లేగ దూడలు తెల్లగా, జిగురుగా పారుట (CALF Scours)

సమస్య:
తెల్లగా, పచ్చగా విరేచనాలు
జిగురుగా పారటం
పేడ భరించరాని దుర్వాసన
జ్వరం వుండవచ్చు.

కారణాలు:
పాలు జీర్ణం కాక పోవటం,
అపరిశుభ్ర పొదుగు, పరిసరాలు,
E.COLI; SALMONELLA సూక్ష్మక్రిముల వల్ల,
పాలు ఎక్కువ తక్కువగా వదలటం, త్రాగటం

పశువైద్యుని సంప్రదించాలి. వ్యాధి భేదాత్మక పరిశీలన అవసరం.
ఈ వ్యాధిని అంతర పరాన్న జీవుల భారం, పాలు మిక్కుటంగా త్రాగటం, E.COLI; Salmonellosis; Coccidiosis; Cryptospordium; streptococcusలుగా భ్రమించే అవకాశం వుంది.

పరిష్కారాలు:

ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం:

  1. చింతపండు పులుసు 15 గ్రా॥, ఉప్పు 15 గ్రా॥ కలిపి ఒకే పర్యాయం త్రాగించాలి.
  2. కొర్ర పిండి 50 గ్రా॥, పసుపు 5 గ్రా॥, వెన్న 5 గ్రా॥ కలిపి 2 రోజులు తినిపించాలి.
  3. మజ్జిగ అరలీటరులో 10 గ్రా॥ పసుపు కలిపి రోజుకు 2 సార్లు త్రాగించాలి.
  4. పాలు పలుచగా చేసి గోరు వెచ్చగా త్రాగించాలి.
  5. ఉప్పు 5 గ్రా॥, సోడా ఉప్పు 5 గ్రా॥, గ్లూకోజు 25 గ్రా॥, ఒక లీటరు గోరు వెచ్చని నీటిలో కరిగించి ఈ విధంగా తయారు చేసిన ద్రవాన్ని రోజుకు 2,3 పర్యాయాలు త్రాగించాలి. లేదా ఒక లీటరు నీళ్ళలో 50 గ్రా॥ ఉప్పు, 10 గ్రా॥ల బెల్లం లేదా పంచదార కలిపి రోజుకు 2,3 పర్యాయాలు త్రాగించాలి.
  6. వాము 10 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥ కలిపి తినిపించాలి.

పెరటివైద్యం:

  1. గుప్పెడు దానిమ్మ, తంగేడు చిగుళ్లు 100 గ్రా॥ పెరుగులో కలిపి తినిపించాలి
  2. 10 ఆకులు గోంగూర, గాడిదగడపాకు, 50 మి.లీ. ఆముదం కలిపి తినిపించాలి.

ఓషధులు:

  1. ఇప్ప చెక్క లేదా పాల చెక్క 10 గ్రా॥ పసుపు 10 గ్రా॥ ముద్ద చేసి, పెరుగులో కలిపి తినిపించాలి.
  2. బలుసు, నేరేడు, తంగేడు ఆకులు ఒక్కొక్కటి 20 గ్రా॥ దంచి, ముద్ద చేసి 2,3 రోజులు తినిపించాలి.
  3. వెదురాకు పసరు 10 మి.లీ., పసుపు 5 గ్రా॥ కలిపి త్రాగించాలి.
  4. మామిడి జీడి, నేరేడు గింజలు సమపాళ్ళలో నూరి, ఆ పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  5. కొడిసెపాల చెట్టు చిగుళ్ళు 5-10 గ్రా॥ నూరి, మజ్జిగతో కలపి రెండు పర్యాయాలు త్రాగించాలి.

మూలికావైద్యం:

  1. గంధ కఛూరాలు, గుగ్గిలం, పటిక బెల్లం సమపాళ్ళలో నూరిన పొడి 10 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  2. శొంఠి, బూరుగు బంక, దానిమ్మ గింజలు, సోంఫు, జీలకర్ర, ధనియాలు సమపాళ్ళలో నూరి, ఆ పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి ఉదయం, సాయంత్రం త్రాగించాలి.
  3. మారేడు కాయ గుజ్జు 50 గ్రా॥, గంధ కఛూరాలు 50గ్రా॥, తుంగ ముస్తలు 50 గ్రా॥, యాలకులు 10 గ్రా॥, పటిక బెల్లం 100 గ్రా॥ నూరిన పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  4. యాలకులు, పటిక బెల్లం, ఉసిరికాయ సమపాళ్ళలో నూరిన పొడి 20 గ్రాములు నీళ్ళలో కలిపి త్రాగించాలి.

హోమియో: క్రింది మందులలో ఏదైనా ఒక మందు

  1. మెర్క్ కార్ 200 లేదా మెర్క్ సాల్ 200 లేదా పోడోఫైలం 200 లేదా ఆర్సెనికం ఆల్బం 200 పూటకు 5 మాత్రలు చొ॥న ఉదయం, సాయంత్రం 3 రోజులు తినిపించాలి.
    పై మందులకు తగ్గకపోతే,
  2. చైన 30 + నేట్రం ఫాస్ 30 + ఆంటిమోనియం క్రూడం 30 పూటకు 5 మాత్రలు చొ॥న ఉదయం, సాయంత్రం 3 రోజులు ద్రవ సమతుల్యత పునరుద్ధరించబడే వరకు తినిపించాలి.
  3. వ్యాధి నిరోధక టీకా: సైకోటిక్ కో 30 / స్ట్రెప్టోకోకినం 30 / ఈ. కొలై నోసోడ్ 30 ఏదైనా ఒక మందు దూడ పుట్టిన వెంటనే మొదటి మోతాదు, అప్పటి నుండి 24 గంటలకు 2వ మోతాదు, 48 గంటలకు 3వ మోతాదు, 72 గంటలకు 4 వ మోతాదు చొప్పున తినిపించాలి. 4. వెరాట్రం ఆల్బం / కార్బో వెజ్ / పైరోజెన్ / డల్కమార / కాంఫొరా / కాల్కేరియా ఫాస్ / రూస్ టాక్స్ 30 లలో ఏదైనా ఒక మందు 5 మాత్రలు చొప్పున ఉదయం, సాయంత్రంగా 5 రోజులు తినిపించాలి.
  4. బయో కెమికల్ సముదాయం: నేట్రం ఫాస్ 3X + కాల్కేరియా ఫాస్ 3X + ఫెర్రం ఫాస్ 3X + కాలి ఫాస్ 3X + కాలి సల్ఫ్ 3X + నేట్రం సల్ఫ్ 3X ఈ ఔషధాల మిశ్రమం 10 మాత్రలు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా 10 రోజులు తినిపించాలి.

అల్లోపతి:

  1. హాల్‌క్వినాల్ (HALQUINOL) 1-2 బిళ్ళలు తినిపించాలి.
  2. 50 గ్రా॥ల పంచదారను 9 గ్రా॥ ఉప్పుతో కలిపి 1 లీటరు నీటిలో కరిగించి త్రాగించాలి.
  3. రాగి లేదా నూకల జావకు గ్లూకోజు, ఉప్పు కలిపి లేదా ఎలక్ట్రాల్ (ELECTRAL) పొడి కలిపి త్రాగించాలి.
  4. హిస్టానిల్ (HISTANIL) ఇంజక్షను చేయించాలి.
  5. అవసరాన్ని బట్టి రింగర్స్ లాక్టేట్ (RINGER’S LACTATE) మరియు డెక్స్‌ట్రోజ్ నార్మల్ సెలైన్ (DEXTROSE NORMAL SALINE) ఇంజక్షను రక్తంలోకి (।/V గా) ఎక్కించాలి.

జాగ్రత్తలు:
జున్నుపాలు పుష్కలంగా త్రాగనివ్వాలి.
క్రమపద్ధతిలో అంతరపరాన్న జీవులను నిర్మూలించాలి.
మట్టి తినకుండా మతికి బుట్ట కట్టాలి.
పరిసరాలు శుభ్రంగా వుంచాలి, తల్లి పొదుగు పొటాషియం పర్మాంగనేట్ లోషన్‌తో శుభ్రపరచాలి.

…………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

అర్నాబ్ తుఫాను వేళ పశుసంపద రక్షణే రైతులకు శ్రీరామరక్ష!*

పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందారులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలురైతులకు పశువైద్య నిపుణుల సూచనలుతుఫాను ముప్పు.. పశుసంపదపై ప్రత్యేక శ్రద్ధ అవసరం!ప్రకృతి వైపరీత్యాలు రైతు జీవితాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేస్తాయి. ముఖ్యంగా తుఫానులు, భారీ వర్షాలు, వరదలు, ఈదురుగాలుల వల్ల పంటలతోపాటు పశుసంపద కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అర్నాబ్ తుఫాను నేపథ్యంలో పశుపోషకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రభుత్వ శాఖలు జారీ చేసే హెచ్చరికలను పాటించడం ద్వారా పశువుల ప్రాణాలను కాపాడుకోవడంతోపాటు ఆర్థిక నష్టాలను కూడా తగ్గించుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్, విజయవాడ 25 అక్టోబర్ 2026న జారీ చేసిన సర్క్యులర్‌లో తుఫానుకు ముందు, తుఫాను సమయంలో, తుఫాను అనంతరం చేపట్టాల్సిన చర్యలను వివరించింది. పశువులను ఎత్తైన ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పశువైద్య బృందాలను సిద్ధం చేయడం, పశుగ్రాసం మరియు మందులను అందుబాటులో ఉంచడం, వ్యాధుల నివారణ చర్యలు చేపట్టడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.పశువులు రైతులకు కేవలం జీవాలు మాత్రమే కాదు. అవి కుటుంబానికి నిరంతర ఆదాయాన్ని అందించే ఆస్తులు. అందువల్ల తుఫాను వచ్చే వరకు వేచి చూడకుండా ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి.

*1. తుఫానుకు ముందే పశువుల రక్షణకు ప్రణాళిక*తుఫాను సమయంలో పశువుల మరణాలకు ప్రధాన కారణాలు వరదల్లో చిక్కుకోవడం, షెడ్లు కూలిపోవడం, బలమైన గాలులకు పైకప్పులు ఎగిరిపోవడం, మేత మరియు తాగునీరు అందుబాటులో లేకపోవడం.రైతులు ముందుగా తమ పశువుల సంఖ్య, వాటి ఆరోగ్య పరిస్థితి, షెడ్ల భద్రత, మేత నిల్వలు, తరలించడానికి అనువైన సురక్షిత ప్రాంతాలను గుర్తించాలి.• పశువుల షెడ్ల పైకప్పులు, రేకులు, స్తంభాలు, తలుపులను పరిశీలించి మరమ్మతులు చేయాలి.• వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల నుంచి పశువులను ముందుగానే ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.• పశువులను చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, బలహీనమైన గోడల పక్కన కట్టకూడదు.• కనీసం 3–5 రోజులకు సరిపడా పొడి గడ్డి, పశుగ్రాసం, దాణా నిల్వ చేసుకోవాలి.• శుభ్రమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి.• పశువుల గుర్తింపు ట్యాగులు, బీమా పత్రాలు, టీకాల వివరాలను భద్రపరచుకోవాలి.• గర్భిణీ పశువులు, చిన్న దూడలు, ఇటీవల ఈనిన పశువులు, అనారోగ్యంతో ఉన్న జీవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.పశువులను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడితే వరద ప్రవాహాలు లేని సురక్షిత మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రాణాపాయం ఉన్న సమయంలో పశువులను రక్షించడానికి ప్రయత్నిస్తూ మనుషులు ప్రమాదంలో పడకూడదు. పశువుల తరలింపుపై స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలి.

*2. పాడి పశువుల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు*పాడి పశువుల ద్వారా రైతులకు ప్రతిరోజూ ఆదాయం లభిస్తుంది. తుఫాను సమయంలో పశువులు భయాందోళనలకు గురికావడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, కలుషిత నీటిని తాగడం వల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది.పశువుల షెడ్లలోకి వర్షపు నీరు రాకుండా చూసుకోవాలి. నేలపై నీరు నిల్వ ఉండకుండా పారుదల సౌకర్యం కల్పించాలి. పశువులు జారిపడకుండా నేలను శుభ్రంగా ఉంచాలి.వర్షపు నీటితో కలుషితమైన గడ్డి, బురద అంటుకున్న మేత, బూజు పట్టిన దాణాను తినిపించకూడదు. పరిశుభ్రమైన తాగునీరు అందించాలి. పశువులు ఆకలి తగ్గడం, జ్వరం, విరేచనాలు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు చూపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

*3. గొర్రెలు, మేకల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలి*గొర్రెలు, మేకలు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో మేత మేస్తాయి. తుఫాను సమయంలో వీటిని మేతకు పంపడం ప్రమాదకరం. బలమైన గాలులు, వర్షం, వరద నీరు, చల్లటి వాతావరణం వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీ జీవాలు, బలహీనమైన జంతువులు ఇబ్బందులకు గురవుతాయి.

*రైతులు పాటించాల్సిన సూచనలు:*• తుఫాను హెచ్చరికల సమయంలో గొర్రెలు, మేకలను బహిరంగ మేతకు పంపకూడదు.• సురక్షితమైన, ఎత్తైన ప్రదేశంలో షెడ్లు ఏర్పాటు చేసుకోవాలి.• షెడ్లలో నీరు నిల్వ ఉండకుండా, నేల పొడిగా ఉండేలా చూడాలి.• ఎండిన గడ్డి, సురక్షితమైన పచ్చిమేత, తగిన దాణాను ముందుగానే నిల్వ చేసుకోవాలి.• చిన్న పిల్లలు, గర్భిణీ జీవాలను ప్రత్యేకంగా సంరక్షించాలి.• వరద నీటితో కలుషితమైన మేతను తినిపించకూడదు.తుఫాను తరువాత గొర్రెలు, మేకల్లో జ్వరం, దగ్గు, విరేచనాలు, కుంటడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్య సహాయం పొందాలి.

*4. కోళ్ల ఫారాల యజమానులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు*కోళ్ల పెంపకంలో తుఫానుల వల్ల ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. షెడ్ల పైకప్పులు ఎగిరిపోవడం, వర్షపు నీరు లోపలికి రావడం, లిట్టర్ తడవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల కోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.కాబట్టి కోళ్ల పెంపకందారులు ఈ చర్యలు చేపట్టాలి:• షెడ్ల పైకప్పులు, రేకులు, తలుపులు, పక్క తెరలను బలంగా బిగించాలి.• వర్షపు నీరు షెడ్‌లోకి రాకుండా పారుదల ఏర్పాటు చేయాలి.• లిట్టర్ తడవకుండా చూసుకోవాలి. అవసరమైన పొడి పరుపు పదార్థాన్ని సిద్ధంగా ఉంచాలి.• కోళ్లకు సరిపడా దాణా, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి.• విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి.• గాలి ప్రసరణ పూర్తిగా ఆగిపోకుండా జాగ్రత్తపడాలి.• తడిసిన దాణా, బూజు పట్టిన పదార్థాలను తొలగించాలి.కోళ్లలో మరణాల సంఖ్య పెరగడం, దాణా తీసుకోవడం తగ్గడం, శ్వాస సమస్యలు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

*5. పశుగ్రాసం నిల్వలు.. అత్యవసర ప్రణాళికలో కీలకం*తుఫాను సమయంలో రహదారులు దెబ్బతినడం, రవాణా నిలిచిపోవడం, పొలాలు నీట మునగడం వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. అందువల్ల పశుగ్రాసాన్ని ముందుగానే నిల్వ చేసుకోవడం అత్యంత ముఖ్యం.పశుపోషకులు పొడి గడ్డి, ఎండు మేత, పశుదాణాను వర్షం తగలని సురక్షిత ప్రదేశంలో నిల్వ చేయాలి. మేతను నేలపై నేరుగా ఉంచకుండా తేమ చేరకుండా జాగ్రత్తపడాలి. నిల్వ చేసిన మేత బూజు పట్టకుండా తరచుగా పరిశీలించాలి.ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సర్క్యులర్‌లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పొడి, పచ్చి పశుగ్రాసం లభ్యతను గుర్తించి, అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి పశుదాణా పంపిణీకి కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.రైతులు పశుగ్రాస కొరత ఎదురైనప్పుడు స్థానిక పశువైద్యశాల లేదా సంబంధిత అధికారులను సంప్రదించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయంపై వివరాలు తెలుసుకోవాలి.

*6. పశువైద్య అత్యవసర బృందాలు, 1962 అంబులెన్స్ సేవలు*తుఫాను సమయంలో పశువులు గాయపడటం, అనారోగ్యానికి గురికావడం, వరద ప్రాంతాల్లో చిక్కుకోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇలాంటి సందర్భాల్లో సకాలంలో పశువైద్య సహాయం అందడం చాలా ముఖ్యం.పశుసంవర్ధక శాఖ సర్క్యులర్ ప్రకారం, పశువైద్య సహాయక సర్జన్, పారా వెటర్నరీ సిబ్బంది, అటెండర్, గోపాలమిత్రతో కూడిన అత్యవసర ప్రతిస్పందన బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ బృందాలకు అవసరమైన ప్రథమ చికిత్స కిట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి.తుఫాను ప్రభావిత గ్రామాల్లో పశువైద్య బృందాలు అందుబాటులో ఉండి, గాయపడిన మరియు అనారోగ్యంతో ఉన్న జీవాలకు చికిత్స అందించాలి. అవసరమైన చోట 1962 పశువైద్య అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచాలని కూడా శాఖ ఆదేశించింది.రైతులు తమ సమీప పశువైద్యశాల ఫోన్ నంబర్‌ను ముందుగానే తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో పశువుల పరిస్థితి, గ్రామం పేరు, చేరుకోవడానికి అనువైన మార్గం వంటి వివరాలను స్పష్టంగా తెలియజేయాలి.

*7. తుఫాను సమయంలో తప్పనిసరిగా నివారించాల్సిన పనులు*• వరద నీటిలో పశువులను బలవంతంగా నడిపిస్తూ తరలించకూడదు.• తెగిపడిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లకూడదు.• కలుషితమైన వరద నీటిని పశువులకు తాగించకూడదు.• తడిసిన, బూజు పట్టిన మేతను తినిపించకూడదు.• పశువైద్యుడి సలహా లేకుండా యాంటీబయాటిక్స్, ఇతర మందులను విచక్షణారహితంగా వాడకూడదు.• బలమైన గాలులు వీచే సమయంలో బలహీనమైన షెడ్లలో పశువులను ఉంచకూడదు.• ప్రమాదకర పరిస్థితుల్లో పశువులను రక్షించే ప్రయత్నంలో మనుషుల ప్రాణాలను పణంగా పెట్టకూడదు.

*8. తుఫాను అనంతరం వ్యాధుల నివారణకు ప్రత్యేక శ్రద్ధ*తుఫాను తగ్గిన తరువాత కూడా రైతుల బాధ్యత ముగియదు. వరద నీరు తగ్గిన తరువాత కలుషితమైన నీరు, తడి వాతావరణం, నిల్వ ఉన్న చెత్త, దోమలు, పేలు వంటి వ్యాధి వాహకాల వల్ల పశువులకు వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.తుఫాను అనంతరం రైతులు చేపట్టాల్సిన చర్యలు:• పశువుల షెడ్లలోని బురద, చెత్తను తొలగించి శుభ్రపరచాలి.• పశువులకు పరిశుభ్రమైన తాగునీరు, నాణ్యమైన మేత అందించాలి.• గాయపడిన జీవాలకు వెంటనే చికిత్స అందించాలి.• జ్వరం, విరేచనాలు, దగ్గు, శ్వాస సమస్యలు వంటి లక్షణాలను గమనించాలి.• పశువైద్య అధికారుల సూచనల మేరకు అవసరమైన టీకాలు, వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి.• చనిపోయిన జంతువుల కళేబరాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలేయకూడదు. స్థానిక అధికారుల సూచనల మేరకు సురక్షితంగా తొలగించాలి.ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సర్క్యులర్‌లో తుఫాను అనంతరం పశువైద్య బృందాలు ప్రభావిత గ్రామాలను సందర్శించి పశువుల నష్టాలను నమోదు చేయాలని, గాయపడిన మరియు అనారోగ్యంతో ఉన్న జీవాలకు చికిత్స అందించాలని సూచించారు. అంటువ్యాధుల నివారణకు అవసరమైన టీకాలు వేయడం, వ్యాధుల వ్యాప్తిని పర్యవేక్షించడం, పశుగ్రాసం మరియు తాగునీటి సరఫరాను సమన్వయం చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు.

*9. పశుసంపద నష్టాల నమోదు.. రైతులు చేయాల్సిన పని*తుఫాను వల్ల పశువులు చనిపోయినా, షెడ్లు దెబ్బతిన్నా, పశుగ్రాసం నష్టపోయినా రైతులు వెంటనే స్థానిక పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.నష్టపోయిన పశువుల సంఖ్య, వాటి వివరాలు, షెడ్ల నష్టం, పశుగ్రాస నష్టం వంటి సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. సాధ్యమైనప్పుడు సురక్షితంగా ఫొటోలు తీసి, సంబంధిత అధికారులకు అందించాలి. బీమా ఉన్న పశువుల విషయంలో బీమా సంస్థ నిబంధనల ప్రకారం సమాచారం అందించాలి.శాఖ సర్క్యులర్ ప్రకారం, పశువుల నష్టాలు, భవనాల నష్టాలు, పశుగ్రాస నష్టాల వివరాలను సంబంధిత అధికారులకు వెంటనే నివేదించాలి. జిల్లా స్థాయిలో నియంత్రణ గదుల ద్వారా సమాచారం సేకరించి, అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేయాలని సూచించారు.

*10. ప్రతి రైతు సిద్ధం చేసుకోవాల్సిన అత్యవసర కిట్*ప్రతి పశుపోషకుడు ఒక అత్యవసర సంరక్షణ కిట్ సిద్ధం చేసుకోవడం మంచిది. అందులో ఈ వస్తువులు ఉంచుకోవాలి:• టార్చ్‌లైట్, అదనపు బ్యాటరీలు.• బలమైన తాళ్లు, పశువుల గుర్తింపు వివరాలు.• శుభ్రమైన నీటి పాత్రలు.• ప్రథమ చికిత్సకు అవసరమైన సామగ్రి.• పశువైద్యశాల ఫోన్ నంబర్.• పశువుల బీమా పత్రాలు, టీకాల రికార్డులు.• కొన్ని రోజుల పాటు సరిపడా పొడి గడ్డి, దాణా.గ్రామంలోని రైతులు పరస్పరం సహకరించుకుంటూ అత్యవసర సమయంలో పశువులను ఎక్కడికి తరలించాలి, మేతను ఎలా సరఫరా చేయాలి, చికిత్స ఎక్కడ అందుబాటులో ఉంటుంది అనే అంశాలపై ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి.తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా నివారించలేకపోయినా, ముందస్తు ప్రణాళికతో వాటివల్ల కలిగే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడం, షెడ్లను బలోపేతం చేయడం, పరిశుభ్రమైన నీరు అందించడం, వ్యాధుల లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా రైతులు తమ పశుసంపదను కాపాడుకోవచ్చు.ప్రభుత్వ శాఖల సూచనలు, పశువైద్య బృందాల సహకారం, రైతుల అప్రమత్తత కలిసివస్తే తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు.*“పశుసంపదను కాపాడుకుందాం — రైతు కుటుంబ ఆర్థిక భద్రతను నిలబెట్టుకుందాం!

”**- డా.జి.రాంబాబు,* పశువైధ్యాధికారి, కడప 9618499184

Read More

ఆవు దూడకు ఊదర బొడ్డు (UMBILICAL HERNIA)

కొన్ని దూడలకు పొట్ట దిగువ భాగాన బొడ్డు చుట్టూ కండ పూడనందు వల్ల, బొడ్డు దగ్గర రంధ్రంగా వుండి, దానిగుండా ప్రేగులు బొడ్డు తిత్తిలోకి చేరి వుంటాయి.

ఇది బొడ్డువాపువలే భ్రమింపజేస్తుంది. నిర్ధారణకు రెండు వ్రేళ్ళతో బొడ్డు భాగంలో నొక్కితే, లోపలకు చిన్న రంధ్రం ద్వారా వ్రేళ్ళు వెళ్ళినట్లయితే, అది ఊదర బొడ్డుగా నిర్ధారించవచ్చును.

పశువైద్య నిపుణునికి చూపించాలి. బొడ్డు వాపు (UMBILICAL ABSCESS) వ్యాధిగా పొరబడే అవకాశం వుంది.

పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం

గృహవైద్యం

  1. పసుపు, వెన్నపూస మిశ్రమాన్ని బొడ్డుపై రాచి గట్టిగా గుడ్డ కట్టాలి.
  2. బొడ్డును లోపలకు నెట్టిన తరువాత, ఒక అడుగు వెడల్పు గల గుడ్డను 3,4 మడతలు మడిచి, బొడ్డుపై నుండి నడుముకు బిగించి ముడి వేయాలి. దాని వల్ల బొడ్డులోనికి జారిన ప్రేగులు పొట్టలోకి నెట్టేయబడి, కాల క్రమేణా ఆ రంధ్రం పూడిపోవడానికి దోహదపడుతుంది.

అల్లోపతి: ఈ విధంగా చేసిన తరువాత కూడా ప్రేగులు బొడ్డులోకి జారివున్నట్లయితే, నిపుణులచే శస్త్రచికిత్స ద్వారా సరిచేయించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఆవుల్లో కవల దూడలు (TWINS) పుట్టుట

కవల దూడలు చాలా అరుదుగా పుడతాయి. గర్భకోశద్వారం గుండా రెండు దూడలు ఒకే పర్యాయం రాలేక, ఈనటం కష్టమవుతుంది. ఒక దూడ జన్మించిన తరువాత కొంత సమయానికి, మరల ప్రసవ వేదన ప్రారంభమై మరొక దూడ జన్మించు సందర్భాలలో, ఈనటం కష్టం అవదు. గర్భద్వారంలో దూడలు యిరుక్కున్న సందర్భాలలో, పశువైద్యనిపుణులను సంప్రదిస్తే, వారు దూడల స్థానాలను సరిచేసి గాని, శస్త్రచికిత్స చేసి గాని, దూడలను బయటకు తీస్తారు.

రెండు దూడలు మగవైనా, రెండు దూడలు ఆడవైనా సమస్య వుండదు.

ఒక మగ, ఒక ఆడ దూడ కలిసి (FREEMARTIN) పుడితే, మగదూడకు ఏ సమస్యా వుండదు. కాని ఆడ దూడలో గర్భకోశ సంబంధిత అవయవాలు అభివృద్ధి చెందక, పునరుత్పత్తి సామర్థ్యం వుండదు. ఇది చాలా వాటిల్లో జరుగుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

పాడి పశువుల్లో ఈగలు, దోమల నియంత్రణకు సహజ పద్ధతులు

నందిమండలం గ్రామ రైతు సిద్ధారెడ్డి – వెటర్నరీ వైద్యుడు డా. జి. రాంబాబు మధ్య జరిగిన ప్రేరణాత్మక కథనం

పాడి పశుసంవర్ధకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతుకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అయితే ఆవులు, గేదెల వద్ద ఈగలు, దోమల బెడద రైతులకు తీవ్రమైన సమస్యగా మారుతోంది. పశువుల శరీరంపై వాలే ఈగలు వాటిని నిరంతరం ఇబ్బంది పెట్టడమే కాకుండా పాల దిగుబడి తగ్గడం, చర్మవ్యాధులు రావడం, మాస్టిటిస్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయి.

ఈ సమస్యకు సహజ పద్ధతుల ద్వారా పరిష్కారం కనుగొన్న నందిమండలం గ్రామానికి చెందిన పాడి రైతు సిద్ధారెడ్డి అనుభవం, వెటర్నరీ నిపుణుడు డా. జి. రాంబాబు ఇచ్చిన శాస్త్రీయ సూచనలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

నందిమండలం ఫారంలో సమస్య ప్రారంభం

  • నందిమండలం గ్రామంలో సిద్ధారెడ్డి పది సంవత్సరాలుగా పాడి పశుసంవర్ధకం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద 20 గేదెలు ఉన్నాయి. పాల ఉత్పత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటూ మంచి రైతుగా పేరుపొందారు.
  • అయితే ఇటీవల నెల రోజులుగా గేదెల వద్ద ఈగలు, దోమల సమస్య అధికమైంది. పశువులు ప్రశాంతంగా నిలబడకపోవడం, మేత తినకుండా ఉండడం, తోకతో నిరంతరం ఈగలను తరిమే ప్రయత్నం చేయడం ఆయనను ఆందోళనకు గురి చేసింది.
  • పాల దిగుబడి కూడా రోజురోజుకు తగ్గుతుండటంతో వెంటనే వెటర్నరీ వైద్య నిపుణుడు డా. జి. రాంబాబు గారిని సంప్రదించారు.

ఫారంకు వచ్చిన వెటర్నరీ వైద్యుడు
డా. జి. రాంబాబు ఫారంకు చేరుకుని పశువుల పరిస్థితిని పరిశీలించారు. గేదెల శరీరంపై ఈగలు ఎక్కువగా ఉండటం, పశువులు అసహనంగా కదలడం, కొన్నింటిలో చర్మంపై చిన్న గాయాలు కనిపించడం గమనించారు.

సిద్ధారెడ్డి ఆందోళనగా అడిగాడు

“డాక్టర్ గారు, ఈగలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. గేదెలు సరిగా తినడం లేదు. పాల దిగుబడి కూడా తగ్గింది. మార్కెట్‌లో రసాయన మందులు ఉన్నాయి కానీ వాటి వల్ల పశువులకు హాని కలుగుతుందేమోనని భయంగా ఉంది.”

ప్రశాంతంగా సమాధానమిచ్చారు

“మీ ఆందోళన సరైనదే. ఈగలు, దోమలు పశువుల రక్తాన్ని పీల్చి బలహీనత కలిగిస్తాయి. ఒత్తిడి పెరగడం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. చర్మవ్యాధులు, మాస్టిటిస్ ప్రమాదం కూడా పెరుగుతుంది. కానీ రసాయన మందులు మాత్రమే పరిష్కారం కాదు. కొన్ని సహజ పద్ధతులు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.”

రైతు సందేహం – సహజ పద్ధతులు నిజంగా పనిచేస్తాయా?

సిద్ధారెడ్డి ఆసక్తిగా అడిగాడు
“సహజ పద్ధతులు నిజంగా పనిచేస్తాయా డాక్టర్ గారు? ఇవి కేవలం తాత్కాలిక పరిష్కారమా లేక పూర్తిగా ఉపయోగపడతాయా?”

డా. రాంబాబు వివరించారు
“సహజ పద్ధతులు ఈగలను పూర్తిగా నిర్మూలించకపోయినా వాటిని పశువుల దగ్గరకు రాకుండా నిరోధిస్తాయి. సరైన షెడ్ నిర్వహణతో కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది.”

వెనిగర్ – ఉప్పు – కర్పూరం సహజ స్ప్రే
డా. రాంబాబు రైతుకు ఒక సరళమైన గృహచిట్కాను వివరించారు.
మూడు లీటర్ల నీటిలో 50 మిల్లీలీటర్ల వెనిగర్, 50 గ్రాముల ఉప్పు కలిపి నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. చల్లారిన తర్వాత 10 గ్రాముల కర్పూరం పొడి కలిపి వడకట్టి స్ప్రే బాటిల్‌లో నింపాలి.
ఈ ద్రావణాన్ని రోజుకు రెండు సార్లు పశువుల శరీరంపై పిచికారీ చేస్తే ఈగలు దూరంగా ఉంటాయి.
సిద్ధారెడ్డి మళ్లీ ప్రశ్నించాడు
“ఈ స్ప్రే పశువులు నాకితే ప్రమాదమా?”
“సాధారణంగా హానికరం కాదు. కానీ మొదట చిన్న భాగంలో పరీక్షించి వాడటం మంచిది” అని డా. రాంబాబు చెప్పారు.

మరో సందేహం – గర్భిణీ పశువులకు వాడవచ్చా?
రైతు తన ఫారంలోని గర్భిణీ గేదెల గురించి అడిగాడు
“గర్భిణీ పశువులకు కూడా ఈ స్ప్రే వాడవచ్చా?”
వైద్యుడు సమాధానమిచ్చారు
“సాధారణంగా వాడవచ్చు. కానీ అధిక మోతాదు వాడకూడదు. కొత్త పద్ధతి ప్రారంభించే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి.”

వెల్లుల్లి ద్వారా ఈగల నియంత్రణ
ఫారంలో తిరుగుతూ డా. రాంబాబు మరో ముఖ్యమైన సూచన ఇచ్చారు.
“వెల్లుల్లి కూడా సహజ కీటక నిరోధకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అల్లియిన్ అనే పదార్థం శరీరంలో అల్లిసిన్‌గా మారి చెమట ద్వారా బయటకు వస్తుంది. ఈ వాసన ఈగలను దూరం చేస్తుంది.”
సిద్ధారెడ్డి ఆశ్చర్యంగా అడిగాడు
“వెల్లుల్లి ఇస్తే పాలలో వాసన వస్తుందా?”
“సరైన మోతాదులో ఇస్తే పాలలో వాసన రాదు. రోజుకు 2–3 గ్రాముల వెల్లుల్లి పొడి లేదా 5–10 గ్రాముల పచ్చి వెల్లుల్లిని దంచి దానాలో కలిపి ఇవ్వవచ్చు” అని వైద్యుడు వివరించారు.

రైతు మరిన్ని సందేహాలు
సిద్ధారెడ్డి తన అనుభవాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగాడు.
“ఎంతకాలం వెల్లుల్లి ఇవ్వాలి?”
వైద్యుడు చెప్పారు
“ఈగల కాలానికి పది రోజుల ముందు ప్రారంభించి సమస్య ఉన్నంతకాలం ఇవ్వవచ్చు.”
“వెల్లుల్లి ఎక్కువ ఇస్తే ఏమవుతుంది?”
“అధిక మోతాదులో జీర్ణ సమస్యలు రావచ్చు. సూచించిన మోతాదే ఇవ్వాలి.”
“ఈ పద్ధతులతో పాల దిగుబడి పెరుగుతుందా?”
“పశువులు ప్రశాంతంగా ఉండటం వల్ల పాల ఉత్పత్తి మెరుగుపడే అవకాశం ఉంది.”

షెడ్ నిర్వహణపై కీలక సూచనలు
డా. రాంబాబు ఫారం పరిసరాలను పరిశీలించి ఇలా చెప్పారు
• పేడ నిల్వ ఉండకూడదు
• నీరు నిల్వ కాకుండా చూడాలి
• షెడ్‌లో గాలి ప్రసరణ ఉండాలి
• పశువుల శరీర పరిశుభ్రత పాటించాలి
• ఈగల ట్రాప్స్ ఉపయోగించాలి
“సహజ స్ప్రే మాత్రమే కాదు, పరిశుభ్రత కూడా ఈగల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది” అని ఆయన వివరించారు.

మార్పు ప్రారంభమైన ఫారం
డాక్టర్ సూచనల మేరకు సిద్ధారెడ్డి వెంటనే చర్యలు ప్రారంభించాడు. షెడ్ శుభ్రత పెంచాడు. వెనిగర్–కర్పూరం స్ప్రే వాడటం ప్రారంభించాడు. వెల్లుల్లిని మోతాదుగా దానాలో కలిపి ఇవ్వడం మొదలుపెట్టాడు.
రెండు వారాల తరువాత ఫారంలో స్పష్టమైన మార్పు కనిపించింది. గేదెల వద్ద ఈగల సంఖ్య గణనీయంగా తగ్గింది. పశువులు ప్రశాంతంగా మేత తినడం ప్రారంభించాయి. పాల దిగుబడి కూడా క్రమంగా పెరిగింది.
సిద్ధారెడ్డి ఆనందంగా చెప్పాడు
“సహజ పద్ధతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితం ఇచ్చాయి. పశువులు ఆరోగ్యంగా ఉంటే రైతు జీవితం సంతోషంగా ఉంటుంది.”

డా. జి. రాంబాబు సందేశం
డా. రాంబాబు రైతులకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు
“పశువుల ఆరోగ్యం కోసం సహజ పద్ధతులు, శాస్త్రీయ నిర్వహణ, సరైన పోషణ అన్నీ కలిసి ఉండాలి. తీవ్రమైన సమస్యల్లో తప్పనిసరిగా వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.”

రైతులకు ఈ కథనం ఇచ్చే పాఠం
నందిమండలం రైతు సిద్ధారెడ్డి అనుభవం పాడి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఖరీదైన రసాయన మందులపై పూర్తిగా ఆధారపడకుండా సహజ పద్ధతులు, పరిశుభ్రత, సరైన నిర్వహణతో ఈగలు, దోమల సమస్యను సమర్ధవంతంగా నియంత్రించవచ్చని ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది.
పశువుల సంరక్షణలో చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యకరమైన పశువులు ఉంటేనే రైతుకు అధిక పాల దిగుబడి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
సహజ పద్ధతులు, శాస్త్రీయ అవగాహన, అనుభవం కలిస్తే పాడి పశుసంవర్ధకంలో విజయాన్ని సాధించవచ్చని ఈ కథనం స్పష్టం చేస్తోంది.

డా. జి. రాంబాబు, పశువైద్యుడు, కడప. Ph:94945 88885

Read More

పశుగ్రాసం కొరత – ప్రత్యామ్నాయ మార్గాలు

పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరియు రైతు ఆదాయాన్ని కాపాడుకోవడానికి సమగ్ర మార్గదర్శిని
భారతదేశంలో పశుపోషణ రైతులకు పశుగ్రాసం కొరత ఒక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, వరదలు, పంటల సాగు విధానాల్లో మార్పులు, సాగుభూమి తగ్గడం వంటి కారణాల వల్ల పచ్చిమేత లభ్యత తగ్గుతుంది. పచ్చిమేత కొరత ఏర్పడినప్పుడు పశువులకు సరిపడా పోషకాలు అందకపోవడంతో పాల దిగుబడి తగ్గడం, శరీర బరువు తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం, వ్యాధుల బారిన పడే అవకాశం పెరగడం జరుగుతుంది.

అయితే పచ్చిమేత అందుబాటులో లేదని పశువులకు కేవలం ఎండుగడ్డి లేదా వరి గడ్డిని మాత్రమే ఎక్కువగా ఇవ్వడం సరైన పద్ధతి కాదు. లభ్యమయ్యే అన్ని స్థానిక వనరులను శాస్త్రీయంగా ఉపయోగించడం, పంట అవశేషాలను పోషక విలువ పెంచి వినియోగించడం, సైలేజ్ తయారు చేయడం, ప్రత్యామ్నాయ పశుగ్రాస పంటలు సాగు చేయడం, సమతుల్య దాణా అందించడం ద్వారా పశుగ్రాస కొరతను గణనీయంగా తగ్గించవచ్చు.

  1. పంట అవశేషాలను పశుగ్రాసంగా ఉపయోగించడం
    పశుగ్రాస కొరత సమయంలో రైతుల వద్ద లభించే ప్రధాన వనరు పంటల అవశేషాలు.
    ఉపయోగించగల పంట అవశేషాలు:
    • వరి గడ్డి, జొన్న కాడలు, మొక్కజొన్న కాడలు, సజ్జ కాడలు, రాగి కాడలు, వేరుశనగ ఎండుగడ్డి,పెసర, మినుము, శనగ పంట అవశేషాలు, కంది కాడలు, గోధుమ గడ్డి, ఇతర పప్పుధాన్యాల ఎండుగడ్డి
    వీటిలో కొన్ని పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉండి, జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసి, దాణా మరియు ఇతర పోషక పదార్థాలతో కలిపి ఇవ్వడం మంచిది.
  2. వరి గడ్డిని మెరుగుపరచి వినియోగించడం
    వరి గడ్డి లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దాని పోషక విలువ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లిగ్నిన్ మరియు సిలికా ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి పరిమితంగా ఉంటుంది.
    దీనిని మెరుగుపరచడానికి:

యూరియా ట్రీట్మెంట్
వరి గడ్డిని యూరియా ద్రావణంతో శాస్త్రీయంగా ట్రీట్ చేయడం ద్వారా దాని జీర్ణశక్తి మరియు నైట్రోజన్ విలువను పెంచవచ్చు.
సాధారణంగా 100 కిలోల పొడి గడ్డికి సుమారు 4 కిలోల యూరియాను నీటిలో కరిగించి సమంగా చల్లుతూ పొరలుగా అమర్చి, గాలి చొరబడకుండా కప్పి కొన్ని వారాలు ఉంచే పద్ధతి ఉపయోగిస్తారు.
అయితే ఇది పశువులకు నేరుగా యూరియా తినిపించడం కాదు. యూరియా ట్రీట్మెంట్ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలి. ట్రీట్ చేసిన గడ్డిని ఉపయోగించే ముందు తగిన సమయం, వెంటిలేషన్ మరియు సరైన నిర్వహణ అవసరం.

  1. సైలేజ్ తయారీ – పచ్చిమేత కొరతకు ఉత్తమ ప్రత్యామ్నాయం
    పచ్చిమేత సమృద్ధిగా లభించే సమయంలో దానిని భద్రపరచుకోవడానికి సైలేజ్ చాలా ఉపయోగకరమైన పద్ధతి.
    సైలేజ్‌కు అనుకూలమైన పంటలు:
    మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఓట్స్, ఇతర అనుకూలమైన పచ్చిమేత పంటలు
    మొక్కజొన్న సైలేజ్ ముఖ్యంగా పాల పశువులకు మంచి శక్తి వనరుగా ఉపయోగపడుతుంది.
    సైలేజ్ తయారీలో ముఖ్యమైన అంశాలు:
  2. పంటను సరైన దశలో కోయాలి.
  3. సుమారు 1–2 సెం.మీ. పరిమాణంలో చాప్ చేయాలి.
  4. సైలేజ్ గుంత/బంకర్/సీలో బ్యాగ్‌లో పొరలుగా వేయాలి.
  5. ప్రతి పొరను బాగా తొక్కి గాలిని బయటకు పంపాలి.
  6. గాలి చొరబడకుండా పూర్తిగా మూసివేయాలి.
  7. కిణ్వ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలి.
    సరైన సైలేజ్ తయారీ ద్వారా పచ్చిమేత లభించని వేసవి లేదా కరువు కాలంలో కూడా నాణ్యమైన పశుగ్రాసాన్ని అందించవచ్చు.
  8. ఎండుగడ్డి నిల్వ చేసుకోవడం
    రైతులు పచ్చిమేత ఉన్న సమయంలోనే భవిష్యత్తు అవసరాల కోసం ఎండుగడ్డిని నిల్వ చేసుకోవాలి.
    మంచి ఎండుగడ్డి లక్షణాలు:
    • బూజు లేకుండా ఉండాలి
    • అధిక తేమ లేకుండా ఉండాలి
    • దుర్వాసన ఉండకూడదు
    • పురుగులు లేకుండా ఉండాలి
    • వర్షానికి తడవకూడదు
    ఎండుగడ్డిని నేలపై నేరుగా కాకుండా ప్యాలెట్లు లేదా ఎత్తైన ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.
  9. పప్పుధాన్యాల ఎండుగడ్డి వినియోగం
    పచ్చిమేత కొరత సమయంలో పప్పుధాన్యాల ఎండుగడ్డి మంచి ప్రత్యామ్నాయం.
    ఉదాహరణకు:
    • వేరుశనగ ఎండుగడ్డి
    • శనగ కాడలు
    • పెసర అవశేషాలు
    • మినుము అవశేషాలు
    • కంది కాడలు
    వీటిలో సాధారణ వరి గడ్డితో పోలిస్తే పోషక విలువ మెరుగ్గా ఉండవచ్చు.
    ప్రత్యేకంగా వేరుశనగ ఎండుగడ్డి రైతులకు మంచి ప్రత్యామ్నాయ పశుగ్రాస వనరుగా ఉపయోగపడుతుంది. అయితే బూజు పట్టిన లేదా అఫ్లాటాక్సిన్ ప్రమాదం ఉన్న పదార్థాలను పశువులకు ఇవ్వకూడదు.
  10. ఉప ఉత్పత్తులను పశుగ్రాసంలో ఉపయోగించడం
    వ్యవసాయ మరియు ఆహార పరిశ్రమలలో లభించే కొన్ని ఉప ఉత్పత్తులను శాస్త్రీయంగా ఉపయోగించవచ్చు.
    ఉదాహరణలు:
    • బియ్యం తవుడు,గోధుమ తవుడు,మొక్కజొన్న, జొన్న,సజ్జ, శనగ చూర్ణం, పప్పుధాన్యాల ఉప ఉత్పత్తులు, వేరుశనగ పిండి/కేక్, సోయాబీన్ మీల్, నువ్వుల కేక్, పొద్దుతిరుగుడు కేక్, కొబ్బరి కేక్
    వీటిని పశువుల శక్తి మరియు ప్రోటీన్ అవసరాలకు అనుగుణంగా సమతుల్య దాణాలో ఉపయోగించాలి.
  11. చెట్ల ఆకులను ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా ఉపయోగించడం
    పశుగ్రాస కొరత సమయంలో కొన్ని చెట్ల ఆకులు కూడా ఉపయోగపడతాయి.
    ఉదాహరణకు:
    సుబాబుల్, గ్లైరిసిడియా, మునగ, కొన్ని స్థానికంగా ఉపయోగించే పశుగ్రాస చెట్ల ఆకులు
    అయితే ప్రతి చెట్టు ఆకును పశువులకు ఇవ్వడం సురక్షితం కాదు. కొన్ని మొక్కల్లో విషపదార్థాలు లేదా యాంటీ-న్యూట్రిషనల్ ఫ్యాక్టర్లు ఉండవచ్చు.
    అందువల్ల తెలిసిన, పశుగ్రాసంగా సురక్షితంగా ఉపయోగించే మొక్కలనే ఎంచుకోవాలి.
  12. సుబాబుల్ ఆకుల వినియోగం
    సుబాబుల్ మంచి ప్రోటీన్ వనరుగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మిమోసిన్ అనే యాంటీ-న్యూట్రిషనల్ పదార్థం ఉంటుంది.
    కాబట్టి:
    • అధిక మొత్తంలో ఇవ్వకూడదు.
    • ఇతర పశుగ్రాసాలతో కలిపి ఇవ్వాలి.
    • ఆకులను మాత్రమే ఆధారంగా చేసుకుని పూర్తి దాణాగా ఉపయోగించకూడదు.
    సుబాబుల్‌ను మిశ్రమ పశుగ్రాసంలో పరిమితంగా ఉపయోగించడం ఉత్తమం.
  13. మునగ ఆకుల వినియోగం
    మునగ ఆకుల్లో ప్రోటీన్ మరియు కొన్ని ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. పశుగ్రాస కొరత సమయంలో పరిమితంగా ఇతర పశుగ్రాసాలతో కలిపి ఉపయోగించవచ్చు.
    అయితే మునగ ఆకులు కూడా మొత్తం రేషన్‌కు ప్రత్యామ్నాయం కావు.
  14. హైడ్రోపోనిక్ పశుగ్రాసం
    తక్కువ స్థలంలో పశుగ్రాసం ఉత్పత్తి చేయడానికి హైడ్రోపోనిక్ ఫాడర్ గురించి ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది.
    సాధారణంగా:
    మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, ఇతర ధాన్య విత్తనాలను
    నీరు మరియు నియంత్రిత పరిస్థితుల్లో మొలకెత్తించి పశుగ్రాసంగా ఉపయోగిస్తారు.
    ప్రయోజనాలు:
    • తక్కువ స్థలం
    • తక్కువ సమయంలో ఉత్పత్తి
    • సంవత్సరం పొడవునా ఉత్పత్తి చేసే అవకాశం
    • నీటి వినియోగాన్ని నియంత్రించవచ్చు
    అయితే విత్తనం, షెడ్, నీరు, కార్మిక వ్యయం మరియు ఫంగస్ నియంత్రణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మాత్రమే రైతు ఆర్థికంగా అనుకూలమా కాదా నిర్ణయించాలి.
  15. పశుగ్రాస పంటల సాగు
    పశుగ్రాస కొరతను శాశ్వతంగా తగ్గించడానికి రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని పశుగ్రాస పంటలకు కేటాయించడం ఉత్తమ మార్గం. స్థానిక వాతావరణం, నీటి లభ్యత మరియు నేల స్వభావాన్ని బట్టి పంటను ఎంచుకోవాలి.
  16. మిశ్రమ పశుగ్రాస సాగు
    ఒకే పంటపై ఆధారపడకుండా గడ్డి + పప్పుజాతి పశుగ్రాసం కలిపి సాగు చేయడం మంచిది.
    ఉదాహరణకు:
    సూపర్ నేపియర్ + లెగ్యూమ్ ఫోడర్
    లేదా
    జొన్న + లెగ్యూమ్
    ఇలా చేస్తే పశువులకు శక్తి మరియు ప్రోటీన్ రెండింటినీ సమతుల్యంగా అందించే అవకాశం ఉంటుంది.
  17. పశువుల రేషన్‌ను శాస్త్రీయంగా నిర్వహించడం
    పశుగ్రాసం కొరత సమయంలో అందుబాటులో ఉన్న గడ్డిని విచక్షణ లేకుండా ఎక్కువగా ఇవ్వడం కంటే రేషన్ బ్యాలెన్సింగ్ చాలా ముఖ్యమైనది. ప్రత్యేకంగా అధిక పాలిచ్చే పశువులకు కేవలం గడ్డి ఆధారిత ఆహారం సరిపోకపోవచ్చు. అవసరానికి అనుగుణంగా సమతుల్య దాణా ఇవ్వాలి.
  18. మినరల్ మిక్చర్ ప్రాముఖ్యత
    పశుగ్రాసం తగ్గినప్పుడు పశువులకు లభించే మొత్తం పోషకాల్లో మాత్రమే కాకుండా ఖనిజాల లోపం కూడా ఏర్పడవచ్చు.
    అందువల్ల పశువు వయస్సు, శరీర స్థితి, పాల ఉత్పత్తి మరియు గర్భస్థితిని బట్టి సరైన మినరల్ మిక్చర్ ఇవ్వాలి.
  19. నీటి నిర్వహణ
    పశుగ్రాసం కొరత సమయంలో నీటి కొరత మరింత తీవ్రమైన సమస్య.
    పాలు ఉత్పత్తి చేసే పశువులకు తగినంత స్వచ్ఛమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.
    నీటి కొరత ఉంటే పశువు ఆహారం తీసుకోవడం మరియు పాల ఉత్పత్తి రెండూ తగ్గే అవకాశం ఉంది.
  20. పశుగ్రాసాన్ని వృథా కాకుండా చూడాలి
    పశువులకు గడ్డి పెట్టే విధానం కూడా చాలా ముఖ్యం.
    చాలా పొడవైన గడ్డిని నేలపై ఎక్కువగా వేసినప్పుడు పశువులు కొంత భాగాన్ని తొక్కి వృథా చేస్తాయి.
    అందువల్ల:
    చాఫ్ కట్టర్ → చిన్న ముక్కలు → సరైన ఫీడ్ ట్రఫ్ → నియంత్రిత పరిమాణం
    అనే విధానాన్ని పాటిస్తే పశుగ్రాస వృథాను తగ్గించవచ్చు.
  21. పశుగ్రాస బ్యాంకులు
    గ్రామ స్థాయిలో Fodder Banks ఏర్పాటు చేయడం కరువు పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
    వర్షాకాలంలో అధికంగా లభించే:
    • ఎండుగడ్డి, సైలేజ్, పశుగ్రాస విత్తనాలు, పంట అవశేషాలు
    సేకరించి నిల్వ చేసి, కరువు సమయంలో రైతులకు అందించవచ్చు.
    రైతు సంఘాలు, సహకార సంఘాలు, పశుసంవర్ధక శాఖ మరియు స్థానిక సంస్థలు కలిసి పనిచేస్తే ఇది మరింత సమర్థవంతంగా ఉంటుంది.
  22. పశుగ్రాస కొరత సమయంలో పశువుల సంఖ్యను నియంత్రించడం
    దీర్ఘకాలిక పశుగ్రాస కొరత ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న పశుగ్రాసాన్ని పశువుల సంఖ్యతో పోల్చుకోవాలి.
    తక్కువ ఉత్పాదకత కలిగిన, వృద్ధ, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న లేదా ఆర్థికంగా నిర్వహించడం కష్టమైన జంతువులను కొనసాగించడం రైతుకు భారంగా మారవచ్చు.
    అందువల్ల రైతు ఉత్పాదకత ఆధారంగా మంద నిర్వహణ చేయడం ద్వారా పశుగ్రాస అవసరాన్ని తగ్గించుకోవచ్చు.
  23. పశుగ్రాస కొరత సమయంలో తప్పించుకోవాల్సినవి
    ❌ బూజు పట్టిన గడ్డి
    ❌ కుళ్లిన సైలేజ్
    ❌ తెలియని విషపూరిత మొక్కలు
    ❌ అధికంగా యూరియా కలిగిన పదార్థాలు
    ❌ అకస్మాత్తుగా అధిక ధాన్యాలు
    ❌ ఒక్కసారిగా రేషన్‌లో భారీ మార్పులు
    ❌ కలుషితమైన వ్యవసాయ వ్యర్థాలు
    ❌ పురుగుమందు అవశేషాలు ఉన్న పంట అవశేషాలు
    వీటివల్ల జీర్ణకోశ సమస్యలు, విషపూరిత పరిస్థితులు, అజీర్ణం, ఆమ్లత్వం మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.

పశుగ్రాస కొరత అనేది కేవలం పచ్చిమేత కొరత సమస్య కాదు; అది పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు రైతు ఆదాయంపై ప్రభావం చూపే సమస్య. అందువల్ల పచ్చిమేత కోసం వర్షంపై మాత్రమే ఆధారపడకుండా ముందుగానే పశుగ్రాస ప్రణాళిక రూపొందించుకోవాలి.
“పచ్చిమేత ఉన్నప్పుడు నిల్వ – పంట అవశేషాల శాస్త్రీయ వినియోగం – సైలేజ్ – ఎండుగడ్డి – ప్రత్యామ్నాయ పశుగ్రాసాలు – సమతుల్య దాణా – సరిపడా నీరు” అనే ఏడు అంశాలను రైతులు పాటిస్తే పశుగ్రాస కొరత ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ప్రతి రైతు తన భూమిలో కొంత భాగాన్ని శాశ్వత పశుగ్రాసం కోసం కేటాయించడం, పంట అవశేషాలను కాల్చకుండా పశుగ్రాసంగా మార్చడం, పచ్చిమేతను సైలేజ్/హే రూపంలో నిల్వ చేయడం అలవాటు చేసుకోవాలి.

పశుగ్రాస భద్రత = పశుసంపద భద్రత = రైతు ఆదాయ భద్రత.

డా.జి.రాంబాబు, పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, నందిమండలం, వై.యస్.ఆర్. కడప జిల్లా. Ph:94945 88885

Read More

ఆవు దూడలలో అవయవ లోపాలు

వికృతాకారంతో, అవయవ లోపాలతో, అదనపు అవయవాలతో దూడలు పుట్టడం అప్పుడప్పుడు జరుగుతుంది.

ఇలాంటి దూడల్ని ఈనటం సాధారణంగా, చాలా కష్టంగానే వుంటుంది. గోవు ఈనలేక కష్టపడుతున్నప్పుడు, అనుభవం వున్న పశువైద్యుని సంప్రదించాలి. వారు నేర్పుతో, వీలును బట్టి, అవసరం మేరకు దూడను సరిచేసి లేదా అవయవాల్ని వేరుచేసి, తల్లి ప్రాణానికి ముప్పురాని విధంగా దూడను బయటకు తీస్తారు.

మలద్వారం లేకుండా దూడ జన్మించడం
మలరంధ్రం లేకుండా జన్మించిన దూడకు పశువైద్యనిపుణులు శస్త్రచికిత్స చేసి లోపాన్ని సరిచేస్తారు.
కాబట్టి, ఆలస్యం చేయకుండా నిపుణత గల పశువైద్యుని సంప్రదిస్తే శస్త్రచికిత్స చేసి, మలద్వారం ఏర్పరచి, విసర్జన జరిగేట్లుగా చేస్తారు.

హోమియో:
ఆపరేషన్ తరువాత హైపరికం 200 ఉదయం 10 మాత్రలు, స్టాఫీసగ్రియ 200, సాయంత్రం 10 మాత్రలు చొప్పున 20 రోజులు తినిపించాలి.
కుట్ల గాయాలు మానటానికి కాలెండుల 30 రోజుకు 5 మాత్రలు తినిపించాలి.

లేగదూడ బొడ్డు నుండి మూత్రవిసర్జన

లేగదూడల్లో ఆనువంశిక జన్యు లోపాల వల్ల బొడ్డు నుంచి మూత్రవిసర్జన జరుగుతుంది.

మత్రాశయం నుండి మూత్ర విసర్జన నాళం (URETHRA) ద్వారా సర్వసాధారణంగా జరుగుతుంది.

పిండోత్పత్తి క్రమంలో మూత్రాశయం నుండి బొడ్డుకు గల సంబంధిత విసర్జన నాళం మూసుకుపోవాలి.

కాని జన్యుపరమైన కారణాల వల్ల బొడ్డు దగ్గర వుండే మూత్రాశయ విసర్జన నాళం మసుకుపోదు.

ఈ కారణంగా బొడ్డు నుంచి మూత్రం వస్తుంది.

జన్యు లోప కారణంగా కలిగే పరిస్థితిని సరిదిద్దడానికి శస్త్ర చికిత్సే ఏకైక మార్గం.

కాబట్టి దూడ పుట్టినపుడు ఇలాంటి స్థితిని గమనించినట్లయితే, వెంటనే పశువైద్యనిపుణుని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించాలి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

నెలలు నిండక ముందే పుట్టిన ఆవు దూడ పోషణ

నెలలు తక్కువగా పుట్టిన దూడకు చలిగాలుల నుండి రక్షణ కల్పించాలి. బాగా వెచ్ౘ్గా వుండే విధంగా గడ్డి, గోనె సంచులతో పడక ఏర్పాటు చేయాలి. జున్నుపాలు మితంగా రోజుకు 4 పర్యాయాలు త్రాగించాలి.

హోమియో: 1. ముందుగా ఫైవ్ ఫాస్ 30, తదుపరి కార్బో వెజ్ 30 రోజుకు 10 మాత్రలు, ఓపియం 30 మడు రోజులకొక పర్యాయం చొప్పున 10 రోజుల తినిపించాలి. 2. ఆల్ఫాల్ఫా 30, జిన్సెంగ్ 30 కలిపిన మందు ఒక చెంచా, కొద్దిపాటి నీళ్ళలో కలిపి, రోజుకు 3 సార్లు చొప్పున 20 రోజులు త్రాగించాలి. అల్లోపతి : 1. విటామిక్స్ లిక్విడ్ (VITAMIX LIQUID) వంటి మందు రోజుకు ఒక పర్యాయం వారం రోజులు త్రాగించాలి. 2. టెట్‌వ్యాక్ (TETVAC) ఇంజక్షన్ 1 మి.లీ. కండకు (IMగా) ఒకసారి మాత్రమే చేయించాలి. 3. సూచించిన ఫెర్రిటాస్ (FERRITAS) ఇంజక్షన్ 2 మి.లీ. (IM) కండకు 3వ రోజున, అవసరాన్నిబట్టి పదవ రోజున చేయించాలి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

పుష్టికరమైన ఆవు దూడ పుట్టుక లక్ష్యం

ఆవు ఈనటానికి కనీసం 2 నెలల ముందే పాలు పిండటం మానెయ్యాలి.

తల్లి నుంచి పాలు త్రాగకుండా దూడను వేరుచేయాలి. అప్పటి నుండి చూడిగోవును శ్రద్ధగా పోషించాలి.

చూడి గోవుకు ఈనటానికి కనీసం 6 వారాల ముందు, పరాన్న జీవుల నిర్మూలనకు మందులు యివ్వాలి.

సాధారణంగా ఇచ్చే ఆహారం కంటే, చూడి గోవుకు ఎక్కువ పోషక విలువలు గల మేతలు మేపాలి.

చూడిగోవుకు తప్పనిసరిగా ఉప్పు, ఖనిజ లవణాలు ప్రతిరోజూ ఇవ్వటం మరిచిపోకూడదు.

చూడిగోవు పోషణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే పుష్టికరమైన, ఆరోగ్యవంతమైన, సంపదను పెంచగల దూడ పుట్టాలనే లక్ష్యం తప్పక నెరవేరుతుంది.

ఆవు దూడ పుట్టుక
ముందుగా – తల్లి గోవు ఉమ్మనీటి బుడగ వేసిన తరువాత,

  1. రెండు గంటలలోపు గనుక దూడను ఆవు ఈనలేక పోయినట్లయితే, వెంటనే పశువైద్యుని సహాయంతో దూడను తియ్యాలి. సహజంగా ముందు కాళ్ళపై తల పెట్టి దూడ బైటకు రావాలి. అలా కాకుండా దూడ తల అడ్డం తిరగటం, వెనుక కాళ్ళు ముందుకు వుండటం, లేదా పొట్ట క్రింది భాగంలోకి దూడ దిగిపోవటం మొదలైన సమస్యలు అప్పుడప్పుడు కలుగుతాయి.
  2. ఎక్కువ సమయం, దూడ లోపలే వున్నట్లయితే, ‘ఉమ్మనీరు’ త్రాగి ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తి, శ్వాస సరిగా ఆడక, దూడ చనిపోవచ్చు. అటువంటి సందర్భాలలో దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు శుభ్రంచేసి, వెనుక కాళ్లతో పట్టుకొని తలక్రిందులుగా, గుండ్రంగా త్రిప్పి, వెల్లుల్లిపాయను చిదిమి, ముద్దగా చేసి, దూడకు వాసన చూపించాలి. దూడ వెన్నుపై చేతితో తట్టాలి.
  3. ఆపద్ధర్మంగా, దూడ నోట్లోకి మన నోటితో గాలి ఊది, శ్వాస కలిగిస్తే (దూడకు) ప్రాణాపాయం తప్పించవచ్చు.
  4. దూడపై గల జిగురు పదార్థాన్ని తల్లి నాకేటట్లు చేయాలి. లేచి నిలబడే శక్తి దూడకు కలుగుతుంది.
  5. ఈనిన వెంటనే దారం బొడ్డుకు ముడివేసి, దిగువన బొడ్డును కోసి, పసుపు లేదా టింక్చర్ అయోడిన్ రాయాలి.
  6. ఈనిన వెంటనే దూడ గోళ్ళు (గిట్టలు, మెత్తని స్పాంజిలా వున్న భాగం) గిల్లి, తల్లికి ఆహారంగా పెట్టాలి. ఎందుకంటే అలా గిల్లి తినిపించిన గోళ్ళ ద్వారా తల్లికి తక్షణం కాల్షియం అందించినట్లవుతుంది.
  7. సుమారు 2 కేజీల ధాన్యం దంచి పెడితే, మాయ త్వరగా వేయడానికి ఉపయోగపడుతుంది.
  8. ఈనిన వెంటనే 2 కె.జి.ల ముల్లంగి దుంపలు, 2 గంటల తరువాత 1 కె.జి. బెండకాయలు తినిపించాలి.
  9. ఈనిన వెంటనే దూడకు తాగినన్ని జున్నుపాలు రోజుకు 3 లీటర్లకు మించకుండా కుడిపించాలి. ఈ జున్నుపాలలో వ్యాధి నిరోధక శక్తి వుంటుంది. జున్నుపాలు సత్వరమే కుడిపించడం మలంగా, గర్భాశయ కదలికల ద్వారా తల్లి తొందరగా మాయ వేస్తుంది.
  10. పుట్టిన వెంటనే అరగంటలోపుగా, మొదటిసారి రేణం (MUCONIUM) వేసిన విషయం నిర్ధారించుకోవాలి. పెయ్యదూడలు అరగంటలోపుగాను, గిత్తదూడలు కాస్త ఆలస్యంగాను లేచి నిలబడతాయి.
  11. ఈనిన వెంటనే ఆర్నికా 200 ముందు 20 మాత్రలు, 2 గంటల తరువాత హైపరికం 200 ఒక మోతాదు తినిపించాలి.
  12. టెట్‌వాక్ (TETVAC) ఇంజక్షను 1 మి.లీ. కండకు (IMగా) ఒకసారి మాత్రమే చేయించాలి.
  13. పుట్టిన దూడ బలహీనంగా వుంటే, విటమిన్ ఎ, డి3, ఇ (VITAMIN A, D3, E) ఇంజక్షన్ 1 మి.లీ. చొప్పున, రోజు విడిచి రోజు 5 పర్యాయాలు కండకు (IM)గా చేయించాలి.
  14. ఫెర్రిటాస్ (FERRITAS) ఇంజక్షన్ 2 మి.లీ. (IM) కండకు 3వ రోజున, అవసరాన్నిబట్టి పదవ రోజున చేయించాలి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఎల్‌నినో – పశుసంపదపై ప్రభావం

రైతులు, పశుపోషకులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
మన దేశ వ్యవసాయం, పశుపోషణ రెండూ వాతావరణ పరిస్థితులపై ఎంతో ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, నీటి లభ్యత వంటి అంశాలు పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులకు కారణమయ్యే ముఖ్యమైన సహజ పరిస్థితుల్లో ఎల్‌నినో (El Niño) ఒకటి.

ఎల్‌నినో ప్రభావం నేరుగా ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా కనిపించదు. అయితే ఇది ప్రపంచ వాతావరణ నమూనాల్లో మార్పులకు కారణమై, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షపాతంలో మార్పులు కలిగించవచ్చు. ఈ మార్పులు వ్యవసాయంతో పాటు పశుసంపదపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎల్‌నినో అంటే ఏమిటి?
ఎల్‌నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ పరిస్థితి.

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే ఈ మార్పులు వాతావరణంలోని గాలి ప్రసరణ, మేఘాల ఏర్పాట్లు మరియు వర్షపాత నమూనాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతంలో అసాధారణ మార్పులు సంభవించవచ్చు.

భారతదేశంలో కూడా ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షపాతంలో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఎల్‌నినో సంవత్సరంలో భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో కరువు లేదా తక్కువ వర్షపాతం తప్పనిసరిగా జరుగుతుందని చెప్పలేం. ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి.

ఎల్‌నినో వల్ల పశుసంపదకు కలిగే ప్రధాన సమస్యలు
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం లేదా వర్షపాతం తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడితే పశుపోషణలో అనేక సవాళ్లు ఎదురవుతాయి.

  1. అధిక ఉష్ణోగ్రతలు – Heat Stress
    పశువులకు అధిక ఉష్ణోగ్రతలు చాలా ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా పాడి పశువులు, అధిక పాల ఉత్పత్తి కలిగిన ఆవులు మరియు గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి.
    వాతావరణణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పశువులు తమ శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థాయిలో ఉంచుకోవడానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి.

Heat Stress వచ్చినప్పుడు:
• మేత తీసుకోవడం తగ్గుతుంది.
• నీరు ఎక్కువగా తాగుతాయి.
• శ్వాస వేగం పెరుగుతుంది.
• నోటి ద్వారా ఎక్కువగా శ్వాస తీసుకోవచ్చు.
• నీడను ఆశ్రయిస్తాయి.
• పాల దిగుబడి తగ్గవచ్చు.
• పునరుత్పత్తి సామర్థ్యం ప్రభావితమవుతుంది.
• గర్భధారణ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.
అందువల్ల వేసవిలో పశువులకు నీడ, గాలి ప్రసరణ మరియు తగినంత నీరు అందించడం అత్యంత ముఖ్యమైన విషయం.

  1. నీటి కొరత
    వర్షపాతం తగ్గడం వల్ల చెరువులు, బోర్లు, బావులు మరియు ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంటుంది.

పశువులకు నీరు కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాదు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియ, పాల ఉత్పత్తి మరియు శరీరంలోని అనేక జీవక్రియలకు నీరు అవసరం.
వేడి వాతావరణంలో నీటి అవసరం మరింత పెరుగుతుంది.

అందువల్ల రైతులు:
“నీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇవ్వడం” కాకుండా
“ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం” అనే పద్ధతిని పాటించాలి.
నీటి తొట్లను ప్రతిరోజూ శుభ్రం చేయాలి. నీరు మురికిగా ఉండకుండా చూడాలి.

  1. పశుగ్రాస కొరత
    వర్షపాతం తగ్గితే పచ్చిమేత ఉత్పత్తి తగ్గుతుంది. పంటల దిగుబడి తగ్గడం వల్ల పంట అవశేషాల లభ్యత కూడా ప్రభావితమవుతుంది.
    దీంతో:
    పచ్చిమేత తగ్గుతుంది → మేత ధర పెరుగుతుంది → పశువుల పోషణ ఖర్చు పెరుగుతుంది.
    పచ్చిమేత కొరత ఏర్పడినప్పుడు పశువులకు కేవలం పొడి మేత మాత్రమే ఇవ్వడం వల్ల సమతుల్య పోషణ అందకపోవచ్చు.
    అందువల్ల రైతులు ముందుగానే:
    • ఎండుగడ్డి
    • పంట అవశేషాలు
    • సైలేజ్
    • హే
    • పచ్చిమేత విత్తనాలు
    • అవసరమైన concentrate feed
    వంటి వాటిని ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాలి.
  2. పాల ఉత్పత్తిపై ప్రభావం
    Heat Stress వల్ల పశువులు సాధారణంగా మేత తీసుకోవడం తగ్గిస్తాయి. మేత తీసుకోవడం తగ్గితే శరీరానికి అందే పోషకాలు తగ్గుతాయి.
    దీని ప్రభావం పాల ఉత్పత్తిపై పడవచ్చు.
    ప్రత్యేకంగా అధిక పాలిచ్చే పశువుల్లో:
    వేడి ఒత్తిడి → Feed intake తగ్గడం → శక్తి లోపం → పాల ఉత్పత్తి తగ్గే అవకాశం
    అలాగే పాలలో కొవ్వు, ప్రోటీన్ వంటి నాణ్యతా అంశాలు కూడా పశువు ఆరోగ్యం మరియు ఆహారంపై ఆధారపడి మారవచ్చు.
  3. పశువుల పునరుత్పత్తిపై ప్రభావం
    అధిక ఉష్ణోగ్రతలు పశువుల reproductive performance ను కూడా ప్రభావితం చేయవచ్చు.
    వేడి కాలంలో:
    • Heat signs స్పష్టంగా కనిపించకపోవచ్చు.
    • Estrus duration తగ్గవచ్చు.
    • Conception rate తగ్గవచ్చు.
    • Early embryonic loss ప్రమాదం పెరగవచ్చు.
    అందువల్ల రైతులు వేసవిలో ఈస్ట్రస్ గుర్తింపు, సరైన సమయానికి కృత్రిమ గర్భధారణ మరియు గర్భ నిర్ధారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
  4. గొర్రెలు మరియు మేకలపై ప్రభావం
    ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, మేత కొరత మరియు నీటి కొరత ఏర్పడితే గొర్రెలు, మేకలు కూడా ప్రభావితమవుతాయి.
    ముఖ్యంగా చిన్న వయస్సు పిల్లలు, గర్భిణీ జంతువులు మరియు బలహీనమైన జంతువులు ఎక్కువ జాగ్రత్త అవసరమైనవి.
    వీటిలో:
    • మేత తీసుకోవడం తగ్గడం
    • బరువు పెరుగుదల తగ్గడం
    • డీహైడ్రేషన్
    • బలహీనత
    • ఉత్పాదకత తగ్గడం
    వంటి సమస్యలు రావచ్చు.
    కాబట్టి గొర్రెలు, మేకలకు ఉదయం మరియు సాయంత్రం మేత అందించడం, మధ్యాహ్నం వేడి సమయంలో నీడ కల్పించడం మంచిది.
  5. కోళ్లపై ప్రభావం
    అధిక ఉష్ణోగ్రతలు కోళ్లలో కూడా Heat Stress కు కారణమవుతాయి.
    Heat Stress సమయంలో:
    • Feed intake తగ్గుతుంది.
    • Water intake పెరుగుతుంది.
    • Egg production తగ్గవచ్చు.
    • Egg shell quality ప్రభావితమవుతుంది.
    • Mortality పెరిగే ప్రమాదం ఉంటుంది.
    కాబట్టి poultry sheds లో ventilation చాలా ముఖ్యమైనది.
    షెడ్‌లో గాలి సరిగా ప్రసరించేలా చూడాలి. తాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
  6. వ్యాధులపై ప్రభావం
    వాతావరణ మార్పులు పశువుల ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపవచ్చు. అధిక వేడి, పోషక లోపాలు, నీటి కొరత వంటి పరిస్థితులు పశువులపై stress పెంచవచ్చు.
    అందువల్ల రైతులు సాధారణ vaccination schedule ను పాటించాలి.
    అలాగే:
    టీకాలు
    అవసరమైనప్పుడు డీవార్మింగ్
    ఈగలు, పేలు, ఇతర ectoparasites నియంత్రణ
    షెడ్ పరిశుభ్రత
    అనారోగ్య పశువులను ముందుగా గుర్తించడం
    వంటి చర్యలు చేపట్టాలి.
  7. పశువులకు నీడ కల్పించడం
    వేసవి పరిస్థితుల్లో పశువులకు మంచి నీడ చాలా అవసరం.
    షెడ్:
    • గాలి ప్రసరణకు అనుకూలంగా ఉండాలి.
    • పైకప్పు అధిక వేడిని లోపలికి రానివ్వకుండా ఉండాలి.
    • పశువులకు తగినంత స్థలం ఉండాలి.
    • నేల పొడిగా, పరిశుభ్రంగా ఉండాలి.
    సాధ్యమైన చోట్ల చెట్లను పెంచడం ద్వారా సహజ నీడను కూడా కల్పించవచ్చు.
  8. పశువులను చల్లబరచడం
    అధిక వేడి సమయంలో పశువులను చల్లబరచడానికి నీటితో శరీరాన్ని తడపడం లేదా సరైన పద్ధతిలో cooling చేయడం ఉపయోగపడుతుంది.
    అయితే షెడ్‌లో తేమ ఎక్కువగా పేరుకుపోకుండా గాలి ప్రసరణ కూడా ఉండాలి.
    నీరు + నీడ + గాలి ప్రసరణ + సరైన cooling అనేవి Heat Stress నియంత్రణలో ముఖ్యమైన అంశాలు.

రైతులు ముందుగానే చేయాల్సిన ప్రణాళిక
ఎల్‌నినో లేదా ఇతర వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి రైతులు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి.

రైతుల కోసం ముఖ్యమైన సూచనలు
నీటి ప్రణాళిక:
వేసవి ప్రారంభానికి ముందే పశువుల తాగునీటి వనరులను సిద్ధం చేసుకోవాలి.
మేత ప్రణాళిక:
అవసరమైన పచ్చిమేత, ఎండుమేత మరియు సైలేజ్‌ను ముందుగానే నిల్వ చేసుకోవాలి.
షెడ్ నిర్వహణ:
గాలి ప్రసరణ మరియు నీడ ఉండేలా షెడ్‌ను సిద్ధం చేసుకోవాలి.
ఆరోగ్య నిర్వహణ:
టీకాలు, పరాన్నజీవుల నియంత్రణ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు కొనసాగించాలి.

పాలిచ్చే పశువులపై ప్రత్యేక శ్రద్ధ:
అధిక పాలిచ్చే ఆవులు, గేదెలకు నీరు, మేత మరియు cooling పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
గర్భిణీ పశువులు:
గర్భిణీ పశువులకు వేడి ఒత్తిడి రాకుండా ప్రత్యేక సంరక్షణ ఇవ్వాలి.
చిన్న పిల్లలు:
దూడలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలను అధిక వేడి మరియు డీహైడ్రేషన్ నుంచి రక్షించాలి.

మొత్తం మీద, ఎల్‌నినో అనేది సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులతో ప్రారంభమయ్యే ఒక సహజ వాతావరణ పరిస్థితి. దీని ప్రభావం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు మరియు నీటి లేదా మేత లభ్యతలో సమస్యలు ఏర్పడితే పశుసంపదపై వాటి ప్రభావం గణనీయంగా ఉండవచ్చు.
ముందుగానే ప్రణాళిక చేసుకుంటే వాతావరణ మార్పుల వల్ల పశువులపై వచ్చే ఒత్తిడిని చాలా వరకు తగ్గించవచ్చు.
“వాతావరణాన్ని మనం నియంత్రించలేం…
కానీ వాతావరణ మార్పులకు పశుసంపదను సిద్ధం చేయగలం.”

రైతు ముందుచూపుతో నీరు, మేత, షెడ్ మరియు పశువుల ఆరోగ్యాన్ని నిర్వహిస్తే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పశుసంపదను ఆరోగ్యంగా, ఉత్పాదకంగా కాపాడుకోవచ్చు.

  • డా. జి. రాంబాబు, పశు వైద్యాధికారి, కడప జిల్లా, ఫోన్: 9618499184, 9494588885
Read More