నిమ్మగడ్డి వార్షిక హెర్బల్ మొక్క. ఇది 2 నుండి 4 అ. ఎత్తు పెరుగుతుంది. 2 నుంచి 3 అ. వెడల్పు విస్తరిస్తుంది. ఆకు సువాసనతో, నిత్యహరితంగా ఉంటుంది. ఈ మొక్క అరుదుగా పూస్తుంది. ఆకులు 0.51 అం. వెడల్పు, సుమారు 3 అ. పొడవు ఉండి ఆకు చివర్లు వాలి ఉంటాయి. నిత్యహరిత ఆకులు కాంతివంతమైన నీలిఆకుపచ్చ రంగులో ఉండి నలిపితే నిమ్మ వాసననిస్తాయి. పూలరెమ్మలు 30-60 సెం.మీ. పొడవుంటాయి..
సాధారణ నామం : లెమన్‌గ్రాస్ శాస్త్రీయ నామం : సింబోపోగాన్ సిట్రేటస్ కుటుంబం: పోయేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- అర్ౙెంటైనాలో ఆకు కషాయాన్ని గొంతునొప్పి తగ్గించడానికి లోపలికి తీసుకుంటారు.
- బ్రెజిల్లో ఆకులతో తయారు చేసిన టీని శరీరంలో ఈడ్పులు తగ్గడానికి, బాధ నివృత్తి ఔషధంగా, వాపు తగ్గించడానికి, జ్వరం తగ్గించడానికి, మూత్రం సాఫీగా పారడానికి, ఉద్రేకం తగ్గించడానికి సేవిస్తారు.
- క్యూబాలో ఎండిన ఆకులను, కాండాన్ని వేడి నీటిలో మరగించిన కషాయాన్ని జలుబు, కీళ్ళవాతం తగ్గించడానికి త్రాగిస్తారు. ఈజిప్టులో ఎండిన ఆకులు, కాండంతో తయారు చేసిన కషాయాన్ని మూత్రపిండాలలో ఈడ్పుని తగ్గించడానికి, మూత్రవర్థకంగా ఉపయోగిస్తారు.
- భారతదేశంలో మొత్తం తాజా మొక్క పాములను వికర్షిస్తుంది. 2-3 చుక్కలు నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని వేడినీటిలో కలిపి త్రాగితే గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. కలరా వ్యాధిగ్రస్థులకు నిమ్మరసంలో కొన్ని చుక్కలు నిమ్మగడ్డి నూనెని కలిపి త్రాగిస్తారు. తీవ్ర తలనొప్పి, జ్వరం తగ్గడానికి ఎండిన ఆకుల వేడి నీటి ద్రావణాన్ని స్నానానికి ఉపయోగిస్తారు. కేంద్ర నాడీమండల ఉపశమనానకి నిమ్మగడ్డితో తయారు చేసిన టీని త్రాగుతారు. మలేషియా, ఇండోనేషియాలో మొత్తం మొక్కతో తయారు చేసిన వేడి నీటి ద్రావణాన్ని ఒక రుతు విడుదలను ప్రోత్సహించే ఔషధంగా త్రాగుతారు.
- థాయ్‌లాండ్‌లో సువాసనకి మొత్తం మొక్కను పీలుస్తారు. ఆకులను ఆకలి పుట్టించు పదార్థంగా తింటారు. ఎండిన మొక్క వేడి నీటి ద్రావణాన్ని ఆకలి పుట్టించడానికి త్రాగుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుతో తయారు చేసిన వేడి నీటి ద్రావణాన్ని త్రాగుతారు.
- అమెరికాలో మొత్తం మొక్క వేడి నీటి ద్రావణాన్ని గాయాలను మాన్పడానికి, విరిగిన ఎముకల వల్ల కలిగే నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్, సిట్రాల్ ఈగల లార్వాలను, పెద్ద పురుగులను చంపాయి (పింటో, అతని అనుచరులు, 2015).
- నిమ్మగడ్డి మొక్కలు దోమలను వికర్షిస్తాయి. సిట్రొనెల్లా ఆయిల్ దోమలను వికర్షిస్తుంది. నిమ్మగడ్డి నూనె చెదలు, పొడినల్లులు, గోమార్లను కీటకనాశక చర్య ద్వారా నివారిస్తుంది. నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ డెంగూ జ్వరం వ్యాప్తి చేసే దోమలను చంపుతుంది.
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని వరి ధాన్యం నిల్వ సమయంలో ఆశించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ పెరుగుదలను, అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని నివారించడానికి ఉపయోగించవచ్చు. (పరనగమ, అతని అనుచరులు, 2003).
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ గొర్రెల నాశించే కెడ్ (గోమారి), మెలోఫాగస్ ఓవినస్పై అత్యధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. దీనిని కెడ్ జీవ నియంత్రణలో శక్తి వంతమైన భాగంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. (గెమెడ, అతని అనుచరులు, 2014).
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని జీవపురుగు మందుగా ఉపయోగించవచ్చు. దీనిని గొంగళిపురుగుల నివారణలో ఉపయోగించారు (శిల అడ్నియాన, అతని అనుచరులు, 2011). నిమ్మ గడ్డి ఎసెన్షియల్ ఆయిల్ (0.5%) 5 నిమిషాలలో గొంగళిపురుగులను పూర్తిగా చంపింది.
- నిమ్మగడ్డి నూనె కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించింది (పరానగమ, అతని అనుచరులు, 2002).
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ (1%) క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్ పురుగుల సంఖ్యను తగ్గించే చర్య కలిగి ఉంది. దీనిని డైమండ్ బ్యాక్‌మాత్ నివారణకు జీవ పురుగు మందుగా సిఫారసు చేశారు. ఇది క్యాబేజి పంటకు ఎటువంటి హాని కల్గించదు (సుదార్త, అతని అనుచరులు, 2013).
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న కండెల నిల్వ సమయంలో సైటోఫిలస్ జియామెయిస్ ఆశించకుండా కాపాడింది (కబేర, అతని అనుచరులు, 2011).
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్ పెరగుదల నరికట్టింది (డెబిల్లర్బెక్, అతని అనుచరులు, 2001). అంతేగాక నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేయకుండా నివారిస్తుంది (హెలాల్, అతని అనుచరులు, 2006, 2007).
- నిమ్మగడ్డి పేనుబంక, మైజస్ పెర్సికె, పై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (స్నీ˜ అండ్ క్లింగాఫ్, 1990).
- నిమ్మగడ్డి, రోజ్మేరి, థైమస్ ఎసెన్షియల్ ఆయిల్, వాటి రసాయన మిశ్రమాలను కలిపి క్యాబేజి సెమిలూపర్, ట్రైకోప్లూసియా ని పై వాటి ప్రభావాన్ని పరీక్షించినపుడు ఈ నూనెలు, వాటి రసాయన మిశ్రమాలు పురుగు క్యూటికల్ లోనికి ప్రవేశించి వాటిని చంపాయి (టక్, 2015).
- నిమ్మగడ్డి ద్రావణం (1గ్రా. 150 గ్రా. గింజలకు) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే వీవిల్ సైటోఫిలస్ జియామెయిస్ని 50%కి పైగా చంపింది. 6 గ్రా. మోతాదువద్ద 90% పురుగులు చంపబడ్డాయి. నిమ్మగడ్డి మొక్క సులభ లభ్యత, దాని అధిక కీటక నాశక చర్య దానిని ఆకర్షణీయమైన జీవ పురుగు మందుగా నిరూపించాయి (ఒబోహ, 2016).
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ శాండ్ ఫ్లెå, ఫ్లెబోటోమస్ డుబోస్క్వ్ పెద్దపురుగులను 100% చంపింది. ఆడపురుగులు గణనీయంగా తక్కువ గుడ్లను పెట్టాయి (కిముటాయ్, అతని అనుచరులు, 2015).
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్ సహజ దోమల వికర్షక మందుగా పనిచేస్తుంది. ఇది రసాయన వికర్షక పురుగు మందుల కన్నా సురక్షితమైనది (ప్రభాకర్, అతని అనుచరులు, 2013).
- నిమ్మగడ్డి కీటకనాశినిగానే గాక, యాంటిఫీడెంట్, వికర్షకచర్యలను కూడా ప్రదర్శిస్తుంది. దోమలు, ఈగలు, పేనుబంక, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుందని రుజువైంది.
- నిమ్మగడ్డి ఎసెన్షియల్ ఆయిల్‌ని పురుగు వికర్షిణిగా ఉపయోగించవచ్చు. లేదా నీటిలో కలిపి ఎమల్షన్‌గా తయారుచేసి పంటలపై పిచికారి చేయవచ్చు.
- వేర్ల నుండి రసం తీసి నీటితో కలిపి పంటలపై పిచికారి చేసి పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చు.
- నిమ్మగడ్డిని నులి పురుగులు, నల్లుల నివారణలో కూడా ఉపయోగించవచ్చు. నులి పురుగులెక్కువగా ఉన్న భూమిలో నిమ్మగడ్డిని నాటి వాటి సంఖ్యను తగ్గించవచ్చు..
- నిమ్మగడ్డి సంబంధిత సింబోపోగాన్ నార్డస్ మొక్క యాంటి ఫీడెంట్, వికర్షక చర్యలను కలిగి ఉంటుంది. పండు ఈగలను అధికంగా ఆకర్షిస్తుంది. ఈ లక్షణం వల్ల పండు ఈగల నివారణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. (ప్లూక్, అతని అనుచరులు, 1999).
- అలసంద పంటలో తీవ్ర నష్టం కల్గించే మారుకా కాయతొలుచు పురుగు (మారుకా విట్రేట), కాయ రసం పీల్చే నల్లి (క్లావిగ్రల్లా టోమెంటోసికోల్లిస్) పురుగులను మొక్కల పురుగు మందుల మిశ్రమాలతో నివారించడానికి పరిశోధనలు జరిపారు. వేప{నిమ్మగడ్డి, వేప{ ఆఫ్రికన్ కర్రి, వేప{టమాట, వేప{కాకర, యూకలిప్టస్{ఆఫ్రికన్ బుష్ టీ ఆకుల మిశ్రమ ద్రావణాలు పిచికారి చేసిన పంటలో కాయతొలుచు పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేప{ఆఫ్రికన్ కర్రి, వేప{నిమ్మగడ్డి, వేప{టమాట, వేప{కాకర, యూకలిప్టస్{ఆఫ్రికన్ బుష్ టీ ఆకుల మిశ్రమ ద్రావణాలు పిచికారి చేసిన పంటపై కాయరసం పీల్చే పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ద్రావణాల మిశ్రమాలు మొక్కలలో కాయల నష్టాన్ని అధికంగా తగ్గించి, గింజ దిగుబడులను పెంచాయి (ఒపరీక్, అతని అనుచరులు, 2005).
- నిమ్మగడ్డి, తులసి వేడి మరియు చల్లని ఆకు ద్రావణాలు అలసందలో యాంత్రాక్నోస్ తెగులు కల్గించే శిలీంద్రం కొల్లెటోట్రైకం లిండముథియానం శిలీంద్ర బీజాలు మొలకశాతాన్ని, శిలీంద్ర పెరుగుదలను సమర్ధవంతంగా తగ్గించాయి. నిమ్మగడ్డి చల్లని ఆకు ద్రావణం అత్యధికంగా శిలీంద్రం పెరుగుదలను తగ్గించి పొలంలో ఆంత్రాక్నోస్ తెగులు వ్యాప్తిని అరికట్టింది. నిమ్మగడ్డిని అలసంద నాశించే ఆకుమచ్చ తెగులు నివారణకు మొక్క ఆధారిత పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (అమడియోహ అండ్ ఓబి, 1999).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

