వ్యవసాయ రంగంలో మరియు పాడి పరిశ్రమలో పశువుల పోషణ ఎంతో కీలకమైనది. పశువులకు సరైన ఆహారం, దాణా అందించడంలో చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ, వాటి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పశువులు ప్రమాదవశాత్తు యూరియా లేదా యూరియా కలిపిన దాణాను ఎక్కువగా తిన్నట్లయితే, వాటి శరీరంలో విషతుల్యత (Urea Toxicity) పెరిగి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాయి. కొన్నిసార్లు సరైన సమయంలో స్పందించకపోతే పశువులు మృత్యువాత పడే అవకాశం కూడా ఉంది.
ఈ సమస్యను నివారించడానికి మరియు పశువుల ప్రాణాలను కాపాడడానికి వివిధ వైద్య విధానాలలో (గృహ వైద్యం, హోమియోపతి, అల్లోపతి) అందుబాటులో ఉన్న అత్యవసర ప్రథమ చికిత్సల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- గృహ వైద్యం (Home Remedies)
ప్రాథమికంగా పశువు యూరియా తిన్నట్లు గుర్తించిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ క్రింది గృహ చికిత్సలను అందించవచ్చు:
• చింత పండు 10 నుండి 20 గ్రాములు మెత్తగా కొట్టి ఒక లీటరు నీటిలో కలిపి త్రాగించాలి.
• లేదా పాలు ఒక లీటరు, రెండు కోడి గుడ్ల తెల్ల సొన, ఒక లీటరు వంట నూనె కలిపి త్రాగించమనాలి.
• వీలైతే ఒక లీటరు కొబ్బరి నీళ్ళు త్రాపాలి.
• ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. - హోమియోపతి చికిత్స (Homeopathic Treatment)
హోమియోపతి విధానంలో క్రింది మందులను సూచించిన మోతాదులో ఇవ్వవచ్చు:
• కార్బాలిక్ ఆసిడ్ 200 / టెరిబిన్సన్ 200 / క్లోరాల్ హైడ్రేట్ 200 – వీటిలో ఏదైనా ఒకటి 10 మాత్రలు ప్రతి రెండు గంటలకు ఒకసారి తినిపించాలి. - అల్లోపతి చికిత్స (Allopathic Treatment)
అత్యవసర పరిస్థితులలో అల్లోపతి వైద్య విధానం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు:
• వెంటనే చల్ల నీరు 10-20 లీటర్ల దాకా త్రాగించాలి.
• 4-5 లీటర్ల వెనిగర్ త్రాగించాలి.
• ఇంజెక్షన్ అట్రోపిన్ సల్ఫేట్, నార్మల్ సలైన్, న్యూరోవెట్, ప్రిడ్నిసలోన్ లను డాక్టర్ ను సంప్రదించి అవసరం మేరకు వాడాలి.
గొర్రెలకు / మేకలకు తగు జాగ్రత్తలు
పైన పేర్కొన్న చికిత్స విధానం గొర్రెలకు మరియు మేకలకు కూడా వర్తిస్తుంది. కాకపోతే పరిస్థితిని బట్టి మందు వాడే మోతాదును తగ్గించాలి. పశువుల పెంపకందారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, యూరియా వంటి రసాయనాలు పశువులకు అందుబాటులో లేకుండా భద్రపరచడం ఉత్తమం.
డాక్టర్. జి. రాంబాబు , పశు వైద్యాధికారి, కడప. 9618499184

