వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని సాగుకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు చేయాలని నాబార్డ్ మాజీ చైర్మన్, ఐఐఎఫఎల్ సంస్థ ఫైనాన్స్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 63వ వ్యవస్థాపక దినోత్సవాలు గుంటూరు సమీపంలోని లాంఫాం ఆడిటోరియంలో శుక్రవారం జరిగాయి. వాతావరణ మార్పు అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్రూ అభివృద్ధికి రూ.3 లక్షలు విరాళం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన ‘మారనున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులకు సుస్థిర వరి వ్యవసాయం’, గుంటూరు జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ప్రచురించిన ‘కంది సాగు సమగ్ర యాజమాన్యం, మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, అపరాల సాగులో సమగ్ర కలుపు యాజమాన్యం’ పుస్తకాలను ఆవిష్కరించారు.

13 Jun, 2026
