సమస్య:
దురద
ఆ తరువాత వెంట్రుకలు రాలిపోవటం
వ్యాధి సోకిన శరీర భాగంపై, ముందుగా నల్లటి
పొడలు ఏర్పడటం
శరీరాన్ని కొరుక్కోవటం
తోక కొరుక్కోవటం
క్రమేపీ శరీరమంతా వ్యాపించటం
అస్తిమితం
కారణాలు:
ఫంగస్ వ్యాధి.
SORCOPTIC పురుగుల వల్ల
పశువైద్యుని సంప్రదించాలి.
ఈ వ్యాధిని Mycotic Dermatitis, Allergy, Pox, Utricaria, Ring Worm, Inherited Para Keratosisగా భ్రమించే అవకాశం వుంది. కనుక వ్యాధి భేదాత్మక పరిశీలన అవసరం.
పరిష్కారాలు:
- ఆయుర్వేదం ప్రకారం ఈ వ్యాధిని ఆకు నుసిమిరిత తల నుసిమిరి అని రెండు రకాలుగా గుర్తిస్తారు.
ఆకు నుసిమిరి:
మపురం, వెన్ను, తోక, గిట్టలపై చర్మానికి వస్తుంది.
తల నుసిమిరి:
కొమ్ముల మొదలున గల చర్మానికి వస్తుంది.
వీటికి నల్లేరు రసం ఒక గ్లాసు, వస 1 గ్రా॥, పసుపు 10 గ్రా॥ కలిపి, రోజుకు ఒక పర్యాయం చొ॥న 5 రోజులు త్రాగించాలి.
ఆయుర్వేదం:
క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.
గృహవైద్యం:
- శుభ్రమైన నీటితో శరీర భాగాల్ని కడగాలి.
- శరీరాన్ని కుంకుడు కాయ నురుగుతో కడగాలి.
- కాలువ లేక చెరువులోని ఒండ్రు / బంక మట్టిని పైపూతగా చర్మానికి పట్టించాలి.
- కొబ్బరి చిప్ప బూడిదను నువ్వుల నూనెలో కలిపి రాయాలి.
- ఆవ నూనె / వేప నూనె చర్మానికి పూయాలి.
- 20 గ్రా॥ పసుపు, అరలీటరు ఆవుపాలలో కలిపి, రోజుకొకసారి త్రాగించాలి.
పెరటి వైద్యం:
- నల్ల ఉమ్మెత ఆకు రసం, ఉప్పు కలిపి నుసిమిరిపై పూయాలి.
- కలబంద ఆకు గుజ్ౙు, సైంధవ లవణం కలిపి, దంచి నుసిమిరిపై పూయాలి.
- గాడిదగడపాకు రసం, కొద్దిగా సున్నం, నువ్వుల నూనె, కలిపి నుసిమిరిపై రాయాలి.
- మర్కొండాకు పసరు 50 గ్రా॥కు, 10 గ్రా॥ గంధకం కలిపి, ఆ మిశ్రమాన్ని నుసిమిరిపై పూయాలి.
- గోరింటాకు 50 గ్రా॥, పటిక 10 గ్రా॥ కలిపి, నూరి నుసిమిరిపై పూయాలి.
- నల్లేరు కాడలు, పసుపు కలిపి, దంచి గాని కామంచి పూరి గాని నుసిమిరిపై రాయాలి.
- కుంకుడు కాయ రసంతో శుభ్రంగా కడిగి, తడి ఆరిన తరువాత మర్కొండాకు 50 గ్రాములు పసుపు 25 గ్రాములు, ఉప్ప్పు 12 గ్రాములు, కచ్చికపొడి 12 గ్రాములు కలిపి నుసిమిరిపై రాయాలి.
హోమియో
సల్ఫర్ 200 / సోరినం 200 / హెపార్ సల్ఫ్ 200 / మెర్క్ సాల్ 200 / సెపియ 200 / గ్రాఫైటిస్ 200 లలో ఏదైనా ఒక మందు రోజుకు 5 మాత్రలు, చొ॥న తగ్గేదాకా తినిపించాలి.
అల్లోపతి:
- అమిట్రాజ్ (AMITRAZ) 2 మి.లీ. మందును 1 లీటరు నీటిలో కలిపి చర్మానికి రాయాలి.
- డెర్మిక్లోర్ లోషన్ (DERMICHLOR LOTION) లేదా బెంజైల్ బెంజొయేట్ వంటి మందును వాడాలి
- హిస్టానిల్ (HISTANIL) వంటి ఇంజక్షన్ చేయించాలి.
- గ్రైసోవిన్-యఫ్పి (GRISOVIN_FP) వంటి మందును వాడాలి.
- స్కేబిఎక్సిమా ఇంజక్షన్ వైద్యుల సూచనల మేరకు మాత్రమే చేయించాలి.
- పరిసరాల పరిశుభ్రత కొరకు అవసరమైన చర్యలు చేపట్టాలి.
- బుటాక్స్ (BUTOX) కూడా పిచికారి చేయాలి. (2 మి.లీ. బుటాక్స్ + 1 లీ. నీటిలో కలిపి). పిచికారి చేసిన వెంటనే కడగరాదు. నాకకుండా నోటికి చిక్కం పెట్టాలి. పిచికారి చేసిన 2 గంటల తరువాత కడగవచ్చు.
……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

