ఇవి ఎక్కువగా దూడలలో వుంటాయి. రిబ్బను లేదా టేపు ఆకారంలో వుండే శరీర ఖండాలు గల జీవి. ఇవి పేగుల లోపలి గోడలకు పట్టుకొని గొలుసు లాగా పెరుగుతాయి. దీని వల్ల దూడలు నీరసపడతాయి. శరీర భాగాలలో నీరు చేరుతుంది.
పేడ పరీక్షించి వ్యాధి నిర్ధారించవచ్చు.
పరిష్కారాలు:
ఆయుర్వేదం :
ఉసిరిక రసం 4 చెంచాలు, కొబ్బరిపాలు 30 మి.లీ. రోజుకు 2 పర్యాయాలు చొప్ప్పున 20 రోజులు త్రాగించాలి.
మూలికావైద్యం:
వాయు విడంగాలు 5 గ్రా॥, ముసాంబరం 1 గ్రా॥, పొడి చేసి మజ్ౙిగలో కలిపి బద్దెపురుగుల నివారణ జరిగేంత వరకు త్రాగించాలి.
హోమియో:
- కూప్రం మెట్ 30 మందు 10 మాత్రలు ఉదయం, నక్స్ వామిక 30 మందు 10 మాత్రలు సాయంత్రం ఒక మందు తర్వాత మరో మందుగా మార్చి, మార్చి రోజుకు 4 సార్లు చొప్పున నెల రోజులు తినిపిస్తే బద్దెపురుగు నశిస్తుంది.
- ఫిట్స్ ఉంటే ఫైలిక్స్ మాస్ 30 + స్పైజీలియా 30 + టెల్లురియం 30 మందుల మిశ్రమం మాత్రలు 10 చొప్పున వారం రోజులు తినిపించాలి.
- పై మందులు పని చేయనప్పుడు, ఆర్సెనికం ఆల్బం 30 మందు 10 మాత్రలు రోజుకు 1 పర్యాయం చొప్పున 4 రోజులు తినిపించాలి.
- కాలేయం సరిగా పని చేయనపుడు, కాల్ మేఘ్ 30 / చెలిడోనియం 30 / లైకోపోడియం 30 లలో ఏదైనా ఒక మందు రోజుకు 10 మాత్రలు చొప్పున తినిపించాలి.
అల్లోపతి:
నిక్లోసమైడ్ (NICLOSAMIDE) కిలో శరీర బరువుకు 100 మి.గ్రా. చొప్ప్పున మందును త్రాగించాలి.
……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

