ఆవుల్లో కవల దూడలు (TWINS) పుట్టుట

కవల దూడలు చాలా అరుదుగా పుడతాయి. గర్భకోశద్వారం గుండా రెండు దూడలు ఒకే పర్యాయం రాలేక, ఈనటం కష్టమవుతుంది. ఒక దూడ జన్మించిన తరువాత కొంత సమయానికి, మరల ప్రసవ వేదన ప్రారంభమై మరొక దూడ జన్మించు సందర్భాలలో, ఈనటం కష్టం అవదు. గర్భద్వారంలో దూడలు యిరుక్కున్న సందర్భాలలో, పశువైద్యనిపుణులను సంప్రదిస్తే, వారు దూడల స్థానాలను సరిచేసి గాని, శస్త్రచికిత్స చేసి గాని, దూడలను బయటకు తీస్తారు.

రెండు దూడలు మగవైనా, రెండు దూడలు ఆడవైనా సమస్య వుండదు.

ఒక మగ, ఒక ఆడ దూడ కలిసి (FREEMARTIN) పుడితే, మగదూడకు ఏ సమస్యా వుండదు. కాని ఆడ దూడలో గర్భకోశ సంబంధిత అవయవాలు అభివృద్ధి చెందక, పునరుత్పత్తి సామర్థ్యం వుండదు. ఇది చాలా వాటిల్లో జరుగుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. పసుపు

సాధారణ నామం : టర్మరిక్ శాస్త్రీయ నామం : కర్కుమాలాంగా కుటుంబం: జింజి బరేసి

వ్యవసాయరంగంలో

  • పసుపు తాజారసం, నీటి ద్రావణం, ఎసెన్షియల్ ఆయిల్ పంటలనాశించే పురుగులపై కీటకనాశక చర్య, దోమలపై వికర్షక చర్య కలిగి ఉన్నాయి. పసుపు సహజ పురుగుమందుగా అనేక పంటలనాశించే పురుగుల నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగడపడుతుంది. (డయాలస్, 2011).
  • పసుపు, అల్లం ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే రెడ్‌ఫ్లోర్‌బీటిల్, ట్రైబోలియం కాస్టానియం లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా తగ్గించాయి. గింజల బరువు నష్టాన్ని కూడా తగ్గించాయి. కాని ఈ రెండింటిలో అల్లం ద్రావణం బాగా పని చేసింది. ఈ రెండు ద్రావణాలను సమగ్ర సస్యరక్షణ పథకాలలో సమర్ధవంతమైన వస్తువులుగా ఉపయోగించవచ్చు. (సజ్జాద్ ఆలి, అతని అనుచరులు, 2014).
  • పసుపు, అల్లం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య సుగంధ ద్రవ్య పంటలు. ఇవి రెండు నిల్వ ధాన్యాలను ట్రైబోలియం క్యాస్టానియం ఆశించి నష్టం కలిగించకుండా కాపాడతాయి. ఇవి తమ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా పురుగులను నివారిస్తాయి (రవీంద్రన్, 2007; లీ, అతని అనుచరులు). కాంటాక్ట్ ఇన్‌సెక్టిసైడ్స్ (బబ్రౌచ్, అతని అనుచరులు, 2010; గార్సికా, అతని అనుచరులు) యాంటీఫీడెంట్స్ లేదా వికర్షకాలుగా (గార్సిన్, అతని అనుచరులు, 2005), పురుగుల జీవిత కాలాన్ని, పెరుగుదల, పునరుత్పత్తిని కూడా నష్టపరుస్తాయి (హో, అతని అనుచరులు, 1996; రహ్మత్, అతని అనుచరులు, 2006).
  • పసుపు ద్రావణం (20%) ట్రైబోలియం కాస్టానియం అత్యధిక పురుగుల మరణాన్ని అతి తక్కువ లార్వాల విడుదల, అతి తక్కువ ప్యూపాల విడుదల, అతి తక్కువ పెద్ద పురుగుల విడుదలను నమోదు చేసింది (సజ్జాద్ ఆలి, అతని అనుచరులు, 2014).
  • పసుపు ద్రావణం ట్రైబోలియం కాస్టానియం ఒరైజీఫిలస్ సురిమెన్సిస్, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, సైటోఫిలస్ ఒరైజె, కార్సిరా సిఫలోనికలపై వికర్షక చర్యను ప్రదర్శించింది (చందర్, అతని అనుచరులు, 2000).
  • పసుపు ఆకు ద్రావణాలలోని ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తాడామినికపై కాంటాక్ట్ యాక్షన్ చర్యను ప్రదర్శించింది. ట్రైబోలియం కాస్టానియం గుడ్లు పెట్టడాన్ని, గుడ్లు పొదగడాన్ని తగ్గించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2002).
  • పసుపుపొడిలోని రసాయనాలు ట్రైబోలియం కాస్టానియంపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. (సు, అతని అనుచరులు, 1981).
  • పసుపు పొడి, దానిలోని రసాయనాలు క్యాబేజీ లూపర్, ట్రైకోప్లూసియాని 3వ దశ లర్వాలను 10-20% చంపాయి. పసుపు పొడికి పైపరానిల్ బ్యుటాక్సైడ్ కలిపితే 90-97% లార్వాలు చనిపోయాయి (లావరెస్, అతని అనుచరులు, 2016).
  • పసుపుదుంప పొడి ఉత్పత్తుల నిల్వలో ఆశించే సైటోపిలస్ గ్రానేరియస్, రైజోపెర్తా డామినికలను సమర్ధవంతంగా నివారించింది (జిలాని అండ్ సు, 1983).
  • పసుపు పొడి (20 గ్రా. /కి.) { ఆవాల నూనె (4 మి.లీ. /కి.) సైటోఫిలస్ ఒరైజె పెద్ద పురుగుల విడుదలను అరికట్టి మరబట్టిన బియ్యాన్ని కాపాడింది (చాందర్, అతని అనుచరులు, 1991).
  • ఫ్లైయాష్ { పసుపుపొడి 10% మిశ్రమం వరి పంటనాశించే నఫలాక్రాసిస్ ఇన్సాలిటస్, ఆక్ౙియానిటిడ్యుల; వంగపంటనాశించే ఎపిలాక్న విజింటియోపంక్టేట, ఎఫిస్ గాసిపి, యురెంటియస్ హిస్ట్రిసెల్లస్, కాక్సియోహిస్టిక్స్ ఇన్సోలిటస్, బెండ పంటనాశించే ఆమ్రాస్కా దేవస్తాన్స్, టెట్రానికస్ నియోకాలెడోనికస్, డిస్టెర్కస్ సింగ్యులేటస్, ఆక్సికారెనసయ లినిపెన్సిస్, అనోమిస్ఫల్లేవ, స్పోడోప్టెరా లిటూర, ఈరియాస్ విట్టెల్లాలను 80% చంపింది (శంకరి అండ్ నారాయణసామి, 2007).
  • పసుపు దుంపపొడి నిల్వ ధాన్యంలో ఆశించే రైజోపెర్తా డామినికని సమర్ధవంతంగా అరికట్టింది. ప్రత్యేకంగా పసుపుపొడి (0.5%) 63.2% పెద్ద పురుగుల విడుదలను నివారించింది. పసుపుపొడి (14 గ్రా.) { నూనె 6 మి.లీ.) మిల్లాడించిన బియ్యంలో ఈ పురుగులను 100% చంపాయి (చందర్, అతని అనుచరులు, 2003).
  • పసుపు దుంప ద్రావణాలు ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా అరికట్టాయి. పెట్రోలియం ఈథర్ ద్రావణం అసిటోన్ మరియు ఇథనాల్ ద్రావణం కన్నా అధిక సమర్థవంతంగా పనిచేశాయి (జిలాని అండ్ సు, 1983).
  • పసుపు దుంప అసిటోన్ ద్రావణం జ్యూట్ ఫ్యాబ్రిక్ నాశించే ట్రైబోలియం కాస్టానియంని తక్కువ మోతాదులో 3 నెలల వరకు అత్యధిక సమర్థవంతంగా వికర్షక చర్య ద్వారా నివారించింది. (చందర్, అతని అనుచరులు, 1992, 1994). పసుపు ద్రావణం ట్రైబోలియం కాస్టానియం, ఒరైజెఫిలస్ సునామెన్సిస్, క్రిస్టోలెస్టెస్ పెర్రుజెనియస్, సైటోఫిలస్ ఒరైజె, కార్సిరా సెఫలోనికపై 3 నెలల వరకు వికర్షక చర్యను ప్రదర్శించింది (చందర్, అతని అనుచరులు, 2000).
  • గోధుమ గింజలనాశించే రైజెపెర్తా డామినిక పెద్ద పురుగులను పసుపు దుంప పెట్రోలియం ఈథర్ ద్రావణం 90.8% నివారించింది. పెట్రోలియం ఈథర్ ద్రావణం (4%) సైటోఫిలస్ ఒరైజెని పూర్తిగా అరికట్టింది. అసిటోన్ ద్రావణం 85% పురుగులనరికట్టింది. పెట్రోలియం ఈథర్ ద్రావణం రైజోపెర్తా డామినికా పెద్ద పురుగులపై 98.3% వికర్షక చర్యను ప్రదర్శించింది (మాటర్, అతని అనుచరులు, 2008).
  • పసుపు దుంప, పైభాగాల క్లోరోఫాం ద్రావణాలు ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. కాని పై భాగాల ద్రావణం దుంప ద్రావణం కన్నా తక్కువ వికర్షక చర్యను ప్రదర్శించింది (అబిడ, అతని అనుచరులు, 2010).
  • పసుపు ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియంపై వికర్షక చర్యను ప్రదర్శించింది (జిలాని, అతని అనుచరులు, 1988). పసుపు ఎసెన్షియల్ ఆయిల్ రైజెపెర్తా డామినికా పెద్ద పురుగులను వికర్షించింది (జిలాని అండ్ సెగుక్సేనా, 1990).
  • పసుపు దుంప ఎసెన్షియల్ ఆయిల్ (1%) కార్డమమ్ ఎఫిడ్ (పెంటలోనియా నైగ్రోనర్వోసా)ని సమర్థవంతంగా నివారించింది (సాజు, అతని అనుచరులు, 1998).
  • పసుపు ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్స్, రైజోపెర్తా డామినితో, సైటోపిలస్ ఒరైజే, ట్రైబోలియం కాస్టానియంపై కాంటాక్ట్, ఫ్యూమిగేషన్ విష చర్యలను ప్రదర్శించింది. రైజోపెర్తా డామినికాపై కాంటాక్ట్ చర్యను ప్రదర్శించింది. సైటోఫిలస్ ఒరైజెపెద్దపురుగులపై ఫ్యూమిగేషన్ చర్యను ప్రదర్శించింది. ట్రైబోలియం కాస్టానియం గుడ్లు పెట్టడాన్ని, గుడ్లు పొదగడాన్ని నిరోధించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2002).
  • పసుపు పొడి నుండి వేరు చేసిన రెండు మిశ్రమాలు, ఆర్‌టర్మరోన్, టర్మరోన్ ట్రైబోలియం కాస్టానియంపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించింది (సు, అతని అనుచరులు, 1982).
  • పసుపు దుంపల ఎసెన్షియల్ నుండి వేరు చేసిన ఆర్‌టర్మరోన్ ఈడిస్ ఈజిప్టి లార్వాలపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (రోల్, అతని అనుచరులు, 1998).
  • ఆర్‌టర్మరోన్ (1000 పిపియం) సుడిదోమ (నీలపర్వత ల్యూజెన్స్) పెద్ద పురుగులను, ప్లూటెల్లా క్ౙెåలోస్టిల్లా లార్వాలను 100% చంపింది. మైజస్ పెర్సికె పెద్ద ఆడపురుగులు, స్పోడోప్టెరా లిటూర లార్వాలను ఆర్‌టర్మరోన్ (2000 పిపియం) సమర్ధవంతంగా నివారించింది (లీ. అతని అనుచరులు, 2001).
  • పసుపు దుంప నుండి వేరు చేసిన పదార్థాలను బోట్రైటిస్ సినరియా, ఎరిసిఫె గ్రామినిస్, ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్, పక్సినియా రీకాండిటా, పైరిక్యులేరియా ఒరైజె, రైజోక్టోనియా సొలానిల పై పరీక్షించారు (కిమ్, అతని అనుచరులు, 2003). హెక్సేన్ ద్రావణం (1000 మి.గ్రా / లీ.) ఎరిసిఫెగ్రామినిస్, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్, రైజోక్టోనియాసొలానిపై ఫంగిసైడల్ చర్యను ప్రదర్శించింది. ఇథైల్ ఎసిటేట్ ద్రావణం బోట్రైటిస్ సినరియా, ఫైటోఫ్తోరా ఇన్ఫెస్టాన్స్, పక్సినియా రికాండిట, రైజోక్టోనియా సొలనిపై ఫంగిసైడల్ చర్యను ప్రదర్శించింది. ఇథైల్ అసిటేట్ ఫ్రాక్షన్ నుండి వేరు చేసిన కర్కుమిన్ (9500 మి.గ్రా./లీ.) ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్, పక్సినియా రికాండిటా, రైజోక్టోనియా సొలానిలను 100, 100, 63% నివారించింది.
  • పసుపు దుంపల మిథనాల్ ద్రావణం మిరప పంటలో ఆంత్రాక్నోస్ (కొల్లెటోట్రైకం కోకాయిడెస్) తెగులుని సమర్థవంతంగా నివారించింది. (చో, అతని అనుచరులు, 2006).
  • పసుపు దుంప మిథనాల్ ద్రావణంలో గుర్తింపబడిన కర్కుమిన్, డిమిథాక్సికర్కుమిన్, బిస్‌డిమిథాక్సికర్కుమిన్ కొల్లెటోట్రైకం కోకాడెస్, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటం శిలీంద్ర పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి.
  • పసుపు ఎసెన్షియల్ ఆయిల్ నుండి వేరు చేసిన రెండు ఫ్రాక్షన్లు ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్, ఫ్యుజేరియం మొనిలిఫార్మె, పెనిసిలియం డిజిటేటం పై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (జయప్రకాష, అతని అనుచరులు, 2001).
  • పసుపు ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం డయాంతి, ఆల్టర్నేరియా డయాంతి (కార్నేషన్‌ని ఆశించే శిలీంద్రాలు), ఫ్యుజేరియం ఆక్సిస్పోరం గ్లాడియోలి, కర్వులేరియా ట్రైఫోలిగ్లాడియోలి (గ్లాడియోలస్‌ని ఆశించే శిలింద్రాలు)పై మంచి యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (బాబు, అతని అనుచరులు, 2007).
  • పసుపు దుంపల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించి నష్టం కలిగించే 7 శిలీంద్రాలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఫ్యుజేరియం సెమిటెక్టం, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం మ్యూసే (దింగ్రా, అతని అనుచరులు, 2007).
  • 20 గ్రా. పసుపు దుంప పొడిని 1కి. గింజలకు కలిపి నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నుండి కాపాడవచ్చు.
  • పసుపు ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజే, రైజోపెర్తా డామినికాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (గంగ్వార్ అండ్ తివారి, 2017).
  • పసుపు హెక్సేన్ ద్రావణం రెటిక్యులిటెర్మెస్ ప్లాలిపెస్‌పై టెర్మిటిసైడల్ చర్యను ప్రదర్శించింది (రాజె, అతని అనుచరులు, 2015).
  • పసుపు ద్రావణం రైస్‌వీవిల్, సైటోఫిలస్ జియామెయిస్‌పై మధ్యమ వికర్షక చర్యను ప్రదర్శించింది (ఇషీ, అతని అనుచరులు, 2010).
  • పసుపు నీటి ద్రావణం సుడిదోమ (నీలపర్వత లూజెన్స్), ఆకుపచ్చ దీపపు పురుగులు (నెషోటెటిక్స్ స్పీ.), డైమండ్ బ్యాక్‌మాత్ (ఫ్లూటెల్లా క్ౙెåలాస్టెల్లా), ఆసియన్ కార్న్‌బోరర్ (ఆస్ట్రినియా ఫర్నాలిస్)పై కాంటాక్ట్ మరియు ఓవిసైడల్ విష చర్యలను ప్రదర్శించింది. (మొరాల్లోరీజీసస్, అతని అనుచరులు, 1993).
  • దక్షిణ భారతదేశంలోని వయనాడ్ జిల్లాలో రైతులు అత్యధికంగా ఉపయోగించే జీవపురుగు మందు మొక్కల ఇన్ఫర్మెంట్ కన్సెన్సన్ ఫాక్టర్ (ఐసియఫ్) ఈ క్రింది విధంగా ఉంది. వేప (1.00), వెల్లుల్లి (0.97), పొగాకు (0.94), అల్లం (0.71), కానుగ (0.64), పసుపు (0.64) (జాన్ అండ్ సుజన, 2014).
  • ప్రత్తిలో పంటనాశించే రసం పీల్చే పురుగులు, దీపపు పురుగులు (ఆమ్రాస్కారేవస్తాన్స్), తామర పురుగులు (త్రిప్స్‌లబాసి), తెల్లదోమ (బెమిసియా టబాసి)ల నివారణకు పెప్పర్‌మింట్ (మెంతా పైపరేట), పసుపు (కర్కుమ లాంగా), మిరప (క్యాప్సికం ఆన్యుయమ్), అల్లం (జింజిబెర్ అఫిసినాలిస్), జిల్లేడు (కలోట్రాపిస్ ప్రాసెర), కాకర (మోమార్డికా చారాంటియా), గోరింట (లాసోనియా ఇనర్మిస్)ల ప్రభావాన్ని క్షేత్ర ప్రయోగాలలో పరీక్షించారు. అన్ని మొక్కలు ప్రత్తి పంటనాశించే జాసిడ్స్, త్రిప్స్, తెల్లదోమల సంఖ్యను సమర్ధవంతంగా తగ్గించాయి. వీటిలో అల్లం అత్యంత సమర్ధవంతంగా 83.3% జాసిడ్స్‌ని చంపింది. మిరప 78.3%, కాకర 68.2% జాసిడ్స్‌ని చంపాయి అత్యధిక దిగుబడులు అల్లం (2304.4 కి./హె.), మిరప (2082.2 కి./హె.) కాకర (2000 కి.హె.)లో నమోదయ్యాయి (అసిఫ్, అతని అనుచరులు, 2016).
  • పసుపు, వేప, వెల్లుల్లి ఇథనాల్ ద్రావణాలు మాగుడు తెగులు కారక శిలీంద్రం పిథియం అఫానిడెర్మేటం శిలీంద్ర పెరుగుదలను అరికట్టాయి (పర్వీన్ అండ్ శర్మ, 2014; డన, అతని అనుచరులు, 2010; సింగ్, అతని అనుచరులు, 2010).
    రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఎల్నినో ప్రభావ సమయంలో ఆవులు మరియు గేదెల సంరక్షణపాల ఉత్పత్తి, ఆరోగ్యం మరియు పశుగ్రాస భద్రత కోసం ముందస్తు చర్యలు

పరిచయం
ఆవులు, గేదెలు రైతు కుటుంబాలకు పాలు, పేడ మరియు ఆదాయాన్ని అందించే ముఖ్యమైన పశుసంపద. ఎల్నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడం, వర్షాలు ఆలస్యమవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. దీనివల్ల పచ్చిమేత, ఎండుమేత మరియు తాగునీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. ఎల్నినో ఉన్న ప్రతి సంవత్సరం తప్పనిసరిగా కరువు వస్తుందని కాదు; స్థానిక వాతావరణ సూచనలను అనుసరించి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి.

వేడి ఒత్తిడిని గుర్తించడం
అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆవులు, గేదెలలో వేడి ఒత్తిడి (Heat Stress) ఏర్పడుతుంది. వేగంగా శ్వాసించడం, నోరు తెరిచి ఊపిరి పీల్చడం, ఎక్కువగా చెమట పట్టడం, నీరు ఎక్కువగా తాగడం, మేత తీసుకోవడం తగ్గడం, నీరసం మరియు పాల దిగుబడి తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీర్ఘకాలిక వేడి ఒత్తిడి పునరుత్పత్తి సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే పశువైద్యుడిని సంప్రదించాలి.

షెడ్, నీడ మరియు గాలి ప్రసరణ
షెడ్లో గాలి సులభంగా ప్రసరించేలా పక్కభాగాలను తెరిచి ఉంచాలి. సాధ్యమైనంతవరకు షెడ్ పొడవు తూర్పు–పడమర దిశలో ఉండేలా నిర్మించాలి. పైకప్పు వేడిని తగ్గించేలా ఉండాలి; అవసరమైతే నీడ వలలు, ఫ్యాన్లు లేదా స్ప్రింక్లర్లు ఉపయోగించవచ్చు. సాధారణ మార్గదర్శకంగా ఒక్క పెద్ద పశువుకు 3.5–4.0 చదరపు మీటర్ల కప్పబడిన స్థలం, 7–8 చదరపు మీటర్ల ఓపెన్ యార్డ్, మేత తొట్టి వద్ద 60–75 సెం.మీ. స్థలం కేటాయించాలి. నేలపై నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయాలి.

నీటి నిర్వహణ
శుభ్రమైన తాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. వేడి సమయంలో పాలిచ్చే పశువులకు నీటి అవసరం పెరుగుతుంది. కాబట్టి నీటి తొట్లను తరచుగా పరిశీలించి, శుభ్రం చేయాలి. సాధ్యమైనంతవరకు తొట్ల ను నీడలో ఉంచాలి. నీటి వృథాను నివారిస్తూ బోర్లు, బావులు మరియు ఇతర నీటి వనరులను ముందుగానే గుర్తించాలి.
 
ఆవులు మరియు గేదెల సంరక్షణ – మేత, పోషణ, ఆరోగ్యం
ఎల్నినో మరియు వర్షాభావ పరిస్థితుల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

పశుగ్రాసాన్ని ముందుగానే నిల్వ చేయడం
వర్షాలు తగ్గే అవకాశం ఉన్నప్పుడు కనీసం 2–3 నెలలకు సరిపడా ఎండుమేతను పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. వరి గడ్డి, జొన్న కట్ట, మొక్కజొన్న కాండం, వేరుశెనగ కట్ట వంటి స్థానిక వనరులను సురక్షితంగా వినియోగించవచ్చు. మంచి పచ్చిమేత లభించినప్పుడు మొక్కజొన్న, జొన్న, సజ్జ లేదా నేపియర్ను సరైన దశలో కోసి సైలేజ్గా నిల్వ చేసుకోవాలి.

సైలేజ్ తయారీ మరియు మేత నాణ్యత
పచ్చిమొక్కజొన్న, జొన్న, సజ్జ లేదా నేపియర్ను తగిన దశలో కోసి 1–2 అంగుళాల ముక్కలుగా తరగాలి. తరిగిన మేతను సైలేజ్ బాగ్ లేదా గోతిలో పొరలుగా వేసి బాగా కుదించి గాలి చొరబడకుండా మూసివేయాలి. సుమారు 30–45 రోజుల తర్వాత సైలేజ్ సిద్ధమవుతుంది. మంచి సైలేజ్కు పుల్లటి వాసన ఉంటుంది; బూజు, కుళ్లు లేదా అసహజ వాసన ఉన్న మేతను పశువులకు ఇవ్వకూడదు. మేత కొరత ఉన్నప్పుడు నిల్వలను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి.

సమతుల్య దాణా మరియు ఖనిజ మిశ్రమం
మేత నాణ్యత తగ్గినప్పుడు పశువు వయస్సు, బరువు, పాల దిగుబడి మరియు శరీర స్థితికి అనుగుణంగా దాణాను సమతుల్యం చేయాలి. పశువైద్యుడు లేదా పశుసంవర్ధక నిపుణుల సూచన మేరకు ప్రాంతానికి అనువైన ఖనిజ మిశ్రమం, ఉప్పు మరియు ఇతర పోషకాలను అందించాలి. యూరియా చికిత్స చేసిన ఎండుమేతను శిక్షణ పొందిన నిపుణుల మార్గదర్శకత్వంలో మాత్రమే ఉపయోగించాలి. యూరియాను నేరుగా పశువులకు తినిపించకూడదు. బూజు పట్టిన లేదా కలుషితమైన మేతను పూర్తిగా నివారించాలి.

మేత అందించే సమయం
వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు మేత తినడం తగ్గించవచ్చు. అందువల్ల ఉదయం తొందరగా, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మేతను ఎక్కువగా అందించడం మంచిది. మధ్యాహ్నం సమయంలో నీడ, విశ్రాంతి మరియు తాగునీరు అందుబాటులో ఉంచాలి. పాలిచ్చే, గర్భిణీ మరియు బలహీనమైన పశువులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.

ఆవులు మరియు గేదెల సంరక్షణ – ఆరోగ్య పరిరక్షణ
వ్యాధుల నివారణ, అత్యవసర చర్యలు మరియు రైతులకు ముఖ్య సూచనలు

ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ
పశువుల ఆరోగ్యాన్ని ప్రతిరోజూ గమనించాలి. స్థానిక పశువైద్య శాఖ సూచనల ప్రకారం టీకాలు వేయించాలి; నులిపురుగుల నివారణ, టిక్ నియంత్రణ మరియు షెడ్ పరిశుభ్రతను పాటించాలి. నీటి తొట్లు, మేత తొట్లు శుభ్రంగా ఉంచాలి. కొత్తగా తీసుకొచ్చిన పశువులను కొంతకాలం వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని గమనించడం మంచిది.

అనారోగ్య సూచనలు కనిపిస్తే
మేత తినకపోవడం, నీరు తాగకపోవడం, జ్వరం, దగ్గు, విరేచనాలు, అధిక లాలాజలం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడవలేకపోవడం, చర్మంపై అసాధారణ గాయాలు లేదా పాల ఉత్పత్తి అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. అనారోగ్య పశువును అవసరమైతే ఇతర పశువుల నుంచి వేరు ఉంచాలి. స్వయంగా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు ఇవ్వకూడదు.

రైతులు ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి
కనీసం 2–3 నెలలకు సరిపడా ఎండుమేత, అవసరమైన సైలేజ్, ఖనిజ మిశ్రమం, ఉప్పు, శుభ్రపరిచే సామగ్రి మరియు పశువైద్యుని సంప్రదింపు వివరాలు సిద్ధంగా ఉంచాలి. గ్రామస్థాయిలో రైతులు కలిసి మేత బ్యాంకు ఏర్పాటు చేసుకుంటే కొరత సమయంలో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న మేత మరియు నీటికి అనుగుణంగా పశువుల నిర్వహణ ప్రణాళిక చేసుకోవాలి.

ముగింపు – రైతులకు సందేశం
ఎల్నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, ముందస్తు మేత నిల్వ, శుభ్రమైన నీరు, నీడ, గాలి ప్రసరణ, సమతుల్య దాణా మరియు ఆరోగ్య పర్యవేక్షణ ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. వాతావరణ సూచనలను గమనిస్తూ స్థానిక పశుసంవర్ధక శాఖ సలహాలను పాటించాలి. “మేతను ముందే నిల్వ చేయండి – నీటిని పొదుపు చేయండి – పశువుల ఆరోగ్యాన్ని కాపాడండి.”

Read More