దూడలలో అంతరపరాన్నజీవులు(INTERNAL PARASITES)

సమస్య:
దూడ శుష్కించి పోవటం
మలబద్ధకం లేదా పారటం
పేడ వాసనతో వుండటం
పొట్ట జారటం, బాన పొట్ట
గడ్డం క్రింద నీరు చేరటం
పళ్ళు నూరటం
మట్టి తినటం
వెంట్రుకలు బిరుసెక్కటం
కళ్ళ వెంట నీరు కారటం
నోరు తెరచి, నాలుకను అటూ యిటూ తిప్పటం
బక్కచిక్కిపోవటం
తోకను దేనికైనా వేసి రుద్దటం
ఆకలి ఎక్కువ.
కడుపునొప్పి
పొట్టను కాళ్ళతో తన్నుకోవటం
నీరసం
వెంట్రుకలు మెలికలు తిరగటం

కారణాలు:
ఏటికపాముల (ASCARIASIS) బెడద
బద్దె పురుగుల (TAPE WORMS) భారం
రక్త విరేచనాలు (COCCIDIOSIS)
ఏకకణ పరాన్నజీవి (CRYPTOSPORIDIOSIS)

పశువైద్యుని సంప్రదించాలి.
పేడ పరీక్షించి, వ్యాధి నిర్ధారణ చేయటం మేలు

పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.

గృహవైద్యం:

  1. చింత పండు పులుసు 10 గ్రా॥ + ఉప్పు 10 గ్రా॥ + ఇంగువ 1 గ్రాము కలిపి త్రాగించాలి.
  2. బొప్పాయి గింజలు 10 గ్రా॥ నూరి 10 మి.లీ నీళ్ళలో కలిపి త్రాగించాలి.

పెరటివైద్యం:

  1. గాడిదగడపాకు 10 గ్రా॥ + ఉప్పు 10 గ్రా॥ + చింత పండు 10 గ్రా॥ కలిపి, నూరి తినిపించాలి.
  2. నేలవేము 20 గ్రా॥, శొంరి 10 గ్రా॥, ఉప్పు 5 గ్రా॥, అన్నభేది 1 గ్రా॥ కలిపి గానీ, కలబంద గుజ్జు 50 గ్రా॥, పసుపు 5 గ్రాములు కలిపి నూరి గానీ తినిపించాలి.
  3. కుప్పింటాకు లేదా దుష్టుపాకు లేదా నేలవేము లేదా అరటి వేళ్ళ రసం 20 మి.లీ., ఉప్పు 10 గ్రాములు + పసుపు 5 గ్రాములు కలిపి త్రాగించాలి.
  4. దూడ పుట్టిన 8వ రోజు, 20వ రోజు, 30వ రోజు, ఆపైన నెలకి 1 పర్యాయం బూడిద గుమ్మడికాయ రసం 30 మి.లీ. వరుసగా 3 రోజులు త్రాగించాలి.

ఓషధులు:

  1. వేపాకు బాగా నూరి 15 గ్రా॥ తినిపించవచ్చు.
  2. పాల చెక్క పొడి 5 గ్రా॥, 200 మి.లీ. నీళ్ళలో కలిపి త్రాగించాలి.

మూలికావైద్యం:

  1. వాయు విడంగాలు 5 గ్రా॥, ముసాంబరం 1 గ్రా॥, త్రిఫల చూర్ణం 5 గ్రా॥ కలిపి పొడిచేసి మజ్జిగలో కలిపి త్రాగించాలి.
  2. మోదుగ గింజల పొడి 5 గ్రా॥, అరకేజీ తవుడులో కలిపి 2,3 రోజులు తినిపించాలి.

హోమియో:

  1. దూడ పుట్టిన 8వ రోజు, 20వ రోజు, 30వ రోజు, ఆ పైన నెలకు ఒక పర్యాయం చొప్పున సిన 200 గానీ, సబడిల్ల 200 గానీ, సాంటోనినం 200 గానీ, నేట్రం ఫాస్ 30 గానీ ఏదో ఒక మందు 5 మాత్రలు చొప్పున 2 రోజులు తినిపించాలి.
  2. కొంకి పురుగులు పోవటానికి, చెనొపోడియం 30 మందు లేదా థైమాల్ 30 మందు 10 మాత్రలు చొప్పున రోజుకు 2 పర్యాయాలు చొప్పున 5 రోజులు తినిపించాలి.
    ……………………………………………………………………………………
    రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.
Read More

ఔషధ మొక్క… భూతావాసము / బెల్లగడ

బెల్లంగడ నిటారుగా పెరిగే ఒక బహువార్షిక లేదా కొద్ది కాలం జీవించే బహువార్షిక మొక్క. ఆకులు ఒక దాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. క్రమాకారం లేని పళ్ళు కలిగి ఉంటాయి. పూలు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో పొడవుగా, మందంగా, గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో, నల్లని గింజలు కలిగి ఉంటాయి.

సాధారణ నామం : వర్మ్‌సీడ్/మెక్సికన్ టీ శాస్త్రీయ నామం : డిస్ఫానియా కినోపోడియం / ఆంబ్రాసియా యీడెస్ కుటుంబం: అమరాంథేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఈ మొక్కని ఔషధ ప్రయోజనాలకు విస్తృతంగా ఉపయోగిస్తారు. కడుపులోని నులిపురుగులను చంపడానికి ఉపయోగపడుతుంది. వీటిని నివారించడానికి ఈ మొక్క కషాయం తాగుతారు. కడుపులోని గ్యాస్‌ని నివారించడానికి ఉపయోగిస్తారు. దీనిని పానీయం రూపంలో సేవిస్తారు.
  • ఆకుల నుండి తీసిన నూనెను మహిళలు బహిష్టు సమయంలో కలిగే నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. సబ్బులు, క్రీములు, లోషన్లు, సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్క శిలీంద్రనాశక లక్షణాలను కూడా కలిగి ఉంది. దీని నూనెని మలేరియా, కోరియా, హిస్టీరియా మరియు ఇతర నరాల సంబంధిత జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. మొత్తం మొక్క గాయాలను నయం చేయడంలో ఉపయోగిస్తుంది.
  • ఈ మొక్కని జలుబు, ఆస్త్మా చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కని నీటిలో అనేక రోజులు నానబెట్టి వచ్చిన ద్రవాన్ని కీళ్ళనొప్పులు తగ్గడానికి పై పూతగా పూస్తారు.
  • ఈ మొక్క ఆకుల కషాయాన్ని జ్వరాన్ని తగ్గించడానికి త్రాగిస్తారు. మొక్కలను పీకి నిప్పులలో వేస్తే ఈగలు, దోమలను వికర్షిస్తాయి. దగ్గు, బ్రోంకైటిస్ నివారణకుపయోగిస్తారు. డిసెంట్రి, డయేరియా తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కినోపోడియం మిథనాల్ ద్రావణం శనగ పంటనాశించే ఎండు తెగులు శిలీంద్రం, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం సైసరి పై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (మింజ్, అతని అనుచరులు, 2012).
  • కినోపోడియం పెట్రోలియం ఈథర్ ద్రావణం మరియు ఎసెన్షియల్ ఆయిల్ మలేరియా వాహకం ఎనోఫెలెస్ గాంబియే లార్వాలు, పెద్ద పురుగులపై విష ప్రభావం చూపాయి. ఈ ఫలితాలు బాడగ్రిలోని గ్రామాలలో ప్రజలు దోమలను పారద్రోలి మలేరియా నరికట్టడానికి సాంప్రదాయంగా కినోసోడియం మొక్కలను తలుపులపై వ్రేలాడదీయడాన్ని సమర్థించాయి (డెన్‌లోయి, అతని అనుచరులు, 2009).
  • కినోపోడియం పొడి, ద్రావణం, ఎసెన్షియల్ ఆయిల్ విష ప్రభావాన్ని గుడ్లు పెట్టడం తగ్గించడాన్ని, గుడ్లను నాశనం చేయడం, లార్వాలను నాశనం చేయడంపై నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ జియామెయిస్, ట్రైబోలియం కాస్టానియం లపై పరీక్షించారు. పొడి ఫార్ములేషన్ సైటోఫిలస్ జియామెయిస్‌పై అత్యధిక విష ప్రభావాన్ని చూపింది. ఇథనాల్ ద్రావణం కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అత్యధిక విష ప్రభావాన్ని చూపింది. ఎసెన్షియల్ ఆయిల్ సైటోఫిలస్ జియామెయిస్ కన్నా కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. ఆయిల్ ఆవిరి కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ గుడ్లపై చర్యను చూపింది కాని లార్వాలను అంతగా చంపలేకపోయింది (డెన్లోయి, అతని అనుచరులు, 2015).
  • కినోపోడియం ఆకులు, కాయల ద్రావణాలు రైజోపెర్తా డామినిక పెద్ద పురుగులపై కీటక నాశక చర్యను ప్రదర్శించలేదు. (గుజ్జో, అతని అనుచరులు).
  • కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ కంది గింజల నిల్వ సమయంలో ఆశించే పల్స్ బ్రూచిడ్స్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్‌లపై 100% పురుగు వికర్షక చర్యను ప్రదర్శించింది. 100 మైక్రోలీటర్ల గాఢత వద్ద కినోపోడియం ఆయిల్ రెండు పురుగులను 100% చంపింది. కంది కాయధాన్యాన్ని నిల్వ సమయంలో పల్స్ బీటిల్ నుండి కాపాడటానికి కినోపోడియం ఆయిల్‌ని కమ్మర్షియల్ ఫ్యూమిగెంట్‌గా సమర్ధవంతంగా ఉపయోగించవచ్చు. (పాండె, అతని అనుచరులు, 2012).
  • కినోపోడియం ఆకు ద్రావణం దోమలు, ఈగలపై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శిస్తుంది. నత్తలను చంపుతుంది. కోత అనంతర ధాన్య పరిరక్షణలో శిలీంద్రనాశినిగా కూడా పనిచేస్తుంది. ఎరువులకు కలిపి పురుగుల లార్వాలను నివారించవచ్చు. కినోపోడియం ఆయిల్‌ని కోత అనంతరం నిల్వ ధాన్యాన్ని శిలీంద్రాల నుండి కాపాడటానికి ఉపయోగిస్తారు. ఆకుల పొడి (0.5%)ని నిల్వ ధాన్యానికి కలిపి చిక్కుడు గింజలలో బ్రూచిడ్‌ని నియంత్రించవచ్చు. 5% ఆకుల పొడినుపయోగించి మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే పురుగుల (సైటోఫిలస్ జియామెయిస్‌తో సహా)ను నివారించవచ్చు. (పెస్టిసైడల్ ప్లాంట్ లీఫ్‌లెట్, ది యూనివర్సిటి ఆఫ్ గ్రీన్‌విచ్).
  • కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ లో టమాట విత్తనాలను నానబెట్టి శుద్ధి చేసి పిథియం అఫానిడెర్మేటం లేదా పిథియం డిబారియానం ఆశించిన భూమిలో విత్తితే పిథియం అఫానిడెర్మేటం కారక మాగుడు తెగులు 66.7%, పిథియం డిబారియానం కారక మాగుడు తెగులు 100% నివారించబడ్డాయి.
  • మొక్కజొన్న నిల్వ సమయంలో తీవ్ర నష్టం కలిగించే సైటోఫిలస్ జియామెయిస్ ని కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ (200 మైక్రోలీటర్లు/కిలో మొక్కజొన్న గింజలు) 72 గంటలలో 100% చంపింది. సంతతి ఉత్పత్తిని పూర్తిగా అరికట్టింది (లాంగ్సి, అతని అనుచరులు, 2017).
  • మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్‌పై కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది (చు, అతని అనుచరులు, 2011).
  • కినోపోడియం ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ (100 మైక్రోగ్రాములు /మి.లీ.) అఫ్లాటాక్సిన్‌ని ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్రం పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. ఈ ఆయిల్ (100 మైక్రోగ్రాములు / మి.లీ.) ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, బోట్రియోడిఫ్లోడియా థియోబ్రొమె, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, స్ల్కీరోషియం రాల్ఫిసి, మాక్రోఫోమినా ఫేసియోలినా, క్లాడోస్పోరియం క్లాడోస్పొరాయిడెస్, హెల్మింతోస్పోరియం ఒరైజె, పిథియం డిబారియానం వంటి అనేక శిలీంద్రాలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది. ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్‌కి చెందిన అఫ్లాటాక్సిన్ బి1ని ఉత్పత్తి చేసే సామర్థ్యం గల స్ట్రెయిన్‌ని అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేయకుండా అరికట్టింది. ఈ ఆయిల్ నిల్వ చేసిన మొక్కజొన్న ధాన్యాన్ని ఆశించే వివిధ శిలీంద్రాలు ఆశించకుండా ఒక సంవత్సరం వరకు కాపాడింది. ఎసెన్షియల్ ఆయిల్ యాంటిఆక్సిడెంట్ చర్యను కూడా ప్రదర్శించింది. ఈ ఫలితాలు కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్‌ని ఒక శక్తివంతమైన శిలీంద్రనాశినిగా ఉపయోగించి నిల్వ చేసిన ఆహారధాన్యాలను కాపాడవచ్చని నిరూపించాయి (రాజేష్ కుమార్, అతని అనుచరులు, 2006).
  • కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్‌ని డ్రెంచ్‌గా పెంచే మాధ్యమానికి ఇస్తే ఫంగస్ గ్నాట్ బ్రాడిసియా స్పీ. 2వ దశ, 3వ దశ లార్వాలపై అత్యంత సమర్ధవంతంగా పని చేసింది. అయితే ఎసెన్షియల్ ఆయిల్ నిమ్మ, బత్తాయి నాశించే పిండినల్లి, ప్లానోకోకస్ సిట్రి (3% చావు), వెస్టర్న్ ఫ్లవర్ త్రిప్స్, ఫ్రాంక్నిలియెల్లా ఆక్సిడెంటాలిస్ (18.34% చావు)పై తక్కువ సమర్ధవంతంగా పని చేసింది (క్లాయిడ్ అండ్ చియాసన్, 2007).
  • కినోపోడియం ఆకు పొడి (1:40) వేరుశనగ కాయలను నిల్వ సమయంలో ఆశించే కార్సిడాన్ సెర్రేటస్‌ని 13 రోజులలో 90% చంపింది (డెలోబెల్ అండ్ మాలోంగ, 1987). గుడ్లు పెట్టకుండా నివారించింది. యఫ1 ఉత్పత్తిని నివారించింది.
  • కినోపోడియం (0.1, 1, 3 గ్రా.) పొడి అలసంద ధాన్యం నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగుల నుండి పూర్తి రక్షణ నిచ్చి, పెద్ద పురుగుల విడుదలను పూర్తిగా అరికట్టింది (మెకెండ, అతని అనుచరులు, 2015).
  • కినోపోడియం కాయల ఇథనాల్ మరియు హెక్సేన్ ద్రావణాలు ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ గ్రానేరియస్ లను అరికట్టాయి (పీటర్‌సన్, అతని అనుచరులు, 1989).
  • కినోపోడియం ఆకుల పెట్రోలియం ఈథర్ ఎసిటోన్ ద్రావణం (1%) ట్రైబోలియం కాస్టేనియంని 4 వారాల తర్వాత 47% వికర్షించింది. 1% ద్రావణం రైజోపెర్తా డామినికపై వేప కషాయంతో సమానంగా యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. (మాలిక్ అండ్ ముజ్‌తాబి నక్వి, 1984).
  • కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ (40 మైక్రోగ్రాములు/పురుగు) 100% కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులను చంపింది. 50 మైక్రోగ్రాములు/పురుగు మోతాదు వద్ద 92% లాసియోడెర్మా సెర్రికొర్నె పురుగులను 3 రోజులలో చంపింది. కాని సైటోఫిలస్ ఒరైజె పురుగులను 52%, ట్రైబోలియం కన్‌ఫ్యూసం పురుగులను 15% మాత్రమే చంపింది (సు, 1986).
  • కినోపోడియం క్రూడ్ నీటి ద్రావణం (10%) అలసంద కాయల నుండి రసంపీల్చే నల్లి, క్లావిగ్రల్లా టోమెంటోసికోల్లిస్, పురుగుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. దిగుబడులు రసాయన పురుగు మందుతో సమానంగా ఉన్నాయి. ఈ ద్రావణం పిచికారి చేసిన ప్లాటులో కేవలం 6.0% కాయలు మాత్రమే పురుగులచే నష్టపరచబడ్డాయి (అడెసిన, 2014).
  • కినోపోడియం ద్రావణం గోధుమ ధాన్యాన్ని నిల్వ సమయంలో ఆశించి నష్టపరిచే ట్రోగోడెర్మా గ్రానేరియం ని అత్యంత సమర్ధవంతంగా చంపింది (ఇబ్రహీం).
  • కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యుజేరియం ఆక్సిస్పోరం పై శిలీంద్రనాశక చర్యను, సైటోఫిలస్ జియామెయిస్ పై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ రసాయన శిలీంద్రనాశనులు, పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది (జరమిల్లో, అతని అనుచరులు, 2012).
  • కినోపోడియం ద్రావణం { ట్వీన్ 20 మిశ్రమం డాక్టిలోపియస్ ఒపన్షియె రెండవ దశ పిల్ల పురుగులను 82 నుండి 99% చంపింది (విగ్వెరాస్, అతని అనుచరులు 2007).
  • అలసంద నిల్వ సమయంలో ఆశించే బ్రూచిడ్స్ నివారణలో టెఫ్రోసియా వోగెలి, కినోపోడియం యాంబ్రాసిడెమ్, టిలోనియా డైవర్సిఫోలియా, లిప్పియా జవానిక, వెర్మోనియా అమైగ్ౙాలినా తక్కువ ఖర్చుతో కూడిన సమర్ధవంతమైన పర్యావరణహిత పురుగు యాజమాన్య పద్ధతిలో ఉపయోగిస్తాయి (మికెండ, అతని అనుచరులు, 2014).
  • కినోపోడియం మొక్క ద్రావణం చీని, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి, జీడిమామిడి, కూరగాయల పంటల్లో ఆశించే పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, నల్లి వంటి పురుగులను నివారిస్తుంది (రజిత్ ముల్లెంరియావ, 2015).
  • మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ జియోమెయిస్ పెద్ద పురుగులపై కినోపోడియం ఇథైల్, నీటి ద్రావణాలు, పొడి వికర్షక ప్రభావాన్ని చూపాయి (జ్టొజనెట్టొ, అతని అనుచరులు, 2013).
  • కినోపోడియం ఆకు పొడి (2.5%) లెగ్యూమ్స్ నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. విగ్నా సబ్‌టెర్నేనియా వేరుశనగలో 69.64% పెద్ద పురుగులను, కెర్ట్సింగియెల్లా జియోకార్పా వేరుశనగలో 100% పురుగులను చంపింది. (చౌగౌరవ్, అతని అనుచరులు, 2015)
    ……………………………………………………………………………………………………………………………..
    రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
Read More

వైరల్ మాస్టిటిస్ (మ్యామిలైటిస్) – గేదెల్లో చనుమొనల తెగులు వ్యాధి విశ్లేషణ, చికిత్స

పాడి గేదెల్లో అకస్మాత్తుగా పొదుగు, చనుమొనలు తీవ్రమైన వాపునకు గురై పాడి రైతులకు అధిక ఆర్థిక నష్టాన్ని కలిగించే ప్రధాన వ్యాధులలో వైరల్ మాస్టిటిస్ లేదా మ్యామిలైటిస్ (చనుమొనల తెగులు వ్యాధి / అల్సరేటివ్ థెలైటిస్) అత్యంత ప్రమాదకరమైనది. ఈ వ్యాధి ప్రధానంగా బోవిన్ హెర్పెస్ వైరస్ -2 అనే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవిస్తుంది.

ఈ వ్యాధి సోకినప్పుడు చనుమొనల్లో తీవ్రమైన వాపు, చనుమొనలు ఉబ్బడం, తీవ్రమైన నొప్పి వల్ల పాలు పితకడం మరియు దూడలు పాలు త్రాగడం లో అడ్డంకులు ఏర్పడతాయి. వ్యాధి సోకిన ప్రాంతంలో లోతైన పుండ్లు ఏర్పడతాయి.

స్థానికంగా ఈ వ్యాధిని గుల్వాద్దీ వ్యాధి (Gulwaddee) అని పిలుస్తారు. చనుమొన మరియు పొదుగు కలిసే సంధి స్థానంలో మెడను కోసినట్లుగా మానని లోతైన పుండు ఏర్పడటం వల్ల దీనికా పేరు వచ్చింది. ముఖ్యంగా, పొదుగు యొక్క వెనుక చనుమొనలు ముందు చనుమొనల కంటే చాలా ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటాయి.

  1. వ్యాధికి అనుకూలించే పరిస్థితులు
    • తొలి ఈత గేదెలు : ఈ వ్యాధి ప్రధానంగా మొదటిసారి ఈనిన తొలి ఈత గేదెల్లోనే ఎక్కువ శాతం కనిపిస్తుంది. పెయ్యలు ఈనడానికి ముందే శరీరంలో నిద్రాణంగా ఈ వైరస్‌ను కలిగి ఉండి, ఈత తదుపరి ఒత్తిడి వల్ల వ్యాధి బారిన పడతాయి. సాధారణంగా ఈనిన మొదటి రెండు నెలల కాలంలోనే అత్యధిక కేసులు నమోదవుతాయి.
    • ఈత ఒత్తిడి మరియు హార్మోన్ల మార్పులు: ఈనే సమయంలో కలిగే తీవ్ర శారీరక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు మరియు ఈత సమయంలో వచ్చే పొదుగు నీటి వాపు వంటివి శరీరంలో దాగి ఉన్న హెర్పెస్ వైరస్‌ను తిరిగి క్రియాశీలకం చేస్తాయి.
    • చలికాలం: సంవత్సరంలోని ఇతర కాలాల కంటే ఉష్ణోగ్రతలు తగ్గే చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత, ప్రాబల్యం మరియు వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటాయి.
    • వ్యాప్తి కారకాలు: వ్యాధి సోకిన పశువుల నుండి ఆరోగ్యకరమైన పశువులకు పాలు పితికే మనుషుల చేతులు, క్రిమిరహితం చేయని పాలు పితికే పరికరాలు, కుట్టే కీటకాలు, వ్యాధిగ్రస్తు ఆబోతుల వీర్యం మరియు గాలి ద్వారా కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది.
  2. వ్యాధి దశలు మరియు లక్షణాలు
    వైరల్ మ్యామిలైటిస్ వ్యాధి గేదెల్లో కింది దశల్లో క్రమంగా తీవ్రమవుతుంది:
  3. ప్రారంభ దశ: వ్యాధి ప్రారంభంలో చనుమొనలు సాధారణ పరిమాణం కంటే 2 నుండి 3 రెట్లు పెద్దవిగా వాస్తాయి. చనుమొన చర్మం మందపడి మెరుస్తూ కనిపిస్తుంది. చనుమొన గోడల మందంలో 2 నుండి 5 మిమీ పరిమాణంలో గట్టి బిళ్ళలు లేదా వాపు బిళ్ళలు ఏర్పడతాయి. తీవ్రమైన నొప్పి వల్ల చనుమొన సాగే గుణాన్ని కోల్పోతుంది, దీనివల్ల పాలు పితకడం చాలా కష్టంగా మారుతుంది.
  4. తీవ్ర రూపం: ప్రారంభ బిళ్ళలు 48 గంటల్లో పగిలి లోతైన, మానని పుండ్లుగా మారతాయి. ముఖ్యంగా చనుమొన మరియు పొదుగు కలిసే సంధి స్థానంలో లోతైన పుండ్లు ఏర్పడతాయి. పుండు గడ్డకడుతున్న కొద్దీ దానిపై మందపాటి బ్లూ-బ్లాక్ పొక్కులు / మచ్చలు కమ్ముకుంటాయి.
  5. సంక్లిష్ట దశ: వ్యాధి ముదిరే కొద్దీ తీవ్రమైన కణజాల కుళ్ళుదల మరియు చర్మం నల్లబడి ఊడిపోవడం) జరుగుతుంది. చనుమొన కొంత భాగం ఊడిపోవడం జరుగుతుంది, తీవ్ర రూపంలో చనుమొన పూర్తిగా ఊడిపోయి కేవలం చనుమొన ద్వారం చుట్టూ ఉండే కణజాలం మాత్రమే మిగులుతుంది. చనుమొన ద్వారం సంకోచించి ఉంగరం వలె తయారై పాలు బయటకు రాకుండా మార్గం మూసుకుపోతుంది.
  6. సాధారణ బ్యాక్టీరియా పొదుగు వాపుకు, వైరల్ మ్యామిలైటిస్‌కు తేడాలు మరియు వ్యాధి నిర్ధారణ
    వైరల్ మ్యామిలైటిస్ వ్యాధిని సాధారణ బ్యాక్టీరియల్ పొదుగు వాపు నుండి వేరు చేయడానికి పాలు మరియు క్లినికల్ పరీక్షలు కీలకమైనవి:

లక్షణము / పరీక్ష : పాలు

సాధారణ బ్యాక్టీరియా పొదుగు వాపు (Bacterial Mastitis): పాలు విరిగిపోవడం, రంగు మారడం, చీము లేదా నీళ్లలా రావడం జరుగుతుంది

వైరల్ మ్యామిలైటిస్ (Viral Mammillitis): పాలు శుభ్రంగా, సాధారణ రంగు మరియు చిక్కదనంతో ఉంటాయి

లక్షణము / పరీక్ష : పాలు నిర్ధారణ పరీక్షలు
సాధారణ బ్యాక్టీరియా పొదుగు వాపు (Bacterial Mastitis): CMT పాజిటివ్; pH, ఎలక్ట్రికల్ కండక్టివిటీ మరియు సోమాటిక్ సెల్ కౌంట్ (SCC) గణనీయంగా పెరుగుతాయి

వైరల్ మ్యామిలైటిస్ (Viral Mammillitis): CMT నెగిటివ్; pH, ఎలక్ట్రికల్ కండక్టివిటీ మరియు సోమాటిక్ సెల్ కౌంట్ (SCC) సాధారణంగా ఉంటాయి

లక్షణము / పరీక్ష : వ్యాధి ప్రభావిత స్థానం
సాధారణ బ్యాక్టీరియా పొదుగు వాపు (Bacterial Mastitis): పొదుగు లోపలి గ్రంథి కణజాలాన్ని దెబ్బతీసి పాల ఉత్పాదనను, గుణ గణాలను మార్చుతుంది
వైరల్ మ్యామిలైటిస్ (Viral Mammillitis): చనుమొన బయటి చర్మం, గోడలు మరియు ద్వారం కి మాత్రమే పరిమితమవుతుంది

CMT- కాలిఫోర్నియా మాస్టైటిస్ పరీక్ష

  1. సమగ్ర వైద్య చికిత్సా పద్ధతులు
    వైరల్ మ్యామిలైటిస్ నివారణ, ఉపశమనం మరియు పుండ్ల నివారణకు శాస్త్రీయ చికిత్సా ప్రోటోకాల్:
    • వైరస్ నిరోధక మందులు (Antiviral Drugs): హెర్పెస్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అసిక్లోవిర్ (Acyclovir) మందును నోటి ద్వారా (2 mg/kg), 5% లేపనం (ointment) రూపంలో పూయాలి మరియు చన్ను లోపలికి కూడా ఎక్కించాలి.
    • ఫైబ్రోసిస్ నివారణ & రోగ నిరోధక శక్తి పెంపు: చనుమొన ద్వారం గట్టిపడి గడ్డగా మారకుండా నిరోధించే యాంటీ-ఫైబ్రోటిక్ చర్య కోసం లిథియం యాంటీమోనీ థియోమలేట్ ఇంజెక్షన్ ఇవ్వాలి. పశువులో రోగ నిరోధక శక్తిని పెంచడానికి నోటి ద్వారా జింక్ సల్ఫేట్ (రోజుకు 2-3 గ్రాములు, 10 రోజుల పాటు), విటమిన్ E-సెలీనియం, మరియు లెవామిసోల్ వాడాలి.
    • చికిత్సా విధానాలు: వైరస్ నిరోధకత మరియు మద్దతు చికిత్సగా ఐవర్‌మెక్టిన్ ఇంజెక్షన్ (0.1 µg/kg) 10 రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వడం సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనితో పాటు, హెర్పెస్ వైరస్ అధిక ఉష్ణోగ్రత వద్ద నశిస్తుంది కాబట్టి ఇన్‌ఫ్రారెడ్ ల్యాంప్ వెలుగు చికిత్స ద్వారా చనుమొనల భాగంలో ఉష్ణోగ్రతను పెంచి వైరస్ రెప్లికేషన్‌ను అరికట్టవచ్చు.
    • నొప్పి మరియు వాపు నివారణ: వాపు, తీవ్ర నొప్పుల నివారణకు మెలోక్సికామ్ (0.5 mg/kg) మరియు అలెర్జీ నిరోధానికి క్లోర్‌ఫెనిరమైన్ మాలిక్యులేట్ ఇంజెక్షన్లను వాడాలి.
    • వైరస్ వల్ల ఏర్పడిన పుండ్లపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకకుండా నిరోధించడానికి యాంటీబయోటిక్స్ (ఉదాహరణకు: ఎన్రోఫ్లోక్సాసిన్, సెఫ్ట్రియాక్సోన్) అందించాలి.
    • పుండ్ల శుభ్రత మరియు లేపనాలు: చనుమొనలపై గట్టిపడిన బ్లూ-బ్లాక్ పొక్కులను/సిబ్బెలను సర్జికల్ బ్లేడ్, సిల్వర్ నైట్రేట్ స్టిక్స్ లేదా కాపర్ సల్ఫేట్ ఉపయోగించి జాగ్రత్తగా శుభ్రం చేయాలి. వైరస్ క్లోరోఫామ్‌కు సున్నితమైనది కాబట్టి డిబ్రైడ్‌మెంట్ తర్వాత క్లోరోఫామ్ ద్రావణంతో కడగవచ్చు. అనంతరం పొవిడోన్-అయోడిన్ లేదా క్లోర్‌హెక్సిడైన్ టీట్ డిప్స్ ఉపయోగించి రోజూ చనుమొనలను క్రిమిరహితం చేయాలి.
  2. పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్వహణ పద్ధతులు
    వ్యాధిగ్రస్త పశువుల వేరుపాటు: వ్యాధి లక్షణాలు కనిపించిన పశువులను వెంటనే మిగిలిన ఆరోగ్యకరమైన పశువుల నుండి వేరు చేయాలి. వ్యాధి సోకిన గేదెలకు అందరి కంటే చివర్లో పాలు పితకాలి.

పరిశుభ్రత & క్రిమిసంహారక చర్యలు: పాలు పితకడానికి ఉపయోగించే పరికరాలను మరిగే నీటిలో లేదా క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. పాలు పితికే ముందు, పితికిన తర్వాత అయోడోఫోర్ లేదా క్లోర్‌హెక్సిడైన్ ద్రావణాలలో చనుమొనలను ముంచడం తప్పనిసరి.

కీటకాల నివారణ: పశువుల పాకల్లో ఈగలు, దోమలు మరియు కుట్టే కీటకాలను నివారించేందుకు క్రిమిసంహారక స్ప్రేలు ఉపయోగించాలి. కీటకాలు వైరస్‌ను ఒక పశువు నుండి మరొక దానికి వేగంగా వ్యాపింపజేస్తాయి.

పశువుల కొనుగోలు జాగ్రత్తలు: కొత్తగా పశువులను కొనుగోలు చేసేటప్పుడు వాటి పొదుగు మరియు చనుమొనలను నిశితంగా పరిశీలించాలి. గతంలో ఈ వ్యాధి సోకి తగ్గిన పశువుల చనుమొనలపై తెల్లటి/రంగు మారిన మచ్చలుఉంటాయి. అటువంటి పశువులను లేదా పుండ్లు ఉన్న పశువులను కొనుగోలు చేయకూడదు.

డా.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, పశువైద్యశాల, నందిమండలం, కడప జిల్లా. Ph: 9618499184

Read More

లేగ దూడలలో నుసిమిరి వ్యాధి (MANGE or SCABIES

సమస్య:
దురద
ఆ తరువాత వెంట్రుకలు రాలిపోవటం
వ్యాధి సోకిన శరీర భాగంపై, ముందుగా నల్లటి
పొడలు ఏర్పడటం
శరీరాన్ని కొరుక్కోవటం
తోక కొరుక్కోవటం
క్రమేపీ శరీరమంతా వ్యాపించటం
అస్తిమితం

కారణాలు:
ఫంగస్ వ్యాధి.
SORCOPTIC పురుగుల వల్ల

పశువైద్యుని సంప్రదించాలి.
ఈ వ్యాధిని Mycotic Dermatitis, Allergy, Pox, Utricaria, Ring Worm, Inherited Para Keratosisగా భ్రమించే అవకాశం వుంది. కనుక వ్యాధి భేదాత్మక పరిశీలన అవసరం.

పరిష్కారాలు:

  1. ఆయుర్వేదం ప్రకారం ఈ వ్యాధిని ఆకు నుసిమిరిత తల నుసిమిరి అని రెండు రకాలుగా గుర్తిస్తారు.
    ఆకు నుసిమిరి:
    మపురం, వెన్ను, తోక, గిట్టలపై చర్మానికి వస్తుంది.
    తల నుసిమిరి:
    కొమ్ముల మొదలున గల చర్మానికి వస్తుంది.
    వీటికి నల్లేరు రసం ఒక గ్లాసు, వస 1 గ్రా॥, పసుపు 10 గ్రా॥ కలిపి, రోజుకు ఒక పర్యాయం చొ॥న 5 రోజులు త్రాగించాలి.

ఆయుర్వేదం:
క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.

గృహవైద్యం:

  1. శుభ్రమైన నీటితో శరీర భాగాల్ని కడగాలి.
  2. శరీరాన్ని కుంకుడు కాయ నురుగుతో కడగాలి.
  3. కాలువ లేక చెరువులోని ఒండ్రు / బంక మట్టిని పైపూతగా చర్మానికి పట్టించాలి.
  4. కొబ్బరి చిప్ప బూడిదను నువ్వుల నూనెలో కలిపి రాయాలి.
  5. ఆవ నూనె / వేప నూనె చర్మానికి పూయాలి.
  6. 20 గ్రా॥ పసుపు, అరలీటరు ఆవుపాలలో కలిపి, రోజుకొకసారి త్రాగించాలి.

పెరటి వైద్యం:

  1. నల్ల ఉమ్మెత ఆకు రసం, ఉప్పు కలిపి నుసిమిరిపై పూయాలి.
  2. కలబంద ఆకు గుజ్ౙు, సైంధవ లవణం కలిపి, దంచి నుసిమిరిపై పూయాలి.
  3. గాడిదగడపాకు రసం, కొద్దిగా సున్నం, నువ్వుల నూనె, కలిపి నుసిమిరిపై రాయాలి.
  4. మర్కొండాకు పసరు 50 గ్రా॥కు, 10 గ్రా॥ గంధకం కలిపి, ఆ మిశ్రమాన్ని నుసిమిరిపై పూయాలి.
  5. గోరింటాకు 50 గ్రా॥, పటిక 10 గ్రా॥ కలిపి, నూరి నుసిమిరిపై పూయాలి.
  6. నల్లేరు కాడలు, పసుపు కలిపి, దంచి గాని కామంచి పూరి గాని నుసిమిరిపై రాయాలి.
  7. కుంకుడు కాయ రసంతో శుభ్రంగా కడిగి, తడి ఆరిన తరువాత మర్కొండాకు 50 గ్రాములు పసుపు 25 గ్రాములు, ఉప్ప్పు 12 గ్రాములు, కచ్చికపొడి 12 గ్రాములు కలిపి నుసిమిరిపై రాయాలి.

హోమియో
సల్ఫర్ 200 / సోరినం 200 / హెపార్ సల్ఫ్ 200 / మెర్క్ సాల్ 200 / సెపియ 200 / గ్రాఫైటిస్ 200 లలో ఏదైనా ఒక మందు రోజుకు 5 మాత్రలు, చొ॥న తగ్గేదాకా తినిపించాలి.

అల్లోపతి:

  1. అమిట్రాజ్ (AMITRAZ) 2 మి.లీ. మందును 1 లీటరు నీటిలో కలిపి చర్మానికి రాయాలి.
  2. డెర్మిక్లోర్ లోషన్ (DERMICHLOR LOTION) లేదా బెంజైల్ బెంజొయేట్ వంటి మందును వాడాలి
  3. హిస్టానిల్ (HISTANIL) వంటి ఇంజక్షన్ చేయించాలి.
  4. గ్రైసోవిన్-యఫ్‌పి (GRISOVIN_FP) వంటి మందును వాడాలి.
  5. స్కేబిఎక్సిమా ఇంజక్షన్ వైద్యుల సూచనల మేరకు మాత్రమే చేయించాలి.
  6. పరిసరాల పరిశుభ్రత కొరకు అవసరమైన చర్యలు చేపట్టాలి.
  7. బుటాక్స్ (BUTOX) కూడా పిచికారి చేయాలి. (2 మి.లీ. బుటాక్స్ + 1 లీ. నీటిలో కలిపి). పిచికారి చేసిన వెంటనే కడగరాదు. నాకకుండా నోటికి చిక్కం పెట్టాలి. పిచికారి చేసిన 2 గంటల తరువాత కడగవచ్చు.
    ……………………………………………………………………………………
    రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఖేత్ బచావో అభియాన్: ప్రతి పొలానికి ఆరోగ్యం, ప్రతి రైతుకు భరోసా!

నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వ్యవసాయ భూమిని కాపాడటం, రైతుల మధ్య శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ప్రచారాన్ని ‘ఖేత్ బచావో అభియాన్’గా పిలుస్తున్నారు. ‘నేలను కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి, రైతులను కాపాడండి’ అనే ప్రధాన సందేశంతోప్రభుత్వం “స్వస్త్ ధరా, సమృద్ధ్ కిసాన్” (ఆరోగ్యకరమైన నేల, సంపన్న రైతు) అనే థీమ్తో ‘ఖేత్ బచావో అభియాన్-రబీ 2026’ను ప్రారంభించింది.
• ఈ దేశవ్యాప్త ప్రచారం అక్టోబర్ 22 నుండి 2026 నవంబర్ 30 వరకు నిర్వహించబడుతోంది.
• ఇది నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వాడకం, సహజ వ్యవసాయం, పంటల వైవిధ్యం మరియు వాతావరణ-స్థితిస్థాపక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది.
• ఇది 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, 700 కి పైగా జిల్లాలు మరియు 50,000 గ్రామాలను కవర్ చేస్తుంది.ఎరువులు ఎక్కువగా వినియోగించే 100 జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు

రబీ 2026 యొక్క ప్రధాన లక్ష్యాలు.

  1. సమతుల్య పోషకాల నిర్వహణ
    ఈ ప్రచారం పంట అవసరాలకు అనుగుణంగా ‘సాధారణ ఎరువుల సిఫార్సుల’ (GFR) ఆధారిత పోషకాల నిర్వహణను ప్రోత్సహిస్తుంది. ఇది 4R సూత్రాన్ని అనుసరిస్తుంది:
    • Right source (సరైన మూలం);
    • Right rate (సరైన మోతాదు);
    • Right time (సరైన సమయం); మరియు
    • Right place (సరైన ప్రదేశం).
  2. సహజ వ్యవసాయం (Natural Farming)
    శిక్షణ, ప్రదర్శనలు మరియు రైతుల నుండి రైతులు నేర్చుకోవడం (farmer-to-farmer learning) ద్వారా సహజ వ్యవసాయాన్ని అవలంబించేలా రైతులు ప్రోత్సహించబడతారు.
  3. సమగ్ర పోషకాల నిర్వహణ (Integrated Nutrient Management – INM)
    INM రసాయన ఎరువులతో పాటుగా తగిన సేంద్రియ మరియు జీవసంబంధిత ఉత్పాదకాలను మిళితం చేస్తుంది. రసాయన ఎరువులపై అధిక ఆధారపడటాన్ని తగ్గిస్తూనే, నేల సారాన్ని కాపాడుకోవాలని ఇది చూస్తుంది.
  4. పంట వ్యర్థాల నిర్వహణ
    సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ (IEC) కార్యకలాపాలు.. పంట వ్యర్థాలను కాల్చడాన్ని నిరుత్సాహపరుస్తాయి మరియు కింది రాష్ట్రాల్లో సుస్థిర వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహిస్తాయి:
    • పంజాబ్;హర్యానా;ఉత్తర ప్రదేశ్; మరియుమధ్యప్రదేశ్.

5.పంటల వైవిధ్యం (Crop Diversification) వరి వంటి కొన్ని పంటలకే పరిమితం కాకుండా వ్యవసాయాన్ని ఏక రూప పంట విధానం నుంచి బహుళ పంటల సాగు వైపునకు మళ్లించి… సిఫారసు చేసిన పంటల సరళిని, అంతర పంటలను, సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించడం మరో అంశం. దీని వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉండటమే కాకుండా సుస్థిర అభివృద్ధి జరుగుతుంది.
• నూనెగింజలు మరియు పప్పుధాన్యాల ఉత్పత్తిని బలోపేతం చేయడం;
• పరిమిత పంటల నమూనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం; మరియు
• వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూములను (rice-fallow areas) ఉత్పాదకంగా వినియోగించడం.

6.వాతావరణ-స్థితిస్థాపక వ్యవసాయం కింది కరువు ప్రభావిత ప్రాంతాల్లో స్థానికంగా సరిపోయే ఆకస్మిక ప్రణాళికలు (contingency plans) అమలు చేయబడతాయి:
• మహారాష్ట్ర;కర్ణాటక;తెలంగాణ;ఆంధ్రప్రదేశ్; మరియురాజస్థాన్.

  1. సమగ్ర తెగుళ్ల నిర్వహణ (Integrated Pest Management – IPM) ఈ ప్రచారం విచక్షణా రహితంగా పురుగుమందుల వాడకాన్ని నిరుత్సాహపరుస్తుంది. నాణ్యమైన, సురక్షితమైన మరియు అవసరాల-ఆధారిత పురుగుమందుల వాడకం, లేబుల్ సమ్మతి మరియు సమగ్ర తెగుళ్ల నిర్వహణను ప్రోత్సహిస్తుంది.
  2. పథకాలపై అవగాహన (Scheme Awareness)
    • ప్రభుత్వ పథకాలు, అధికారిక రుణాలు, పంటల బీమా మరియు వ్యవసాయ సేవల గురించి రైతులకు తెలియజేయబడుతుంది.
    • నీటి సంరక్షణ, వ్యవసాయ యాంత్రీకరణ మరియు నేల ఆరోగ్యం-జీవవైవిధ్య పునరుద్ధరణపై దృష్టి సారించే పునరుత్పత్తి వ్యవసాయాన్ని (regenerative agriculture)
    కూడా ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది.

సంస్థాగత పాత్రలు (Institutional Roles)
సంస్థ: రాష్ట్ర/కేంద్రపాలిత వ్యవసాయ విభాగాలు
బాధ్యత: ప్రచార ప్రణాళిక, అమలు, కలయిక (convergence) మరియు రిపోర్టింగ్

సంస్థ: ATMA మరియు జిల్లా యంత్రాంగం
బాధ్యత: సూక్ష్మ ప్రణాళికలు (Micro-plans), రైతులను సమీకరించడం, లాజిస్టిక్స్ మరియు కార్యాచరణ రికార్డులు

సంస్థ: ICAR సంస్థలు, ATARIలు, KVKలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు
బాధ్యత: శాస్త్రీయ మార్గదర్శకత్వం, శిక్షణ, ప్రదర్శనలు మరియు ధృవీకరించబడిన సలహాలు

సంస్థ: ఇతర రాష్ట్ర విభాగాలు
బాధ్యత: నీటిపారుదల, ఉద్యానవనం, గ్రామీణాభివృద్ధి, సహకార మరియు అనుబంధ రంగాల ద్వారా మద్దతు

ఖేత్ బచావో అభియాన్–రబీ 2026 వ్యవసాయ అభివృద్ధికి నేల ఆరోగ్యాన్ని కేంద్రంగా ఉంచుతుంది. ఇందులో మిళితమైన సమతుల్య ఎరువులు, సహజ వ్యవసాయం, పంటల వైవిధ్యం, శాస్త్రీయ పొడిగింపు (scientific extension) మరియు వాతావరణ ప్రణాళిక.. వ్యవసాయాన్ని మరింత వనరుల-సమర్థవంతమైనదిగా మార్చగలవు. అయితే, దీని దీర్ఘకాలిక విజయం అనేది నిరంతర క్షేత్రస్థాయి మద్దతుతో పాటు నేల ఆరోగ్యం, ఉత్పాదకత మరియు రైతుల ఆదాయాల్లో కొలవదగిన మెరుగుదలలపై ఆధారపడి ఉంటుంది.

డా. ఎం. గంగాదేవి, సీనియర్ శాస్త్రవేత్త (వ్యవసాయ శాస్త్రం) డా. ఎం.యుగంధర్ కుమార్ – ప్రధాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, లాం, గుంటూరు. షేక్ ఎన్. మీరా – సంచాలకులు, ICAR–ATARI, డా. తుషార్ రంజన్ – సీనియర్ శాస్త్రవేత్త, ICAR–ATARI, హైదరాబాద్. Ph: 9490035258

Read More

కొత్తగా కొనుగోలు చేసిన పశువులను ఎందుకు Quarantine చేయాలి?

  1. క్వారంటైన్ (Quarantine) అంటే ఏమిటి?
    పాడి పరిశ్రమలో మరియు పశువుల పెంపకంలో ‘క్వారంటైన్’ అనగా కొత్తగా కొనుగోలు చేసిన లేదా వేరే ప్రాంతాల నుండి తీసుకువచ్చిన పశువులను, ఇప్పటికే ఉన్న ఆరోగ్యవంతమైన పశువుల మందకు దూరంగా, ప్రత్యేకంగా ఉంచడం. ఇది కేవలం వేరుగా కట్టేయడం మాత్రమే కాదు; పశువుల ఆరోగ్య స్థితిని నిశితంగా పరిశీలించడానికి, అంటువ్యాధులు ఫామ్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన జీవభద్రతా (Biosecurity) చర్య.
  2. కొత్త పశువు ఆరోగ్యంగా కనిపించినా ముప్పు ఎందుకు ఉంటుంది?
    రైతులు తరచుగా చేసే పొరపాటు ఏమిటంటే, చూడటానికి ఉత్సాహంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న పశువును చూడగానే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా నేరుగా పాత మందతో కలిపేయడం. అయితే, అనేక ప్రమాదకర అంటువ్యాధులు (ఉదాహరణకు: గాలికుంటు వ్యాధి, బ్రుసెల్లోసిస్, మరియు అంతర్గత పరాన్నజీవులు) శరీరంలో ప్రవేశించిన వెంటనే లక్ష్యాలను చూపించవు. వాటికి ఒక నిర్దిష్టమైన ‘ఇంక్యుబేషన్ పీరియడ్’ (Incubation Period – వ్యాధి సోకినప్పటి నుండి లక్షణాలు బయటపడే వరకు పట్టు సమయం) ఉంటుంది. పశువు ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, అది వ్యాధి వాహకంగా (Carrier) మారే అవకాశం ఉంది.
  3. ప్రాథమిక క్వారంటైన్ మార్గదర్శకాలు (రైతు చేయవలసినవి)
    ఫామ్ యజమానులు మరియు రైతులు కొత్త పశువును కొనుగోలు చేసిన వెంటనే కింది జాగ్రత్తలను విధిగా పాటించాలి:
    ✔️ ఖచ్చితమైన వేరుపాటు: కొత్త పశువును తీసుకువచ్చిన వెంటనే ఫామ్లోని ప్రధాన కొట్టం లేదా ఇతర పశువులకు కనీసం 50-100 అడుగుల దూరంలో ప్రత్యేక షెడ్డులో లేదా వేరుగా ఉంచాలి.
    ✔️ నిరంతర ఆరోగ్య పరిశీలన: రోజువారీగా పశువు మేత మేసే తీరు, నెమరువేసే విధానం, ఉష్ణోగ్రత, శ్వాసనాళాల పనితీరు మరియు మూత్ర విసర్జనను గమనించాలి.
    ✔️ వైద్య పరీక్షలు మరియు చికిత్స: స్థానిక పశువైద్యుల సహాయంతో డీవార్మింగ్ (నట్టల నివారణ మందులు), టీకాలు వేయించడం మరియు అవసరమైన రక్త పరీక్షలు చేయించాలి.
    ✔️ సురక్షిత కలయిక: కనీసం 21 నుండి 30 రోజులు పూర్తి అయిన తర్వాత మరియు పశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే గుంపులో కలపాలి.
  4. రైతులు తరచుగా చేసే పొరపాట్లు మరియు నష్టాలు
    క్షేత్రస్థాయిలో అవగాహన లోపం వల్ల కొన్నిసార్లు రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు. క్రింది పొరపాట్లకు ఎప్పుడూ తావివ్వకూడదు:
    ❌ తక్షణ కలయిక: కొనుగోలు చేసిన వెంటనే పశువులను ఏమాత్రం ఆలోచించకుండా పాత మందలో చేర్చడం వల్ల కొన్ని గంటల్లోనే మొత్తం ఫామ్కు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.
    ❌ ఉమ్మడి పరికరాల వాడకం: కొత్త పశువును చూసే ఉత్సాహంలో ఇతర పశువుల వస్తువులు, నీటి తొట్లు, మేత కుండీలు మరియు పరికరాలను ఉమ్మడిగా వాడటం వల్ల వ్యాధులు వేగంగా సోకుతాయి.
    ❌ ముందస్తు పరీక్షల నిర్లక్ష్యం: వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స చేయించకుండా, పరిస్థితి విషమించే వరకు నిర్లక్ష్యం చేయడం ఫామ్కు ఆర్థికంగా పెద్ద దెబ్బ.
  5. క్వారంటైన్ పాటించడం వల్ల కలిగే ఆర్థిక లాభాలు
    క్వారంటైన్ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించడం ద్వారా రైతులకు మరియు పాడి పరిశ్రమకు కలిగే ప్రయోజనాలు అపారం:
    ✅ అంటువ్యాధుల నియంత్రణ: ఫామ్లోకి అంటువ్యాధులు ప్రవేశించే అవకాశాలు దాదాపు 90% వరకు తగ్గుతాయి. దీనివల్ల పశువుల మరణాల రేటు నియంత్రించబడుతుంది.
    ✅ ఆర్థిక రక్షణ: అకస్మాత్తుగా పశువులు అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం పెట్టే భారీ ఖర్చులు, పాలు దిగుబడి తగ్గిపోవడం వల్ల జరిగే నష్టాలను నివారించవచ్చు.
    ✅ పాల ఉత్పత్తి స్థిరత్వం: ఆరోగ్యకరమైన పశువుల ద్వారా పాల ఉత్పత్తి స్థిరంగా కొనసాగుతుంది, తద్వారా పాడి రైతుకు నికర ఆదాయం లభిస్తుంది.
  6. క్షేత్ర అనుభవం మరియు వాస్తవ పరిశీలనలు
    గ్రామీణ ప్రాంతాలలో మరియు పాడి క్షేత్రాలలో నిర్వహించిన వివిధ అధ్యయనాల ప్రకారం, క్వారంటైన్ పద్ధతులను క్రమశిక్షణతో పాటించిన ఫామ్లలో అంటువ్యాధుల ప్రవేశం గణనీయంగా తగ్గింది. పశుసంవర్ధక శాఖ మరియు వెటర్నరీ నిపుణులు ఎల్లప్పుడూ కొత్త పశువుల ప్రవేశం విషయంలో నివారణే మేలైన మార్గం సూత్రాన్ని అనుసరించాలని సిఫార్సు చేస్తున్నారు.
  7. మీకు తెలుసా? – శాస్త్రీయ విశేషాలు
    కొత్త పశువులను వేరుగా ఉంచడం కేవలం ఒక సాంప్రదాయం కాదు, ఇది అంతర్జాతీయంగా ఆమోదించబడిన బయోసేఫ్టీ స్టాండర్డ్. రవాణా సమయంలో పశువులు ఎదుర్కొనే తీవ్రమైన మానసిక ఒత్తిడి (Transport Stress) వల్ల వాటి రోగనిరోధక శక్తి తాత్కాలికంగా తగ్గుతుంది. ఈ సమయంలోనే వాటికి బయట వాతావరణం నుండి రకరకాల వైరస్ లు మరియు బాక్టీరియా సులభంగా సోకే అవకాశం ఉంటుంది. క్వారంటైన్ సమయంలో పశువుకు ప్రశాంతమైన వాతావరణం, సమతుల్య ఆహారం అందించి దాని రోగనిరోధక శక్తిని పునరుద్ధరించవచ్చు.
  8. డాక్టర్ సలహా మరియు ముగింపు
    పశుపోషణలో విజయం సాధించాలంటే కేవలం మంచి జాతి పశువులను ఎంచుకోవడం మాత్రమే సరిపోదు, వాటికి తగిన రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం. నూతనంగా పశువులను కొనుగోలు చేసే ప్రతి రైతు ఈ సూత్రాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి.

డా.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, పశువైద్యశాల, నందిమండలం, కడప జిల్లా 9618499184

Read More

దూడలకు వెంట్రుకలు ఊడిపోవటం (ALOPECIA)

సమస్య: పాలు త్రాగే దూడలలో ఎక్కువగా బొడ్డు దగ్గర, వెన్ను మీద తొడల దగ్గర, పొట్ట భాగంలో, ముట్టెపైన వెంట్రుకలు ఊడతాయి.

కారణాలు:
విటమిన్ ‘ఎ’ లోపం; అయోడిన్, జింకు ధాతు లోపం; ఫంగస్ వల్ల; బాహ్య పరాన్న జీవుల బెడద; లవణ లోపం; వివిధ చర్మ వ్యాధులు; అజీర్ణం; ఊపిరితిత్తుల వ్యాధులు; తల్లి, దూడను నాకే ప్రదేశాలలో సాధారణంగా వెంట్రుకలు ఊడతాయి; రక్తహీనత

పశువైద్యుని సంప్రదించాలి. వ్యాధి భేదాత్మక పరిశీలన అవసరం.
ఈ వ్యాధిని VITAMIN ‘A’ DEFICIENCY, MANGE, WORM BURDEN, HYPOTRICHOSIS, ECZEMAగా భ్రమించే అవకాశం వుంది.

పరిష్కారాలు:

  1. పరాన్న జీవుల నిర్మూలన
  2. దూడపై తడిలేకుండా చూడటం
  3. ఎండ తగిలే ప్రదేశంలో దూడలను ఉంచటం

ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం:

  1. పసుపు, కొబ్బరి నూనెలో కలిపి రాయాలి.
  2. కొబ్బరి కాయ కండ్ల దగ్గర ఉండే పీచు కాల్ౘ్ి (అది జిడ్డుగా వుంటుంది.), వెంట్రుకలు ఊడిన చోట రాయాలి.
  3. గంధకం 10 గ్రా॥, వేప నూనె 100 మి.లీ.లలో కలిపి పూతగా రాయాలి.

పెరటి వైద్యం:

  1. నల్ల ఉమ్మెత్త ఆకుల పసరు రాయాలి.
  2. రుద్ర జడ ఆకు పసరు, తులసి ఆకు పసరు, కొబ్బరి నూనెలో కలిపి రాయాలి.
  3. కసివిందాకు, కామంచి ఆకు నూరి చర్మంపై పూత పెట్టాలి.
  4. గాడిదగడపాకులు, పులిగోరాకులు, దిరిసెనాకులు మడు గుప్పెళ్ళు తొక్కి, రసం తీసి, 1/4 లీటరుకు 1/8 లీటరు నువ్వుల నూనె కలిపి పూత పెట్టాలి.

ఓషధులు:
మోదుగ గింజలు నూరి, నిమ్మ కాయ రసం కలిపి, వెంట్రుకలు ఊడిన చోట రాయాలి.

మూలికావైద్యం:
పెన్నేరు దుంపలు 15 గ్రా॥, ఊడుగ చెక్క 3 గ్రా॥, నీరుల్లి పాయలు 3, పచ్చి పసుపు 3 కొమ్ములు రాత్రి మజ్జిగలో ఊరబెట్టి, దానికి 1 గ్రా॥ మిరియాల చూర్ణం కలిపి, పై పూతగా రాయాలి.

హోమియో:

  1. సల్ఫర్ Q వెంట్రుకలు ఊడిన ప్రదేశంలో రాయాలి.
  2. ఆర్నికా Q + జబొరండి Q లను కొబ్బరి నూనెలో కలిపి వెంట్రుకలు ఊడిన ప్రదేశంలో రాయాలి.
  3. చర్మ వ్యాధులు ఉంటే సల్ఫర్ 30 మందు 5 మాత్రలు ఉదయం, సాయంత్రం చొప్పున 3 రోజులు తినిపించాలి.
  4. పరాన్న జీవుల నిర్మూలనకు సాంటోనినమ్ 30 లేదా సిన 30 ఏదో ఒక మందు 5 మాత్రలు చొప్పున 3 రోజులు తినిపించాలి.
  5. సెలీనియం 200 గానీ నేట్రం మర్ 200 గానీ కాలి కార్బ్ 200 గానీ, ఫ్లోరిక్ యాసిడ్ 200 గానీ రోజుకు 10 మాత్రలు చొప్పున తినిపించాలి.

అల్లోపతి:

  1. హైమాక్స్ (HIMAX) వంటి ఆయింట్‌మెంట్ వాడాలి.
  2. నెమ్లెంట్ (NEMLENT) లేదా వేప నూనె పూయాలి.
  3. పైపరజిన్ ఆడిపేట్ (PIPERAZINE ADIPATE) మందును తినిపించాలి.
  4. వైమిరాల్ టానిక్ (VIMEROL TONIC) 5 మి.లీ. చొ॥న 20 రోజులు త్రాగించాలి.
  5. షార్కోఫెరాల్ (SHARKOFERROL) 10 మి.లీ. చొ॥న 20 రోజులు త్రాగించాలి.
  6. మినరల్ మిక్చర్ రోజుకు 10 గ్రాముల చొప్ప్పున నోటిలో వేసి పాలు కుడవటానికి వదలాలి.
  7. విటమిన్ ఎ, డి3, ఇ Ð ఇంజక్షను 2 మి.లీ. కండకు (I/M) రోజుకు 1 పర్యాయం చొ॥న 5 రోజులు ఇంజక్షన్లు చేయించాలి.
    జాగ్రత్తలు:
  8. పౌష్టికాహారం పెట్టాలి. పాలు సక్రమంగా త్రాగనివ్వాలి.
  9. ఖనిజ లవణ బ్రిక్స్ పశువులశాలలలో దూడలకు అందుబాటులో వ్రేళ్ళాడదీయాలి.
    …………………………………………………………………………………..
    రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

అసీల్ (Aseel) కోళ్ల పెంపకంపల్లెల్లో జీవన ATM, పోషక విలువలు మరియు సమగ్ర ఆర్థిక విశ్లేషణ

  1. అసీల్ మూలాలు మరియు చరిత్ర
    భారతీయ పశుసంవర్ధక చరిత్రలో ‘అసీల్’ (Aseel లేదా Asil) జాతికి ఒక ప్రత్యేకమైన, వీరోచితమైన స్థానం ఉంది. అరబ్బీ భాషలో ‘అసీల్’ అంటే అసలైన, స్వచ్ఛమైన, లేదా స్వదేశీ అని అర్థం. ఈ జాతి పక్షుల మూలాలు వేల సంవత్సరాల నాటి భారతీయ ఉపఖండానికి చెందినవి.
    ● చారిత్రక నేపథ్యం: సుమారు 3,500 ఏళ్లకు పైగా మన దేశంలో ఈ కోళ్లను పెంచుతున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. మొఘల్ చక్రవర్తులు, దేశీయ రాజులు మరియు జమీందారులు తమ పరాక్రమానికి, తెగింపునకు ప్రతీకగా ఈ అసీల్ పుంజుల పెంపకాన్ని పోషించారు.
    ● భౌగోళిక విస్తరణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరియు రాజస్థాన్ రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలలో ఈ జాతి అత్యంత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ మరియు కోస్తా జిల్లాల్లో అసీల్ పెంపకానికి రైతులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
    ● శారీరక లక్షణాలు: ఇవి చాలా దృఢమైన ఎముకలు, వెడల్పాటి ఛాతీ, బలమైన కాళ్లు, నిటారైన శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. ఎటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా, అంతుచిక్కని రోగాలనైనా తట్టుకునే అద్భుతమైన జన్యుపరమైన రోగనిరోధక శక్తి దీని సొంతం.
  2. పల్లెల్లో అసీల్ కోడి: రైతుకు “జీవనాధార ATM” లా ఎలా పనిచేస్తుంది?
    గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులకు మరియు మహిళా కూలీలకు బ్యాంకుల్లో నగదు సర్దుబాటు కావడం ఒక్కోసారి కష్టమవుతుంది. అలాంటి సమయాల్లో అసీల్ కోళ్ల పెంపకం ఒక “లైవ్ ఏటీఎం (Live ATM)” లాగా ఆపద్బాంధవుడిగా నిలుస్తుంది.
    ● అత్యవసర నిధులు: ఇంట్లో పిల్లాడికి ఫీజు కట్టాలన్నా, వైద్యం ఖర్చులకైనా, లేదా వ్యవసాయంలో అకస్మాత్తుగా ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైనా, పెరట్లో ఉన్న ఒక మంచి అసీల్ పుంజును లేదా కోడిని అమ్మి క్షణాల్లో నగదును పొందవచ్చు. దీనికోసం ఎవరి ముందూ చేయి చాచాల్సిన అవసరం లేదు.
    ● తక్కువ పెట్టుబడి – అధిక రాబడి: బాయిలర్ కోళ్ల మాదిరిగా వీటికి ప్రత్యేకంగా ఏసీ షెడ్లు, ఖరీదైన పౌల్ట్రీ ఫీడ్ అవసరం లేదు. పగటిపూట గ్రామాల్లో తిరుగుతూ గింజలు, చెత్తాచెదారం, పురుగులను మేస్తూ బతుకుతాయి. రాత్రికి ఇంటి వద్ద చిన్న గూటిలో తలదాచుకుంటాయి.
    ● స్థానిక విపణిలో డిమాండ్: గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో దేశీ కోడి మాంసానికి ఉండే డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది మరియు పెళ్లిళ్ల సీజన్లలో అసీల్ పుంజులకు బంగారు ధర లభిస్తుంది.
  3. అసీల్ మాంసం – పోషక విలువలు
    సాధారణ బాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే, అసీల్ మాంసం ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనదిగా వైద్యులు మరియు పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

● ప్రోటీన్లు మరియు కొవ్వు శాతం: అసీల్ మాంసంలో లీన్ ప్రోటీన్లు (Lean Proteins) అత్యధికంగా ఉంటాయి. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు నిరభ్యంతరంగా ఈ మాంసాన్ని తినవచ్చు.
● విటమిన్లు మరియు ఖనిజాలు:
ఇందులో ఐరన్ (ఇనుము), జింక్, విటమిన్ బి-12 మరియు అమినో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతాయి.
● సహజమైన రుచి: ఎటువంటి రసాయన హార్మోన్లు, యాంటీబయోటిక్స్ వాడకుండా సహజ సిద్ధంగా పెరగడం వల్ల ఈ మాంసానికి ఒక ప్రత్యేకమైన ఘుమఘుమలాడే రుచి వస్తుంది.

  1. అసీల్ మాంసం vs మటన్ (Mutton Comparison)
    ప్రస్తుతం మార్కెట్లో మాంసం ధర కిలో ₹800 నుండి ₹1000 వరకు ఉంది. అయితే అసీల్ కోడి ఆర్థిక మరియు పోషక సమీకరణాలను గమనిస్తే రైతులకు ఇది ఎందుకు లాభదాయకమో అర్థమవుతుంది:

అంశం : పెరిగే కాలం
అసీల్ కోడి (Aseel Bird): 5 నుండి 6 నెలల్లోనే విక్రయానికి సిద్ధం (3 కిలోల బరువు).
మటన్(Mutton): 10 నుండి 12 నెలలకు పైగా సమయం పడుతుంది.

అంశం : మార్కెట్ ధర (కిలోకు)
అసీల్ కోడి (Aseel Bird): లైవ్ బర్డ్ రూపంలో కిలో ₹500-₹600 పలికితే, 3 కిలోల కోడి ధర ₹1500 నుండి ₹1800 వరకు పలుకుతుంది.
మటన్(Mutton): కిలో ₹800 – ₹1000 వరకు ఉంటుంది.

అంశం : పెట్టుబడి ఖర్చు
అసీల్ కోడి (Aseel Bird): చాలా తక్కువ (ఇంటి వద్ద లభించే వ్యర్థాలు, గింజలు సరిపోతాయి).
మటన్(Mutton): మేత మరియు పచ్చగడ్డి కోసం ప్రత్యేక ఖర్చు అవసరం.

అంశం : పిల్లల ఉత్పత్తి (Reproduction)
అసీల్ కోడి (Aseel Bird): ఏడాదికి రెండు నుండి మూడు సార్లు గుడ్లు పెట్టి, పొదిగి ఎక్కువ పిల్లలను ఇస్తుంది. మటన్(Mutton): సాధారణంగా ఏడాదికి ఒకటి లేదా రెండు పిల్లలు మాత్రమే.

అంశం : అత్యవసర నగదు లభ్యత
అసీల్ కోడి (Aseel Bird): ఒక కోడిని అమ్మి చిన్న మొత్తంలో తక్షణ డబ్బు పొందవచ్చు.
మటన్(Mutton): జీవాలను అమ్మాలంటే పెద్ద మొత్తంలో విక్రయించాలి (అన్నిసార్లు అవసరం ఉండకపోవచ్చు).

● ఆర్థిక గణాంకాలు: మార్కెట్లో 3 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన అసీల్ పుంజు సులభంగా ₹1,500 నుండి ₹1,800 వరకు అమ్ముడుపోతుంది. అదే బరువుగల మటన్ కొనాలంటే ₹2,500 నుండి ₹3,000 ఖర్చవుతుంది. వినియోగదారుడికి ఇది తక్కువ ధరలో స్వచ్ఛమైన మాంసపు ప్రత్యామ్నాయంగా మారుతుంటే, రైతుకు తక్కువ కాలంలో ఎక్కువ లాభాన్ని ఇస్తోంది.

  1. పందాల కోళ్లు / అసీల్ జాతి ప్రత్యేక విలువ: లక్షల్లో ధరల ప్రస్థానం
    అసీల్ కోళ్లలో కొన్ని ప్రత్యేకమైన రకాలు (ఉదాహరణకు: జాతి పుంజులు, కక్కిరాయి, డేగ, సేతు, పీల మొదలైనవి) కేవలం మాంసానికే కాకుండా, వాటి జాతి శుద్ధత, వేగం, మొండితనం కోసం విపరీతంగా పెంచుతుంటారు.
    ● లక్షల్లో వ్యాపారం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో సంక్రాంతి తదితర పండగల సమయంలో జరిగే సాంప్రదాయ పుంజుల పందాలు లేదా ప్రదర్శనల్లో ఉత్తమ లక్షణాలున్న అసీల్ పుంజుల ధరలు ₹50,000 నుండి లక్షల రూపాయల వరకు పలుకుతాయి.
    ● బ్రీడింగ్ వ్యాపారం: సరైన వంశావళి కలిగిన అసీల్ తల్లి-తండ్రి కోళ్లను పెంచి, వాటి ద్వారా వచ్చే పిల్లలను విక్రయించడం ద్వారా గ్రామీణ యువకులు ఉపాధి పొందుతున్నారు. ఒక్కో అసీల్ కోడి పిల్లను (నెల వయసు ఉన్నదాన్ని) ₹300 నుండి ₹500 వరకు విక్రయించి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
  2. గ్రామీణ స్థాయిలో అసీల్ పెంపకానికి ఆచరణాత్మకమైన మెట్లు
    గ్రామాల్లో రైతులు అసీల్ పెంపకాన్ని విజయవంతంగా లాభసాటిగా మలచుకోవడానికి క్రింది దశలను అనుసరించాలి:
  3. సరైన జాతి ఎంపిక: స్వచ్ఛమైన దేశీ అసీల్ లక్షణాలు (వెడల్పాటి తల, పొడవాటి కాళ్లు, నిటారైన చూపు, బలమైన ముక్కు) ఉన్న మగ, ఆడ పక్షులను బ్రీడింగ్ కోసం ఎంచుకోవాలి.
  4. వసతి మరియు రక్షణ: రాత్రి సమయాల్లో నక్కలు, పిల్లులు, గ్రద్దల నుండి రక్షణగా గాలి బాగా ఆడే చిన్న కోళ్ల షెడ్డును ఏర్పాటు చేయాలి. నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.
  5. శాస్త్రీయ టీకాలు: అసీల్ కోట్లకు ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా స్థానిక పశువైద్యుల సహాయంతో సకాలంలో టీకాలు వేయించాలి.
  6. సమతుల్య ఆహారం: వరి ధాన్యం, మొక్కజొన్న నూకలు, చెత్తలో దొరికే గింజలతో పాటు కూరగాయల వ్యర్థాలను పెట్టాలి. అప్పుడప్పుడు నీటిలో విటమిన్ సప్లిమెంట్స్ కలిపి ఇస్తే ఎదుగుదల బాగుంటుంది.
  7. మార్కెటింగ్ వ్యూహం: సోషల్ మీడియా ద్వారా చుట్టుపక్కల పట్టణాల వాళ్లకు, పందాల మరియు పెంపక ప్రియులకు నేరుగా విక్రయించడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పూర్తి లాభాన్ని పొందవచ్చు.

రాయలసీమ ముంగిట, తెలుగు పల్లెసీమల్లో అసీల్ కోడి కేవలం ఒక పక్షి కాదు; అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ఒక అక్షయ పాత్ర. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇస్తూ, అత్యవసర సమయాల్లో ఏటీఎంలా ఆదుకునే అసీల్ పెంపకం నేటి యువ రైతులకు ఒక అద్భుతమైన ఉపాధి మార్గం. ఈ స్వదేశీ సంపదను కాపాడుకుంటూ ముందుకు సాగితే పల్లెల్లో సిరులు పండడం ఖాయం.

డా.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, పశువైద్యశాల, నందిమండలం, కడప జిల్లా 9618499184

Read More

ఔషధమొక్క… పులివాయి / గొల్లపుల్లేడు / బండేడ

గొల్లపుల్లేడు 1-3 మీ. ఎత్తు పెరిగే ఒక పొద లేక 9 మీ. ఎత్తు పెరిగే ఒక చిన్న చెట్టు. ఆకులు వివిధ రూపాలలో ఉంటాయి. కొన్ని ఆకులు అండాకారంలో ఉంటాయి. మరికొన్ని బల్లెం ఆకారంలో ఉంటాయి. ఆకులు 4-7.5 సెం.మీ. పొడవు, 1-1.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి, రెసిన్ లాంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఆకులు తోలు లాగా గట్టిగా ఉంటాయి. పూలు సాధారణంగా కొమ్మల చివర ఏర్పడతాయి. పూలు పసుపు రంగు నుండి నారింజ ఎరుపు రంగులో ఉంటాయి. కాయ 1.5 సెం.మీ. వెడల్పున్న కాప్సూల్. కాయలు ఎరుపు రంగులో ఉండి పండినపుడు గోధుమరంగులోకి మారతాయి.

సాధారణ నామం : హాప్‌బుష్ శాస్త్రీయ నామం : డోడొనియా విస్కోసా కుటుంబం: సాపిండేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయ ఔషధరంగంలో గొల్లపుల్లేడు అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. దీనిని అనేక జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. కాండం లేదా ఆకుల కషాయాలను గొంతునొప్పి చికిత్సలో ఉపయోగిస్తారు. కాండాన్ని కీళ్ళ నొప్పుల నివారణకు ఫ్యూమిగెంట్‌గా ఉపయోగిస్తారు.
  • వేరు కషాయాన్ని జలుబు పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఆకులను దురద, జ్వరం, వాపులు, నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. ఆకులు, వేర్లను పంటి నొప్పులు, తలనొప్పి నివారణకు ఉపయోగిస్తారు. మొక్కభాగాల నుండి తయారు చేసిన లోషన్‌ని బెణుకులు, కాలిన గాయాలు, వ్రణాల చికిత్సకు ఉపయోగిస్తారు. అజీర్తి, అల్సర్లు, డయేరియా, మలబద్ధకం వంటి జీర్ణాశయ సమస్యలను ఆకులు లేదా వేర్ల కషాయం త్రాగించి నివారిస్తారు. ఈ మొక్క వేర్ల కషాయం లేదా తాజా వేర్లను బాలింతలు పాల ఉత్పత్తి పెరగడానికి తీసుకుంటారు. పూల నుండి తయారు చేసిన పానీయాన్ని టానిక్‌గా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • గొల్లపుల్లేడు పెట్రోలియం ఈథర్ ద్రావణం (3%) ప్రత్తి, బెండ, వంగ పంటలనాశించే మచ్ౘ్ల కాయతొలుచు పురుగు, ఈరియాస్ విట్టేల్లా పై అత్యధిక యాంటీఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • గొల్లపుల్లేడు ద్రావణం అలసంద బీటిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను 100% చంపింది (డిమెట్రి, అతని అనుచరులు, 2015).
  • లెపిడాప్టెరా పురుగులపై ఈ మొక్క కీటకనాశన లక్షణాలు రిపోర్టు చేయబడ్డాయి (మలర్‌వన్నన్ అండ్ సుభాషిణి, 2007; మలర్ వన్నన్, అతని అనుచరులు, 2008, 2009, షార్బి, అతని అనుచరులు, 2009).
  • ఈ మొక్క నుండి అనేక ఫ్లేవనాయిడ్లు, డైటెర్పెనిక్ యాసిడ్లు, సపోనిన్లు వేరు చేయబడ్డాయి (నియు, అతని అనుచరులు, 2010).
  • ఇథనాల్ ఆకు ద్రావణం రొఫాలోసైఫం మేడిస్ (పేనుబంక), ఎపిలాక్న పీన్యులేట (అక్షింతల పురుగు)లను పంటల ఆకులపై రసం పీల్చకుండా, తినకుండా డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. ఇతర ఫ్రాక్షన్స్ మైజస్ పెర్సికె (పేనుబంక), స్పోడోప్టెరా లిట్టురాలిస్ (లద్దెపురుగు) పైన కూడా డిటరెంట్ చర్యలను ప్రదర్శించాయి. ఆకు ద్రావణం నుండి వేరు చేసిన మిశ్రమం, లుపియాల్, మైజస్ పెర్సికె, ఎపిలాక్న పీన్యులేట రెండింటిపై డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. స్టిగ్మాస్టెరాల్ మిశ్రమం కేవలం పేనుబంక పురుగులపైన మాత్రమే డిటరెంట్ చర్య ప్రదర్శించింది. స్టిగ్మాస్ 7ఎన3ఆల్ కేవలం మైజస్‌పెర్సికె పైన మాత్రమే ఈ చర్య ప్రదర్శించింది. కాంపౌండ్ (మిశ్రమం) 4 కేవలం ఎపిలాక్న పీనిక్యులేట పైన మాత్రమే డిటరెంట్ చర్య ప్రదర్శించింది (మార్టినడయాజ్, అతని అనుచరులు, 2015).
  • ఈ మొక్క ఆకుల పెట్రోలియం ఈదర్, హెక్సేన్, క్లోరోఫాం, ఎసిటోన్, నీటి ద్రావణాలు క్షేత్ర ప్రయోగాలలో ఈరియాస్ విట్టేటు లార్వాలను సమర్ధవంతంగా అరికట్టాయి (మలర్వన్నన్, అతని అనుచరులు, 2007). అంతేగాక ఈ ద్రావణాలు హెలికోవర్ప ఆర్మిజరా గుడ్లపై గుడ్లనాశక చర్యను కూడా ప్రదర్శించాయి (మలర్వన్నన్, 2003)
  • ఆకులు, కాడల నుండి తీసిన ద్రావణాలు పేనుబంక (రొపాలోసైఫం పడి, మైజస్‌పెర్సికె) పురుగులు, అక్షింతలపురుగు (ఎపిలాక్న పీనిక్యులేట)పై మంచి డిటరెంట్ చర్యను ప్రదర్శించాయి. ప్రయోజనకర తేనెటీగల (ఎపిస్ మెల్లిఫెర్)కు ఎటువంటి హాని కలిగించలేదు (కాస్టిల్లో, అతని అనుచరులు, 2009).
  • గింజల ద్రావణం సైటోఫిలస్ ఒరైజె పై బలమైన స్పర్శ చర్యను ప్రదర్శించింది (జావొ, అతని అనుచరులు, 2006).
  • గొల్లపల్లేడు మొక్క క్రూడ్ ద్రావణం చెదలు, ఒడొంటోటెర్మస్ ఒబెసస్ వర్కర్ పురుగులను చంపింది. చెట్లలో చెదలు చేసే టనెల్ నిర్మాణాన్ని కూడా నివారించింది. దీనిని చెదల నివారణకు శక్తివంతమైన పురుగు మందుగా కూడా ఉపయోగించవచ్చు. (నిసార్, అతని అనుచరులు, 2015).
  • కోళ్ళ నుండి వేరు చేసిన సాల్మొనెల్లా స్పీసీస్ పెరుగుదలని గొల్లపల్లేడు మొక్క ఇథనాల్ ద్రావణం 71.19% అరికట్టింది. ఈ ఔషధ మొక్క నుండి తయారు చేసిన సహజ మందులు యాంటిబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వలన వైద్యరంగంలో ఉపయోగించవచ్చు. (ఆల్‌బకర్, అతని అనుచరులు, 2014).
  • గొల్లపల్లేడు ఆకుల ద్రావణం ట్రోగోడెర్మా గ్రానోరియం 3వ దశ లార్వాలను వికర్షణ చర్య ద్వారా సమర్ధవంతంగా నివారించింది (యూసఫ్ అండ్ సత్తి, 2012).
    ……………………………………………………………………………………………………………………………..
    రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పంటల కోతకు మరియు నూర్పిడికి ఉపయోగించే యంత్రాలు

  • పంట కోత కోసే పరికరము (రీపర్) :
    ధర : 1,20,000-1,50,000/-
    ఈ యంత్రంతో రోజుకు 10 ఎకరాల వరకు వరి కోత కోయవచ్చు; వరి, గోధుమ, బార్లీ తదితర ధాన్యపు పంటల కోతకు ఉపయోగిస్తారు.
  • మిని కంబైన్డ్ హార్వెస్టర్ :
    ధర : 20,00,000-25,00,000/-
    సామర్థ్యం : 1.5 ఎకరాలు/గంటకి
    కంబైన్ హార్వెస్టర్ వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటలను కోయడానికి, నూర్పిడి చేసి గింజలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కోత, నూర్పిడి, గింజల శుభ్రపరిచే పనులను ఒకేసారి నిర్వహిస్తుంది
  • కంబైన్డ్ హార్వెస్టర్ :
    ధర : 25,00,000-35,00,000/-
    సామర్థ్యం : సుమారు 2.5–3.7 ఎకరాలు/గంటకు
    ఈ యంత్రంలో వరి కోత కోయడం, నూర్పిడి చేయడం మరియు చెరగడం ఒకేసారి జరుగుతుంది. యంత్రాన్ని వరి, గోధుమ, మరియు మొక్కజొన్న పంటలను కోసేందుకు ఉపయోగించవచ్చు.
  • మల్టీక్రాప్ థ్రెషర్
    ధర : 5,00,000-7,00,000/-
    ఒకే యంత్రంతో వివిధ పంటల నూర్పిడి చేయవచ్చు; నూర్పిడి పనిని వేగంగా పూర్తి చేసి, కూలీల అవసరాన్ని తగ్గించవచ్చు.
    వరి: సుమారు 1 ఎకరం/గంట; మొక్కజొన్న: గంటకు 70–80 బస్తాలు
  • వరిగడ్డి కట్టలు కట్టే యంత్రము :
    ధర : 3,00,000-4,00,000/-
    సామర్థ్యం : 1.2–1.7 ఎకరాలు/గంటకు
    ఈ యంత్రం వరిగడ్డిని సేకరించి, కట్టలు కట్టి బయటకు విడిచిపెడుతుంది; ఒక్కో కట్ట బరువు 20–50 కిలోల వరకు ఉంటుంది.
  • రీపర్ కం బైండర్ :
    ధర : 3,00,000-4,00,000/-
    ఈ యంత్రం ద్వారా ఒక రోజుకి 3 నుండి 5 ఎకరాలు వరకు వరి కోత నిర్వహించవచ్చు. ఈ యంత్రం ద్వారా వరి మరియు గోధుమ పంటలను సమర్థంగా కోతచేయవచ్చు.

పి. బాబు, ఎన్. కిశోర్, ఎన్. సత్తిబాబు, మరియు ఎన్. రాజ కుమార్,
కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, ఆంధ్ర ప్రదేశ్. మరింత సమాచారం కొరకు ఫోన్ : 8639279098

Read More