కర్పూరం 3-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక వృక్షం. లేత ఆకులు ఎర్రగా ఉంటాయి. ముదిరిన కొద్దీ ఆకులు పచ్చగా మారతాయి. పసుపుపచ్చ పూలు సువాసన కలిగి ఉంటాయి. కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇదివిత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్కలోని ఆకులు, కొమ్మలు, వేర్లు, ఇతర భాగాల నుండి వెలికి తీయబడు పదార్థాన్నే కర్పూరం అంటారు.

సాధారణ నామం
క్యాంఫర్‌ట్రీ / పచ్చ కర్పూరం / కర్పూర్
శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫొర
కుటుంబం: లారేసి²

ఉపయోగాలు : ఔషధ రంగంలో …

  • ఆకులు, కొమ్మలు, వేర్లు, చెక్క ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఆవిరయ్యేనూనె, కాంఫర్, శాప్రోల్, యూజినాల్, టర్పినియోల్, సిన్నమిక్ ఆల్డిహైడ్, కౌమారిన్ అనబడు రసాయనాలు ఉంటాయి.
  • దీనిని జ్వరాలు, కురుపులు, పొంగులు, కోరింతదగ్గు, శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, కీళ్ళనొప్పులు నివారించుటకు ఉపయోగిస్తారు.
  • ఈ మొక్క నుంచి తయారు చేసిన కర్పూరాన్ని హారతి ఇచ్చుటకు, చర్మ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కర్పూరం మొక్క ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పై బలమైన ఫ్యూమిగెంట్ మరియు కాంటాక్ట్ విష చర్యలను ప్రదర్శించింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో డిక్యామ్ఫర్ (40.54%), వినలూల్ (22.92%), సినియోల్ (11.26%), 3, 7, 11 ట్రైమిథైల3హైడ్రాక్సి6, 10డోడికాడియెన1ఐలఎసిటేట్ (4.50%) ఉంటాయి. సిన్నమోమం క్యామ్‌ఫర్ ఎసెన్షియల్ ఆయిల్, దాని రసాయనాలను లాసియోడెర్మా సెర్రికార్నె నివారణకు సహజ ఫ్యూమిగెంట్స్ మరియు కీటకనాశనులుగా వృద్ధి చేయవచ్చు (చెన్, అతని అనుచరులు, 2014).
  • సిన్న మోమం క్యాంఫొరా వెరైటి లినలూలిఫెరా, సిన్నమోమం క్యాంఫొరావెరైటి హోస్యో ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్స్ సైటోఫిలస్ జియామెయిస్‌పై ప్రయోగశాలలోను, మినిసైలోస్‌లోను వికర్షక చర్యను ప్రదర్శించాయి (కాన్సియన్, అతని అనుచరులు, 2015).
  • కర్పూరం మొక్క ఎసెన్షియల్ ఆయిల్‌లో 36.61% క్యామ్ఫర్ మరియు 30.05% సినియోల్ ఉంటాయి. కర్పూర్ ఎసెన్షియల్ ఆయిల్ రెడ్ ఇంపోర్టెడ్ ఎర్రచీమ (ఆరఐయఫఎ) మైనర్ మరియు మేజర్ వర్కర్స్‌పై ఫ్యూమిగెంట్ విషచర్యను, బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. (ఫు, అతని అనుచరులు, 2015).
  • కర్పూర్ పొడి, ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం గ్రానేరియం, ట్రైబోలియం కాస్టానియంపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (నెనా అండ్ ఇబ్రహీం)
  • కర్పూర్ ఆకుల (100-300) పొడి నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, కాల్లసోబ్రూకస్ రోడిసియానస్ గుడ్లు పెట్టడాన్ని నిరోధించడం, గుడ్లు పొదగడాన్ని గణనీయంగా తగ్గించాయి (రాజపాక్సె అండ్ వాన్‌మ్డెన్, 1997)
  • కర్పూర్ ఆకుల (10-50) పొడి నిల్వ ధాన్యం లోపల లార్వా, ప్యూపా బ్రతికి ఉండటం తగ్గించాయి (ధర్మసేన, అతని అనుచరులు, 1998).
  • కర్పూర్ మిథనాలిన్ ద్రావణాలు పీచ్‌పండు ఈగ బాక్ట్రోసిరా జోనేట ఆడ పురుగులను అదికంగా చంపాయి (సైరాఖాన్, అతని అనుచరులు, 2016).
  • సిన్నమోమం జీలానికం, సిన్నమోమం బుర్మాన్ని, సిన్నమోమం ఇనర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్టెమియ సలిన లార్వాలను అరికట్టాయి (నూర్ ఫెసిహ ఒంటిహసన్, 2011).
  • కర్పూర్ క్ౙెåలం ద్రావణాలు కోరియోలస్ వెర్సికలర్, గ్లియోఫిల్లం ట్రాబియం శిలీంద్రాలపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (లి, అతని అనుచరులు, 2014).
  • సిన్నమోమం జీలానికిం ఎసెన్షియల్ ఆయిల్ మరియు నానోఎమల్షన్ మీల్‌వర్మ్, ఆల్ఫిటోబియస్ డయాపెరినస్‌ని నివారించాయి (వోల్పటొ, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా ప్రిన్సెప్స్ ఆకులు, సిన్నమోమం క్యాంఫొరా గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు, సైటోఫిలస్ ఒరైజె, బ్రూకస్ రూజిమానస్‌లపై మంచి వికర్షక చర్యలను ప్రదర్శించాయి. కాని వాటి మిశ్రమం (1:1) అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (లియు, అతని అనుచరులు, 2005). ఈ రెండు ఆయిల్స్‌ని విడివిడిగా ఉపయోగించినపుడు గోధుమ విత్తనాల మొలక శాతాన్ని తగ్గించాయి. కాని రెండింటిని కలిపి ఉపయోగించినపుడు మొలకశాతం పెరిగింది.
  • రసాయన ఎరువులు, పురుగు మందులనుపయోగిస్తే ఆహార గొలుసులో విషపూరిత అవశేషాలు, జీవ అసమతుల్యత, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు రావచ్చు. వృక్ష సంబంధ పురుగు మందులను రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడితే ఈ సమస్యలను అదిగమించవచ్చు. పేనుబంక ఆశించిన గ్రీన్ ఆల్ఫాల్ఫ నారు మొక్కలను మలైఫాస్ మరియు సహజ ఆయిల్ ద్రావణాల (ఒరిగానో, తైమ్.వేప, కానుగ, కర్పూర్, తేయాకు చెట్టు)తో శుద్ధి చేసినపుడు పేనుబంక పురుగులు నివారింపబడ్డాయి (కస్పిమి, అతని అనుచరులు, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.