2014 నుండి 2019 వ సంవత్సరం వరకు ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు మరియు వివిధ రకాల యంత్ర పరికరాలను రైతులకు రాయితీపై అందించడం వలన యాంత్రీకరణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మరలా తిరిగి రాయితీలను పునరుద్ధరించి రైతులను ప్రోత్సహించటానికి గాను వ్యక్తిగత రాయితీపై యంత్ర పరికరాలను అందివ్వాలని వ్యవసాయశాఖా మంత్రి అచ్చెం నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చే పరికరాల్లో కృత్రిమ మేథనూ జోడించాల్సి ఉంది. ఇప్పటికే ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వరి రైతులకు రాయితీపై టార్పాలిన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

14 Aug, 2024
