శంఖుపుష్పం / దింతెన

సాధారణ నామం : బ్లూ పీ / బటర్‌ఫ్లైపీ శాస్త్రీయ నామం : క్లిటోరియా టెర్నేటియా కుటుంబం: ఫాబేసి

శంఖుపుష్పం ఒక బహువార్షిక హెర్బల్ మొక్క. ఆకులు అండాకారంలో ఉంటాయి. ఇది ఒక తీగ లేదా క్రీపర్‌లా పెరుగుతుంది. ఈ మొక్కలో కొట్ట వచ్చినట్లు కనిపించేవి వాటి ముదురు నీలం రంగు పూలు. అవి 4 సెం.మీ. పొడవు, 3 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కొన్ని రకాలు తెలుపు రంగు పూలు పూస్తాయి. కాయలు 5-7 సెం.మీ. పొడవుండి, ప్రతి కాయలో 6 నుండి 10 గింజలుంటాయి. లేత కాయలను తింటారు. దీనిని అలంకరణ మొక్కగా పెంచుతారు. దీని వేర్లు రైజోబియంతో కలిసి జీవిస్తూ పరస్పర సహకారమందించుకుంటాయి.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వాపు, నొప్పిని తగ్గిస్తుంది.
  • రక్తం పడే మొల్లల చికిత్సలో ఉపయోగిస్తారు. మొల్లలను ఆకుల కషాయంతో శుభ్రపరుస్తారు. మొత్తం మొక్క పేస్టుని మొల్లలపై పూస్తారు.
  • తలనొప్పి నివారణకు ఆకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేస్తారు.
  • రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ చికిత్సలో థామాసాతో మరగించిన నూనెతో మర్ధన చేస్తారు.
  • నోటిలోపల వాపుకు ఆకు కషాయంతో పుక్కిలిస్తారు. గాయాలను శుభ్రపరచడానికి కూడా ఈ కషాయాన్ని ఉపయోగిస్తారు. చీము ఏర్పడకుండా నివారిస్తుంది.
  • వ్యవసాయరంగంలో
  • శంఖుపుష్పం ద్రావణం నుండి తయారు చేసిన మేళనం కీటకనాశక చర్య మరియు / లేదా వికర్షక చర్య మరియు / లేదా పురుగు గుడ్లు పెట్టకుండా నిరోధించడం మరియు / లేదా గుడ్లు పెట్టే స్థానంపై ప్రభావం చూపడం మరియు / లేదా పురుగు మొక్కపై తినకుండా అవరోధించడం వంటి చర్యల ద్వారా పురుగులనరికడుతుంది.
  • ఈ మేళనం కీటకనాశక చర్య ద్వారా వ్యవసాయ పంటలనాశించే పెద్ద పురుగులు, లార్వాలను లేదా రసంపీల్చే పురుగులను నివారిస్తుంది. దీనిని ప్రత్తి పంటనాశించే హెలికోవర్మా ఆర్మిజరాపై ఉపయోగించి ప్రయోగాలు చేశారు. (రాబర్ట్ మెన్సా, 2012).
  • శంఖు పుష్పం గింజల ద్రావణం రైజోక్టోనియా సొలాని పై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
  • ద్రావణంలోని ప్రోటీన్ ఫినోటిన్ చిక్కుడునాశించే ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు శిలీంద్రం, కొల్లెటోట్రైకం లిండముథియానం మరియు బాక్టీరియల్ బ్లెåట్‌కారకం క్ౙాంతో మోనాస్ ఆక్సొనోపొడిస్ ఫేసియోలి; వరి నాశించే బైపొలారిస్ ఒరైజే, పైరిక్యులేరియా గ్రిసియా, బ్రాకియేరియా స్పీ, నాశించే రైజోక్టోనియా సొలానిలపై శిలీంద్రనాశక, బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది. ఈ ప్రోటీన్ జాబ్రోటెస్ సబ్‌ఫాసియేటస్ మరియు అకాంతోసీలిడియస్ ఒబెక్టస్ బ్రూచిడ్ల మొదటి దశ లార్వాలపై అధిక విష ప్రభావాన్ని ప్రదర్శించింది (కెలెము, అతని అనుచరులు, 2004).
  • శంఖుపుష్పం ఆకు ద్రావణాలు మలేరియా, ఫైలేరియా జ్వరం, ఎన్సెఫెలైటిస్, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాప్తి చేసే వాహకాలు ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ పెద్ద పురుగుల విడుదలను అరికట్టింది (అరివోలి, అతని అనుచరులు, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. నల్లేరు

నల్లేరు పొదలు, చెట్ల మీద దాదాపు 10 మీ. ఎత్తు పెరిగే బహు వార్షిక తీగ. దీని శాఖలు నాలుగు పలకల కాడల్లా ఉంటాయి. ఈ మొక్క కణుపులు కలిగి ఉండి ప్రతి కణుపు వద్ద హృదయాకారంలో గానీ, గుండ్రంగా గానీ పెళుసైన పత్రాలు కలిగి ఉంటుంది. ఈ కణుపుల వద్ద సన్నని తీగలు కూడా వస్తాయి. పూలు వంగ పండు రంగులోను, ఫలాలు సన్నగా, ఎరుపు రంగులో ఉంటాయి. నల్లేరు కాడ అంతా నారతో కూడి ఉండి చేతితో నలిపితే చేయి దురద పెడుతుంది. కాండం గుండ్రంగాను, బల్ల పరుపుగాను ఉండే మొక్కలు కూడా అక్కడక్కడ అరుదుగా కనిపిస్తాయి.

సాధారణ నామం : అడమెంట్ క్రీపర్ / ఎడిబుల్ స్టెమ్‌డ్‌లైన్ / హడ్‌జోడ్ శాస్త్రీయ నామం : సిస్సస్ క్వాడ్వాంగ్యులారిస్ కుటుంబం: వైటేసి²

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • నల్లేరు కాడలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఈ మొక్కల నుండి టెట్రాసైక్లిన్ ట్రైటెర్పినాయిడ్లు మరియు స్టెరాయిడ్లు లభిస్తాయి. నల్లేరు లేత కాడలను దంచి ఉప్పు, కారం, జీలకర్ర, మిరియాలు చేర్చి తింటే జీర్ణ శక్తి పెరుగుదలకు, కీళ్లనొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
  • బాగా ముదిరి లావుగా ఉన్న నల్లేరు కాడల్ని ఎండబెట్టి చూర్ణం చేసి పిప్పిళ్ళ చూర్ణం కలిపి తేనెతో సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. నల్లేరు చూర్ణం మూలవ్యాధికి, బహిష్టు క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. నల్లేరు రసం చెవి నుంచి చీము కారడం తగ్గిస్తుంది. నల్లేరుకి విరిగిన ఎముకలను అతికించే గుణం కూడా ఉంది.

వ్యవసాయరంగంలో

  • నల్లేరు కాండం పెట్రోలియం ఈదర్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను, ప్యూపాలను అత్యంత సమర్ధవంతంగా నివారించింది (రమేష్ కుమార్ అండ్ నట్టుతురాయ్, 2012).
  • నల్లేరు తాజా మరియు ఎండిన కాండాల ఇథైల్ అసిటేట్ ద్రావణం మరియు మిథనాల్ ద్రావణాలు బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ సీరియస్, స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ స్పీసీస్‌పై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (చిదంబర మూర్తి, అతని అనుచరులు, 2004).
  • నల్లేరు ఆకు ద్రావణం అనాఫిలెస్ స్టెఫెన్సిపై గుడ్లనాశక చర్యను ప్రదర్శించింది. 100% గుడ్లను చంపింది (కృష్ణప్ప, అతని అనుచరులు, 2013).
  • వేప ఆకులు, నల్లేరు ఆకులు సమపాళ్ళలో కలిపి నూరి ఆవుమూత్రంలో ఒక వారం నానబెట్టి వడపోసి, 1:9 నిష్పత్తిలో నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి వరిలో పురుగులను నివారించవచ్చు (పిఒపి, తమిళనాడు)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. కర్పూరం

కర్పూరం 3-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక వృక్షం. లేత ఆకులు ఎర్రగా ఉంటాయి. ముదిరిన కొద్దీ ఆకులు పచ్చగా మారతాయి. పసుపుపచ్చ పూలు సువాసన కలిగి ఉంటాయి. కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇదివిత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్కలోని ఆకులు, కొమ్మలు, వేర్లు, ఇతర భాగాల నుండి వెలికి తీయబడు పదార్థాన్నే కర్పూరం అంటారు.

సాధారణ నామం
క్యాంఫర్‌ట్రీ / పచ్చ కర్పూరం / కర్పూర్
శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫొర
కుటుంబం: లారేసి²

ఉపయోగాలు : ఔషధ రంగంలో …

  • ఆకులు, కొమ్మలు, వేర్లు, చెక్క ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఆవిరయ్యేనూనె, కాంఫర్, శాప్రోల్, యూజినాల్, టర్పినియోల్, సిన్నమిక్ ఆల్డిహైడ్, కౌమారిన్ అనబడు రసాయనాలు ఉంటాయి.
  • దీనిని జ్వరాలు, కురుపులు, పొంగులు, కోరింతదగ్గు, శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, కీళ్ళనొప్పులు నివారించుటకు ఉపయోగిస్తారు.
  • ఈ మొక్క నుంచి తయారు చేసిన కర్పూరాన్ని హారతి ఇచ్చుటకు, చర్మ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కర్పూరం మొక్క ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పై బలమైన ఫ్యూమిగెంట్ మరియు కాంటాక్ట్ విష చర్యలను ప్రదర్శించింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో డిక్యామ్ఫర్ (40.54%), వినలూల్ (22.92%), సినియోల్ (11.26%), 3, 7, 11 ట్రైమిథైల3హైడ్రాక్సి6, 10డోడికాడియెన1ఐలఎసిటేట్ (4.50%) ఉంటాయి. సిన్నమోమం క్యామ్‌ఫర్ ఎసెన్షియల్ ఆయిల్, దాని రసాయనాలను లాసియోడెర్మా సెర్రికార్నె నివారణకు సహజ ఫ్యూమిగెంట్స్ మరియు కీటకనాశనులుగా వృద్ధి చేయవచ్చు (చెన్, అతని అనుచరులు, 2014).
  • సిన్న మోమం క్యాంఫొరా వెరైటి లినలూలిఫెరా, సిన్నమోమం క్యాంఫొరావెరైటి హోస్యో ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్స్ సైటోఫిలస్ జియామెయిస్‌పై ప్రయోగశాలలోను, మినిసైలోస్‌లోను వికర్షక చర్యను ప్రదర్శించాయి (కాన్సియన్, అతని అనుచరులు, 2015).
  • కర్పూరం మొక్క ఎసెన్షియల్ ఆయిల్‌లో 36.61% క్యామ్ఫర్ మరియు 30.05% సినియోల్ ఉంటాయి. కర్పూర్ ఎసెన్షియల్ ఆయిల్ రెడ్ ఇంపోర్టెడ్ ఎర్రచీమ (ఆరఐయఫఎ) మైనర్ మరియు మేజర్ వర్కర్స్‌పై ఫ్యూమిగెంట్ విషచర్యను, బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. (ఫు, అతని అనుచరులు, 2015).
  • కర్పూర్ పొడి, ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం గ్రానేరియం, ట్రైబోలియం కాస్టానియంపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (నెనా అండ్ ఇబ్రహీం)
  • కర్పూర్ ఆకుల (100-300) పొడి నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, కాల్లసోబ్రూకస్ రోడిసియానస్ గుడ్లు పెట్టడాన్ని నిరోధించడం, గుడ్లు పొదగడాన్ని గణనీయంగా తగ్గించాయి (రాజపాక్సె అండ్ వాన్‌మ్డెన్, 1997)
  • కర్పూర్ ఆకుల (10-50) పొడి నిల్వ ధాన్యం లోపల లార్వా, ప్యూపా బ్రతికి ఉండటం తగ్గించాయి (ధర్మసేన, అతని అనుచరులు, 1998).
  • కర్పూర్ మిథనాలిన్ ద్రావణాలు పీచ్‌పండు ఈగ బాక్ట్రోసిరా జోనేట ఆడ పురుగులను అదికంగా చంపాయి (సైరాఖాన్, అతని అనుచరులు, 2016).
  • సిన్నమోమం జీలానికం, సిన్నమోమం బుర్మాన్ని, సిన్నమోమం ఇనర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్టెమియ సలిన లార్వాలను అరికట్టాయి (నూర్ ఫెసిహ ఒంటిహసన్, 2011).
  • కర్పూర్ క్ౙెåలం ద్రావణాలు కోరియోలస్ వెర్సికలర్, గ్లియోఫిల్లం ట్రాబియం శిలీంద్రాలపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (లి, అతని అనుచరులు, 2014).
  • సిన్నమోమం జీలానికిం ఎసెన్షియల్ ఆయిల్ మరియు నానోఎమల్షన్ మీల్‌వర్మ్, ఆల్ఫిటోబియస్ డయాపెరినస్‌ని నివారించాయి (వోల్పటొ, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా ప్రిన్సెప్స్ ఆకులు, సిన్నమోమం క్యాంఫొరా గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు, సైటోఫిలస్ ఒరైజె, బ్రూకస్ రూజిమానస్‌లపై మంచి వికర్షక చర్యలను ప్రదర్శించాయి. కాని వాటి మిశ్రమం (1:1) అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (లియు, అతని అనుచరులు, 2005). ఈ రెండు ఆయిల్స్‌ని విడివిడిగా ఉపయోగించినపుడు గోధుమ విత్తనాల మొలక శాతాన్ని తగ్గించాయి. కాని రెండింటిని కలిపి ఉపయోగించినపుడు మొలకశాతం పెరిగింది.
  • రసాయన ఎరువులు, పురుగు మందులనుపయోగిస్తే ఆహార గొలుసులో విషపూరిత అవశేషాలు, జీవ అసమతుల్యత, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు రావచ్చు. వృక్ష సంబంధ పురుగు మందులను రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడితే ఈ సమస్యలను అదిగమించవచ్చు. పేనుబంక ఆశించిన గ్రీన్ ఆల్ఫాల్ఫ నారు మొక్కలను మలైఫాస్ మరియు సహజ ఆయిల్ ద్రావణాల (ఒరిగానో, తైమ్.వేప, కానుగ, కర్పూర్, తేయాకు చెట్టు)తో శుద్ధి చేసినపుడు పేనుబంక పురుగులు నివారింపబడ్డాయి (కస్పిమి, అతని అనుచరులు, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… రాచ ఉసిరి

ఇది 4-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక చిన్న చెట్టు. కొమ్మలు నిటారుగా చెట్టు అగ్రభాగంలో వస్తాయి. కాయలు నక్షత్రం ఆకారంలో ఉండి పుల్లగా ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. సంవత్సరంలో రెండుసార్లు (ఏప్రిల్-మే మరియు ఆగస్టు-సెప్టెంబరు) కాపు తీసుకోవచ్చు.

సాధారణ నామం : కంట్రిగూస్‌బెర్రి / స్టార్‌గూస్‌బెర్రి శాస్త్రీయ నామం : సిక్కా అసిడ కుటుంబం: యూఫర్బియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దీనిలో కాయలు ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది.
  • ఇవి కామెర్లు మరియు జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో

  • రాచ ఉసిరిలో గ్లెåకోసైడ్, టానిన్, రెసిన్ వంటి రసాయనాలుంటాయి. దీని ద్రావణం బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ మెగాథీరియం, స్టెపైలోకోకస్‌టైఫి, స్టెఫైలోకోకస్ డీసెంటిరియేలపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (రెహ్మాన్, అతని అనుచరులు, 2011).
  • రాచ ఉసిరి ద్రావణం పైన్ వుడ్ నెమటోడ్, బర్సాఫెలెంకస్ క్ౙెåలోఫిలస్‌లపై బలమైన యాంటినెమటోడల్ చర్యను ప్రదర్శించింది (మకీన్, అతని అనుచరులు, 1997).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. రెడ్‌బడ్

ఇది ఒక చిన్న అలంకరణ చెట్టు. 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. 10 మీ. వెడల్పు ఉంటుంది. ఒక సంవత్సరం లేదా ఎక్కువ వయసున్న చెట్టు, కాండంతో సహా ముదరు పింకు రంగు పూలను ఉత్పత్తి చేస్తుంది. పూలు ఏర్పడిన కొద్ది సమయం తర్వాత ఆకులు ఏర్పడతాయి. ఈ చెట్టు పొడవైన బల్లపరుపు కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చెట్టు నుండి వ్రేలాడుతుంటాయి. పూలను తినవచ్ౘ్ు. ఇవి తీయని ఆమ్ల రుచి కలిగి ఉంటాయి.

సాధారణ నామం : జుడాస్ ట్రీ
శాస్త్రీయ నామం : సెర్సిస్ సిలిక్వాస్ట్రం
కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • రెడ్‌బడ్‌ని అనీమియా, నిస్సత్తువ చికిత్సలో ఉపయోగిస్తారు. శతాబ్దాల నుండి దీనిని మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, శ్వాసకోశ సమస్యలు, గర్భవతుల్లో కాళ్ళ వాపుల చికిత్సలో ఉపయోగిస్త్తున్నారు. మూత్ర వర్ధకంగా పనిచేస్తుంది.
  • పూలలో కెరోటిన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని పార్ల్సేతో కలిపి రక్తం, లివర్‌లోని కొవ్వు డిపాజిట్లను కరిగించడానికి ఉపయోగిస్తారు. మెత్తని క్రీం చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తుంది. 1 కప్పు పూలను 1 కప్పు నీరు కలిపిన క్రీంలో కలిపి 20 ని. ఉడికించాలి. వడపోసి పూలను తొలగించి 3 చెంచాల విటమిన్ ఇ నూనెని క్రీమ్‌కి కలిపి, బాగా కలియత్రిప్పి స్టెరిలైజ్ చేసిన జాడీలో పోయాలి. ఈ క్రీంని గోళ్ళు లేదా చర్మంపై సమస్య వున్న చోట పూసి మసాజ్ చేయాలి.
  • హెల్త్ టీ తయారు చేయడానికి పావుకప్పు తాజాపూలను ఒక పాత్రలో తీసుకుని వాటిపై ఒక కప్పు వేడి నీటిని పోసి 5 ని. నిల్వ ఉంచి వడపోయాలి. దీనికి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. అమెరికన్ ఇండియన్స్, రెడ్‌బడ్‌ని పంటి నొప్పి నుండి బ్లాడర్ ఇన్‌ఫెక్షన్ వరకు, చర్మ మచ్ౘ్ల నుండి చీలిన కాలి గోర్ల వరకు అనేక సమస్యలకు పూలను నలగ్గొట్టి కట్టు కట్టడానికి లేదా లోషన్‌గా పూయడానికి, పూలను హెల్త్‌టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
  • యూరోపియా ఖండంలో ప్రస్తుతం రెడ్‌బడ్ కషాయాన్ని విరేచనకారిగా ఉపయోగిస్తున్నారు. (రాబర్ట్స్, 2000)

వ్యవసాయరంగంలో

  • రెడ్‌బడ్ ఇథనాల్ ద్రావణం (30 మైక్రో లీటర్లు / మి.లీ.) లోని రసాయనాలు 12 రోజుల తామర పురుగులు, త్రిప్స్ టబాసి పై అత్యధిక విష ప్రభావాన్ని చూపాయి (నజ్‌మిజాడె, అతని అనుచరులు, 2013).
  • రెడ్‌బడ్ ద్రావణం { బదనికనల్లి, ఓరియస్ హోర్వాతి విడుదల వెస్టర్న్ ఫ్లవర్ త్రిప్స్, ప్రాంక్లినియెల్లా ఆక్సిడెంటాలిస్ పిల్ల పురుగులపై మంచి ప్రభావాన్ని చూపాయి. రెడ్‌బడ్ ద్రావణం పిల్ల తామర పురుగులను చంపింది (రజావి అండ్ అహ్మరి, 2016). తామర పురుగులు సమర్ధవంతంగా నివారించబడ్డాయి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. దేవదారు

దేవదారు పశ్చిమ హిమాలయ వాలుల్లో పెరిగే అతి సుందరమైన అలంకరణ చెట్టు. ఇది ఒక పెద్ద నిత్యహరిత కోనిఫెర్ జాతికి చెందిన చెట్టు. 40-50 మీ. ఎత్తు పెరుగుతుంది. దీని కాండం 3 మీ. వ్యాసం కలిగి ఉంటుంది. కొమ్మలు సమాంతరంగా పెరుగుతాయి. ఆకులు నీడిల్ లాగా ఉండి 2-5.5 సెం.మీ. పొడవుంటాయి. 20-30 నీడిల్స్ ఒక గుత్తిలో ఏర్పడతాయి. ఇవి కాంతివంతమైన ఆకుపచ్ౘ్రంగు నుండి నీలిఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆడకోన్స్ బ్యారల్ ఆకారంలో 7-13 సెం.మీ. పొడవు, 5-8 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. గింజలు రెక్కలు కలిగి ఉంటాయి. మగకోన్స్ 4-6 సెం.మీ. పొడవుంటాయి.

సాధారణ నామం : దేవ్‌దార్ శాస్త్రీయ నామం : సెడ్రస్ డియోడెరా కుటుంబం: పైనేసీ

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • గాయాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. కడుపులో నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. చర్మవ్యాధుల చికిత్సకి ఉపయోగిస్తుంది.
  • నరాల బలహీనత నదుపు చేస్తుంది. దగ్గు, జలుబులను నివారిస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది.
  • మూత్రకోశ వ్యాధులు, డయాబెటిస్ చికిత్సలో ఉపయోగకరం. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కడుపుబ్బరాన్ని, వాయువులను తగ్గిస్తుంది. అధిక దురదలను తగ్గిస్తుంది. వాపు, ఎడిమ, నొప్పులను తగ్గిస్తుంది. రక్త సమస్యలను నివారిస్తుంది.
  • ముక్కు కారడం, సైనొసైటిస్ చికిత్సలో ఉపయోగిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచి మందు. ఊబకాయం చికిత్సలో ఉపయోగిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • దేవదారు ఎసెన్షియల్ ఆయిల్, దానిలోని వివిధ రసాయనాలు క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్ లార్వాలపై వాటిని చంపే ప్రభావం చూపింది. దీనిని పురుగుల యాజమాన్యంలో వృక్ష సంబంధ లార్విసైడ్‌గా ఉపయోగించవచ్చు. (చౌధరి, అతని అనుచరులు, 2011).
  • వస, దేవదారు, మారేడు, బంతి, కరివేపాకు ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రభావాన్ని డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై పరీక్షించారు. వస ఎసెన్షియల్ ఆయిల్ డైమండ్ బ్యాక్ మాత్ లార్వాలపై అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది. దీని తర్వాత దేవదారు ద్రావణం అధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (ఈశ్వరరెడ్డి, అతని అనుచరులు, 2015).
  • దేవదారు అనేక పురుగులను సమర్ధవంతంగా నివారించింది (రఘురామన్ అండ్ సింగ్, 1997; రహమాన్, అతని అనుచరులు, 2009, రావ్ అండ్ సింగ్, 2009, డెల్బెకె, అతని అనుచరులు, 1997).
  • దేవదారు ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటిస్ దోమలను 2.5% ఎల్‌సి 50 వద్ద ఒక గంట తర్వాత సమర్ధవంతంగా చంపింది (మకాయిక్, అతని అనుచరులు, 2005).
  • దేవదారు క్రూడ్ ఆయిల్‌ని మీల్‌వర్మ్స్ (టెనెబ్రయొమా లిటర్) ఆఖరి దశ లార్వాలపై ఉపయోగించి ఎల్‌సి50 ని 3.4% గా గుర్తించారు. 12% క్రూడ్ ఆయిల్ 87% లార్వాలను చంపింది. దేవదారు క్రూడ్ ఆయిల్‌తోపాటు రసాయన పురుగు మందులు కార్బోసల్ఫాన్, ఇమిడాక్లోప్రిడ్‌లను కూడా ఉపయోగించారు. కార్బోసల్ఫాన్ యల్‌సి500.086%. కార్బోసల్ఫాన్ (0.5%) 92% లార్వాలను చంపింది. ఇమిడాక్లోప్రిడ్ ఎల్‌సి 500.23% ఇమిడాక్లోప్రిడ్ అత్యంత సమర్ధవంతంగా మీల్‌వర్మ్స్‌ని చంపింది. దేవదారు ఆయిల్‌ని ఉపయోగించిన లార్వాలలో ప్రోటీన్ పరిమాణం అత్యధికం (4.14 మి.గ్రా. / మి.లీ.) గా నమోదయింది. ఇమిడాక్లోప్రిడ్, కార్బోసల్ఫాన్ ఉపయోగించిన లార్వాలలో ప్రోటీన్ పరిమాణాలు 2.80, 2.68 మి.గ్రా / మి.లీ. గా నమోదయ్యాయి. దేవదారు ఆయిల్ లార్వాలపై అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (బునేరి, అతని అనుచరులు, 2017).
  • సిడార్ ఉడ్ ఆయిల్ పల్స్‌బీటిల్, కాల్లసోబ్రూకస్ అనాలిస్, ఈగలపై శక్తివంతమైన కీటకనాశక చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ అగర్వాల్, 1988). అనోఫెలిస్‌స్టెఫెన్సి (దోమ) పై కూడా కీటకనాశక శక్తిని చూపింది. (సింగ్, అతని అనుచరులు, 1984).
  • జమ్ముప్రావ్సిలో డోడా జిల్లాలో రైతులు దేవదారు కొయ్యతో చేసిన స్టోరేజ్‌బిన్స్‌లో ధాన్యాన్ని నిల్వ చేస్తారు. ఇందులో నిల్వ చేసిన ధాన్యాన్ని పురుగులు, శిలీంద్రాలు నష్టపరచవు.
  • దేవదారు కొమ్మలు, ఆకులను వరి పంటలో కలుపు మందుగా ఉపయోగిస్తారు. కొమ్మలు, రెమ్మలు, ఆకులను వరి పొలంలో సమంగా వెదజల్లుతారు. సిడార్ ఉడ్ ఆయిల్ కలుపు మందు లక్షణాల వల్ల కలుపు మొక్కలు వీటిని తాకితే చనిపోతాయి.
  • మొక్కజొన్న విత్తనాలను విత్తేముందు సిడార్ ఉడ్ ఆయిల్‌తో శుద్ధి చేస్తే పురుగుల బారి నుండి కాపాడుతుంది. ఈ పద్ధతి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది.
  • సిడార్ ఉడ్ ఆయిల్ కీటకనాశక చర్యవల్ల లద్దె పురుగు నివారింపబడుతుంది.
  • వరి పండించే ప్రాంతాల్లో పురుగుల నివారణకు వరి నారు మడికి నీరు అధికంగా ఇస్తారు. దీని వలన నీటి స్థాయి పెరిగి లద్దె పురుగు మొక్కలపై ఆకుల మీదకు ప్రాకుతుంది. ఒక కర్ర చివరలో గుడ్డ కట్టి ఆయిల్‌లో ముంచి ఆకులపై చల్లాలి. ఆకులపై కొచ్చిన లార్వాలు ఆయిల్ కీటకనాశక చర్యల వల్ల చనిపోతాయి.
  • టిక్స్ ఆశించిన పెంపుడు జంతువులపై సిడార్ ఉడ్ ఆయిల్ కలిపిన నీటిని చల్లితే పురుగులు చనిపోతాయి. (స్లాతియా, అతని అనుచరులు, 2007).
    దేవదారు కొయ్య/గుజ్జుకి చెదలను తట్టుకునే శక్తి ఉంది.
  • సిడార్ ఉడ్‌తో తయారు చేసిన కతార్, కొత్తి, బార, డొబ్లి వంటివి సంప్రదాయకంగా ధాన్యాన్ని నిల్వ చేసే నిర్మాణాలు (ఠాకూర్ అండ్ ప్రితి, 2011).
  • సిడార్ ఉడ్ ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) మినుము నిల్వ గింజలలో ఆశించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, కర్వులేరియా ఒవాయిడియా శిలీంద్రాల పెరుగుదల నరికట్టాయి (సింగ్ అండ్ త్రిపాఠీ, 1999).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… కసివింద

కసివింద ఎక్కువగా ఎర్రనేలలు, గరువు భూములు, రోడ్ల ప్రక్కన, కొండల దిగువ భాగంలో గట్ల మీద ఉంటుంది. సుమారు 60-90 సెం.మీ. ఎత్తు పెరిగి బలమైన వేర్లతో పొదవలే వ్యాపించి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కలు విపరీతంగా వ్యాప్తి చెంది ఇతర మొక్కలను రాకుండా చేస్తాయి. ఆకులు బలిష్టంగా చింతాకుల వలె ఉంటాయి. పూవులు పసుపు పచ్ౘ్రంగులో కొమ్మల సందులలో గుచ్ఛాలు వలె ఉంటాయి. వీటి విత్తనాలకు మొలకెత్తే శక్తి చాలా కాలం వరకు ఉంటుంది. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : కాఫీసెన్న శాస్త్రీయ నామం : క్యాసియా ఆక్సిడెంటాలిస్ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, వేర్లు, గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో సెన్నోసైడ్లు, నాఫ్తలిన్ గ్లెåకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఆవిరయ్యే నూనె, క్రైసోఫినాల్, ఎమోడిన్, క్రూడ్‌ఫైబర్, కాల్షియం, ఇనుము, నియోసిన్ మొదలగునవి ఉంటాయి.
  • ఈ మొక్క వేరును మిరియాలతో కలిపి పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం కుష్టువ్యాధి చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
  • మొక్క సమూలంగా కోరింత దగ్గు, వ్రణాలు, బొల్లి, మూత్రకోశ వ్యాధులు, మూర్ఛవ్యాధి, హిస్టీరియా వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కసివింద పెట్రోలియం ఈదర్ మరియు ఎన్‌బ్యుటనాల్ ద్రావణాలు (200 మరియు 300 పిపియం) క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను 100% చంపాయి. దీనిని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దీపక్ కుమార్, అతని అనుచరులు, 2014).
  • కసివింద ఆకుల క్రూడ్ ఇథనాలిక్ ద్రావణం 80 మైక్రోగ్రాములు / మి.లీ. మోతాదుకు పైన రైపిసిఫాలస్ మాన్యులేటస్ గుడ్లు పొదగడాన్ని అకారిసైడల్ చర్య ద్వారా పూర్తిగా నివారించింది. (సునీల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద జీవపురుగుమందు మొక్కజొన్న పంటలో అత్యధిక పెరుగుదలనిచ్చింది. (పంగ్నాకోర్న్, అతని అనుచరులు, 1999). అదనంగా కసివింద మొక్కజొన్న పంటనాశించే పేనుబంక, రొఫాలోసైఫం మెయిడిస్, మొక్కజొన్న తొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫ్యూమకాలిస్, ఆర్మివర్మ్, మితిమ్న సపరేటస్‌లను అత్యంత సమర్ధవంతంగా నివారించింది.
  • కసివింద ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తా డామినిక, ట్రైబోలియం కాస్టానియం, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, లైపోసెలిస్ పీటాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (వాకిల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద ఆకుల నీటి ద్రావణం పునరుత్పత్తి చర్యను, చన్న పంక్టేటస్ చేపలలో యాంటిఇన్‌ఫ్లమేటరి చర్యను ప్రదర్శిస్తుంది. (మనె, అతని అనుచరులు, 2012).
  • కసివింద ద్రావణం గోధుమ గింజలనాశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగు చావు మరియు పెద్ద పురుగుల సంతతిపై అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది (దెర్బాలా, 2012).
  • మొక్క రక్షణ వ్యవస్థలో ప్లాంట్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్ (పిపిఐ) ఒక ముఖ్యభాగం. పిపిఐ మొక్కలనాశించే పురుగులు, సూక్ష్మజీవులపై చురుకుగా పనిచేస్తుంది. క్యాసియా స్పీసీస్ యాంటి ఇన్‌సెక్టిసైడల్ మరియు యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కసివింద ఆకుల నుండి ఫిస్టులన్ అనే పిపిఐని వేరు చేశారు. ఈ పిపిఐ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియాకోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లా న్యుమోనియాలను స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్‌కి సమానంగా అరికట్టింది (అరుల్ పాండి అండ్ సంగీత, 2012).
  • కసివింద పూల ఇథైల్ అసిటేట్ ద్రావణం నుండి వేరు చేసిన రీన్ (1,8డైహైడ్రాక్సిఆంత్రాక్వినోన3కార్బాక్సిలిక్ యాసిడ్) 1000 పిపియం హెలికోవర్పా ఆర్మిజెరాపై 76.13% యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. రీన్ హెలికోవర్పా ఆర్మిజెరా (67.5%), స్పోడోప్టెరా లిటోర (36.25)లపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. బ్రతికిన లార్వాలు రూపం మారిన పెద్ద పురుగులనుత్పత్తి చేశాయి (దురైపాండియన్, అతని అనుచరులు, 2010).
  • క్యాసియాపెన్నా ద్రావణం అత్యంత సమర్ధవంతంగా గోధుమ గింజల నాశించే ట్రోగోడెర్మా గ్రానేరియంని అరికట్టింది. ఈ ద్రావణంలో కీటకనాశక చర్యగల వివిధ జీవ చర్యలు గల కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ ద్రావణాన్ని గోధుమగింజలను ఈ పురుగు నుండి కాపాడటానికి రసాయన పురుగుమందులకు ఒక సురక్షిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దెర్బలా, 2017).
  • చక్రపాణి మిశ్రా విశ్వవల్లభ (అధ్యాయం 8, శ్లోకం 39)లో పురుగుల నివారణకు కసివింద, శాపిండస్ ఎమార్ౙినేటస్, కానుగ, ఆల్‌స్టోనియా స్కాలరిస్, ఎంబెలియా రైబ్స్ బెరడు పొడిని ఆవుమూత్రంలో రాత్రంతా నానబెట్టి చెట్లలో ఆశించిన భాగాలపై పేస్టుగా పూయాలని సిఫారసు చేశారు (సాథేల్, 2004)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. సీమ మెట్ట తామర

ఇది సుమారు 1.5 మీ. ఎత్తు పెరిగే ఒక చిన్న పొద. దీని శాఖలు సమాంతరంగా విస్తరిస్తాయి. పత్రములు పక్షవత్ సంయుక్తం. కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. పత్రకములు 8-12 జతలు, వెడల్పుగా, గుండ్రంగా ఉంటాయి. మొదలు వంకరగా ఉంటుంది. కాడలు మరియు పత్రవృంతములు సాధారణంగా ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. పుష్పవిన్యాసం ఆకుల మొదలు నుండి లేదా కొమ్మల చివర్ల నుండి వస్తుంది. నిటారైన పుష్పగుచ్చాలు కల్గి ఉంటుంది. పూలు పసుపు రంగులో ఉంటాయి. కాయలు పొడవుగా కొద్దిగా నొక్కినట్లు ఉండి అంచులు రెక్కలలాగా ఉంటాయి. గింజలు అనేకం ఉండి నలుపు రంగులో ఉంటాయి. తేమ గల ప్రాంతాలలో మరియు సాగు నేలలలోను కలుపుగా బాగా పెరుగుతుంది. అందమైన పూల కొరకు కూడా దీనిని పెంచుతారు. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : రింగ్ వార్మ్ క్యాసియా / వింగ్‌డ్ సెన్నా / కాండిల్ బుష్ శాస్త్రీయ నామం : క్యాసియా అలాట కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు మరియు కాండం ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో ఆంత్రాగ్లూకోసైడ్లు, క్రైసోఫిన్ మరియు రీన్ అనే రసాయనాలు ఉన్నాయి. ఆకులు మరియు కాండమునకు శరీర భాగాలు కుళ్ళిపోకుండా చేసే గుణం ఉంది. విరేచనకారిగా పనిచేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి.
  • దీనిని ఎడిమా, హెపాటైటిస్ మొదలగు జబ్బుల చికిత్సకూ, తామర, గజ్ౙి వంటి చర్మవ్యాదుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • సీమ మెట్ట తామర ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ పీకాలిస్, ఎస్కెరిచియాకోలి, ప్రోటియస్ మిలాబిలిస్‌పై యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (ఇగ్వె అండ్ ఓన్వు, 2015)
  • బెరడు మరియు ఆకుద్రావణాలు సాధారణ నల్ల చీమలు, ఎర్రచీమల పై విష చర్యను ప్రదర్శించాయి (ప్లూక్, 1999).
  • క్యాసియా నైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ తెల్లదోమ, బెమిసియా టబాసి పెద్ద పురుగులపై కీటక నాశక చర్యను, అనోఫెలెస్ గాంబియే దోమల లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అజిర్ౙెస్, అతని అనుచరులు, 2008).
  • దీని ఆకులలోని ఎమోడిన్ యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (అయో, అతని అనుచరులు, 2007).
  • సీమ మెట్టతామర ఆకుల ఎసిటోన్, ఇథనాల్ ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ సీరియస్, ఎస్కెరిచియా కోలి, విబ్రియో కలరా, క్లెబ్సియెల్లా న్యుమోనియేపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి (సకార్కర్, అతని అనుచరులు, 1998).
  • దీని ఆకులలో ఉన్న క్యాసియాక్ౙాంతోన్, కీంప్‌ఫెరాల్, గ్లెåకోసైడ్స్, క్రైసోఫినాల్స్, ఐసోక్రైసోఫినాల్ చీమలను సమర్ధవంతంగా వికర్షించాయి (వాట్ అండ్ బ్రేయర్, 1962, ప్రసాద్, 2007)
  • సీమ మెట్ట తామర మానవులలో వ్యాధులు కలిగించే క్యాండిడా ఆల్బికాన్స్, మైక్రోస్పోరం కానిస్, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైట్స్ శిలీంద్రపెరుగుదలను అరికట్టింది (టమోతి, అతని అనుచరులు, 2012).
  • ఈ మొక్క భాగాలను స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సబ్‌టైలిస్ కలిగించే వ్యాధుల నివారణలో ఉపయోగించవచ్చు. (అలలార్, అతని అనుచరులు, 2012).
  • ఈ మొక్క ఆకుల ఇథనాల్ ద్రావణంతో తయారు చేసిన ఆయింట్‌మెంట్లు పశువులలో డెర్మటోఫైలోసిస్ వ్యాధిని సమర్ధవంతంగా నివారించాయి. (ఆలిఎమ్మాన్యుయెల్, అతని అనుచరులు, 2003).
  • దీని ఆకులు, కాండం, బీన్స్ ద్రావణాలు బలమైన యాంటిబాక్టీరియల్ చర్యను, బలహీనమైన యాంటిఆక్సిడెంట్ చర్యను ప్రదర్శించాయి (వహాల్, అతని అనుచరులు, 2014).
  • సీమ మెట్టతామర మొక్కను అరటి కాండంతొలుచు పురుగు, ఒడోయిపోరస్ లాంగికోల్లిస్ నివారణలో ఉపయోగించవచ్చు.(బాలన్, దయానందన్, 2016).
  • ఈ మొక్క బెరడు పొడి టిక్స్‌ని నాశనం చేస్తుంది (సోరోన్)
  • సీమ మెట్టతామర సాల్వెంట్ ద్రావణాలు కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్‌పై శక్తివంతమైన విష చర్యను ప్రదర్శించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011)
  • దీని కాండం బెరడు ద్రావణంలో ఆల్కలాయిడ్స్, సపానిన్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, గ్లెåకోసైడ్స్ ఉంటాయి (అవంతి అండ్ సుబ్బలక్ష్మి, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… బుడ్డకాకర

తీగ జాతి హెర్బల్ మొక్క. టెండ్రిల్స్ ద్వారా పైకి ప్రాకుతూ 1.5-2 మీ. పొడవు పెరుగుతుంది. కాండం 5 నిలువు ఉబ్బుచారలు కలిగి ఉంటుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. చిన్న ఆకులు నూగు కలిగి ఉంటాయి. చిట్టచివరి ఆకు బల్లెం ఆకారంలో ఉండి 2-3.5 సెం.మీ. పొడవుంటుంది. చిన్న ఆకు అండాకారంలో 1-2.5 సెం.మీ. పొడవు కలిగి ఉంటుంది. ఆకు కాడ 2-3 సెం.మీ. పొడవుంటుంది. టెండ్రిల్స్ జంటలలో ఉంటాయి. ఆడ, మగ పూలు విడివిడిగా ఏర్పడతాయి. కాప్సూల్ గోధుమ రంగులో 1.53 x 2.4 సెం.మీ. పరిమాణంలో ఉండి 5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి.

సాధారణ నామం : బెలూన్‌వైన్ శాస్త్రీయ నామం : కార్డియోస్పెర్మం హోలికకబమ్ కుటుంబం : సాపిండేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొత్తం మొక్క డయాఫోరెటిన్, మూత్రవర్థకం, విరేచనకారి లక్షణాలు కలిగి ఉంది. దీనిని కీళ్ళనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, కాళ్ళు, చేతులు బిగుసుకు పోవడం, పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఆకులను కీళ్ళ నొప్పుల చికిత్సలో పట్టీగా వేస్తారు. ఆకుల టీని చర్మ దురదల చికిత్సలో ఉపయోగిస్తారు. వాపులపై ఉప్పుతో కూడిన ఆకులతో కట్టుకడతారు. ఆకు రసాన్ని చెవి నొప్పి చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వేరుని మూత్రవర్థకం, విరేచనకారిగా ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • మొక్క క్రూడ్ ద్రావణాలు దోమకాటుకు రక్షణ నిస్తాయి (గోవిందరాజన్ అండ్ శివకుమార్, 2012).
  • బుడ్డ కాకర ఆకు ద్రావణాలను జొన్న, మొక్కజొన్న, వరి విత్తనాల నుండి వేరు చేసిన ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కర్వులేరియా లునేట, డ్రెష్లరా హాలోడెస్, ఫ్యుజేరియం మొనిలిపార్మె, ఫ్యుజేరియం సొలాని, ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై పరీక్షించారు. ఆకుల నీటి ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్ పెరుగుదలను గణనీయంగా అరికట్టింది. ఆకుల నీటి ద్రావణం ఆకుల కాలస్ ద్రావణం కన్నా సమర్ధవంతంగా పని చేసింది (గిరీష్, అతని అనుచరులు, 2011).
  • మదురై, దిండిగల్, తెని జిల్లాల్లోని మారుమూల గ్రామాలలోని గ్రామస్థులు వేప, బుడ్డకాకర, బూడిద చెట్టు, గ్లోరియోసా సుపర్పా, జట్రోపా, మునగ, ఫిల్లాంథస్ అమరస్, అవిశ, చింత, వావిలాకు, ట్రైడాక్స్ పొకంబెన్స్‌లను దైనందిన జీవితంలో పురుగుల నివారణలో ఉపయోగిస్తారు (రాజేంద్రన్, అతని అనుచరులు, 2008).
  • బుడ్డకాకర ఆకుల నీటి ద్రావణం శనగ పచ్చ పురుగు, హెలికోవర్పా ఆర్మిజరా లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (రమ్య అండ్ జయకుమార్ రాజ్, 2009).
  • బుడ్డకాకర ఆకుల ఇథనాల్ ద్రావణం ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (శ్రీనివాసన్, అతని అనుచరులు, 2014)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… బంగ్లా ఆకు / గాంజా

గాంజా ఒక వార్షిక, 6-12 అ. ఎత్తు పెరిగే పూలు పూసే హెర్బల్ మొక్క. కాండం నిటారుగా పెరుగుతుంది. పెద్ద ఆకులు ఎగుడుదిగుడు అంచులు కల చిన్న ఆకులను కలిగి ఉంటాయి. మొదటి జత ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రమంగా ఈ చిన్న ఆకుల సంఖ్య 7 లేదా 9 వరకు పెరుగుతుంది. మొక్క చివరలో ఏర్పడే ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రింది జత ఆకులు ఎదురెదురుగా ఏర్పడతాయి. మొక్క చివరి భాగంలోని జంట ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ప్రతి మొక్కలో ఆడ, మగ పూలు ఏర్పడతాయి.

సాధారణ నామం : మార్జువానా / భంగ్‌మొక్క / కామన్ హెంప్ శాస్త్రీయ నామం : కెన్నాబిస్‌సెటైవా కుటుంబం: కెన్నాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేలాది సంవత్సరాలుగా ఔషధరంగంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఆస్త్మా, డయేరియా, డిసెంట్రి, గనోరియ, ఎపిలెప్సి, గౌట్, మలేరియా, జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • గౌట్, వ్రణాలు, వెర్రుకోస్‌వెయిన్, కీళ్ళ నొప్పులకు లేపనంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగులలో నాసియా, వామిటింగ్‌ల నుండి ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు.

వ్యవసాయరంగంలో

  • గాంజా మొక్కను పురుగు వికర్షిణి, కీటకనాశినిగా అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పురుగులు, నులి పురుగులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలను ఆటంక పరుచుటకు దీనిని సహచర పంటగా నాటుతారు. (లేడీస్టోన్, 2015)
  • గాంజా మొక్క ఎండబెట్టిన ఆకులు, పూలు పురుగులు, నల్లులు, నులిపురుగులు కలుపు మొక్కలను వికర్షిస్తాయి లేదా చంపుతాయి. మొక్కల ద్రావణాలు పురుగులు, నులిపురుగులు, నల్లులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలు, బాక్టీరియా, ప్రోటోజోవాలను వికర్షించడం లేదా చంపడం చేస్తాయి. (మెక్‌పార్ట్‌లాండ్, 1997)
  • ప్రత్తి చేలకు దగ్గరలో గాంజా మొక్కలను పెంచితే ప్రత్తి నాశించే అలబామా ఆర్ౙిల్లేసియా (కాటన్ వర్మ్) నుండి రక్షించింది (రిలే, 1885).
  • కూరగాయల పంటల చుట్టూ దీనిని పెంచితే క్యాబేజి లార్వా పియరిస్ బ్రాసికె క్యాబేజి పంటను ఆశించకుండా కాపాడింది (బెలింగ్, 1932).
  • ఆలుగడ్డ క్షేత్రాలు పొటాటో బీటిల్ (లెప్టినొటార్సా డెసెమ్‌లినియేటా) ఆశించకుండా రక్షింపబడ్డాయి (స్టాట్టి, 1976).
  • గోధుమ, వేరుశనగ లను డెలియాకోయార్ట్కేటా నుండి కాపాడతాయి. (పకోమోవ్ అండ్ పోటుషాన్ స్కీ, 1977),
  • గాంజా వేరు రసాలు భూమిలోని వేర్లకు నష్టం కలిగించే యూరోపియన్ చాఫర్ బీటిల్ (మెలోలోంతా మెలోలోంతా) నుండి కాపాడతాయి (మటీవ, 1995).
  • గాంజా చిక్‌వీడ్, స్టెల్లేరియా మీడియా, పెరుగుదలను అణచివేసింది (స్టుప్నికా రోడ్ౙింకీవిక్ౙ్, 1970).
  • పొటాటోలేట్‌బ్లెåట్ శిలీంద్రం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్ ను అరికట్టడానికి ఆలుగడ్డ పంటలో గాంజాని అంతర పంటగా వేయాలి (ఇస్రాయెల్, 1981).
  • ఆలుగడ్డ పంటని గాంజాతో పంట మార్పిడి చేసి పొటాటోసిస్ట్ నెమటోడ్, హిటరోడెరారోస్టోకైనెన్సిస్‌ని అణచి వేయవచ్చు. (కిర్‌యనోవా అండ్ క్రిల్, 1971).
  • గాంజాతో పంట మార్పిడి రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ చిట్‌వుడి, సంఖ్యని కూడా అణచి వేసింది (కోక్, అతని అనుచరులు, 1994).
  • బటన్ పుట్టగొడుగు (అగారికస్) పెంపకంలో 137 కి. కంపోస్టుకి 3 కి. గాంజా ఎండు ఆకులను కలిపి ఉపయోగిస్తే పుట్టగొడుగులను తినే నెమటోడ్, ఎఫెలెంకాయిడెస్ కాంపోస్టికోలాని అరికట్టబడింది. (గ్రెవాల్, 1989).
  • గాంజా విత్తన చెక్కలను భూమిలో వేస్తే మెలాయిడోగైన్ ఇన్‌కాంగ్నిటా నులి పురుగుల సంఖ్య తగ్గుతుంది (గోస్వామి & విజయలక్ష్మి, 1986)
  • ఎండు ఆకులు నిల్వ ధాన్యంలో ఆశించే ముక్కు పురుగులను వికర్షించాయి (రిలే Ê హోవార్డ్, 1892, మాకిండూ & స్టీవర్స్, 1924).
  • ఆలుగడ్డ కుప్పలపై 2 సెం.మీ. మందంలో ఎండిన, పొడి చేసిన ఆకుల పొరనేర్పాటు చేస్తే పొటాటో ట్యూబర్‌మాత్ ఆశించకుండా 120 రోజుల వరకు కాపాడుకోవచ్చు. (కష్యప్, అతని అనుచరులు, 1992).
  • గోధుమ గింజలకు పొడి చేసిన గాంజా ఆకులను కలిపి ముక్కు పురుగు సైటోఫిలాఒరైజే ఆశించకుండా కాపాడవచ్చు. (ఖరె, అతని అనుసచరులు, 1974).
  • పూలు పూసే గాంజ మొక్కను నీటిలో వేసి మరగించి కషాయం తయారు చేసి ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి పొటాటో బీటిల్, లెప్టినోటార్సాడెసెమ్ లినియేటని చంపవచ్చు. (స్ట్రాట్టి, 1976).
  • 100 గ్రా. తాజా గాంజా ఆకులను 25 మి.లీ. నీటిలో కలిపి రుబ్బి, గుడ్డతో వడకట్టిన ద్రావణం 12వ దశ హిటరోడెరా కజాని నులిపురుగులను చంపాయి (మజుందార్, అతని అనుచరులు, 1989).
  • 10 గ్రా. గాంజా ఆకులను 100 మి.లీ. నీటిలో రుబ్బి, పిల్టర్ పేపర్‌తో వడపోసి ద్రావణాన్ని తయారు చేశారు. 40% ద్రావణం రాగి విత్తనాల నాశించిన 25 వివిధ జాతులకు చెందిన శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది. వీటిలో ముఖ్యమైనవి ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, క్లాడోస్పోరియం, డ్రెష్లెరా, ఫ్యుజేరియం, సెఫలోస్పోరియం, రైజోపస్, మ్యూకార్, కర్వులేరియా (పాండే, 1982).
  • గాంజా ద్రావణం పైన్ నారు మొక్కలను ఫ్యుజేరియం కలిగించే తెగులు నుండి కాపాడింది (వైసోట్స్‌క్యి, 1962)
  • సోవియట్ అగ్రానమిస్టులు ‘కాన్‌సాటిన్ 4” లేదా కొన్సాటిన” అనే నీటిలో కలిపిన ద్రావణాన్ని ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి తెగుళ్ళు కలిగించే కొరినోబాక్టీరియం, సూడోమోనాస్, అగ్రోబాక్టీరియా స్పీసీస్‌ని నివారించారు. (జెలెపుకా, 1960, బెల్‌ట్యుకోవ, 1962).
  • ఆలుగడ్డ నిల్వ సమయంలో మెత్తని కుళ్ళు కలిగించే ఎర్వినియా కెరటవోరా మరియు ఇతర బాక్టీరియాలు నివారించబడ్డాయి (విజయ్, అతని అనుచరులు, 1992)
  • శ్రీవాస్తవ & దాస్ (1974) 100 గ్రా. నూరిన గాంజా ఆకులు, కాండాలను 10 మి.లీ. నీటిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరిగించి కషాయం తయారు చేశారు. ఈ కషాయం సైపరస్ రొటండస్ కలుపు మొక్క విత్తనాలను మొలకెత్తకుండా చేసింది.
  • గాంజా నీటి ద్రావణాలు ఫాల్స్‌ఫామోమైల్ (మాట్రికేరియా రెకుటియేటా), లెమన్ గడ్డి (లోపిడియం సెటైవా) కలుపు మొక్కల విత్తనాలను మొలకెత్తకుండా చేసాయి (స్టుప్నికరోడ్ౙింకి విక్ౙ్, 1970).
  • గాంజా ఆకు ద్రావణాలు (1,2 3, 10 మి.గ్రా/మి.లీ.) ఆపిల్ పంటలో తీవ్ర నష్టాన్ని కలిగించే కాడ్లింగ్‌మాత్ (సైడియాపోయోనెల్లా) ఆపిల్ కాయల నాశించకుండా నివారించింది. (డుర్డెన్, అతని అనుచరులు, 2011).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More