీవాష్‌లో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, హార్మోన్లు, ఎంజైములు, సూక్ష్మజీవుల నిరోధక అంశాలు, పెరుగుదల నియంత్రణ అంశాలు (ఆక్సిన్ మరియు సైటోకైనిన్) అలాగే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది నేలసారాన్ని పెంచడానికి మరియు పంటలలో రోగాలు, పురుగుల బెడదను అణచివేయడానికి సహాయపడుతుంది. వానపాముల శరీర పైభాగంలోని రంధ్రాల నుండి వచ్చే కోలోమిక్ ద్రవం శిలీంద్ర నాశక, సూక్ష్మజీవ నాశక మరియు పురుగుమందుల లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది రైతుల పంటలను రోగాలు మరియు కీటకాల నుండి దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

వానపాములు సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకొని జీర్ణక్రియ ద్వారా వాటిని సూక్ష్మ కణాలుగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో వాటి విసర్జన పదార్థాలు, సూక్ష్మజీవుల కార్యకలాపాలు సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నానికి తోడ్పడతాయి. వానపాముల బెడ్‌లో తగిన తేమను నిర్వహిస్తూ నీరు నెమ్మదిగా ప్రవహించేలా చేసినప్పుడు, ఆ బెడ్‌లోని కొన్ని కరిగే పదార్థాలు నీటితో కలిసి బయటకు వస్తాయి. ఈ ద్రవాన్ని తగిన విధంగా సేకరించి వడపోసినప్పుడు వర్మీవాష్ లభిస్తుంది.

వర్మీవాష్‌ తయారీ విధానం

  • సుమారు 100 లీటర్ల డ్రమ్ము/ బ్యారెల్ ను తీసుకొని, దాని క్రింది భాగంలో ఒక కుళాయిని (నల్లా) బిగించాలి.
  • పెద్ద డ్రమ్ము లోపల 10 లీటర్ల బకెట్‌ను తలక్రిందులుగా చేసి ఉంచాలి.
  • బిగించిన కుళాయి డ్రమ్ము మరియు బకెట్ రెండింటికీ సరిపోయేలా ఉండాలి.
  • డ్రమ్ము క్రింది భాగంలో సుమారు 25 నుండి 30 సెంటీమీటర్ల వరకు రాతి గులకరాళ్లతో నింపాలి.
  • ఈ పొరపై 25 సెంటీమీటర్ల మేర ఇసుకను పోయాలి.
  • ఇసుక పొరపై మిగిలిన భాగంలో 60 శాతం వరకు పంట వ్యర్థాలను (పంట అవశేషాలు) నింపాలి.
  • ఆ తర్వాత నీటిని పిచికారీ చేయాలి.
  • ఈ పొరపై, 25 శాతం భాగంలో పశువుల పేడను నింపాలి.
  • పేడ పైభాగంలో సుమారు 1 నుండి 5 కిలోల వరకు వానపాములను వదలాలి.
  • ఈ పొరపై పంట వ్యర్థాలను నింపి ప్రతిరోజూ 1 నుండి 5 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.
  • డ్రమ్ము లోపల వానపాములు ఒత్తిడికి గురై కోలోమిక్ ద్రవాన్ని బయటకు విడుదల చేస్తాయి.
  • పిచికారీ చేసిన నీరు ఈ ద్రవంతో పాటు వానపాము విసర్జక పదార్థం ద్వారా అన్ని పొరల గుండా ప్రవహించి క్రింది భాగంలో అమర్చిన బకెట్‌లో సేకరించబడి వర్మీవాష్‌గా కుళాయి ద్వారా బయటకు వస్తుంది.
  • వర్మీవాష్‌ యూనిట్ ఏర్పాటు చేసిన 15 నుండి 20 రోజుల తర్వాత ప్రతిరోజూ 5 నుండి 10 లీటర్ల వర్మీవాష్‌ను పొందవచ్చు.

వర్మీవాష్‌లో ఉండే పోషకాలు, ఉపయోగకర పదార్థాలు : వర్మీవాష్‌లోని పోషకాల పరిమాణం తయారీ విధానం, సేంద్రియ పదార్థాల రకం, నీటి పరిమాణం, సేకరణ సమయంపై ఆధారపడి ఉంటుంది.

  1. ప్రధాన పోషకాలు: నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు కొంతమేర కరిగిన రూపంలో ఉండవచ్చు. అయితే వాటి సాంద్రత స్థిరంగా ఉండదు.
  2. ద్వితీయ పోషకాలు, సూక్ష్మపోషకాలు: కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటి మూలకాలు ముడి పదార్థాలపై ఆధారపడి ఉండవచ్చు.
  3. సేంద్రియ సమ్మేళనాలు: సేంద్రియ ఆమ్లాలు, కరిగే సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవుల జీవక్రియకు సంబంధించిన కొన్ని సమ్మేళనాలు ఉండవచ్చు.
  4. సూక్ష్మజీవులు: తయారీ, నిల్వ పరిస్థితులను బట్టి వివిధ సూక్ష్మజీవులు ఉండవచ్చు. అయితే అన్ని వర్మీవాష్ నమూనాల్లో ప్రయోజనకర సూక్ష్మజీవులు సమానంగా ఉంటాయని చెప్పలేం.
  5. మొక్కల పెరుగుదలకు సంబంధించిన సమ్మేళనాలు: కొన్ని వర్మీవాష్ నమూనాల్లో మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపగల జీవక్రియ సంబంధిత పదార్థాలు ఉంటాయి. వీటి ఉనికి, సాంద్రత, పంటపై ప్రభావం తయారీ విధానాన్ని బట్టి మారుతుంది.

వర్మీవాష్‌ను ఉపయోగించే విధానం
వర్మీవాష్‌కు అన్ని పంటలకు వర్తించే ఒకే ప్రామాణిక మోతాదు లేదు. తయారీ విధానం, ద్రవంలో పోషకాల సాంద్రత, పంట దశ, ఉపయోగించే విధానం ఆధారంగా మోతాదును నిర్ణయించాలి. సాధారణంగా 1:10 నిష్పత్తిలో నీటిని కలిపి పంట ఆకులపై పిచికారీ చేయాలి.

  • పిచికారీకి: 1 లీటరు వర్మీవాష్‌ను 10 లీటర్ల నీటిలో కలిపి (1:10 నిష్పత్తిలో) పంట ఆకులపై పిచికారీ చేయాలి. ఇది అద్భుతమైన ఫోలియర్ స్ప్రే (Foliar spray) లా పనిచేస్తుంది.
  • డ్రిప్‌ ద్వారా వర్మీవాష్‌ వాడాలనుకుంటే ఎకరానికి 10-15 లీటర్లు వాడాలి.
  • వర్మీవాష్‌ను నీటితో కలిపి మొక్కల మొదళ్ళ చుట్టూ గల నేల బాగా తడిచేలా పోసుకోవాలి. దీనివలన నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చు.
  • ఒక ఎకరం పండ్ల తోటలో మొక్కల ఎదుగుదలకు 2-4 లీటర్ల వర్మీవాష్‌ను ఉపయోగించవచ్చు.
  • ఆకు కూరల పంటల్లో, తొలి దశలో రెండు లీటర్ల నుంచి ప్రారంభించి తర్వాత కాలంలో మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వర్మీవాష్‌ను పిచికారీ చేసుకోవచ్చు.
  • పాదుల్లో ఇవ్వడానికి: నేరుగా నీటితో కలిపి మొక్కల పాదుల్లోకి కూడా వదలవచ్చు.
  • ఉత్తమ ఫలితాల కోసం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం మంచిది.

వర్మీవాష్‌ యొక్క ఉపయోగాలు
• వర్మీవాష్‌లో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, హార్మోన్లు, ఆక్సిన్ మరియు సైటోకైనిన్‌లు ఉండి మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి.
• ఇది కేవలం ఎరువు మాత్రమే కాదు, అద్భుతమైన వృద్ధి ఉత్ప్రేరకం (Growth Promoter).
• పంటలలో రోగ మరియు కీటక నిరోధక శక్తిని పెంచుతుంది.
• నేల యొక్క భౌతిక మరియు రసాయన గుణాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది.

ముగింపు
వర్మీవాష్ సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించదగిన ఒక ద్రవరూప ఉప ఉత్పత్తి. సేంద్రియ వ్యర్థాలను సమర్థంగా వినియోగించడం, వర్మీకంపోస్టు తయారీ ప్రక్రియకు అదనపు విలువ కల్పించడం, పంటల పోషక యాజమాన్యంలో అనుబంధ వనరుగా ఉపయోగించడం వంటి అంశాల్లో దీనికి ప్రాధాన్యం ఉంది.

అయితే వర్మీవాష్‌ను అన్ని పోషక లోపాలకు పరిష్కారంగా లేదా రసాయనిక ఎరువులకు సంపూర్ణ ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. దాని నాణ్యతను గుర్తించి, తగిన మోతాదులో, సరైన పద్ధతిలో వినియోగించాలి. నేల పరీక్ష, సేంద్రియ ఎరువుల సమతుల్య వినియోగం, పంట మార్పిడి, పంట అవశేషాల నిర్వహణ, సమర్థవంతమైన నీటి యాజమాన్యంతో కలిపి వర్మీవాష్‌ను ఉపయోగించినప్పుడే స్థిరమైన వ్యవసాయానికి మెరుగైన తోడ్పాటు అందించవచ్చు. వర్మీవాష్‌ను నేల ఆరోగ్య పరిరక్షణకు, సమగ్ర సేంద్రీయ పోషక యాజమాన్యానికి తోడ్పడే అనుబంధ వనరుగా గుర్తించి శాస్త్రీయంగా వినియోగించాలి.

బి. చంద్ర శేఖర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం) పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

*దూడలు పాలు కక్కటం *(MILK REGURGITATION / EMESIS / VOMITING IN CALVES)

సమస్య:
డయాఫ్రం అనే అవయవం ఎక్కువగా సంకోచ వ్యాకోచాలు చెందటం
దూడలలో పేగు కదలికలు ఎక్కువవటం

కారణాలు:
గొంతులో ఏదైనా వస్తువు అడ్డుకొనటం (CHOKE)

పరిష్కారాలు:
గృహవైద్యం:

  1. పాలు సరిపడినన్ని మాత్రమే త్రాగించాలి.
  2. వాము 15 గ్రా॥, ఉప్పు 5 గ్రా॥ నూరి తినిపించాలి.

హోమియో:
క్రింది వాటిలో ఏదైనా ఒక మందు వాడవచ్చు.
ఆంటిమోనియం టార్టారికం 200 గానీ, ఈధూసా 200 గానీ ఆంటిమోనియం క్రూడం 200 గానీ ఇపికాక్ 200 మందు గానీ, మాగ్ కార్బ్ 200 గానీ, నక్స్ వామిక 200 గానీ 10 మాత్రలు రోజుకు 2 సార్లు 3 రోజులు తినిపించాలి.

అల్లోపతి:

  1. సోడా ఉప్పు (SODIUM BICARBONATE) 20 గ్రా॥ తినిపించాలి.
  2. ఆంటాసిడ్స్ – రానిటిడిన్, ఇసోమెప్రజోల్, లాన్‌సొప్రజోల్, ఒమిప్రజోల్, పాంటోప్రజోల్ మందులలో ఏదైనా ఒక మందును నియమిత మోతాదులో తినిపించాలి.
  3. సిక్విల్ లేదా ఎవొమిన్ ఇంజక్షన్ 2 మి.లీ. కండకు చేయించాలి.
  4. జీట్ (ZEET) ఇంజక్షన్ చేయించాలి.
  5. ఆక్సీ 50 (OXY 50) ఇంజక్షన్ చేయించాలి.
  6. ట్రైబివెట్ (TRIBIVET) ఇంజక్షన్ చేయించాలి.

జాగ్రత్తలు:

  1. తక్కువ పరిమాణంలో పాలు త్రాగనివ్వాలి.
  2. పాలు త్రాగిన వెంటనే స్వేచ్ఛగా పరిగెత్తనివ్వాలి.
    …………………………………………………………………………………..

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ABC వీర్య సేకరణ కేంద్రంలో HF ఎద్దులలో థైలీరియాసిస్ వ్యాధి – ఒక కేసు నివేదిక

పరిచయం :-
థైలీరియాసిస్ (Theileriosis) అనేది Theileria జాతికి చెందిన ప్రోటోజోవా పరాన్నజీవుల వల్ల పశువులలో కలిగే రక్త సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి సాధారణంగా పేల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా అధిక జాతి సామర్థ్యం కలిగిన హోల్స్టీన్ ఫ్రీసియన్ (Holstein Friesian – HF) పశువులలో ఈ వ్యాధి తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది.

రైతులకు కలిగే ప్రధాన ఆర్థిక నష్టాలు:-
థైలీరియోసిస్ రైతులకు ప్రత్యక్షంగా చికిత్స ఖర్చులు, పాల ఉత్పత్తి తగ్గుదల, పశువుల మరణాలు మరియు ఉత్పాదకత నష్టాల రూపంలో ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. పరోక్షంగా సంతానోత్పత్తి పనితీరు, పశువుల మార్కెట్ విలువ మరియు వ్యవసాయ ఆదాయంపై ప్రభావం చూపవచ్చు.వీర్య సేకరణ కేంద్రాల్లో ఉన్న సంతానోత్పత్తి ఎద్దుల ఆరోగ్య పరిరక్షణలో ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం.

కేసు వివరాలు :-
ABC వీర్య సేకరణ కేంద్రానికి పంజాబ్లోని లూధియానా నుండి మొత్తం నాలుగు HF ఎద్దులను ABC సీమెన్ స్టేషన్, వెరవల్లి, బాపులపాడు, కృష్ణా జిల్లాకి తీసుకువచ్చారు.

వివరాలు సమాచారం
మొత్తం ఎద్దుల సంఖ్య 4
ఒక సంవత్సరం లోపు వయస్సు కలిగినవి 3
మూడు సంవత్సరాల లోపు వయస్సు కలిగినది 1
చిన్న వయస్సు ఎద్దుల సగటు శరీర బరువు 350 కిలోలు
పెద్ద ఎద్దు శరీర బరువు 650 కిలోలు

రవాణా సమయంలో నాలుగు ఎద్దులలోనూ ఎటువంటి స్పష్టమైన వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అయితే, కేంద్రానికి చేరుకున్న మూడు రోజుల తరువాత ఎద్దులలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

క్లినికల్ లక్షణాలు:-
ఎద్దులలో గమనించిన ప్రధాన లక్షణాలు:
• శరీర ఉష్ణోగ్రత 104°F నుంచి 105°F వరకు పెరగడం.
• శోషరస గ్రంథులు (Lymph nodes) గణనీయంగా వాపు చెందడం.
• రక్తహీనత.
• ఆకలి తగ్గడం
పై లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, పశువైద్యులు థైలీరియాసిస్ వ్యాధిని అనుమానించారు.

చికిత్స మరియు రోగ నిర్ధారణ:-
దశ 1: ప్రారంభ చికిత్స
బుపార్వాక్వోన్ (Buparvaquone – 50 mg/ml) మోతాదు: ప్రతి కిలో శరీర బరువుకు 2.5 మి.గ్రా.

ఇచ్చే విధానం: మెడ కండరంలోకి లోతుగా (Deep Intramuscular Injection). వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే, ఎద్దులకు బుపార్వాక్వోన్ (Buparvaquone) ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, చికిత్స తరువాత కూడా జ్వరం మరియు ఇతర లక్షణాలు తగ్గకపోవడంతో తదుపరి రోగ నిర్ధారణ చర్యలు చేపట్టారు.

దశ 2: రక్త నమూనాల సేకరణ
ప్రారంభ చికిత్స చేసిన రెండు రోజుల తరువాత ఎద్దుల నుంచి రక్త నమూనాలను సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం ADDL, విజయవాడకు పంపించారు. అనంతరం, నమూనాలను మరింత నిర్ధారణ కోసం VBRI, విజయవాడకు పంపించారు.

రక్త స్మియర్ పరీక్ష
ఈ కేసులో బుపార్వాక్వోన్ చికిత్స అందించిన తర్వాత రక్త నమూనాను సేకరించి స్మియర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో Theileria పరాన్నజీవులు కనిపించలేదు.దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు.చికిత్స అనంతరం రక్తంలో కనిపించే పరాన్నజీవుల సంఖ్య తగ్గి ఉండవచ్చు. ఈ కేసులో ప్రత్యేకంగా గమనించదగిన అంశం ఏమిటంటే, చికిత్స అనంతరం సేకరించిన రక్త స్మియర్లో పరాన్నజీవులు కనిపించకపోయినా PCR పరీక్షలో Theileria spp. పాజిటివ్గా నమోదైంది.

హెమటాలజికల్ పరీక్షల ఫలితాలు
పరీక్ష నమోదైన ఫలితం
హీమోగ్లోబిన్ (Hb) 9.2 g/dL
ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (PCV) 27.4%
ఎర్ర రక్తకణాలు (RBC) 8.81 × 10⁶/µL
తెల్ల రక్తకణాలు (WBC) 6 × 10³/µL
ప్లేట్లెట్లు (Platelets) 397 × 10³/µL

దశ 3: తదుపరి చికిత్స
రక్త నమూనాలను పంపిన మరుసటి రోజు, ఒక ఎద్దుకు ఇమిడోకార్బ్ (Imidocarb) ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, ఆశించిన స్థాయిలో మెరుగుదల కనిపించలేదు. ఇమిడోకార్బ్ (Imidocarb – 120 mg/ml) మోతాదు: ప్రతి కిలో శరీర బరువుకు 1.2 మి.గ్రా. ఇచ్చే విధానం: కండరంలోకి (Intramuscular) లేదా చర్మం కిందకు (Subcutaneous).

దశ 4: సహాయక చికిత్స
1.ఆక్సీటెట్రాసైక్లిన్ (Oxytetracycline) నివేదించిన మోతాదు: 1 మి.లీ./3 కిలోల శరీర బరువు
2. న్యూరెనిక్ ఇంజెక్షన్ (Nuorenic Injection) మోతాదు: 5–10 మి.లీ. ఇచ్చే విధానం: కండరంలోకి లోతుగా (Deep Intramuscular Injection).
3. మెగ్లుడైన్ ఇంజెక్షన్ (Megludyne Injection) మోతాదు: ప్రతి కిలో శరీర బరువుకు 1.1–2.2 మి.గ్రా. ఇచ్చే విధానం: సిరలోకి నెమ్మదిగా (Slow Intravenous Injection).

ఈ చికిత్సను నాలుగు రోజుల పాటు అందించిన తరువాత ఎద్దులలో వ్యాధి లక్షణాలు తగ్గినట్లు నివేదించబడింది. ఇది చికిత్సకు అనుకూలమైన క్లినికల్ ప్రతిస్పందనను సూచిస్తుంది.

ఫలితాలు:-
ప్రారంభ బుపార్వాక్వోన్ చికిత్స తరువాత లక్షణాలు తగ్గలేదు. అనంతరం ఒక ఎద్దుకు ఇమిడోకార్బ్ ఇచ్చినప్పటికీ స్పష్టమైన మెరుగుదల కనిపించలేదు. తరువాత ఆక్సీటెట్రాసైక్లిన్ మరియు ఇతర సహాయక చికిత్సలను నాలుగు రోజుల పాటు అందించిన తరువాత క్లినికల్ లక్షణాలు తగ్గినట్లు నివేదించబడింది.
ఈ కేసులో రక్త స్మియర్ నెగటివ్గా ఉండగా, PCR పాజిటివ్గా రావడానికి చికిత్స అనంతరం పరాన్నజీవుల సంఖ్య తగ్గడం ఒక సాధ్యమైన వివరణ.
రక్త స్మియర్ పరీక్షలో పరాన్నజీవులు కనిపించకపోవడంతో మాలిక్యులర్ నిర్ధారణ కోసం PCR పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో Theileria spp. కు పాజిటివ్ ఫలితం వచ్చింది.మైక్రోస్కోపీతో పోలిస్తే తక్కువ పరాన్నజీవి సాంద్రత ఉన్న నమూనాల్లో కూడా సంక్రమణను గుర్తించే అవకాశం ఉంటుంది.

రైతులకు కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించే చర్యలు:-
• పశువులను క్రమం తప్పకుండా పేల కోసం పరీక్షించడం.
• పశువుల షెడ్లు, గోడలు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడం.
• పశువైద్యుని సూచనల ప్రకారం పేల నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించడం.
• అధిక జ్వరం, లింఫ్ నోడ్స్ వాపు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్య సహాయం పొందడం.
• అవసరమైనప్పుడు బ్లడ్ స్మియర్తో పాటు PCR వంటి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించడం. అంతిమంగా, PCR పరీక్ష ఈ కేసు నిర్ధారణకు ముఖ్యమైన సహాయక సాధనంగా నిలిచింది;

ముగింపు :-
సంతానోత్పత్తి ఎద్దుల నిర్వహణ: కొత్తగా తీసుకువచ్చే ఎద్దులకు ప్రత్యేక నిర్బంధ నిర్వహణ (Quarantine), పేల నివారణ, శరీర ఉష్ణోగ్రత పర్యవేక్షణ మరియు అవసరమైన రక్త పరీక్షలు చేపట్టడం మంచిది.

డా. ఎ . ఉషారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ (AH), పరాన్నజీవి శాస్త్ర విభాగం, వీబీఆర్ఐ, విజయవాడ.
డా. ఎస్. వసుంధర, అసిస్టెంట్ డైరెక్టర్ (AH), పాథాలజీ విభాగం, వీబీఆర్ఐ, విజయవాడ.
డా. సుజని, అసిస్టెంట్ డైరెక్టర్ (AH), ఎ.డి.డి.ఎల్. విజయవాడ.
డా. ప్రవీణ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఎ.డి.డి.ఎల్ , విజయవాడ.
డా. బీ. చంద్ర మౌళి నాయక్, జాయింట్ డైరెక్టర్ (AH), వీబీఆర్ఐ, విజయవాడ.
Ph: 8790998060

Read More

*ఔషధ మొక్క… పెద్ద పెండలం*

ఇది 5 మీ. వరకు ఎగప్రాకే బహువార్షికపు తీగ. వేర్లు లావుగా కండ కలిగి దుంపలాగా ఊరతాయి. దీనిని దుంపల ద్వారా మరియు బల్బిల్స్ ద్వారా వ్యాప్తిచేయవచ్చు. దీని దుంపలు వాణిజ్యపరంగా మరియు ఔషధంగా ఉపయోగిస్తారు.*సాధారణ నామం :* ఏసియాటిక్ యామ్, గ్రేటర్ యామ్

*శాస్త్రీయ నామం :* డయోస్కోరియా అలాట

*కుటుంబం :* డయోస్కోరియేసి

*ఉపయోగాలు : ఔషధరంగంలో …** దీని దుంపలలో అల్బుమినాయిడ్లు (7.96-15.68%), కొవ్వు (0.59-1.26%), బూడిద (4.23-7.28%), పీచు (2.19-6.12%), కార్బోహైడ్రేట్లు (71.67-85.027%), భాస్వరము (0.44-0.98%), పిండిపదార్థములు (21%) లభిస్తాయి. ఆకులలో డిఫ్రక్టోజ్, డిగ్లూకోజ్ మరియు పాలియోల్స్ ఉంటాయి.

* దీనిని దుంప కూరగా ఉపయోగిస్తారు. క్రిమిసంహారి, కుష్ఠు, మూలశంక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ దుంపలలో శరీరం పెరుగుదలకు దోహదపడే హార్మోనులుంటాయి.

*వ్యవసాయరంగంలో* * పెద్ద పెండలం ఇథనాల్ ద్రావణం స్ల్కీరోషియం రాల్ఫ్సి, బోట్రియోడిప్లోడియా థియోబ్రోమె, ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై అధిక యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. ఇది అన్ని శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది (ఒకిగ్బొ, అతని అనుచరులు, 2015).

* పెద్దపెండలం, పులిదుంప ద్రావణాలను మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్‌లో పులియబెట్టిన ద్రావణాలు గోల్డెన్ నత్తలను సమర్థవంతంగా నివారించాయి (పొన్సియానో, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More