1. భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది నేల స్వరూపం కొంత వరకు మారుతుంది.
2. నేలలో చౌడు శాతాన్ని తగ్గింస్తుంది నేలకు తేమ నిలుపుకునే సామర్ధ్యాన్ని పెంచుతుంది.
3. భూమిలో వానపాముల వ్యాప్తికి తోడ్పడుతుంది అలాగే హానికర సూక్ష్మజీవులను అరికడుతుంది
4. మొక్కలలో వచ్చే కుళ్ళు తెగుళ్లను అరికడుతుంది.
5. ప్రధానంగా వేరుపురుగు వేరు కాయలను కలుగచేసే నెమటోడ్స్ అంటే నులి పురుగులను అదుపులో ఉంచుతుంది.

6. ఇది మొక్కలకు నిదానంగా అందటం వలన పోషకాలు సమానంగా స్థిరంగా మొక్కలకు అందుతాయి
7. పోషకాలు నిదానంగా అందటం వలన మొక్కలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది
8. వేపపిండి స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాలు కలిగి ఉంటుంది.
9. అన్ని రకాల ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు
10. ఒకసారి భూమిలో వేశాక పంట చివరి వరకు మొక్కలకు అందుతుంది
11. ఇందులో ఎలాంటి హానికరమైన క్లోరైడ్స్ ఉండవు
12. పోషకాలు స్థిరంగా అందటం వలన పంట దిగుబడి పెరుగుతుంది
కల్తీ వేపపిండి, వేపనూనెలబారిన పడకండి…
వేపపిండి వాడాలి అనుకున్న రైతులు, ఇది వేపపండ్లు రాలే సమయం కాబట్టి, వారుకాని, ఎవరినైనా నియమించికాని, వేపకాయలు సేకరించి, మధ్యవర్తులకు, మిల్లువాళ్లకు అమ్మేవారిదగ్గర సేకరించి, ఎండబెట్టి, రోడ్డుమీద పోసి ట్రాక్టర్‌తో త్రొక్కించి వాడుకుంటే, అంతకన్నా మించిన, ఉత్తమం, వేరొకటిలేదు.
మనకు, మార్కెట్లో దొరికే వేపపిండి, ఆకర్షణీయమైన బస్తాలలో నింపి, వివిధరకాల ఆకర్షణీయ పథకాలతో అమ్ముతున్న వేపపిండి, ఎంత కల్తీదో ఆదేముడికి కూడా తెలియదు.
నాణ్యతా ప్రమాణాలు కూడా నియమించలేదు, నియంత్రించటమూ లేదు. కల్తీలేని, వేపపిండి దొరికితే మీ అదృష్టం.

వేప నూనె వాడేవారుకూడా, ఈ ఎండబెట్టిన గింజలను నానబెట్టి, వెట్ గ్రైండర్లో మెత్తగా రుబ్బి, నీరుకలిపి, పిండి క్రింద తేరుకున్న తరువాత, వడకట్టిన ద్రావణాన్ని పైరుపై స్ప్రే చేసుకుంటే, మిల్లునుంచి తెచ్చిన వేపనూనె లేక మార్కెట్లో దొరికే నమ్మకమైన కంపెనీలు అమ్మే రకరకాల వేపనూనె ప్రొడక్ట్స్ కన్నా ఎంతో ఉపయోగమని పరిశోధనా ఫలితాలుకూడా చెబుతున్నాయి.

