దూడ, పాలు ఎక్కువగా త్రాగటం / పాలదొమ్మ (DYSPNEA Due to Excess Intake of Milk)
సమస్య:
- కడుపు ఉబ్బటం, 2. గురక రావటం, 3. దగ్గటం, 4. ఊపిరి ఆడక బాధపడటం
- ముక్కుల వెంట నీరు కారటం, 6. కళ్ళ వెంట నీరు కారటం
కారణాలు:
ఒకే పర్యాయం మిక్కుటంగా ప్రాలు త్రాగటం
పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.
గృహవైద్యం:
- వేడి నీళ్ళు త్రాగించాలి.
- వాము వాటర్ 30 మి.లీ. త్రాగించాలి.
- అవిశనూనె 15 మి.లీ. త్రాగించాలి.
- కొర్రపిండి 50 గ్రా॥, పసుపు 5 గ్రా॥, వెన్న 5 గ్రా॥ కలిపి లేదా వాము 10 గ్రా॥, ఉప్పు 2 గ్రా॥ మెత్తగా నూరి గాని లేదా ఆవ పిండి 5 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥, చేదు జీలకర్ర పొడి 2 గ్రా॥ కలిపి గాని తినిపించాలి.
- అల్లం 5 గ్రా॥ నలగగొట్టి, 1/4 లీటరు నీళ్ళలో రసం పిండి, పొంగించి త్రాగించాలి.
ఓషధులు :
- గానుగ చెక్క 15 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥ కలిపి దంచి తినిపించాలి.
- గాడిద గడప ఆకులు 5-6, ఉప్పు 10గ్రా॥ నూరి తినిపించాలి.
- ఎండు మోదుగ పూలు 5 గ్రా॥ నూరి, నీళ్ళలో కలిపి త్రాగించాలి.
మూలికావైద్యం:
అశ్వగంధ 50 గ్రా॥, గల్ౙేరు వేళ్ళు 50 గ్రా॥ నూరి, ఒక లీటరు పెరుగులో కలిపి తినిపించాలి.
హోమియో :
- ఈథూసా లేదా నక్స్ వామిక లేదా బ్రయోనియ లేదా పల్సటిల్ల 200 గానీ 10 మాత్రలు తినిపించాలి.
- ఆకలి పుట్టటానికి ఆల్ఫాల్ఫా 3ఒ లేదా ఫైవ్ ఫాస్ 6 మాత్రలు చొప్పున 5 రోజులు తినిపించాలి.
అల్లోపతి:
- లివ్ (LIV) 52 వంటి లివర్ టానిక్ (LIVER TONIC) మందును వాడాలి.
- ఎవిల్ (AVIL) వంటి మందును వాడాలి.
జాగ్రత్తలు:
- తల్లి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి దూడకు కావలసినన్ని పాలు మాత్రమే త్రాగనివ్వాలి.
- రోజు మొత్తం మీద దూడ బరువులో 10% మించి పాలు త్రాగించరాదు.
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.



