పంటల కోతకు మరియు నూర్పిడికి ఉపయోగించే యంత్రాలు
- పంట కోత కోసే పరికరము (రీపర్) :
ధర : 1,20,000-1,50,000/-
ఈ యంత్రంతో రోజుకు 10 ఎకరాల వరకు వరి కోత కోయవచ్చు; వరి, గోధుమ, బార్లీ తదితర ధాన్యపు పంటల కోతకు ఉపయోగిస్తారు. - మిని కంబైన్డ్ హార్వెస్టర్ :
ధర : 20,00,000-25,00,000/-
సామర్థ్యం : 1.5 ఎకరాలు/గంటకి
కంబైన్ హార్వెస్టర్ వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటలను కోయడానికి, నూర్పిడి చేసి గింజలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కోత, నూర్పిడి, గింజల శుభ్రపరిచే పనులను ఒకేసారి నిర్వహిస్తుంది - కంబైన్డ్ హార్వెస్టర్ :
ధర : 25,00,000-35,00,000/-
సామర్థ్యం : సుమారు 2.5–3.7 ఎకరాలు/గంటకు
ఈ యంత్రంలో వరి కోత కోయడం, నూర్పిడి చేయడం మరియు చెరగడం ఒకేసారి జరుగుతుంది. యంత్రాన్ని వరి, గోధుమ, మరియు మొక్కజొన్న పంటలను కోసేందుకు ఉపయోగించవచ్చు. - మల్టీక్రాప్ థ్రెషర్
ధర : 5,00,000-7,00,000/-
ఒకే యంత్రంతో వివిధ పంటల నూర్పిడి చేయవచ్చు; నూర్పిడి పనిని వేగంగా పూర్తి చేసి, కూలీల అవసరాన్ని తగ్గించవచ్చు.
వరి: సుమారు 1 ఎకరం/గంట; మొక్కజొన్న: గంటకు 70–80 బస్తాలు - వరిగడ్డి కట్టలు కట్టే యంత్రము :
ధర : 3,00,000-4,00,000/-
సామర్థ్యం : 1.2–1.7 ఎకరాలు/గంటకు
ఈ యంత్రం వరిగడ్డిని సేకరించి, కట్టలు కట్టి బయటకు విడిచిపెడుతుంది; ఒక్కో కట్ట బరువు 20–50 కిలోల వరకు ఉంటుంది. - రీపర్ కం బైండర్ :
ధర : 3,00,000-4,00,000/-
ఈ యంత్రం ద్వారా ఒక రోజుకి 3 నుండి 5 ఎకరాలు వరకు వరి కోత నిర్వహించవచ్చు. ఈ యంత్రం ద్వారా వరి మరియు గోధుమ పంటలను సమర్థంగా కోతచేయవచ్చు.





పి. బాబు, ఎన్. కిశోర్, ఎన్. సత్తిబాబు, మరియు ఎన్. రాజ కుమార్,
కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, ఆంధ్ర ప్రదేశ్. మరింత సమాచారం కొరకు ఫోన్ : 8639279098



