కూరగాయ పంటల్లో సత్ఫలితాలకు హెర్బల్ టీ

కావలసిన పదార్థాలు :
పిచ్చి తులసి లేదా తులసి, పాలకొడిస, తుత్తురు బెండ, పొగాకు, బోగన్ విల్లియా (కాగితం పూలు), వేప, టేకు ఆకులు, కలబంద, బొప్పాయి, ఆవు మూత్రం, పశువుల పేడ, బెల్లం

తయారు చేసే విధానం :

  • పైన తెలిపిన ఆకులను 5 కిలోలు తీసుకొని ముద్దగా చేయాలి.
  • ఈ మిశ్రమానికి 5 కిలోల పశువుల పేడను, 100 గ్రాముల బెల్లం పొడిని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో తీసుకొని ప్రతిరోజూ ఒక కర్రతో 7 రోజుల వరకూ కలుపుతూ ఉండాలి.
  • 7 రోజుల తర్వాత “హెర్బల్ టీ” తయారవుతుంది. ఈ మిశ్రమానికి 5 లీటర్ల నీరు కలిపి పలుచని గుడ్డతో వడపోయాలి.
  • ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరా పొలంలో పంటపై పిచికారి చేయాలి.

ఎలా పనిచేస్తుంది? : పైన తెలిపిన వివిధ రకాల ఆకులలో ఎన్నో రకాల “ఆల్కలాయిడ్లు” ఉండుట వలన పురుగుల నియంత్రణలోనే కాకుండా కొన్ని రకాల తెగుళ్ళను అరికట్టడంలోనూ ఉపయోగపడుతుంది.

ఉపయోగాలు : ఇది చాలా శక్తివంతమైన ద్రావణం. ఈ ద్రావణం పంటలలో వచ్చే కీటక నియంత్రణలోనే కాకుండా వరిలో వచ్చే ఆకుమచ్చ తెగులు నివారణలో కూడా బాగా పని చేసినట్లు రైతుల అనుభవం. ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోనూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కూరగాయల పంటలలో ఉపయోగించి సత్ఫలితాలు పొందవచ్చు.

Read More

“నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యం – ఆవశ్యకత, అవకాశాలు”

నేల ప్రకృతిలోని ప్రముఖ సహజమైన పునరుత్పాదక లేని వనరు (Non-renewable resources). రాళ్ళు, ఖనిజాలు విచ్ఛిత్తి చెందటంద్వారా ఒక అంగుళం నేల తయారవడానికి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. ఆహారోత్పత్తికి, గ్రామీణ ప్రజల ఉపాధికి, పర్యావరణ సమతుల్యానికి ఆరోగ్యమైన నేల అత్యావశ్యకం. మనదేశంలో, రాష్ట్రంలో వివిధ రకాల నేలలున్నాయి, ఆయానేలల గుణాలు, లక్షణాలు నిర్ధిష్టమైనవి మరియు వాటిలో ఉత్పాదకత భిన్నగా ఉంటుంది.

వ్యవసాయ రంగం స్థిరంగా, లాభసాటిగా సాగాలంటే భూమి ఆరోగ్యం చాలా ముఖ్యం. రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడటం, నేల కోతను ప్రేరేపించే సాగుపద్దతుల వల్ల నేల క్షీణత జరుగుతుంది. ఇటీవలి కాలంలోని కొన్ని అధ్యయనాల నివేదికల ప్రకారం మనదేశంలోని సాగుకు యోగ్యమైన భూమిలో 50 శాతం వరకు క్షీణత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో, నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యం (Site-Specific Nutrient Management – SSNM) చేపట్టడం అత్యంత ఆవశ్యకమైన పద్ధతిగా శాస్త్రవేత్తలు పరిగణించారు. పంటకు ఏ సమయంలో, ఎంత మొత్తంలో, ఏ రకమైన పోషకాలు కావాలో నేల స్వభావాన్ని బట్టి అందించడమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.

నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యం చేపడితే నేల ఆరోగ్యం మరియు సారం సంరక్షింపబడి సుస్థిరమైన వ్యవసాయ దిగుబడులు సాధించవచ్చు.

  1. నేల రకాలు – వాటి సహజ గుణాలు
    మన రాష్ట్రంలో వివిధ రకాల నేలలు ఉన్నాయి. ఒక్కో నేలకు ఒక్కో రకమైన భౌతిక, రసాయన లక్షణాలు కల్గి పోషక సామర్థ్యంలో వ్యత్యాసం ఉంటుంది:

నల్ల రేగడి నేలలు: ఇవి నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొంచెం క్షార లక్షణాన్ని కలిగివుంటాయి. వీటిలో పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉన్నప్పటికీ, నత్రజని (నెట్రోజన్), భాస్వరం (ఫాస్ఫరస్, జంకు, ఇనుము ధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఎర్ర నేలలు: ఇవి త్వరగా నీటిని పీల్చుకుంటాయి కానీ నిల్వ ఉంచలేవు. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సేంద్రియకర్బనం శాతం చాలా తక్కువగా ఉంటుంది.
ఇసుక / చల్కా నేలలు: పోషకాలను పట్టి ఉంచే గుణం వీటికి చాలా తక్కువ. సూక్ష్మపోషకాల లోపం (జింక్, ఇనుము) వీటిలో అధికం.

చౌడు నేలలు: తెల్ల చౌడు నేలల్లో లవణాల శాతం ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు పోషకాలను గ్రహించలేవు. వీటికి ప్రత్యేక యాజమాన్యం అవసరం. నల్లచౌడు నేలల్లో ఉదజని సూచి 8.5 కంటే అధికంగా ఉండి మార్పిడిచెందే సోడియం అధికంగా 15 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. ఈ నేలల భౌతిక లక్షణాలు మొక్కల పెరుగుదలకు అవరోధం కల్గిస్తాయి. నత్రజని, భాస్వరం, జం కు, ఇనుము, బోరాన్ వంటి పోషకాల లోపాలు అధికంగా ఉంటాయి.

ఒండ్రు నేలలు : ఈ నేలలు నదీ తీరాలలోనూ, నది సముద్రంలో కలిసే ప్రాంతంలోనూ విస్తరించి ఉంటాయి. ఇవి స్వభావ రీత్యా సారవంతమైన నేలలు. నేల భౌతిక లక్షణాలు కూడా సాగుకు అనుకూలం. ఈ నేలల్లో అధిక సాంద్ర పంటల సాగువల్ల సూక్ష్మ ధాతువులతో పాటు నత్రజని, భాస్వరం లోపాలు కనిపిస్తున్నాయి.

  1. నిర్ధిష్ట పోషక యాజమాన్యం అంటే ఏమిటి?
    సాధారణంగా రైతులు అందరికీ వర్తించే ఒకే రకమైన ఎరువుల సిఫార్సులను (Blanket Recommendations) పాటిస్తారు. కానీ, ఒకే పొలంలో ఒక వైపు ఉన్న నేల గుణానికి, మరోవైపు ఉన్న నేల గుణానికి తేడా ఉండవచ్చు. భూసార పరీక్షల ఆధారంగా, ఆయా నేలలో ఉన్న పోషకాల లభ్యతను బట్టి, పండించే పంట దిగుబడి లక్ష్యాన్ని బట్టి ఖచ్చితమైన మోతాదులో పోషకాలను అందించడాన్నే “నిర్దిష్టమైన పోషక యాజమాన్యం” అంటారు. ఇది ‘సరైన ఎరువు మోతాదు, సరైన సమయంలో ఎరువు వెయ్యడం, మరియు ఎరువును సరైన పద్ధతిలో వెయ్యడం’ (4Rs) అనే సూత్రంపై పనిచేస్తుంది.
  2. పోషక యాజమాన్యం
    భూసార పరీక్షలు (Soil Testing): ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పొలంలో మట్టి నమూనాలను సేకరించి పరీక్షించాలి. దీనివల్ల నేల పి.హెచ్ (pH), విద్యుత్ వాహకత (EC), సేంద్రీయ కర్బనం మరియు ప్రధాన, సూక్ష్మ పోషకాల లభ్యత తెలుస్తుంది.

సేంద్రీయ ఎరువుల వాడకం: పశువుల ఎరువు, కంపోస్ట్ లేదా పచ్చిరొట్ట ఎరువులు (జీలుగ, జనుము) భూమిలో వేసి కలయదున్నాలి. ఇది నేల భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది. సిఫారసు చేసిన పోషకాలను అందించాలి.

ఆధునిక పరికరాల వాడకం: లీఫ్ కలర్ చార్ట్ (Leaf Color Chart – LCC), క్లోరోఫిల్ మీటర్ల ద్వారా పంట ఆకుల రంగును బట్టి లోపాన్ని గుర్తించి, అవసరమైన మేరకే పోషకాలను వాడవచ్చు.

  1. నేల గుణాన్ని బట్టి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు

ఆమ్ల నేలలు (Acid Soils): పి.హెచ్ 6.5 కంటే తక్కువ ఉన్న నేలల్లో సున్నం ఎరువు వాడి నేల స్వభావాన్ని మార్చాలి. భూసార పరీక్ష చేయిస్తే ఎకరాకు ఎంత సున్నం కావాలో పరీక్షించి చెప్తారు. కట్టెజనుము వంటి పచ్చిరొట్ట పైరు సాగుచేసి పైరుపూతదశలో నేలలో కలియదున్నాలి.

క్షార/చౌడు నేలలు (Saline/Alkaline Soils): పి.హెచ్ 8.5 కంటే ఎక్కువ ఉన్న చౌడు నేలల్లో జిప్సం వేసి నెలలో కలియదున్ని బాగు చేయాలి. భూసార పరీక్ష చేయిస్తే ఎకరాకు ఎంత జిప్సం ఎరువు కావాలో పరీక్షించి చెప్తారు. మురుగునీటి నిల్వలను బయటకు పంపే డ్రైనేజీ వసతి కల్పించాలి. ధయించా వంటి పచ్చిరొట్ట పైరు సాగుచేసి పైరుపూతదశలో నేలలో కలియదున్నాలి.

తేలికపాటి నేలలు: ఇసుక శాతం ఎక్కువ ఉన్న నేలల్లో ఎరువులు కడిగిపోతాయి (Leaching). కాబట్టి ఎరువులను ఎక్కువ విడతలుగా, తక్కువ మోతాదులో ఇవ్వాలి. వేసవిలో ఎకరాకు 20 టన్నుల చొప్పున చెరువు లోపలి మట్టిని తోలాలి. సేంద్రీయ ఎరువులని అధికంగా వాడాలి.

  1. ఈ నిర్ధిష్ట పోషక యాజమాన్యం పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు
    నేల గుణగణాలు ముందే తెలుస్తాయి: భూసార పరీక్ష వల్ల నేల గుణగణాలు ముందే తెలుస్తాయి కాబట్టి అవసరమైన యాజమాన్య చర్యలు తీసుకొనే వీలుంటుంది.

పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది: అనవసరమైన ఎరువుల వాడకం తగ్గి, రైతుకు డబ్బు ఆదా అవుతుంది.

నాణ్యమైన, అధిక దిగుబడి: మొక్కకు కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందడం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి ఆశించిన దిగుబడి వస్తుంది.

*నేల ఆరోగ్యం రక్షణ: రసాయనాల అవశేషాలు పేరుకుపోకుండా నేల జీవశక్తి, మిత్ర పురుగులు (వానపాములు వంటివి) సంరక్షించబడతాయి.

పర్యావరణ సమతుల్యత: భూగర్భ జలాలు కలుషితం కాకుండా, పర్యావరణానికి మేలు జరుగుతుంది.
నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యాన్ని చేపట్టడం అనేది ఆధునిక వ్యవసాయంలో ఒక విప్లవాత్మక అడుగు. “ఆరోగ్యకరమైన నేల – ఆరోగ్యకరమైన పంట – సంపన్నమైన రైతు” అనే నినాదంతో ప్రతి రైతు తమ పొలంలో భూసార పరీక్షలు చేయించి, లభించిన నివేదికల ఆధారంగానే పోషకాలను అందించాలి. ఇది వసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా, రాబోయే తరాలకు సారవంతమైన భూములను అందించడానికి దోహదపడుతుంది.

అనీల్ కుమార్ కీర్తి, పి. గురుమూర్తి, టి. మౌనిక
వ్యవసాయ కళాశాల బాపట్ల మరియు నైరా
Ph: 9491567949

Read More

ఔషధ మొక్క… జీలకర్ర / జీరా

జీలకర్ర క్యుమినం సైమినం మొక్క యొక్క ఎండబెట్టిన గింజలు. ఈ మొక్క 30-35 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. జీలకర్ర ఒక పుష్పించే మొక్క. ఇది ఒక వార్షిక హెర్బల్ మొక్క. కాండం నుండి సన్నని కొమ్మలు వస్తాయి. కాండం 20-30 సెం.మీ. పొడవు, 3-5 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. ప్రతి కొమ్మ 2-3 ఉపకొమ్మలు కలిగి ఉంటుంది. అన్ని కొమ్మలు ఒకే ఎత్తుకు పెరుగుతాయి కనుక మొక్క ఒకే విధమైన క్యానపి కలిగి ఉంటుంది. కాండం బూడిద వర్ణం లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకులు 5-10 సెం.మీ. పొడవుండి దారం వంటి చిన్న ఆకులు కలిగి ఉంటుంది. పూలు చిన్నవిగా, తెలుపు లేదా పింకు రంగులో ఉంటాయి. కాయ 4-5 మి.మీ. పొడవుండి రెండు మీసోకార్ప్‌లను కలిగి ఉంటుంది. ప్రతి మీసోకార్ప్‌లో ఒక గింజ ఉంటుంది. జీలకర్ర గింజలకు 8 నిలువాటి బోదెలుంటాయి. ఇవి పసుపుగోధుమ రంగులో ఉంటాయి.

సాధారణ నామం : క్యూమిన్ శాస్త్రీయ నామం : క్యూమినం సైమినం కుటుంబం: ఎపియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • జీలకన్రు పురాతన కాలం నుండి ఆహారం రుచి పెంచడానికి, ఔషధ ప్రయోజనాలకు, అనేక సంప్రదాయ వంటిళ్లలో ఉపయోగిస్తున్నారు. దీనికి జీర్ణశక్తిని పెంచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, మొలలు, ఆస్త్మా, బ్రోంకైటిస్ చికిత్స వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్గించే గుణం ఉంది.
  • దీనిని భోజనానికి ముందు ఆకలి పెరగడానికి (అపెటైజర్‌గా) ఉపయోగిస్తారు.
  • మజ్జిగ, కొన్ని నూనె చుక్కల మిశ్రమాన్ని జీలకర్రతో కలిపి వేయిస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. దీనిని సాధారణంగా సుగంధ ద్రవ్యాలు, నూనె అధికంగా ఉపయోగించిన ఆహారం తిన్న తర్వాత తీసుకుంటారు.
  • భోజనానికి ముందు వేడి నీటిలో 2 చెంచాల జీలకర్రను కలిపి త్రాగితే తీవ్ర అజీర్తి నయమవుతుంది.
  • 2 గ్రా. జీలకర్రను కొతిమీర రసం, యాలకులు, ఉప్పుతో కలిపి తీసుకుంటే ఎసిడిటి, హైపర్ ఎసిడిటి, కడుపులో మంటలు, గ్యాస్ సమస్యలకు మంచి ఫలితాలు లభిస్తాయి. భోజనానికి ముందు కొంచెం జీలకర్ర నమిలితే నోటి దుర్వాసనకి అద్భుత ఫలితాలనిస్తుంది.
  • మలబద్ధకం, కడుపులో నులిపురుగులు, జ్వరంతో బాధపడేవారు వేడి నీటిలో ఒక చెంచా జీలకర్ర కలిపి రోజుకి 3-4 సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
  • పురుగులు కాటు వేసిన చోట జీలకర్ర, నెయ్యి పేస్టు పూస్తే బాధ తగ్గుతుంది. దీనిని అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. నోటి దుర్వాసన పోవడానికి జీలకర్ర రసం నోటిలో పోసుకొని పుక్కిలించాలి. బాలింతరాళ్ళకు జీలకర్ర ఇస్తే గర్భాశయం శుభ్రపరచబడి, పాల ఉత్పత్తి పెరుగుతుంది.

వ్యవసాయరంగంలో

  • జీలకర్ర ఎసెన్షియల్ ఆయిల్ (1.25%) పేనుబంక, రైపిసెఫాలస్ మైక్రోప్లస్‌పై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (మార్టినెజ్‌వెలాజ్‌క్వెజ్, అతని అనుచరులు, 2011).
  • జీలకర్ర ఎసెన్షియల్ ఆయిల్ పేనుబంక నాశక చర్యను ప్రదర్శించింది (టుని అండ్ సాహిన్‌కయ, 1998).
  • ఎండిన జీలకర్ర గింజల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ నీటి ద్రావణం (6.25-1000 పిపియం) ఈడెస్ ఈజిప్టి దోమ 2వ దశ లార్వాలను అతి సమర్ధవంతంగా నివారించింది (పురోహిత్, అతని అనుచరులు, 1983).
  • జీలకర్రను జీవ పురుగు మందు తయారీలో ఉపయోగిస్తారు. ఈ జీవ పురుగు మందుని పాటింగ్ మట్టితో కలిపి, పంటపై చల్లి పురుగులను 72 గంటలలో చంపవచ్చు.

జీవ పురుగు మందు తయారీకి కావలసిన పదార్థాలు :
పాటింగ్ మట్టిలో కలిపే ఫార్ములేషన్
సుగంధ ద్రవ్యం శాతం సుగంధ ద్రవ్యం శాతం
నల్ల మిరియాలు 25.75 జీలకర్ర 15.45
దాల్చిన చెక్క 11.05 వెల్లుల్లి 12.03
ధనియాలు 12.80 పసుపు 7.44
సోపు 2.37 మెంతి 3.65
లవంగం 2.58 మిరప 1.38
అల్లం 3.36 కరివేపాకు 1.60
ఆవాలు 0.37 సోడియం క్లోరైడ్ 0.17

ఈ జీవ పురుగుమందుని పాటింగ్ మట్టిలో కలపాలి. ఇది 72 గంటలలో పురుగులను చంపుతుంది.
పంటపై చల్లే పురుగు మందు ఫార్ములేషన్

సుగంధ ద్రవ్యం	శాతం	సుగంధ ద్రవ్యం	శాతం
నల్లమిరియాలు	20-30	జీలకర్ర	10-20
దాల్ౘ్ిన చెక్క	5-15	వెల్లుల్లి	5-20
ధనియాలు	5-20	పసుపు	3-15
సోపు	0.01-10	లవంగం	0.01-10
మిరప	0.01-10	అల్లం	0.01-10
కరివేపాకు	0.01-5	ఆవాలు	0.01-5
  • పైన పేర్కొన్న పదార్థాలన్నీ పొడి రూపంలో ఉంటాయి. ఈ జీవ పురుగు మందుని పొడి రూపంలో చదరపు మీటరుకి 100-500 గ్రా. పొడిని చల్లాలి (డోటి, 2012).
  • జీలకర్ర ఎసెన్షియల్ ఆయిల్ ప్రత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, ఆలుగడ్డ, టమాట పంటలకు తీవ్ర నష్టం కలిగించే నల్ల లద్దె పురుగు అగ్రోటిస్ ఇప్సిలాన్‌పై ఉదర, స్పర్శ చర్యలను ప్రదర్శించింది
  • అనేక యాంటి బయాటిక్స్‌ని తట్టుకునే క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ పలు కూరగాయల పంటల్లో తీవ్ర నష్టం కలిగిస్తుంది. యాలకలు, పసుపు, అల్లం, జీలకర్ర, లవంగం, పాప్పిగింజలు, ఫెనెల్, ఆవాలు, వెల్లుల్లి, మిరియాలు, మెంతులు, దాల్చిన చెక్క, ఇంగువ, ధనియాల నీటి ద్రావణాలు విడివిడిగా, 26 కలిపిన ద్రావణాలు ఈ బాక్టీరియం పెరుగుదల నరికట్టాయి (డిబ్రిట్టో, అతని అనుచరులు, 2011). అన్ని సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ఈ బాక్టీరియం పెరుగుదల నరికట్టింది.
  • జీలకర్ర, ఇతర సుగంధ ద్రవ్యాలు అపరాల గింజలను పల్స్ బీటిల్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ వల్ల నష్టపోకుండా కాపాడాయి (మహ్ది, అతని అనుచరులు, 2008; ఇస్లాని, అతని అనుచరులు, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పరిరక్షణ వ్యవసాయం: నేల ఆరోగ్యం, దిగుబడి మరియు వాతావరణ స్థితిస్థాపకతకు ఒక సుస్థిర మార్గం

పరిచయం
పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.

పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ:
(1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.

తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.

చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ

నేల ఆరోగ్యంపై ప్రభావం
పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మట్టి స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.

దిగుబడి, ఆర్థిక అంశాలు
మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయం ఆధారిత మొక్కజొన్న పంటలు దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన నత్రజని యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.

వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ
ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయ పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత
నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్‌లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్‌ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత కలుపు నివారణ వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.

చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది

సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు
పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.

ముగింపు
పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.

ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.

చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³*
¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు
.

Read More

ఔషధ మొక్క… తగిరిస్ / తగరిష చెట్టు

ఇది నిటారుగా పెరిగే ఏకవార్షిక మొక్క. సుమారు 80-90 సెం.మీ. ఎత్తులో వ్యాపించే కొమ్మలు కలిగి ఉంటుంది. సంయుక్త పత్రాలు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకులు 3 జతలుగా ఏర్పడతాయి. ఇవి కోలగా ఉంటాయి. ఇవి 3-4.5 సెం.మీ. పొడవుంటాయి. పూవులు లేత పసుపు రంగులో ఆకుల మొదళ్ళలో జంటలుగా ఏర్పడతాయి. కాయలు తప్పడిగా లేదా 4 కోణాలు కలిగి ఉంటాయి. కాయలు కొడవలి ఆకారంలో 10-15 సెం.మీ. పొడవుండి లోపల 30-50 గింజలు ఉంటాయి. తప్పడిగా ఉండి నల్లగా మెరుస్తుంటాయి. ఇది మెట్ట భూములలో కలుపు లాగా పెరుగుతుంది.

సాధారణ నామం : సికిల్‌పాడ్ / టోర సికిల్‌సెన్న / చాకుండ శాస్త్రీయ నామం : క్యాసియాటోరా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేర్లు, ఆకులు మరియు గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఆకులను కూరగా ఉపయోగిస్తారు. ఉదర సమస్యలు, రక్త సమస్యలు, మలబద్ధకం, ఊబకాయం, వాపులు, సుఖవ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. ఆకులు కణుతులు, రక్తలేమి, ఉబ్బసం, వెక్కిళ్ళు నివారణకుపయోగిస్తాయి.
  • గింజలు కంటి జబ్బులు, చర్మవ్యాధుల చికిత్సకు మరియు విరేచనకారిగా కూడా ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • తగిరిస్ (క్యాసియాటోరా) విత్తనాలను భారతదేశంలో సేంద్రియ క్షేత్రాలలో సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు. తగిరిస్ అనేక పంటలనాశించే పురుగులపై కీటక నాశక లక్షణాలను కలిగి ఉంది. తగిరిస్ గింజల ద్రావణం, దానిలో అధికంగా ఉండే ఆంత్రాక్వీనోన్స్ ఆఫ్రికన్ మలేరియా వెక్టర్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. (ఎమ్‌బాచౌ, అతని అనుచరులు, 2017).
  • క్యాసియానైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ యాంటీమైక్రోబియల్ (అమో, అతనిఅనుచరులు, 2007), తెల్లదోమపెద్ద పురుగులపై కీటకనాశక చర్య, అనోఫెలెస్ గాంబియే పై లార్విసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008), సిట్రియోరోసిన్, ఎమోడిక్‌యాసిడ్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై మస్క్విటోసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008) లను ప్రదర్శించాయి.
  • క్యాసియాటోరా మిథనాల్ ఆకుద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిపై అత్యధిక అడల్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. హెక్సేన్, క్లోరోఫాం, బెంజీన్, అసిటోన్, మిథనాల్ ద్రావణాలను మనిషి ముంజేతిపై రాసినపుడు ఇవి వికర్షణ చర్య ద్వారా దోమల కాట్ల నుండి రక్షణనిచ్చాయి. (అమరేశన్, అతని అనుచరులు, 2012).
  • క్యాసియాటోరా జీవనియంత్రణ చర్య ద్వారా పార్థినియం మిస్టిరోఫోరస్‌ని అరికట్టింది. ఆకు, కాండం నీటి ద్రావణాలు పార్థినియం విత్తనాల మొలకశాతం, లేత మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపింది. 20% ఆకుల ద్రావణం, 30% కాండం ద్రావణం 100% పార్థినియం విత్తనాలు మొలకెత్తడాన్ని అరికట్టాయి (సింగ్ అండ్ దేవి, 2017). క్యాసియాటోరా మొక్కలు స్రవించిన రసాయనాలు పార్థినియంపై ఎల్లెలోపతి ప్రభావాన్ని చూపాయి.
  • క్యాసియాటోరా (25%) ఆకుల నీటి ద్రావణం సోయాబీన్ పంటనాశించే ఆకుమచ్చ తెగులు కారకం, ఆల్టర్నేరియా ఆల్టర్నేటని పర్యావరణహిత పద్ధతిలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (ఖందారె, 2015)
  • క్యాసియాటోర హెక్సేన్ ద్రావణం గోధుమగింజల నిల్వ ధాన్యంలో ఆశించే లెస్సర్ గ్రెయిన్‌బోరర్, రైజోపెర్తా డామినికా నుండి కాపాడింది (అహద్, అతని అనుచరులు, 2016).
  • క్యాసియాటోరా మరియు అరిస్టోలోకియా బ్రాక్టియేట నీటి ద్రావణం మరియు ఇథనాల్ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, స్టెఫైలోకోకస్ ఆల్బస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, స్ట్రెప్టోకోకస్ ఫీకాలిస్, ఎస్కెరిచియాకోలి, క్లెబ్సియెల్లాఈరోజినెస్, ప్రోటియస్ వుల్గారిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, కాండిడా ఆల్బికాన్స్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్‌లపై యాంటీమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించాయి. నీటి ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలలో ఇథనాల్ ద్రావణం బాక్టీరియాపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది (జయసుధ, ఆమె అనుచరులు, 2011).
  • క్యాసియాటోరా, గ్లెåరిసిడియా, కానుగ ఆకులను పచ్చిఆకు ఎరువుగా ఉపయోగించవచ్చు. (మురళి, కెవికె, డిడియస్, జహీరాబాద్)
  • క్యాసియా టోరా జీవ పురుగు మందు వెల్లుల్లి పంటనాశించే తామర పురుగులు, త్రిప్స్ టబాసిని నివారించింది. వెల్లుల్లి దిగుబడులను కూడా గణనీయంగా పెంచింది (సింగ్, అతని అనుచరులు, 2014)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

అగ్నాస్త్రం

కాండం తొలుచు, కాయ తొలుచు మరియు అన్నిరకాల తొలుచు పురుగుల కొరకు ఈ అగ్నాస్త్రం ఉపయోగిస్తారు.
తయారీ విధానం: ఒక పాత్రలో 10 లీటర్ల గోమూత్రం తీసుకుని ఇందులో 1 కిలో పొగాకు ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్ద, 1 లేదా 2 కిలోల పచ్చి మిరపకాయల ముద్ద మరియు 1/2 కిలో వెల్లుల్లి ముద్ద వేసి పాత్రపైన మూత పెట్టి 4 సార్లు పొంగు వచ్చేటట్లుగా బాగా ఉడికించాలి. తర్వాత పాత్రను కిందకి దించి 48 గంటల వరకు చల్లారనివ్వాలి. చివరకు ఒక గుడ్డతో వడగట్టి ఒక డబ్బాలో పోసి ఉంచాలి. ఎకరానికి 100 లీటర్ల నీటికి 2 Ð 3 లీటర్ల అగ్నా¢స్తం కలిపి పిచికారీ చేయండి.

Read More

పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

చేప వ్యర్థాలతో పోషక మిశ్రమం

వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.

 తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).

చేప వ్యర్థాలను పపైన్‌తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.

పులియ బెట్టడం
5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి.
15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి.
పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ ఫార్మ్యులేషన్‌ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

‘జీవామృతం’ తో జవజీవాలు

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)

  • 200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
  • 10 కిలోల పేడ (నాటు ఆవు)
  • 5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
  • 2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
  • 2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
  • పొలం గట్టు మట్టి…పిడికెడు

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.

జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.

జీవామృతం తయారీ విధానం:
ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

పంటలపై జీవామృతం పిచికారీ ఇలా…
3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు).
6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి.
రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి.
నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి.
ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి.
జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.

Read More

సాంకేతికతను సాగుకు అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు

వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని సాగుకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు చేయాలని నాబార్డ్ మాజీ చైర్మన్, ఐఐఎఫఎల్ సంస్థ ఫైనాన్స్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 63వ వ్యవస్థాపక దినోత్సవాలు గుంటూరు సమీపంలోని లాంఫాం ఆడిటోరియంలో శుక్రవారం జరిగాయి. వాతావరణ మార్పు అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్రూ అభివృద్ధికి రూ.3 లక్షలు విరాళం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన ‘మారనున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులకు సుస్థిర వరి వ్యవసాయం’, గుంటూరు జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ప్రచురించిన ‘కంది సాగు సమగ్ర యాజమాన్యం, మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, అపరాల సాగులో సమగ్ర కలుపు యాజమాన్యం’ పుస్తకాలను ఆవిష్కరించారు.

Read More
  • 1
  • 2