కండ్ల కలక అనేది కంటికి సోకే ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. దీనినే వ్యావహారిక భాషలో ‘కళ్ళ కలక’ అనీ వైధ్యాభాషలో ‘కంజక్తివైటిస్’ అంటారు. ఇది చూడటానికి మనుషులలో వచ్చే మద్రాస్ ఐ మాదిరి ఉంటుంది. ఈ పరిస్థితిలో కంటిలోని తెల్లటి భాగం ఎర్రగా లేదా గులాబీ రంగులోకి మారుతుంది. సాధారణంగా గులాబీ కళ్ళు అని కూడా అంటారు. కండ్ల కలక సాధారణంగా కంటిలో తెల్లగుడ్డు లేదా కళ్లల్లోని తెలుపు రంగు పొరను ఆవరించి ఉండే కణజాలం అయిన కనురెప్ప వాపు వల్ల ఏర్పడుతుంది. ముఖ్యంగా సరైన పరిశుభ్రత లేకపోవడం దానికి కారణం. అతి తేలికిగా ఒకదాని నుంచి మరొక దానికి సంక్రమిస్తుంది. ‘కళ్ళకలక’ వివిధ రకాలవ్యాధి క్రిములవల్ల వస్తుంది. సాధారణంగా వచ్చే కళ్ళ కలకకు స్టఫాలోకోకస బాక్టీరియా క్రిమే కారణం ఈ కళ్ళ కలక ముందు ఒక కంటికి ప్రారంభమైనా, రెండవ పూటకి రెండవ కంటికి కూడా సంక్రమిస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు కంటినుంచి కారే నీరుద్వారా, పుసులు ద్వారా రెండవవారికీ తేలికగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
కారణాలు
- కండ్ల కలకకి, సాధారణంగా వైరస్, బాక్టీరియాలు, ఎలర్జీలు కూడా కారణం కావచ్చు.
- ముఖ్యమైన వాటిలో ఎడినోవైరస్, ఫంగై, బాక్టీరియా (స్టెఫిలోకోకస్, ఎపిడెర్మిడిస్, స్టెఫిలోకోకస్ అరియోస్, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, హిమోఫిలస్ ఇన్ఫ్లుయాంజా).
- వైరస్ క్రిముల వల్లకూడా సాధారణంగా కళ్ళకలక వస్తుంది. వైరస్ వల్లవచ్చే కళ్ళకలకలో మామూలుగా వచ్చే కళ్ళకలకలోలాగా పుసులు కట్టడం, రెండుకళ్ళు అంటుకుని పోవడం జరగదు. వైరస్ వల్ల వచ్చే కళ్ళకలక ముందు ఒక్క కంటితోనే ప్రారంభం అవుతుంది. కళ్ళు ఎర్రబడతాయి, బాగా మండుతాయి, కళ్ళవెంట నీళ్ళు బాగా కారతాయి. వెలుతురూ చూస్తే మరింత నీళ్ళు కారతాయి. ఈ కళ్ళకలక కూడా మూడు – నాలుగు రోజుల్లో తగ్గుతుంది.
- రోగ నిరోధక వ్యవస్థలో ఏర్పడే లోపాలు, కంటి లోపల పెరిగిన ఒత్తిడి, రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించిన ఇతర సమస్యలు.
రోగ నిర్ధారణ
- కంటిని పరిశీలించడం ద్వారా, కండ్ల కలకను నిర్ధారిస్తారు. ఒక వేళ ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే, దానికి కారణమైన సూక్ష్మ క్రిమిని గుర్తించేందుకు కల్చర్ పరీక్షని నిర్వహించవచ్చు.
చికిత్స
- వైరస్ వల్ల కలికిన కండ్ల కలక సాధారణంగా ఎలాంటి మందులు లేకుండా రెండు వారాలలో తగ్గిపోతుంది. హెర్పిస్ వైరస్ కార్నీయాని సోకితే తగ్గేవరకు మందులను వాడమని సూచించవచ్చు.
- కళ్ళకలక వచ్చినప్పుడు శుభ్రమైన నీళ్ళతో కళ్ళు శుభ్రంచేస్తూ ఉండాలి. కళ్ళలో టెర్రామైసిన్, సోఫ్రామైసిన్ లాంటి కంటి అయింటుమెంట్లు వాడాలి. అవసరాన్ని బట్టి యాంటి బయాటిక్స్ వాడవలసి ఉంటుంది. కళ్ళకలక వచ్చినప్పుడు మందువాడితే రెండు మూడు రోజుల్లో కొంతవరకూ తగ్గిపోతుంది. పూర్తిగా వ్యాధి తగ్గేవరకు మందువాడాలి. సాధారణంగా కంటికి వచ్చే ఈ వ్యాధివల్ల ఎటువంటి దుష్పలితాలు ఉండవు, సరైన చికిత్స పొందకుండా వ్యాధిని నిర్లక్ష్యం చేయడంవల్ల, నాటువైద్యం చేయడంవల్ల కంట్లో పుండు ఏర్పడే ప్రమాదం మాత్రం వుంది.
- కంటి కనురెప్పలకు ఒక్కొక్కసారి ప్రేడ్నిసలోన్, డేక్సామితసాన్ వంటి కార్టికోస్తీరాయిడ్స్ను కనురెప్పలకు ఇవ్వడము వలన కూడా పలితాలు ఉంటాయి.
- ఇన్ఫెక్షన్లతో కూడిన బ్యాక్టీరియా సోకిన సందర్భంలో, యాంటీబయాటిక్స్ను కంటిలో వేసుకునే చుక్కలు, ఆయింట్మెంట్లు లేదా మాత్రల రూపంలో అందించవచ్చు.
- మంట పుట్టించే పదార్ధాల వల్ల కండ్ల కలక కలిగితే, కళ్ళని స్వచ్ఛమైన నీటితో ఐదు నిమిషాల పాటు శుభ్రపరుచుకోవాలి. ఆమ్లాలు, క్షారాల వంటి తీవ్రమైన మంట పుట్టించే పదార్ధాలు కంటికి తగిలినప్పడు మీ వైద్యులను సంప్రదించండి.
- ఎలర్జీ వల్ల కలిగే కండ్ల కలక, ఆ ఎలర్జీకి చికిత్స చేసి, దాని కారకాన్ని తొలగించినప్పడే మెరుగవుతుంది. ఎలర్జీకి సంబంధించిన కండ్ల కలక చికిత్సలో, మంటల్ని తగ్గించే మందులు, దురదల్ని తగ్గించే యాంటీ హిస్టమైన్స్ వంటివి ఉన్న మందులను ఉపయోగించాలి. కళ్ళ మంటని తగ్గించడానికి అప్పుడప్పుడు స్టిరాయిడ్లను కూడా ఉపయోగించవచ్చు.
సమస్యలు
- కండ్ల కలక సమస్యలు అది ఎలర్జీ వల్ల కలిగినదా లేదా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినదా అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. క్లమేడియా ఇన్ఫెక్షన్ వ్యాధి సందర్భంలో ఆ కండ్ల కలక కొన్ని నెలల పాటు కొనసాగవచ్చు.
- కొన్నిసార్లు కార్నియా వాచి, శుక్ల పటలపు కోత అనే ఒక పరిస్థితికి దారి తీయవచ్చు. శుక్ల పటలపు కోత ఫలితంగా ఏర్పడిన కంతులు చివరికి చూపుని శాశ్వతంగా పోగొట్టే అవకాశముంది.
- ఎక్కువసార్లు కనురెప్పలు చీము పట్టిన దూడలలో చిన్న కోత పెట్టి లోపల ఉండే చీమును బయటికి తీసి శుభ్రము చేసి చికిత్స చేయవలెను.
నివారణ
- అంటు రోగమైన కండ్ల కలకని నివారించేందుకు తరుచూ శుభ్రపరుచుకోడమన్నది ఒక గొప్ప పద్ధతి.
- కళ్ళని రుద్దడాన్ని నివారించాలి.
- కళ్ళను తుడిచిన తరవాత మీ చేతుల్ని తప్పనిసరిగా శుభ్రపరుచు కోవాలి.
- వాడే వస్తువులు రోజు సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి.
- కంటిని తుడుచుకున్న లేదా తాకిన తరువాత చేతుల్ని శుభ్రపరుచుకోవాలి.
- వేరే దూడలను తాకడాన్ని నివారించండి.
- చికిత్స కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.
- కళ్ళ కలక ఒక అంటురోగం. కాబట్టి వైద్యులు అనుమతించే దాకా వాటిని వేరే దుడలతో కలపకూడదు.

ప్రమాద సంకేతాలు
- ఈ కింది లక్షణాలు కనిపించినప్పడు వైద్యులను సంప్రదించండి.
- కళ్ళు ఎర్రగా మారి దురద పుట్టినప్పడు.
- రెండు, మూడు రోజుల తరువాత కూడా గుణం కనిపించకపోతే.
- కళ్ళు అంటుకు పోవడానికి దారితీసే చిక్కటి స్రవాలు కారుతున్నప్పడు.
- తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు.
- కళ్ళు రెప్పలు వాచినప్పుడు
కండ్ల కలక సామాన్య లక్షణాలు
- కళ్ళల్లో మంట పుట్టడం, ఎర్రబడడం, దురదలు.
- కళ్ళ నీళ్ళు ఎక్కువగా కారడం.
- ఉదయం లేచేసరికి రెండు కనురెప్పల్ని అంటుకునేలా చేసే పసుపు లేదా రంగు లేని స్రవాలు
- కనురెప్పలు వాచడం.
- విపరీతమైన కంటి నొప్పి, కంటి దురద, కళ్ళల్లో మంట పుట్టిన అనుభూతి.
- చూపు మసకబారడం.
- రెండు కళ్ళు పూర్తిగా అంతుకుని పోయి కళ్ళనిండా పుసులు ఉంటాయి
- కాంతిని చూడలేకపోవడం.
డా. జి. రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప.
ఫోన్: 9618499184
