ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వనరులవారీగా నీటి వినియోగదారుల సంఘాలకు త్వరలోనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్నికలు జరగకపోవడంతో పూడికతీత పనులు, మరమ్మత్తులు, కాలువ గట్ల బలోపేతం వంటి క్షేత్రస్థాయి ముఖ్యమైన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే నీటి తీరువా వసూలు కూడా ఆగిపోయింది. ఇప్పుడు సాగునీటి సంఘాలకు తిరిగి ఊపిరిలూదడం ద్వారా నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.

28 Aug, 2024
