తెలంగాణా ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి చేసిన వాగ్ధానాలకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడతల రుణమాఫీని అమలు చేసింది. లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రేపు నిధులను విడుదల చేయనుంది. మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రారంభించి, అర్హులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేయనుంది. జులై 18న మొదటి విడత రుణమాఫీ, జూలై 30న రెండో విడత రుణమాఫీ, రేపు మూడో విడత రుణమాఫీ చేసి కేవలం నెల రోజులలో తాము చేసిన వాగ్ధానాన్ని తెలంగాణా ప్రభుత్వం నిలబెట్టుకొంటుంది.

14 Aug, 2024
