ఇది 5 మీ. వరకు ఎగప్రాకే బహువార్షికపు తీగ. వేర్లు లావుగా కండ కలిగి దుంపలాగా ఊరతాయి. దీనిని దుంపల ద్వారా మరియు బల్బిల్స్ ద్వారా వ్యాప్తిచేయవచ్చు. దీని దుంపలు వాణిజ్యపరంగా మరియు ఔషధంగా ఉపయోగిస్తారు.*సాధారణ నామం :* ఏసియాటిక్ యామ్, గ్రేటర్ యామ్
*శాస్త్రీయ నామం :* డయోస్కోరియా అలాట
*కుటుంబం :* డయోస్కోరియేసి
*ఉపయోగాలు : ఔషధరంగంలో …** దీని దుంపలలో అల్బుమినాయిడ్లు (7.96-15.68%), కొవ్వు (0.59-1.26%), బూడిద (4.23-7.28%), పీచు (2.19-6.12%), కార్బోహైడ్రేట్లు (71.67-85.027%), భాస్వరము (0.44-0.98%), పిండిపదార్థములు (21%) లభిస్తాయి. ఆకులలో డిఫ్రక్టోజ్, డిగ్లూకోజ్ మరియు పాలియోల్స్ ఉంటాయి.
* దీనిని దుంప కూరగా ఉపయోగిస్తారు. క్రిమిసంహారి, కుష్ఠు, మూలశంక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ దుంపలలో శరీరం పెరుగుదలకు దోహదపడే హార్మోనులుంటాయి.
*వ్యవసాయరంగంలో* * పెద్ద పెండలం ఇథనాల్ ద్రావణం స్ల్కీరోషియం రాల్ఫ్సి, బోట్రియోడిప్లోడియా థియోబ్రోమె, ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై అధిక యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. ఇది అన్ని శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది (ఒకిగ్బొ, అతని అనుచరులు, 2015).
* పెద్దపెండలం, పులిదుంప ద్రావణాలను మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్లో పులియబెట్టిన ద్రావణాలు గోల్డెన్ నత్తలను సమర్థవంతంగా నివారించాయి (పొన్సియానో, 2015).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

