లక్షణాలు:
కళ్ళు కనపడకపోవటం, నడక తడబాటు వుండటం, వస్తువులను గుర్తించలేక గుద్దుకోవటం, కళ్ళు నీరు కారటం, కాళ్ళు బాగా పైకి ఎత్తి జాగ్రత్తగా నడవటం.
కారణాలు:
పుర్రెకు సంబంధించిన ఎముకలు సరిగా పెరగక, కంటి నరాలు కుంచించుకు పోవటం.
కొన్ని దూడలకు వంశానుగతంగా జన్యుదోషం వల్ల వస్తుంది.
కొన్ని దూడలకు పుట్టిన వారం రోజుల వయస్సులోనే కళ్ళు కనపడవు.
తల్లి చూడిగా వున్నపుడు పచ్చి మేత మేపకపోవటం వల్ల కలిగే ‘ఎ’ విటమిన్ లోపం.
పశువైద్యుని సంప్రదించాలి. వ్యాధి ఖేదాత్మక పరిశీలన అవసరం.
ఈ వ్యాధిని ENCEPHALITIS, DISEASES of orbit, retina, optic nerve, localised infectionsగా భ్రమించే అవకాశం వుంది.
పరిష్కారాలు:
- కంటి నరం దెబ్బ తింటే వైద్యం ఫలించదు.
- జున్నుపాలు పుష్కలంగా త్రాగించాలి.
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం:
- రోజుకు 100 గ్రా॥ చొప్పున సజ్ౙ పిండి లేదా చోడి పిండి లేదా రాగి పిండి తినిపించాలి.
- నీరుల్లి రసం ఒకటి రెండు చుక్కలు కంట్లో వెయ్యాలి.
- ఆముదం, ఉప్పు, కుంకుమ పువ్వు నూరి, శనగ గింజంత కంట్లో పెట్టాలి.
- పటిక లేదా పసుపు 10 గ్రా॥, శుభ్రమైన కాచి చల్లార్చిన నీళ్ళలో నానబెట్టి, ఒక రాత్రి వుంచి, తేర్చి 2 చుక్కలు రోజూ 3 పర్యాయాలు కంట్లో వేయాలి.
- కళ్ళలో ఆవు నెయ్యి 2 చుక్కలు వేసి కన్నుపై చన్నీళ్ళు చల్లాలి.
పెరటి వైద్యం:
- పచ్చి మేత, మొలకలు, అవిశ, ములగ మొదలైన ఆకులు మేపాలి.
- అవిసె పువ్వులో గుప్పెడు, ఆవాలు 5 గ్రా॥, తమలపాకులు 10, దేశవాళీ గోంగూర గుప్పెడు, ఒక నీరుల్లిపాయ నూరి, రోజుకు ఒక పర్యాయం తినిపించాలి.
- ముచ్చిలి గుంటలో ఆముదం రాసి, బొక్కెనాకు తొక్కి, ముచ్చిలి గుంటలో పెట్టి కట్టు కట్టాలి.
- ములగాకు లేదా అవిసెపూల రసం తేనెతో కలిపి కంట్లో వెయ్యాలి.
- నల్ల ఉమ్మెత్త ఆకు రసం, అల్లం రసంలో కలిపి కంట్లో వేయాలి.
ఔషధాలు :
- గానుగ వేరు తేనెతో అరగదీసి ఆ గంధం కంట్లో పెట్టాలి.
- చింత ఆకు 10గ్రా॥ కాచి చల్లార్చిన నీళ్ళలో నానబెట్టి, ఒకరాత్రి వుంచి, తేర్చి 2 చుక్కలు కంట్లో వేయాలి.
మూలికావైద్యం:
- జాజికాయ తేనెతో అరగదీసి ఆ గంధం కంట్లో పెట్టాలి.
- చేప నూనె రెండు చుక్కలు కంట్లో వెయ్యాలి, చేప నూనె రోజుకు 10 మి.లీ. చొ॥న త్రాగించాలి.
హోమియో:
ఏదైనా ఒక మందు
- ఫాస్పరస్ 30 లేదా కాస్టికం 30 లేదా సైలీషియ 30 లేదా నేట్రం మర్ 30 లేదా యుఫ్రెషియ 30 లేదా లైకోపోడియం 30 మందు, 5 బిళ్ళలు చొ॥న రోజుకు 2 పర్యాయాలు నెల రోజులు తినిపించాలి.
- నేట్రం ఫాస్ 6X + కాల్కేరియా ఫాస్ 6X + ఫెర్రం ఫాస్ 6X + కాలి సల్ఫ్ 6X + కాలి మర్ 6X + నేట్రం సల్ఫ్ 6X + కాల్కేరియా ఫ్లోర్ 6X + కాల్కేరియా సల్ఫ్ 6X + మాగ్ ఫాస్ 6X + నేట్రం మూర్ 6X + సల్ఫర్ 6X – ఈ ఔషధాల మిశ్రమం 10 మాత్రలు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా 10 రోజులు తినిపించాలి.
అల్లోపతి:
- పరాన్నజీవులను నిర్మూలించాలి.
- విటామిక్స్ లిక్విడ్ (VITAMIX LIQUID) వంటి మందు ఉదయం 5 మి.లీ., సాయంత్రం 5 మి.లీ. చొ॥న, 5 రోజులు త్రాగించాలి.
- విటమిన్ ‘ఎ’ ఇంజక్షను 2 మి.లీ. కండకు (I/Mగా) రోజు విడిచి రోజు 5 ఇంజక్షన్లు చేయించాలి.
జాగ్రత్తలు:
- ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి.
- దూడను వదలకుండా, జాగ్రత్తగా దగ్గరుండి తీసుకువెళ్ళాలి.
- నెలలు నిండిన చూడి ఆవుకు పరాన్నజీవుల నిర్మూలనకై మందు వాడాలి.
- 8వ నెల చూడి ఆవుకు విటమిన్ ‘ఎ’ ఇంజక్షను వారానికి 2 మి.లీ. చొ॥న కండకు (I/Mగా) 4 ఇంజక్షన్లు చేయించాలి.
…………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

