శంఖుపుష్పం / దింతెన

సాధారణ నామం : బ్లూ పీ / బటర్‌ఫ్లైపీ శాస్త్రీయ నామం : క్లిటోరియా టెర్నేటియా కుటుంబం: ఫాబేసి

శంఖుపుష్పం ఒక బహువార్షిక హెర్బల్ మొక్క. ఆకులు అండాకారంలో ఉంటాయి. ఇది ఒక తీగ లేదా క్రీపర్‌లా పెరుగుతుంది. ఈ మొక్కలో కొట్ట వచ్చినట్లు కనిపించేవి వాటి ముదురు నీలం రంగు పూలు. అవి 4 సెం.మీ. పొడవు, 3 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కొన్ని రకాలు తెలుపు రంగు పూలు పూస్తాయి. కాయలు 5-7 సెం.మీ. పొడవుండి, ప్రతి కాయలో 6 నుండి 10 గింజలుంటాయి. లేత కాయలను తింటారు. దీనిని అలంకరణ మొక్కగా పెంచుతారు. దీని వేర్లు రైజోబియంతో కలిసి జీవిస్తూ పరస్పర సహకారమందించుకుంటాయి.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వాపు, నొప్పిని తగ్గిస్తుంది.
  • రక్తం పడే మొల్లల చికిత్సలో ఉపయోగిస్తారు. మొల్లలను ఆకుల కషాయంతో శుభ్రపరుస్తారు. మొత్తం మొక్క పేస్టుని మొల్లలపై పూస్తారు.
  • తలనొప్పి నివారణకు ఆకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేస్తారు.
  • రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ చికిత్సలో థామాసాతో మరగించిన నూనెతో మర్ధన చేస్తారు.
  • నోటిలోపల వాపుకు ఆకు కషాయంతో పుక్కిలిస్తారు. గాయాలను శుభ్రపరచడానికి కూడా ఈ కషాయాన్ని ఉపయోగిస్తారు. చీము ఏర్పడకుండా నివారిస్తుంది.
  • వ్యవసాయరంగంలో
  • శంఖుపుష్పం ద్రావణం నుండి తయారు చేసిన మేళనం కీటకనాశక చర్య మరియు / లేదా వికర్షక చర్య మరియు / లేదా పురుగు గుడ్లు పెట్టకుండా నిరోధించడం మరియు / లేదా గుడ్లు పెట్టే స్థానంపై ప్రభావం చూపడం మరియు / లేదా పురుగు మొక్కపై తినకుండా అవరోధించడం వంటి చర్యల ద్వారా పురుగులనరికడుతుంది.
  • ఈ మేళనం కీటకనాశక చర్య ద్వారా వ్యవసాయ పంటలనాశించే పెద్ద పురుగులు, లార్వాలను లేదా రసంపీల్చే పురుగులను నివారిస్తుంది. దీనిని ప్రత్తి పంటనాశించే హెలికోవర్మా ఆర్మిజరాపై ఉపయోగించి ప్రయోగాలు చేశారు. (రాబర్ట్ మెన్సా, 2012).
  • శంఖు పుష్పం గింజల ద్రావణం రైజోక్టోనియా సొలాని పై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
  • ద్రావణంలోని ప్రోటీన్ ఫినోటిన్ చిక్కుడునాశించే ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు శిలీంద్రం, కొల్లెటోట్రైకం లిండముథియానం మరియు బాక్టీరియల్ బ్లెåట్‌కారకం క్ౙాంతో మోనాస్ ఆక్సొనోపొడిస్ ఫేసియోలి; వరి నాశించే బైపొలారిస్ ఒరైజే, పైరిక్యులేరియా గ్రిసియా, బ్రాకియేరియా స్పీ, నాశించే రైజోక్టోనియా సొలానిలపై శిలీంద్రనాశక, బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది. ఈ ప్రోటీన్ జాబ్రోటెస్ సబ్‌ఫాసియేటస్ మరియు అకాంతోసీలిడియస్ ఒబెక్టస్ బ్రూచిడ్ల మొదటి దశ లార్వాలపై అధిక విష ప్రభావాన్ని ప్రదర్శించింది (కెలెము, అతని అనుచరులు, 2004).
  • శంఖుపుష్పం ఆకు ద్రావణాలు మలేరియా, ఫైలేరియా జ్వరం, ఎన్సెఫెలైటిస్, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాప్తి చేసే వాహకాలు ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ పెద్ద పురుగుల విడుదలను అరికట్టింది (అరివోలి, అతని అనుచరులు, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వైరస్ నివారిణి పునర్నవ (ఎర్రగలిజేరు) కషాయం

  • పునర్నవ కషాయం వైరస్ నివారిణిగా టమాట ఆకు ముడత వైరస్, టమాట మొజాయిక్, పొటాటో వైరస్, కుకుంబర్ గ్రీన్ మాటల్ వైరస్, వంగ మొజాయిక్, టమాట ఎల్లోమొజాయిక్ వైరస్, పెసర ఎల్లో మొజాయిక్ వైరస్, బీన్ కామన్ మొజాయిక్ వైరస్, సార మొజాయిక్ వైరస్, పుచ్చ మొజాయిక్ వైరస్, కుకుంబర్ గ్రీన్ మొజాయిక్ వైరస్, కుకుంబర్ గ్రీన్ మాటిల్ వైరస్‌లను నివారిస్తుంది.
  • 5 శాతం పునర్నవ వేరు కషాయం క్షేత్ర స్థాయిలో బెండ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్‌ని మొక్కదశ నుండి వారం రోజుల వ్యవదిలో పిచికారి చేయడం ద్వారా నివారించింది.
  • అన్ని రకాల వైరస్, బాక్టీరియా తెగుళ్ళ నుండి పునర్నవ కషాయం కాపాడుతుంది.

Read More

ఔషధ మొక్క… వడిసె / కడిసె

వడిసె కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ మరల పుట్టించు ఒక చిన్న చెట్టు. బెరడు ముదురు గోధుమ రంగు, ఎరుపు రంగుతో కూడిన నలుపు రంగులో గరుకుగా ఉండి, నలుచదరపు కొయ్య పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడి, రబ్బరులాగా, గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో 1.53 అం. పొడవు, రంగుతో ఆకు మొదలులో గుత్తులుగా ఏర్పడతాయి. క్యాప్సూల్ కొయ్యలాగా తొడిమ లేకుండా, గుండ్రంగా, 3 లేదా 4 చీలిన భాగాలు కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో దీని విషపూరిత స్వభావం ఒక సమస్య.

సాధారణ నామం : గరారి శాస్త్రీయ నామం : క్లిస్టాంతస్ కోల్లినస్ కుటుంబం: ఫిల్లాంతేసి

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • వడిసాకు డికాక్షన్ (50%) వరి నాశించే తాటాకు తెగులు (హిస్పా), ఆకుచుట్టు పురుగు, కాండంతొలుచు పురుగులను నివారించింది. ప్రత్యేకంగా గొట్టం పురుగు (నిమ్‌ఫ్యులా డిపంక్టాలిస్)ని సమర్ధవంతంగా నివారించింది. ఈ ద్రావణాన్ని ఒకసారి పిచికారి చేస్తే అన్ని పురుగులు 12 గంటలలో సంహరించబడ్డాయి.. పంటకోత వరకు పురుగులు ఆశించలేదు (భారతి అహిర్వార్, ఆమె అనుచరులు, 2011).
  • జార్ఖండ్‌లోని రాంచి జిల్లాకి చెందిన రైతులు వరిలో ఉల్లికోడు నివారణకు వడిసాకులను సేకరించి ఎకరానికి 40 కి. చొప్పున వేస్తారు.
  • 100 చ.మీ.కి 5 కి. వడిసె తాజా ఆకులను చల్లి గొట్టం పురుగుని నివారించవచ్చు. (శ్రీవాస్తవ, అతని అనుచరులు, 2009)
  • వడిసె ఆకులోని రసాయనాలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులను, పిండినల్లులను, లద్దె పురుగులు / లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తాయి. దీనిని జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు.(నమ్రతాకుమారి, ఆమె అనుచరులు, 2016).
  • వడిసె మొక్కలోని పాలిఫినాలిక్ పదార్థం పల్స్ బీటిల్, చెదలు, ప్రత్తి ఆకు తినే ఆర్మివర్మ్‌పై కీటకనాశక చర్య ప్రదర్శించింది. అనేక నిల్వ ధాన్యాలనాశించే పురుగుల లార్వాలను సంహరించే శక్తిని ప్రదర్శించింది (పరితోష్ భట్టాచార్య, 2016).
  • తోటకూర పంటపై వడిసె ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి తోటకూర ఆకులను తినే లార్వా (హైమెనియా రికర్వాలిస్)ల సంఖ్యను తగ్గించవచ్చు. (అరివుడైనంబి, అతని అనుచరులు, 2010)
  • వడిసె ఆకు ద్రావణం ప్రయోగశాలలో ప్రత్తికాయతొలుచు పురుగు, హెలికోవర్ప ఆర్మిజరాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (దేశ్‌ముఖ్, అతని అనుచరులు, 2013).
  • వడిసె లేత కొమ్మలను, పొడి ఆకుపొడిని వరి పొలంలో పురుగుల నివారణకు, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు. (సౌమిత్‌బెహరా, అతని అనుచరులు, 2006).
  • వడిసె ఆకులనుపయోగించి హెర్బల్ ద్రావణం తయారు చేసి అనేక పురుగులను నివారించవచ్చు.

హెర్బల్ ద్రావణం తయారు చేసే పద్ధతి :
కావలసిన పదార్థాలు :
వడిసె ఆకులు – 1కి.
ఉమ్మెత్త కాయలు – 1 కి.
మధుక లాంగిఫోలియాపిండి – 1 కి.
గన్నేరు పప్పు – 1 కి.
పొగాకు రద్దు – 500 గ్రా.
సున్నం – 250 గ్రా.
ఆవుమూత్రం – 5 లీ.
మట్టికుండ – 1

తయారు చేసే పద్దతి :

  • ఒక మట్టి కుండలో వడిసె మొక్క ఆకులు, సన్నగా తరిగిన ఉమ్మెత్త కాయల ముక్కలు, గన్నేరు గింజలు అన్నింటినీ నూరి, మధుకలాంగి ఫోలియాపిండి, పొగాకు రద్దు, సున్నం కలిపి 5 లీ. ఆవు మూత్రం పోయాలి.
  • మట్టి పాత్రను మూతతో కప్పి ఎరువు గుంత / మట్టిలో 7 రోజులు పూడ్చి ఉంచాలి.
  • పై మిశ్రమాన్ని వడపోసి 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి పిచికారి చేసి అన్ని పురుగులను నివారించవచ్చు.
  • వడిసె ఆకులు వికర్షక చర్యతో చెదలను అరికడతాయి.
  • వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగు నివారణకు ఎకరానికి 80 కి. వడిసె ఆకులను వేయాలి.
  • పశ్చిమ బెంగాల్‌కి చెందిన పురులియా గ్రామ రైతులు వరి చేలో ఎకరానికి 150 కి. వడిసె ఆకులను వేసి పసుపుపచ్చ కాండంతొలుచు పురుగు, గొట్టపు పురుగు, హిస్పాలను సమర్ధవంతంగా నివారించడమేగాక 20-40% అధిక దిగుబడులను పొందారు (కళ్యాణ్ కెవికె, పశ్చిమబెంగాల్, 2017)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… హార్స్ ఉడ్

ఒక పొద లేదా చిన్న చెట్టు. ఇది 10 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి బెరడు నునుపు దనంతో, పలుచని, గచ్ౘ్కాయ – ఆకుపచ్చ రంగులో ఉండి వయసుతోపాటు గోధుమ రంగుకి మారుతుంది. ఆకులు చిన్న ఆకులతో 30 సెం.మీ. పొడవుంటాయి. పెద్ద ఆకులో 11-37 చిన్న ఆకులుంటాయి. చిన్న ఆకులు కొడి గుడ్డు ఆకారంలో ఉంటాయి. ఆకు ఉపరితలంలో అనేక గ్రంథులుండి సువాసన కలగి ఉంటాయి. పూలు సువాసన కలిగిన పూలు. కాయ అండాకారంలో 3.3 -7.0 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : హార్సఉడ్ శాస్త్రీయ నామం : క్లాసెనా అనిసాట కుటుంబం: రూటేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వివిధ ఆఫ్రికా దేశాలలో ఈ మొక్కని అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. నైజీరియాలో క్లాసెనా అనిసేట, అప్రీగిల్‌పానిక్యులేట, వేప మిశ్రమంతో తయారు చేసిన ‘ఆబ్గో’ అనే కషాయాన్ని మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. టాంజెనియాలో సంప్రదాయ వైద్యులు దీనిని నోటి కాండిడియాసిస్, చర్మవ్యాధుల చికిత్సకుపయోగిస్తారు. టాంజెనియాలో దీనిని మూర్ఛ రోగ చికిత్సలో ఉపయోగిస్తారు. దక్షిణాఫ్రికాలో ఈ మొక్క ఆకులను అధిక రక్తపోటు నివారణకు ఉపయోగిస్తారు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలలో, ఫిలిప్పెåన్స్‌లో దోమలను వికర్షించడానికి తాజా ఆకులను కాలుస్తారు.
  • ఆహారం ద్వారా కలిగే జబ్బులను వ్యాప్తి చేసే కొరినిబాక్టీరియం డిఫ్తీరియా, ఎస్కరిచియా కోలి, సూడోమోనాస్ యీరూజనోసా బాక్టీరియాల నివారణకు ఉపయోగిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • క్లాసెనా అనిసాట ద్రావణం దోమలు, ఈగలు, వీవిల్స్‌ని నివారించింది (ముకండివ, అతని అనుచరులు, 2016).
  • చిక్కుడు గింజలపై బంకమట్టి, ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమం పొడి ఫార్ములేషన్ పూత నిల్వ సమయాలలో గింజలను ఆశించే పురుగు అకాంతోసెలిడస్ ఓబ్టెక్టస్ సంతతి ఉత్పత్తిని నివారించింది. (ఎన్‌డోమ్, అతని అనుచరులు, 2008). సువాసన గల బంకమట్టి పొడి ఎసెన్షియల్ ఆయిల్ కన్నా ఎక్కువ విషపూరిత చర్య కలిగిఉంది. ఎసెన్షియల్ ఆయిల్ మధ్యమ వికర్షణ చర్య, అధిక ఫ్యూమిగెంట్ విషపూరిత చర్య ప్రదర్శించింది.
  • క్లాసెనా అనిసాట ద్రావణం మిడత (జోనోసెరస్ వెరైగేట్స్) నివారణలో ఉపయోగిస్తుంది (ఒకునడె అండ్ ఒలైఫా, 1987).
  • క్లాసెనా అనిసాట ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ జియా మెయిస్ పెద్ద పురుగులను స్పర్శ, ఇన్‌హలేషన్ ప్రక్రియల ద్వారా నివారించింది (గౌడౌమ్, అతని అనుచరులు, 2013).
  • క్లాసినా అనిసాట ఆకుల పొడి మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే ప్రోస్టెఫోనస్ ట్రంకీటస్, సైటోఫిలస్ జియామెయిస్ పురుగులను గణనీయంగా అరికట్టాయి (నూకెనైన్, అతని అనుచరులు, 2010).
  • క్లాసినా ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ మలేరియా వ్యాప్తి చేసే దోమలు క్యూలెక్స్ క్వింక్విఫేసియన్స్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టిఫెన్సిలను గణనీయంగా చంపాయి (గోవింద రాజన్, 2010).
  • సాంప్రదాయకంగా ఆఫ్రికాలోని అనేక కమ్యూనిటీలలో ఈ మొక్కని దోమలు, ఈగలు, వీవిల్స్ వంటి పురుగుల నివారణలో ఉపయోగిస్తున్నారు. క్రూడ్ ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలను అనేక పురుగులపై పరీక్షించి వాటి సమర్ధతను నిరూపించారు. కౌమారిన్లు, కార్బజోల్ ఆల్కలాయిడ్లు, లియొనాయిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి సుమారు 50 మిశ్రమాలను వేరు చేసి గుర్తించారు. వీటిలో కొన్ని పురుగు మందుల లక్షణాలు కలిగి ఉన్నాయని నిరూపించబడ్డాయి (ముకుండివ, అతని అనుచరులు, 2016). ఈ మొక్క ద్రావణం పాలిచ్చే జంతువుల చర్మాన్ని ఆశించే ఈగల లార్వాలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించింది (ముకుండివ, అతని అనుచరులు, 2012).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. బత్తాయి

బత్తాయి ఒక చిన్న, ముళ్ల చెట్టు. ఇది 7.5 మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు తోలు లాగా నిత్యహరితంగా ఉండి 6.5 నుండి 15 సెం.మీ. పొడవు, 2.5-9.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. ఇవి సన్నని రెక్కలతో ఆకుకాడమీద ఏర్పడతాయి. సువాసన గల తెల్లని పూలు ఒకటిగా లేదా 6 పూలున్న గుత్తులుగా ఏర్పడతాయి. పూవు సుమారు 5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటుంది. కాయగుండ్రంగా 6.5 నుండి 9.5 సెం.మీ. వెడల్పు కలిగి, పండినపుడు నారింజ లేదా పసుపు రంగులో ఉంటుంది. కాయ తోలు అనేక చిన్న గ్రంథులను కలిగి ఉంటుంది. పండు గుజ్ౙు తియ్యని రసం కలిగి ఉంటుంది. పండులో 10 నుండి 14 తొనలుంటాయి.

సాధారణ నామం : సిట్రస్ శాస్త్రీయ నామం : సిట్రస్ సైనెన్సిస్ కుటుంబం: రూటేసి

ఉపయోగాలు : ఔషధరంగలో …

  • బత్తాయి పండ్లను ఆహారంగా తీసుకుంటారు. పూల నుండి టీ తయారు చేయవచ్చు. పండు తొక్క, పూలు, ఆకుల నుండి ఎసెన్షియల్ ఆయిల్ తీస్తారు. ఎసెన్షియల్ ఆయిల్‌ని హెర్బల్ ఔషధంగా ఉపయోగిస్తారు. ఎసెన్షియల్ ఆయిల్‌లో డిలిమోనీన్ అనే మోనోటెర్పిన్ 90% ఉంటుంది. సిట్రాల్, సిట్రొనెల్లాల్, డెకనాల్, ఆక్టనాల్ అనే ఆల్డిహైడ్స్, నెరైల్ ఎసిటేట్, ఇథైల్ ఎసిటేట్ ఎస్టర్స్ ఉంటాయి.
  • ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ లక్షణాలున్న కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పెక్టిన్ ఉంటాయి. ఎసెన్షియల్ ఆయిల్ యాంటిసెప్టిక్, యాంటిఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి మలబద్ధకం, గ్యాస్ట్రెåటస్, మోషన్‌సిక్‌నెస్, తిమ్మిర్లు, కోలిక్, ఊబకాయం, బ్రోంకైటిస్, నోటిపుండ్లు, నరాల టెన్షన్, కుంగుబాటు, వత్తిడి వంటి సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు. బత్తాయిపండ్లలో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం, కాపర్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్, బయోఫ్లేవనాయిడ్స్, సహజ చక్కెర, పెక్టిన్ ఉంటాయి.
  • యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జలుబులు, ఫ్లూచికిత్సలో ఉపయోగపడుతుంది. ఇది అధిక రక్తపోటుని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • బత్తాయి తోలు పొడి (5, 10, 15 గ్రాములు) కన్‌ఫ్యూజ్‌డ్ ఫ్లోర్ బీటిల్, ట్రైబోలియం కన్ఫ్యూజమ్ పెద్ద పురుగులను 30, 40, 43.3% చంపింది. బత్తాయి తోలు ఎసెన్షియల్ ఆయిల్ తొక్కపొడి కన్నా సమర్ధవంతంగా పని చేసింది. 10% ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం 3 రోజుల తర్వాత 100% పురుగులను చంపింది (యూనిస్, 2014).
  • బత్తాయి తోలు, నిమ్మతోలు ఆవిరయ్యే ద్రావణాలు దోమ, బొద్దింక, ఈగలపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి. ఈ ద్రావణాలను పిచికారి చేసిన 30 ని. కంటే 60 ని.కి అధిక కీటకనాశిక చర్యను ప్రదర్శించాయి. బత్తాయితోలు ఆవిరయ్యే ద్రావణాలు నిమ్మ తోలు ద్రావణాలు కన్నా అధిక కీటక నాశక చర్యను చూపాయి. బొద్దింకలపై ఈ ద్రావణాలు అధికంగా పనిచేశాయి (ఎజియోను, అతని అనుచరులు, 2001).
  • బత్తాయి తోలు ఎసెన్షియల్ ఆయిల్ (2.5, 3.0 మైక్రోగ్రాములు) ఆస్పర్ౙిల్లస్ నైగర్ పెరుగుదలను అరికట్టింది (శర్మ, త్రిపాఠి, 2008).
  • బత్తాయి ఎసెన్షియల్ ఆయిల్ ఈగ (మస్కాడొమెస్టికా)పై అత్యధిక కీటకనాశక ప్రభావం చూపింది. దీనిని సహజ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (పలాసియోస్, అతని అనుచరులు, 2009).
  • గ్రేప్‌ఫ్రూట్ (సిట్రస్ పారడైసి), బత్తాయి (సిట్రస్ సైనెన్సిస్), నిమ్మ (సిట్రస్ ఆరాంటిఫోలియా) ఎసెన్షియల్ ఆయిల్ దోమ (క్యూలెక్స్ క్వింక్విఫేసియెన్స్)పై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఇవి లార్వాలపైనేగాక ప్యూపా, పెద్ద పురుగుల విడుదలపై కూడా ప్రభావాన్ని చూపాయి (అబ్డెలతీఫ్, 2004).
  • బత్తాయి తోలు ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న వీవిల్, సైటోఫిలస్ జియామెయిస్‌పై ఫ్యూమిగేషన్ చర్యను ప్రదర్శించి 100% పురుగులను చంపింది. కాని 36% వికర్షక చర్యను మాత్రమే చూపింది(డావిట్‌కిడేన్, 2013).
  • బత్తాయితోలు ఎసెన్షియల్ ఆయిల్ చిక్కుడు గింజల నిల్వ సమయంలో ఆశించే జబ్రోటెస్ సబ్‌ఫాసియాటస్ పురుగులను 24 గంటల తర్వాత 100% చంపింది. చిక్కుడు గింజలను 15 గ్రా. ఎండబెట్టిన బత్తాయి తోలు పొడి 750 మి.గ్రా. ఎసెన్షియల్ ఆయిల్‌తో శుద్ధిచేసినపుడు 65% మరియు 67% పురుగులు చంపబడ్డాయి. తోలు పొడి పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా తగ్గించింది. ఎసెన్షియల్ ఆయిల్ తక్కువ మోతాదు (30 మిగ్రా.)లో వాడినా ఒక పెద్ద పురుగు కూడా విడుదల అవలేదు. పొడి, ఎసెన్షియల్ అత్యధిక ఫ్యూమిగేషన్ చర్యను ప్రదర్శించింది (జెవ్‌డి, జెంబెరె, 2010).
  • కిన్నో మరియు బత్తాయి తోలు, గింజల నుండి వేరు చేసిన ఆవిరయ్యే ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై విషప్రభావం చూపాయి. కమల తోలు, గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ పురుగుపై బత్తాయి తోలు, గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ కన్నా అధిక విష ప్రభావాన్ని చూపాయి (సలీం, అతని అనుచరులు, 2013).
  • అలసంద గింజలు, నిల్వ సమయంలో అధిక నష్టం కలిగించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులను బత్తాయి తోలు ద్రావణం అత్యధికంగా మొదటి రోజే చంపింది. ఈ ద్రావణం గుడ్లు పొదగడాన్ని కూడా నివారించింది (ఒజెబొడె, అతని అనుచరులు, 2016).
  • బత్తాయి (సిట్రస్ సైనెన్సిస్), నిమ్మ (సిట్రస్ ఆరాంటిఫోలియా), గజనిమ్మ (సిట్రస్ లిమన్) తోళ్ళ నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రభావాన్ని వడ్రంగి చీమల (కాంపొనేటస్‌నియార్ట్కికస్)పై అధ్యయనం చేశారు. అన్ని ద్రావణాలు వడ్రంగి చీమలపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. మూడింటిలో బత్తాయి తోలు ద్రావణం అత్యల్ప (82.5%) చర్యను, గజనిమ్మ తోలు ద్రావణం అత్యధిక (95%) చర్యను ప్రదర్శించాయి. నిమ్మతోలు ద్రావణం అత్యధిక మరణ చర్యను ప్రదర్శించగా, బత్తాయి తోలు ద్రావణం అత్యల్ప మరణ చర్యను ప్రదర్శించింది (అడుసెమెన్సా, అతని అనుచరులు, 2014).
  • బత్తాయి ఆకుల ద్రావణం చెద పురుగుల (మాక్రోటెర్మస్ స్పీసీస్)పై 86.67% చావు చర్యను, 26.67% వికర్షక చర్యను ప్రదర్శించింది (ఒసిపిటన్, ఇసెమెమి, 2012).
  • బత్తాయి (ఆకులు/తోలు) ఇథనాల్ ద్రావణం కాప్రా బీటిల్ ట్రోగోడెర్మా గ్రానేరియం 4వ దశ లార్వాలు, పెద్ద పురుగులపై లార్విసైడల్ మరియు అడల్టిసైడల్ చర్యలను ప్రదర్శించింది. బత్తాయి ద్రావణంలోని సపోనిన్స్, ఆల్కలాయిడ్స్, స్టీరాయిడ్స్, టానిన్స్, కార్డియక్ గ్లెåకోసైడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్ వంటి సెకండరీ మెటబొలైట్స్ ఉండటం వలన కొంత కీటకనాశక చర్యను కూడా కలిగి ఉందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి (మూసా, అతని అనుచరులు, 2016).
  • కిన్నో (తోలు, ఆకులు) ఇథనాల్ ద్రావణం పొడి రూపంకన్నా నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగు, ట్రైబోలియం కాస్టానియంపై అధిక ప్రభావాన్ని చూపింది. అంతేగాక కిన్నో తోలు ద్రావణం, ఆకు ద్రావణం ఒకే రీతిలో ప్రభావం చూపాయి. ఈ ద్రావణం రసాయన పురుగు మందు, మిథోప్రెన్ తో సమానంగా పురుగుపై చర్య చూపింది (ఇరామ్, అతని అనుచరులు, 2013).
  • సిట్రస్ పారడైసి, పుల్ల నారింజ, గజనిమ్మ, బత్తాయి పండ్ల తోలు నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ వోలటైల్ కాంపౌండ్స్ అలసంద బ్రూచిడ్ పెద్ద పురుగుల (కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్) పై అధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించాయి. సిట్రస్ పారడైసి ఆయిల్ సిట్రస్ ఆరాంటియం, సిట్రస్ లిమోనియం ఆయిల్స్ కన్నా అధిక సామర్థ్యాన్ని చూపింది. సిట్రస్ పండ్ల తోలు ద్రావణాలు అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే బీటిల్స్ నివారణలో సమర్ధవంతంగా ఉపయోగించవచ్చు అని ఫలితాలు వెల్లడించాయి (మొరావ్వెజ్, అబ్బార్, 2008).
  • దీర్ఘకాలం నుండి సిట్రస్ జాతి మొక్కలు పురుగు నియంత్రణ కారకాలుగా గుర్తించబడ్డాయి. పండ్ల తోలులోని ఆయిల్స్ మెడిటోరియన్ పండుఈగ, సెరాటిటిస్, గుడ్లు, లార్వాలను చంపుతాయి (బాక్, పెంబర్టన్, 1915). పండ్ల తోలులోని వోలటైల్ కాంపౌండ్స్ కారిబ్బియన్ పండుఈగ, అనాస్ట్రెఫా సస్పెన్స్ గుడ్లను, లార్వాలను చంపుతాయి (గ్రీని, అతని అనుచరులు, 1983). వీటిలో సిట్రాల్, లిమోనెన్ కన్నా అధిక విషపూరితం. లిమోనెస్ అనేక పురుగులపై స్పర్శ మరియు ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది (టేలర్ & వికరి, 1974)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. నల్లేరు

నల్లేరు పొదలు, చెట్ల మీద దాదాపు 10 మీ. ఎత్తు పెరిగే బహు వార్షిక తీగ. దీని శాఖలు నాలుగు పలకల కాడల్లా ఉంటాయి. ఈ మొక్క కణుపులు కలిగి ఉండి ప్రతి కణుపు వద్ద హృదయాకారంలో గానీ, గుండ్రంగా గానీ పెళుసైన పత్రాలు కలిగి ఉంటుంది. ఈ కణుపుల వద్ద సన్నని తీగలు కూడా వస్తాయి. పూలు వంగ పండు రంగులోను, ఫలాలు సన్నగా, ఎరుపు రంగులో ఉంటాయి. నల్లేరు కాడ అంతా నారతో కూడి ఉండి చేతితో నలిపితే చేయి దురద పెడుతుంది. కాండం గుండ్రంగాను, బల్ల పరుపుగాను ఉండే మొక్కలు కూడా అక్కడక్కడ అరుదుగా కనిపిస్తాయి.

సాధారణ నామం : అడమెంట్ క్రీపర్ / ఎడిబుల్ స్టెమ్‌డ్‌లైన్ / హడ్‌జోడ్ శాస్త్రీయ నామం : సిస్సస్ క్వాడ్వాంగ్యులారిస్ కుటుంబం: వైటేసి²

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • నల్లేరు కాడలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఈ మొక్కల నుండి టెట్రాసైక్లిన్ ట్రైటెర్పినాయిడ్లు మరియు స్టెరాయిడ్లు లభిస్తాయి. నల్లేరు లేత కాడలను దంచి ఉప్పు, కారం, జీలకర్ర, మిరియాలు చేర్చి తింటే జీర్ణ శక్తి పెరుగుదలకు, కీళ్లనొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
  • బాగా ముదిరి లావుగా ఉన్న నల్లేరు కాడల్ని ఎండబెట్టి చూర్ణం చేసి పిప్పిళ్ళ చూర్ణం కలిపి తేనెతో సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. నల్లేరు చూర్ణం మూలవ్యాధికి, బహిష్టు క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. నల్లేరు రసం చెవి నుంచి చీము కారడం తగ్గిస్తుంది. నల్లేరుకి విరిగిన ఎముకలను అతికించే గుణం కూడా ఉంది.

వ్యవసాయరంగంలో

  • నల్లేరు కాండం పెట్రోలియం ఈదర్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను, ప్యూపాలను అత్యంత సమర్ధవంతంగా నివారించింది (రమేష్ కుమార్ అండ్ నట్టుతురాయ్, 2012).
  • నల్లేరు తాజా మరియు ఎండిన కాండాల ఇథైల్ అసిటేట్ ద్రావణం మరియు మిథనాల్ ద్రావణాలు బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ సీరియస్, స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ స్పీసీస్‌పై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (చిదంబర మూర్తి, అతని అనుచరులు, 2004).
  • నల్లేరు ఆకు ద్రావణం అనాఫిలెస్ స్టెఫెన్సిపై గుడ్లనాశక చర్యను ప్రదర్శించింది. 100% గుడ్లను చంపింది (కృష్ణప్ప, అతని అనుచరులు, 2013).
  • వేప ఆకులు, నల్లేరు ఆకులు సమపాళ్ళలో కలిపి నూరి ఆవుమూత్రంలో ఒక వారం నానబెట్టి వడపోసి, 1:9 నిష్పత్తిలో నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి వరిలో పురుగులను నివారించవచ్చు (పిఒపి, తమిళనాడు)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఒక నిత్యహరిత చెట్టు. కాండం బలంగా 30-60 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. బెరడు సుమారు 10 మి.మీ. మందంగా బూడిద రంగులో ఉంటుంది. సాధారణంగా ఇది ఒక దట్టమైన పొద. లేత కొమ్మలపై బెరడు నునుపుదనం కలిగి పాలిపోయిన గోధుమరంగు లేదా గోధుమబూడిద రంగులో ఉంటుంది. ఆకులు ఎదురెదురుగా ఏర్పడి వాసననిస్తాయి. ఆకు కాడ 1-2 సెం.మీ. పొడవుంటుంది. పూలు చిన్నవిగా 3 మి.మీ. వ్యాసం, పాలిపోయన పసుపు రంగులో ఉంటాయి. కాయ అండాకారంలో 1-2 సెం.మీ. పొడవుండి పండినపుడు నలుపు రంగులో ఉంటాయి.

సాధారణ నామం : సిన్నమోమ్ శాస్త్రీయ నామం : సిన్నమోమం వెరమ్/సిన్నమోమం జీలానికం కుటుంబం: లారేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • సంప్రదాయ ఔషధాలలో దీర్ఘకాలంగా దాల్చిన చెక్కను ఇతర హెర్బల్ మొక్కలతో కలిపి ఉపయోగిస్తున్నారు. దీనిని కీళ్ళనొప్పులు, గుండెదడ, డిస్మెనోరియా చికిత్సలో ఉపయోగిస్తారు. పురాతన ఈజిప్షియన్లు దాల్చిన చెక్క కలిపిన పరిమళ ద్రవ్యంలో మార్పుకు గురికాకుండా వస్తువులను నిల్వ చేసేవారు.
  • దీనిని పళ్ళునొప్పులు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఆరోగ్యాన్ని పెంచే టానిక్‌గా ఉపయోగిస్తారు. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజ, గొంతు నొప్పులను తగ్గిస్తుంది. స్త్రీలలో బహిష్టు సమయంలో కలిగే అసౌకర్యాలకు ఉపశమనం కలిగిస్తుంది.
  • భారతదేశంలో ఆయుర్వేద ఔషధాలలో మొలలు, డయేరియా, పళ్ళనొప్పి, అమీబియాసిస్, గుండె జబ్బులు, జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి అనేక సమస్యలను తీరుస్తుంది.
  • దాల్చిన చెక్కలో యాంటి ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ప్రతిరోజు దాల్చిన చెక్క టీని త్రాగితే మానవులలో ఒత్తిడి తగ్గుతుంది. మూత్రం స్రవించడానికి, విసర్ౙనానికి దోహదపడుతుంది. సెక్స్ కోరికలను పెంచుతుంది. బాలింతలలో చనుబాల ఉత్పత్తిని పెంచుతుంది.
  • దాల్చిన చెక్కను అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. డోనట్స్, యాపిల్‌పై, బన్స్, క్యాండీస్, టీ, వేడికోకో, లిక్కర్లలో ఉపయోగిస్తారు. చిక్కని సూపులు, డ్రింక్స్, స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.
  • ఆయుర్వేద ఔషధం దాల్చిన చెక్క శ్వాసకోశ, జీర్ణాశయ, గర్భాశయ సమస్యలకు మంచి మందు. ఈ చెట్టు బెరడు, ఆకులు, పూలు, కాయలు, వేర్లు ఔషధ లేదా వంటకాల విలువలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టు బెరడుని ఎండబెట్టి భారతదేశంలో అన్ని వంటకాలలో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు.
  • ఈ మొక్కని, దాని కషాయాలను అనేక జబ్బులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క ద్రావణాలను గాస్ట్రో ఇంటస్టెåనల్ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. జీర్ణాశయంలో ఏర్పడిన వాయువు విడుదలవడానికి సహాయపడుతుంది. అధికంగా వాయువు ఏర్పడటం వలన పొట్టలో కలిగే నొప్పులకు ఉపశమనం కల్గిస్తుంది.
  • మూత్రకోశాన్ని శుభ్రపరచి జబ్బులను తగ్గిస్తుంది. మధుమేహాన్ని నివారించి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. జలుబు, ఫ్లూజ్వరాన్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగిస్తారు. తీవ్ర తలనొప్పిని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క, తాజా నిమ్మరసంతో పేస్టు తయారు చేసి మొటిమలపై పూసి వాటిని నయం చేయవచ్చు.

వ్యవసాయరంగంలో

  • దాల్చిన చెక్క ఆకునూనె దోమల లార్వాలను సమర్దవంతంగా చంపుతుంది. దీనిని పురుగు వికర్షిణిగా సిఫారసు చేశారు. దాల్చిన చెక్కను ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి జీవ పురుగు మందు తయారీలో ఉపయోగిస్తారు. దీనిని పాటింగ్ మట్టితో కలిపి లేదా పంటలపై చల్లి పురుగులను నివారించవచ్చు (డోటి, 2012).
  • దాల్చిన చెక్కలో ఉన్న యూజినాల్ కీటకనాశన చర్య కలిగి ఉంది. మాటన్, అతని అనుచరులు సిన్నమోమ్ ఆయిల్ సహజ యాంటి మైక్రోబియల్ ఏజెంట్ అని రిపోర్టు చేశారు. ఇది వివిధ బాక్టీరియా (పీడియోకోకస్ హాలోఫిలస్, స్టెఫైలోకోకస్ ఆరియస్), శిలీంద్రాల (ఆస్పర్ౙిల్లస్‌ఫ్లేవస్, మ్యూకార్ ప్లంబియస్, పెనిసిలియం రాక్విఫోర్టి, యూరోషియం స్పీ.) పెరుగుదలనరికడుతుంది (విశ్వేశ్వరరావు అండ్ హుయాగాన్, 2014).
  • దాల్చిన చెక్క (సిన్నమోమమ్ జీలానికం) ఎసెన్షియల్ ఆయిల్ టమాట లీఫ్ మైనర్, టుట ఆబ్సల్యూట లార్వాలను 100% చనిపోయేలా చేసింది (అడిల్, అతని అనుచరులు, 2015).
  • దాల్చిన చెక్క (సిన్నమోమమ్ జీలానికం) ఎసెన్షియల్ ఆయిల్ ధాన్యం నిల్వలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజెలను 98% మరియు 80% చంపగలిగింది (జ్యోతిక బ్రారి అండ్ ఠాకూర్, 2015).
  • దాల్చిన చెక్క (సిన్నమోమమ్‌వెరమ్) నీటి ద్రావణం ఆహారాన్ని పాడు చేసే 3 గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా (స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సెరియస్, ఎంటరోకోకస్ ఫీకాలి), 2 గ్రామ్ నెగటివ్ బాక్టీరియా (ఎస్కెరిచియాకోలి, ప్రోటియస్ మిరాబిలిస్)లపై యాంటి బాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. దీనిని సహజ ఆహార సంరక్షిణిగా ఉపయోగించవచ్చు (మధుమిత రక్షిత్ అండ్, రామలింగం, 2011).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ (33.3%) నిమ్మ, మాండరిన్ కాయల తోటల్లో తొక్కలపై మచ్ౘ్లు కలిగించి మార్కెట్ విలువ తగ్గించే శిలీంద్రం గ్విగ్నార్డియా సిట్రికార్ప పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. షేడ్‌హౌస్‌లో జరిపిన ప్రయోగాల్లో లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపిన ద్రావణం టమాట మొక్కల నాశించే ఎర్లీబ్లెåట్ ఆకుమచ్చ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (ఇయోల్, అతని అనుచరులు, 2014).
  • దాల్చిన చెక్క చెట్టు ఆకుల ఇథనాల్ ద్రావణం ఆర్టెమియా సరిన లార్వాలపై లార్విసైడల్ చర్యను, సైటోఫిలస్ ఒరైజెపై పురుగు మందు ప్రభావాన్ని చూపింది. (ఉదయ ప్రకాష్, అతని అనుచరులు, 2014).
  • సిన్నమాల్డిహైడఅల్లిసిన్ ఫార్ములేషన్ పంటలను నులిపురుగులు, శిలీంద్ర తెగుళ్ళు, పురుగులు, నల్లుల నుండి కాపాడుతుంది.
    దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ పిచికారి చేసిన 4 గంటలలో టమాట పంటనాశించే లీఫ్‌మైనర్, టుట ఆబ్సల్యూట లార్వాలు 100% చనిపోయాయి. ఎసెన్షియల్ ఆయిల్ లీఫ్‌మైనర్ లార్వాలపై శక్తివంతమైన వికర్షక మరియు కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (అడిల్, అతని అనుచరులు, 2015).
  • దాల్చిన చెక్క (సిన్నమోమం ఇంప్రెస్సినర్వియం) ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, ఆల్టర్నేరియా ఆల్టర్నేటలపై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (80%). ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై 78.6% శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (భూయాన్, అతని అనుచరులు, 2015).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజాలపై స్పర్శ, ఫ్యూమిగెంట్ విషచర్యలను ప్రదర్శించింది (జ్యోతిక అండ్ ఠాకూర్, 2015).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్‌పై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (కార్మొ, అతని అనుచరులు, 2008).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ కంది వీవిల్‌ని 24 గంటల తర్వాత 100% చంపింది. ఎసెన్షియల్ ఆయిల్ అధిక కీటకనాశక, వికర్షక లక్షణాల వల్ల దీనిని నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు (గ్రేస్, ఆమె అనుచరులు, 2017).
  • దాల్చిన చెక్క హెక్సేన్ మరియు మిథనాల్ ద్రావణాలు (3 మి.లీ./లీ. నీరు) టమాట ఎర్లీబ్లెåట్ శిలీంద్రం ఆల్టర్నేరియా సొలాని పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. దాల్చిన చెక్క ద్రావణం (2 మి.లీ./లీ.) టమాట మొక్కలనాశించే ఎర్లీబ్లెåట్ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (ఇయోల్, అతని అనుచరులు, 2014).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ (1%) అలసంద బీటిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను వికర్షించింది. ఎసెన్షియల్ ఆయిల్‌ని అలసంద బీటిల్ సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమంలో విజయవంతంగా ఉపయోగించవచ్చని ఫలితాలు వెల్లడించాయి (ఫౌయాజ్, 2013).
    భవిష్యత్ సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమాలలో దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్‌తో సహా అనేక ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. (కౌల్, 2008).
  • దాల్చిన చెక్క, నిమ్మగడ్డి ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమంతో తయారు చేసిన కెయొలిన్ టాబ్లెట్లు వరి నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగు సైటోఫిలసఒరైజే పురుగులను గణనీయంగా తగ్గించాయి. 6 నెలల కాలంలో గింజలకు కలిగే నష్టం గణనీయంగా తగ్గింది. 6 నెలల తర్వాత కేవలం 5% కెయొలిన్ టాబ్లెట్ల బరువు నష్టం గమనించబడింది. వరి రకం సువండల్‌లో ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమం కీటక నాశక చర్యను అత్యధికంగా గమనించడం జరిగింది (పరనగమ అండ్ మదువంతి, 2015).
  • విశిష్ట చర్యలు గల పదార్థాలు కలిగిన సహజ వనరులను ఉపయోగించి రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా కొత్త పురుగు మందు ఫార్ములేషన్స్‌ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజ్‌మేరి, దాల్చిన చెక్క, మెంతి ఎసెన్షియల్ ఆయిల్స్‌లోని టెర్పిన్స్‌ను ఉపయోగించి ఇకోస్మార్ట్ టెక్నాలజీస్ బొటానికల్‌పెస్టిసైడ్ ఫార్ములేషన్‌ని వృద్ధి చేస్తున్నారు. (గ్రెచెన్ పాలుచ్, 2010).
  • లవంగం, నల్లమిరియాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, నట్‌మెగ్, నల్ల జీలకర్ర, పసుపు, ఎర్రకారం, జీలకర్ర, ఆకుపచ్చ యాలకులు, పొడులు మినుముల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులను 100% చంపి మినుము గింజలను కాపాడాయి. లవంగం, నల్లమిరియాలు అధిక సమర్ధవంతంగా చంపాయి (మహది అండ్ రహమాన్, 2008).
  • దాల్చిన చెక్క ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ కుందేళ్ళనాశించే మేంజినల్లి, సోరోప్టెస్ కునికులిని సమర్ధవంతంగా చంపాయి. నల్లులాశించిన కుందేళ్ళపై ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణాన్ని పిచికారి చేసి నల్లులను సమర్ధవంతంగా నివారించవచ్చు (ఫిచి, అతని అనుచరులు, 2007).

ఫార్ములేషన్ తయారీ
సిన్నమాల్డిహైడ్{అల్లిసిన్ (10%) – 30% నుండి 50%
సోయాబీన్ ఆయిల్ – 50% నుండి 80%
ఎమల్సిఫయర్ – 3% నుండి 12%
ఆర్గానోఫిలిక్‌హెక్టొరైట్‌క్లే – 0.8% నుండి 2.0%
ప్రొపిలిన్‌కార్బొనేట్ – 0.5% నుండి 3.0%
నానఅయానిక్ సర్ఫెక్టంట్ – 0.5% నెండి 2.0%

  • నులి పురుగుల నివారణకు ఈ ఫార్ములేషన్‌ని భూమికి లేదా మొక్కల పై పిచికారి చేయాలి.
  • కెయొలిన్ పెల్లెట్స్‌ని దాల్చిన చెక్క (సిన్నమోమం జీలానికం) { సిట్రొనెల్లా (సింబోపోగాన్‌నార్డస్) ఆకుల ఎసెన్షియల్ ఆయిల్స్ మిశ్రమంతో శుద్ధి చేసి దీని ప్రభావాన్ని వరి ధాన్యం నిల్వపై పరీక్షించారు. ఈ మిశ్రమంలోని ప్రధాన రసాయనాలైన యూజినాల్, సిట్రొనెల్లాల్, జరానియాల్ సైటోఫిలస్ ఒరైజె పెద్ద పురుగుల సంఖ్యను 6 నెలల నిల్వ కాలమంతటా గణనీయంగా తగ్గించాయి (పరనగమ అండ్ మధువంతి, 2017).
  • దాల్చిన చెక్క (సిన్నమోమం జీలానికం) ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ (2.5 మి.లీ. 10% నుండి 0.03% వరకు పారాఫిన్ ఆయిల్‌లోకుందేళ్ళనాశించే మేంజి నల్లిప్సోరోప్టెస్ కునికులిపై వీటి ప్రభావాన్ని పరీక్షించారు. 24 గంటల తర్వాత 0.10-10% మధ్యగాఢతలో మంచి నల్లి నాశక చర్యను ప్రదర్శించాయి. కుందేళ్ళపై 0.16-10% మధ్య గాఢతలు కుందేళ్ళ నాశించిన నల్లులను సమర్ధవంతంగా నివారించాయి (ఫిచి, అతని అనుచరులు, 2007).
  • దాల్చిన చెక్క (సిన్నమోమంజీలానికం) బెరడు ఎసెన్షియల్ ఆయిల్ ప్రభావాన్ని మానవుల తలలో పేలు (పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటస్), వాటి గుడ్లపై పరీక్షించారు. ఎసెన్షియల్ ఆయిల్, దానిలోని మిశ్రమాలు మానవుల తలలోని పేలను నివారించే శక్తి కలిగి ఉన్నాయి (యాంగ్, అతని అనుచరులు, 2005).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. కర్పూరం

కర్పూరం 3-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక వృక్షం. లేత ఆకులు ఎర్రగా ఉంటాయి. ముదిరిన కొద్దీ ఆకులు పచ్చగా మారతాయి. పసుపుపచ్చ పూలు సువాసన కలిగి ఉంటాయి. కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇదివిత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్కలోని ఆకులు, కొమ్మలు, వేర్లు, ఇతర భాగాల నుండి వెలికి తీయబడు పదార్థాన్నే కర్పూరం అంటారు.

సాధారణ నామం
క్యాంఫర్‌ట్రీ / పచ్చ కర్పూరం / కర్పూర్
శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫొర
కుటుంబం: లారేసి²

ఉపయోగాలు : ఔషధ రంగంలో …

  • ఆకులు, కొమ్మలు, వేర్లు, చెక్క ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఆవిరయ్యేనూనె, కాంఫర్, శాప్రోల్, యూజినాల్, టర్పినియోల్, సిన్నమిక్ ఆల్డిహైడ్, కౌమారిన్ అనబడు రసాయనాలు ఉంటాయి.
  • దీనిని జ్వరాలు, కురుపులు, పొంగులు, కోరింతదగ్గు, శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, కీళ్ళనొప్పులు నివారించుటకు ఉపయోగిస్తారు.
  • ఈ మొక్క నుంచి తయారు చేసిన కర్పూరాన్ని హారతి ఇచ్చుటకు, చర్మ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కర్పూరం మొక్క ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పై బలమైన ఫ్యూమిగెంట్ మరియు కాంటాక్ట్ విష చర్యలను ప్రదర్శించింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో డిక్యామ్ఫర్ (40.54%), వినలూల్ (22.92%), సినియోల్ (11.26%), 3, 7, 11 ట్రైమిథైల3హైడ్రాక్సి6, 10డోడికాడియెన1ఐలఎసిటేట్ (4.50%) ఉంటాయి. సిన్నమోమం క్యామ్‌ఫర్ ఎసెన్షియల్ ఆయిల్, దాని రసాయనాలను లాసియోడెర్మా సెర్రికార్నె నివారణకు సహజ ఫ్యూమిగెంట్స్ మరియు కీటకనాశనులుగా వృద్ధి చేయవచ్చు (చెన్, అతని అనుచరులు, 2014).
  • సిన్న మోమం క్యాంఫొరా వెరైటి లినలూలిఫెరా, సిన్నమోమం క్యాంఫొరావెరైటి హోస్యో ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్స్ సైటోఫిలస్ జియామెయిస్‌పై ప్రయోగశాలలోను, మినిసైలోస్‌లోను వికర్షక చర్యను ప్రదర్శించాయి (కాన్సియన్, అతని అనుచరులు, 2015).
  • కర్పూరం మొక్క ఎసెన్షియల్ ఆయిల్‌లో 36.61% క్యామ్ఫర్ మరియు 30.05% సినియోల్ ఉంటాయి. కర్పూర్ ఎసెన్షియల్ ఆయిల్ రెడ్ ఇంపోర్టెడ్ ఎర్రచీమ (ఆరఐయఫఎ) మైనర్ మరియు మేజర్ వర్కర్స్‌పై ఫ్యూమిగెంట్ విషచర్యను, బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. (ఫు, అతని అనుచరులు, 2015).
  • కర్పూర్ పొడి, ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం గ్రానేరియం, ట్రైబోలియం కాస్టానియంపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (నెనా అండ్ ఇబ్రహీం)
  • కర్పూర్ ఆకుల (100-300) పొడి నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, కాల్లసోబ్రూకస్ రోడిసియానస్ గుడ్లు పెట్టడాన్ని నిరోధించడం, గుడ్లు పొదగడాన్ని గణనీయంగా తగ్గించాయి (రాజపాక్సె అండ్ వాన్‌మ్డెన్, 1997)
  • కర్పూర్ ఆకుల (10-50) పొడి నిల్వ ధాన్యం లోపల లార్వా, ప్యూపా బ్రతికి ఉండటం తగ్గించాయి (ధర్మసేన, అతని అనుచరులు, 1998).
  • కర్పూర్ మిథనాలిన్ ద్రావణాలు పీచ్‌పండు ఈగ బాక్ట్రోసిరా జోనేట ఆడ పురుగులను అదికంగా చంపాయి (సైరాఖాన్, అతని అనుచరులు, 2016).
  • సిన్నమోమం జీలానికం, సిన్నమోమం బుర్మాన్ని, సిన్నమోమం ఇనర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్టెమియ సలిన లార్వాలను అరికట్టాయి (నూర్ ఫెసిహ ఒంటిహసన్, 2011).
  • కర్పూర్ క్ౙెåలం ద్రావణాలు కోరియోలస్ వెర్సికలర్, గ్లియోఫిల్లం ట్రాబియం శిలీంద్రాలపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (లి, అతని అనుచరులు, 2014).
  • సిన్నమోమం జీలానికిం ఎసెన్షియల్ ఆయిల్ మరియు నానోఎమల్షన్ మీల్‌వర్మ్, ఆల్ఫిటోబియస్ డయాపెరినస్‌ని నివారించాయి (వోల్పటొ, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా ప్రిన్సెప్స్ ఆకులు, సిన్నమోమం క్యాంఫొరా గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు, సైటోఫిలస్ ఒరైజె, బ్రూకస్ రూజిమానస్‌లపై మంచి వికర్షక చర్యలను ప్రదర్శించాయి. కాని వాటి మిశ్రమం (1:1) అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (లియు, అతని అనుచరులు, 2005). ఈ రెండు ఆయిల్స్‌ని విడివిడిగా ఉపయోగించినపుడు గోధుమ విత్తనాల మొలక శాతాన్ని తగ్గించాయి. కాని రెండింటిని కలిపి ఉపయోగించినపుడు మొలకశాతం పెరిగింది.
  • రసాయన ఎరువులు, పురుగు మందులనుపయోగిస్తే ఆహార గొలుసులో విషపూరిత అవశేషాలు, జీవ అసమతుల్యత, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు రావచ్చు. వృక్ష సంబంధ పురుగు మందులను రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడితే ఈ సమస్యలను అదిగమించవచ్చు. పేనుబంక ఆశించిన గ్రీన్ ఆల్ఫాల్ఫ నారు మొక్కలను మలైఫాస్ మరియు సహజ ఆయిల్ ద్రావణాల (ఒరిగానో, తైమ్.వేప, కానుగ, కర్పూర్, తేయాకు చెట్టు)తో శుద్ధి చేసినపుడు పేనుబంక పురుగులు నివారింపబడ్డాయి (కస్పిమి, అతని అనుచరులు, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. చామంతి

క్రైసాన్తిమం సినరరీఫోలియంను డాల్మేషియన్ క్రైసాన్తిమం అంటారు. ఇది ఎక్కువగా సాధారణ డైసీలాగా కనిపిస్తుంది. దీని పూలు తెల్లగా ఉండి మధ్యలో పసుపురంగులో ఉంటాయి. ఇవి అనేక గట్టి కాండాలనుండి ఏర్పడతాయి. మొక్కలు నీలిఆకుపచ్చ రంగు ఆకులు కలిగిఉండి 18 నుండి 39 అంగుళాల ఎత్తు పెరుగుతాయి. ఈ మొక్క సహజ పురుగు మందు కలిగి ఉంటుంది. పూలను దంచి విత్తనాలలో ఉన్న పైరెత్రిన్స్‌ని వేరు చేసి ఓలియోరెసిన్‌గా అమ్ముతారు.

క్రైసాన్తిమం కాక్సినియం ఒక బహుళ వార్షిక మొక్క. ఇది కూడా డైసీలాగానే కన్పిస్తుంది. ఇది పెద్ద తెల్ల, గులాబి లేదా ఎర్రనిపూలు కలిగి ఉంటుంది. ఆకులు ఫెరన్ ఆకులను పోలి ఉండి మొక్క 12 నుండి 24 అంగుళాలు ఎత్తు పెరుగుతుంది.

  సాధారణ నామం : పైరిత్రం  శాస్త్రీయ నామం : క్రైసాన్తిమమ్ కాక్సినియం, క్రైసాన్తిమమ్ సినరరీఫోలియం  కుటుంబం: ఆస్టిరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొక్కలలో పూలు, ఆకులను ఔషధ భాగాలుగా ఉపయోగిస్తారు. వీటిలో ఉండే ప్రదాన పదార్థాలు క్లోరోజెనిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్, విటమిన్ ‘ఎ’, బి6, సి, కె, రైబోఫ్లేవిన్, థయామిన్. కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
  • సైనసైటిస్ లక్షణాలు, జ్వరం, చర్మ సమస్యలు, అధిక రక్తపోటు నివారణకుపయోగిస్తారు. రక్తప్రసరణను పెంచి గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది.
    కాలరీస్ తక్కువగా ఉండి క్రైసాన్తిమం టీ ఊబకాయులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగకరం. జీర్ణశక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • చామంతిలో కీటకనాశన పదార్థాలు రెండు రకాలలో ఉన్నాయి కైసాన్తిమం సినరరీఫోలియం, క్రైసాన్తిమం కాక్సినియం. ఈ రెండింటిలో పైరిథ్రం పదార్థాలు క్రైసాన్తిమం సినరరీఫోలియంలో క్రైసాన్తిమం కాక్సినియం కన్నా అధికంగా ఉన్నాయి.
  • పైరిత్రం పూల ద్రావణం ఆఫ్రికన్ ఆర్మీవర్మ్, ఆఫ్రికన్ బోల్‌వర్మ్, పేనుబంక, ఆకు తినే లార్వాలు, ఎర్రనల్లి, తామర పురుగులు, తెల్లదోమ, మొక్కజొన్న కాండం తొలుచు పురుగు, పొటాటో జాసిడ్‌లను నివారిస్తుంది. ఒక లీటరు వేడినీటిలో 100 గ్రా. ఎండిన పూలను వేసి బాగా కలిపి ఒక గంట నిల్వ ఉంచాలి. తర్వాత వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూలను కోసి ఎండబెట్టి మెత్తగా నూరాలి. ఈ పొడిని పురుగు లపై లేదా మొక్కలపై చల్లాలి (త్రిష్, 2013).

పైరిత్రం పురుగు మందు తయారు చేసే పద్ధతి :

  1. పైరిత్రం పూలను కోసి చల్లని, చీకటి, పొడి ప్రదేశంలో ఆరబెట్టాలి. ఆరిన పూలగుత్తులను గాలిచొరబడని పాత్రలో నిల్వ చేయాలి. అవసరమైనపుడు వీటిని పొడి చేసి కొద్దిగా సబ్బు ద్రావణంతో కలిపి తగినంత నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  2. ఒక కప్పు తాజా పూలగుత్తులను 1/8 కప్పు 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌లో నానబెట్టాలి. పాత్రను రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు మిశ్రమాన్ని పలుచని గుడ్డలో వడపోసి ద్రావణాన్ని గాలి చొరబడని పాత్రలో నిల్వ ఉంచాలి. 4 క్వార్ట్స్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
    నివారించబడే పురుగులు : పేనుబంక, దీపపు పురుగులు, పిండినల్లులు, ఎర్రనల్లి, కంపునల్లి, పొలుసుపురుగులు, తామర పురుగులు, తెల్లదోమలు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. రెడ్‌బడ్

ఇది ఒక చిన్న అలంకరణ చెట్టు. 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. 10 మీ. వెడల్పు ఉంటుంది. ఒక సంవత్సరం లేదా ఎక్కువ వయసున్న చెట్టు, కాండంతో సహా ముదరు పింకు రంగు పూలను ఉత్పత్తి చేస్తుంది. పూలు ఏర్పడిన కొద్ది సమయం తర్వాత ఆకులు ఏర్పడతాయి. ఈ చెట్టు పొడవైన బల్లపరుపు కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చెట్టు నుండి వ్రేలాడుతుంటాయి. పూలను తినవచ్ౘ్ు. ఇవి తీయని ఆమ్ల రుచి కలిగి ఉంటాయి.

సాధారణ నామం : జుడాస్ ట్రీ
శాస్త్రీయ నామం : సెర్సిస్ సిలిక్వాస్ట్రం
కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • రెడ్‌బడ్‌ని అనీమియా, నిస్సత్తువ చికిత్సలో ఉపయోగిస్తారు. శతాబ్దాల నుండి దీనిని మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, శ్వాసకోశ సమస్యలు, గర్భవతుల్లో కాళ్ళ వాపుల చికిత్సలో ఉపయోగిస్త్తున్నారు. మూత్ర వర్ధకంగా పనిచేస్తుంది.
  • పూలలో కెరోటిన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని పార్ల్సేతో కలిపి రక్తం, లివర్‌లోని కొవ్వు డిపాజిట్లను కరిగించడానికి ఉపయోగిస్తారు. మెత్తని క్రీం చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తుంది. 1 కప్పు పూలను 1 కప్పు నీరు కలిపిన క్రీంలో కలిపి 20 ని. ఉడికించాలి. వడపోసి పూలను తొలగించి 3 చెంచాల విటమిన్ ఇ నూనెని క్రీమ్‌కి కలిపి, బాగా కలియత్రిప్పి స్టెరిలైజ్ చేసిన జాడీలో పోయాలి. ఈ క్రీంని గోళ్ళు లేదా చర్మంపై సమస్య వున్న చోట పూసి మసాజ్ చేయాలి.
  • హెల్త్ టీ తయారు చేయడానికి పావుకప్పు తాజాపూలను ఒక పాత్రలో తీసుకుని వాటిపై ఒక కప్పు వేడి నీటిని పోసి 5 ని. నిల్వ ఉంచి వడపోయాలి. దీనికి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. అమెరికన్ ఇండియన్స్, రెడ్‌బడ్‌ని పంటి నొప్పి నుండి బ్లాడర్ ఇన్‌ఫెక్షన్ వరకు, చర్మ మచ్ౘ్ల నుండి చీలిన కాలి గోర్ల వరకు అనేక సమస్యలకు పూలను నలగ్గొట్టి కట్టు కట్టడానికి లేదా లోషన్‌గా పూయడానికి, పూలను హెల్త్‌టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
  • యూరోపియా ఖండంలో ప్రస్తుతం రెడ్‌బడ్ కషాయాన్ని విరేచనకారిగా ఉపయోగిస్తున్నారు. (రాబర్ట్స్, 2000)

వ్యవసాయరంగంలో

  • రెడ్‌బడ్ ఇథనాల్ ద్రావణం (30 మైక్రో లీటర్లు / మి.లీ.) లోని రసాయనాలు 12 రోజుల తామర పురుగులు, త్రిప్స్ టబాసి పై అత్యధిక విష ప్రభావాన్ని చూపాయి (నజ్‌మిజాడె, అతని అనుచరులు, 2013).
  • రెడ్‌బడ్ ద్రావణం { బదనికనల్లి, ఓరియస్ హోర్వాతి విడుదల వెస్టర్న్ ఫ్లవర్ త్రిప్స్, ప్రాంక్లినియెల్లా ఆక్సిడెంటాలిస్ పిల్ల పురుగులపై మంచి ప్రభావాన్ని చూపాయి. రెడ్‌బడ్ ద్రావణం పిల్ల తామర పురుగులను చంపింది (రజావి అండ్ అహ్మరి, 2016). తామర పురుగులు సమర్ధవంతంగా నివారించబడ్డాయి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More