కాళ్ళు మెలికలు తిరిగి, లిగమెంట్స్ బిగుసుకుపోయి దూడ పుట్టటం

కొన్ని దూడలు పుట్టేటపుడు కాళ్ళ లిగమెంట్స్ బిగుసుకుపోయి, కాళ్ళు మెలికలు తిరిగి, మడతలతో పుట్టటం అప్పుడప్పుడు జరుగుతుంది.
తల్లిగోవు చూడిగా వున్నప్పుడు, మాంగనీస్ అను ఖనిజ లవణం లభ్యం కానందున, ఈ విధంగా జరుగుతుంది.
కాళ్ళ ఎముకలు విరగలేదని నిర్ధారించుకోవాలి

గృహవైద్యం:

  1. బిగుసుకుపోయిన లిగమెంట్స్ సరిచేసి, కాళ్ళు సాఫు చేసి, పచ్చి వెదురు బద్దలు చెక్కి, చర్మానికి గాయం కాకుండా బద్దల చివళ్ళకు దూది చుట్టి కాళ్ళకు కట్టాలి. వారం రోజులలోపుగానే కాళ్ళ వంకరలు తగ్గిపోతాయి.
  2. కాళ్ళకు గుంటకలగరాకు పసరు రాయాలి.
    పుట్టిన దూడ లిగమెంట్స్ బిగుసుకుపోయి వున్నా, లేదా అంగవైకల్యాలు వున్నా వెంటనే పశువైద్యుని సంప్రదిస్తే, వారు తగు శస్త్రచికిత్స చేస్తారు.
    ఈ స్థితి రాకుండా ఉండాలంటే సల్ఫర్ 200 ఒక మోతాదు, 3 నెలల చూడిగా ఉన్నప్పుడు మరొక మోతాదు 6 మరియు 8వ నెల చూడిగా ఉన్నప్పుడు తల్లికి తినిపించాలి.

అల్లోపతి: పుట్టిన దూడకు కాళ్ళ లిగమెంట్స్ బిగుసుకుపోయి వున్నా, అంగవైకల్యాలు వున్నా, దూడ పుట్టిన వెంటనే ఆలస్యం చేయకుండా పశువైద్యుని సంప్రదిస్తే వారు తగిన శస్త్ర చికిత్స చేస్తారు.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… కస్తూరి పసుపు

సాధారణ నామం : వైల్డ్ టర్మరిక్, ఎల్లో జడోరీ
శాస్త్రీయ నామం : కర్కుమా ఆరోమాటికా
కుటుంబం: జింజిబెరేసి

ఇది 75 సెం.మీ. ఎత్తు పెరిగే దుంప కొమ్ము (రైజోమ్) గల మొక్క. మొక్క వేర్లు చేమగడ్డలవలె ఉంటాయి. పత్రాలు పెద్దవిగా, పొడవుగా, వెడల్పుగా, కుంభకటకాకారంలో ఉండి కింది భాగంలో కాడవలె సన్నబడి ఉంటాయి. పుష్పాలు లేత గులాబి రంగులో పుష్పపుచ్ఛాలతో కూడిన కంకివలె వస్తాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చెందిస్తారు. దుంప సువాసనతో, చేదుగా ఉంటుంది. దుంప లోపలి భాగం నారింజ ఎరుపు రంగులోను, బయటివైపు పసుపు రంగులోను ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దుంప కొమ్ములు “కుర్కుమిన్” అనుబడు రసాయనం కలిగి ఉండి ఔషధములలో వాడబడుతున్నాయి.
  • కస్తూరి పసుపు వీర్యపుష్టికి, క్రిమిహరము, సర్ప విషము, వాతమునకు ఉపయోగపడుతుంది. ఒంటికి పూసిన యెడల గజ్జి, స్ఫోటక పొక్కులు నయమవుతాయి. దీనిని ఎక్కువగా అలంకారపు వస్తువులలో ఉపయోగిస్తారు. కుష్ఠు, శ్వాసకోశవ్యాదులు, బొల్లి, ఒళ్ళునొప్పులు, తల నొప్పి మరియు చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కస్తూరి పసుపు ద్రావణాన్ని పురుగు వికర్షక ఉత్పత్తిగా ఉపయోగిస్తారు (ముస్తాఫాడెబ్బేన్, అతని అనుచరులు, 2006)
  • కస్తూరి పసుపు ఇథనాల్ ద్రావణం యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ చర్యలనుకలిగి ఉంది (హరిత్, అతని అనుచరులు, 2013).
  • కస్తూరి పసుపు దోమలపై వికర్షక చర్యను ప్రదర్శించింది (దాస్, అతని అనుచరులు, 2000)
  • కస్తూరి పసుపు హెక్సేన్ ద్రావణం గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాపై యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. కాని గ్రామ్ నెగటివి˜ బాక్టీరియాపై చూపలేదు (రేవతి అండ్ మాలతి, 2013).
  • కస్తూరి పసుపు ఇథైల్ ఎసిటేట్ ద్రావణం క్యూలెక్స్ విష్ణుయ్ గ్రూప్‌పై మంచి లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. కస్తూరి పసుపు దుంప ద్రావణాలను క్యూలెక్స్ విష్ణుయ్ గ్రూప్ లార్వాలపై ప్రత్యామ్నాయ లార్విసైడ్‌గా ఉపయోగించవచ్చు (మాల్లిక్, అతని అనుచరులు, 2014).
  • కస్తూరి పసుపు ఎసెన్షియల్ ఆయిల్ అనేక పురుగులపై కీటక నాశక చర్యను ప్రదర్శించింది (రావ్, 1976).
  • ఆవాలు, కొబ్బరి నూనెల ఆధారిత దుంప ద్రావణం దోమల నుండి రక్షణనిచ్చింది. కస్తూరి పసుపు ఇథనాల్ ద్రావణం ఆర్మిజెరెస్ సబాల్బాటస్, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్, క్యూలెక్స్ ట్రైటీనియోరింకస్‌ల నుండి రక్షణ ప్రభావాన్ని చూపింది. ఈ ద్రావణాన్ని శరీర భాగాలపై పూసుకుని దోమ కాట్ల నుండి సమర్ధవంతంగా రక్షించుకోవచ్చు. (దాస్, అతని అనుచరులు, 1999)
  • దుంప ద్రావణం ఈడెస్ టుగాయ్‌ని సమర్థవంతంగా నివారించింది (పిటసావట్, అతని అనుచరులు, 2003).
  • ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ చెరకు తోటల నాశించే తెల్ల చెదలు, ఒడొంటోటెర్మెస్ ఒబెసస్‌ని సమర్ధవంతంగా నివారించింది (గుర్దీప్, అతని అనుచరులు, 2004).
  • దుంప ద్రావణం, ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి 4వ దశ లార్వాలపై గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (చూకోట్, అతని అనుచరులు, 2005).
  • దుంప ద్రావణం నుండి వేరు చేసిన 9 ఆక్సోనియో ప్రోకర్కుమినాల్, నియోప్రోకర్కుమినాల్ కంటే అధికంగా క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్‌పై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (మధు, అతని అనుచరులు, 2010)
  • దుంపల నీటి ద్రావణం బాసిల్లస్ సబ్‌టైలిస్, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (స్మిత, అతని అనుచరులు 2010)
  • కస్తూరి దుంపల హెక్సేన్, క్లోరోఫాం, ఇథైల్ అసిటేట్, మిథనాల్, పెట్రోలియం ఈథర్ ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, లిస్టీరియా మోనోసైటోజెనెస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, ఎస్కెరిచియా కోలి, సాల్మొనెల్లా ట్రైఫిమ్యారియంపై యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. కనుక ఈ ద్రావణాన్ని ఆహార పదార్థాల నాశించి వ్యాధులు కలిగించే బాక్టీరియా నుండి సహజ ప్రిజర్వేటివ్‌గా ఉపయోగించవచ్చు. (ఆల్‌రెజా, అతని అనుచరులు, 2004).
  • కస్తూరి దుంప ఎసెన్షియల్ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫాల్కేటం, ఆస్పర్ౙిల్లస్ టెర్రియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం మొనిలిఫార్మె, కర్వులేరియా పాల్లెసెన్స్‌పై యాంటీఫంగల్ చర్యను ప్రదర్శించింది (గుర్దీప్, అతని అనుచరులు, 2004).
  • కస్తూరి దుంప ఇథనాల్ ద్రావణం రైజోపస్ స్టొలానిఫర్, బోట్రెåటిస్ సినరియా, కొల్లేటోట్రైకం కోకోడెస్‌లను సమర్థవంతంగా అరికట్టింది (భగవత్, అతని అనుచరులు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More