కూరగాయ పంటల్లో సత్ఫలితాలకు హెర్బల్ టీ

కావలసిన పదార్థాలు :
పిచ్చి తులసి లేదా తులసి, పాలకొడిస, తుత్తురు బెండ, పొగాకు, బోగన్ విల్లియా (కాగితం పూలు), వేప, టేకు ఆకులు, కలబంద, బొప్పాయి, ఆవు మూత్రం, పశువుల పేడ, బెల్లం

తయారు చేసే విధానం :

  • పైన తెలిపిన ఆకులను 5 కిలోలు తీసుకొని ముద్దగా చేయాలి.
  • ఈ మిశ్రమానికి 5 కిలోల పశువుల పేడను, 100 గ్రాముల బెల్లం పొడిని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో తీసుకొని ప్రతిరోజూ ఒక కర్రతో 7 రోజుల వరకూ కలుపుతూ ఉండాలి.
  • 7 రోజుల తర్వాత “హెర్బల్ టీ” తయారవుతుంది. ఈ మిశ్రమానికి 5 లీటర్ల నీరు కలిపి పలుచని గుడ్డతో వడపోయాలి.
  • ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరా పొలంలో పంటపై పిచికారి చేయాలి.

ఎలా పనిచేస్తుంది? : పైన తెలిపిన వివిధ రకాల ఆకులలో ఎన్నో రకాల “ఆల్కలాయిడ్లు” ఉండుట వలన పురుగుల నియంత్రణలోనే కాకుండా కొన్ని రకాల తెగుళ్ళను అరికట్టడంలోనూ ఉపయోగపడుతుంది.

ఉపయోగాలు : ఇది చాలా శక్తివంతమైన ద్రావణం. ఈ ద్రావణం పంటలలో వచ్చే కీటక నియంత్రణలోనే కాకుండా వరిలో వచ్చే ఆకుమచ్చ తెగులు నివారణలో కూడా బాగా పని చేసినట్లు రైతుల అనుభవం. ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోనూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కూరగాయల పంటలలో ఉపయోగించి సత్ఫలితాలు పొందవచ్చు.

Read More

కాయతొలుచు పురుగు నివారణకు పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం

పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన’ అనే ఆల్కలాయిడ్ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస’ అనే ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. వీటి ప్రభావం వల్ల పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు మొక్క పై నుండి క్రిందపడి చనిపోతుంది.
శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగళి పురుగు (మూడవ దశ వరకు) నివారణకు ఈ ద్రావణాన్ని పత్తి, కంది, శనగ, వేరుశనగ, ఆముదం, వంగ, టమాట, మిరప పంటలలో రైతులు పురుగు ఉధృతిని బట్టి వాడవచ్చు.

కావలసిన పదార్థాలు :
పచ్చిమిర్చి : 3 కిలోలు
వెల్లుల్లి : అరకిలో
కిరోసిన్ : పావులీటరు (250 మి.లీ.)
సబ్బుపొడి : 100 గ్రా.

తయారు చేసే విధానం :

  • 3 కిలోల పచ్చిమిరప కాయలను కాడలు తీసి వాటిని మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి.
  • అరకేజి వెల్లుల్లిపాయలను పొట్టుతీసి వాటిని బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్‌లో ఒక రాత్రంతా నానబెట్టాలి.
  • మర్నాడు పచ్చిమిర్చి ద్రావణాన్ని ఒక పలుచని గుడ్డతో వడపోయాలి.
  • మిరప ద్రావణం, వెల్లుల్లి ద్రావణం, 100 గ్రాముల సబ్బుపొడి ద్రావణం, ఈ మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి.
  • ఈ విధంగా తయారు చేసిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం పూట పిచికారి చేయాలి.

ఉపయోగాలు: పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణాన్ని వంగలో వచ్చే కాయతొలుచు పురుగు నివారణకు, బెండ, టమాట పంటల నాశించే కాయతొలుచు పురుగుల నివారణకు, పత్తిలో వచ్చే కాయతొలుచు పురుగుల నియంత్రణకు వాడి మంచి ఫలితాలు సాధించవచ్చు.

జాగ్రత్తలు :

  • ఈ ద్రావణం చాలా శక్తివంతమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.
  • ఈ ద్రావణం పంటలపై పిచికారి చేసిన 4-5 రోజుల తర్వాత పశువుల పేడ, మూత్రం ద్రావణం పిచికారి చేయడం చాలా మంచిది. దీని వలన పంటలకు పోషకాలు లభించి ఆరోగ్యవంతంగా ఉంటాయి.
  • ఈ ద్రావణం తయారు చేయునపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం.
  • పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలపై పిచికారి చేయునపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
  • పంట కాలంలో 1-2 సార్లు మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
  • తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
    పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా ఎండుమిర్చిని కూడా ఉపయోగించవచ్చు.
Read More

ఔషధ మొక్క… వాము ఆకు

సాధారణ నామం కర్పూరవల్లి / కప్పరిల్లాకు/ కంట్రీబోరేజ్
శాస్త్రీయ నామం కోలియస్ ఆరోమాటికస్
కుటుంబం: లామినేసి

ఇది దాదాపు 1 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. దీని అన్ని భాగాలు మెత్తగా, మందంగా ఎక్కువ రసంతో వాములాంటి వాసన కలిగి ఉంటాయి. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున అండాకృతి లేదా హృదయాకారం కలిగి మెత్తని నూగుతో దంతాల లాంటి అంచులతో దళసరిగా ఉంటాయి. పూలు అతిచిన్నవిగా లేత ఊదారంగులో కొమ్మల చివర పొడవైన గుత్తులుగా వస్తాయి. ఫలాలు పెంకు గల చిరుఫలాలు. దీనిని కొమ్మల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వాము ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆకుల నుండి ఆవిరయ్యే నూనె, డైటెర్పీన్లు, థైమాల్, కాంఫర్ వంటి ఔషధగుణాలు గల రసాయనాలు లభిస్తాయి.
  • వాము ఆకు జీర్ణశక్తిని పెంచి అజీర్ణపు కడుపు నొప్పులను పోగొడుతుంది. మూత్రకోశంలోని రాళ్ళను కరిగించి మూత్రాన్ని సులువుగా జారీ చేస్తుంది.
  • ఆకుల కషాయం దీర్ఘకాలపు మొండిదగ్గులకు, ఉబ్బసానికి, అధిక రక్తపోటుని తగ్గించడానికి, గుండె జబ్బులకి ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ (350 పిపియం) ట్రైబోలియం కాస్టానియం పురుగులను 100% చంపింది. దీనిని నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (జయ, ఆమె అనుచరులు, 2014).
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) గోధుమ గింజలను ట్రైబోలియం కాస్టానియం ఆశించకుండా పూర్తిగా కాపాడింది.
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ బాసిల్లస్ మెగటీరియం, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్, ప్రోటియస్ వుల్గారిస్, సూడోమోనాస్ ఈరోజినోసా, క్ౙాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ (బాక్టీరియా), ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్, రైజోపస్ ఒరైజె, రైజోక్టోనియా ఒరైజెసటైవే, కొల్లెటోట్రైకం మ్యూసీ, ఫ్యుజేరియం సొలాని, ఆల్టర్నేరియా బ్రాసికోలా, కాండిడా ఆల్బికాన్స్ (శిలీంద్రాలు) పెరుగుదలను అరికట్టింది (దీనా, ఆమె అనుచరులు, 2002).
  • వాము ఆకు ద్రావణంలోని 11ఆక్టాడెసెనాయిక్ ఆసిడ్, మిథైల్ ఎస్టర్ మస్క్యిటోసైడల్ మరియు వికర్షక చర్యలను ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్పెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ పై ప్రదర్శించాయి (మథాలైముత్తు, అతని అనుచరులు, 2016).
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ మరియు దానిలోని కార్వక్రాల్ క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిని రసాయన పురుగు మందులకు ప్రత్నామ్నాయంగా నివారించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. (గోవిందరాజు, అతని అనుచరులు, 2016).
  • వాము ఆకు మిథనాల్ ద్రావణం బీటిల్, ఎపిలాక్న వరివెస్టిస్ పై యాంటిఫీడెంట్ చర్యను కలిగి ఉంది. ఎసెన్షియల్ ఆయిల్ శిలీంద్రాలు, బాక్టీరియా, నత్తలు, నెమటోడ్లపై యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్, యాంటిమొల్లస్కల్, యాంటినెమటోడ్ చర్యలను ప్రదర్శించింది (వాస్క్వెజ్, అతని అనుచరులు)
  • కోలియస్ ఆంబోయినకస్ ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ తెల్ల చెదలపై ఇన్‌సెక్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. ఇది రసాయన పురుగు మందులు థయోడాన్, ప్రైమోబన20 కన్నా అధిక సమర్ధవంతంగా చెదపురుగులను చంపింది (గుర్దీప్‌సింగ్, అతని అనుచరులు, 2002).
  • శ్రీగోమత గాయత్రి ఆర్గానిక్స్ అండ్ ఆయుర్వేద సేంద్రియ కోలియస్ పురుగు మందుని కోలియస్ ఆంబోనికస్, ఒరిగానోలతో తయారు చేశారు. ఇది శిలీంద్రనాశక, కీటకనాశక, చెదలనాశక లక్షణాలను కలిగి ఉంది. 20% ద్రావణాన్ని ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.
  • వాము ఆకు మొత్తం మొక్కను పురుగు మందుగా ఉపయోగిస్తారు. కోలియస్ ఆంబియానికస్ నర్సరి దశలోని కొబ్బరి మొక్కలపై ఒరెåక్టెస్ రైనోసిరాస్ గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది. కొబ్బరి నారు మొక్కల చుట్టూ వాము ఆకు (కోలియస్ ఆరోమాటికస్) మొక్కలను నాటడం ఆనవాయితీగా వస్తుంది. (కిఈఒ, అతని అనుచరులు, 2006).
  • వాము ఆకు ఆల్కహాలిక్ ద్రావణాలు షిగెల్లా స్పీ., సాల్మొనెల్లా టైఫి బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (రమ్య, ఆమె అనుచరులు, 2012).
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని నిల్వ ధాన్యంలో ఆశించే శిలీంద్రాలపై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. ఇది ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్రం అఫ్లాటాక్సిన్‌ని ఉత్పత్తి చేయకుండా నివారించింది. అంతేగాక గోధుమ గింజలను ఈ ఎసెన్షియల్ ఆయిల్‌తో ఫ్యూమిగేట్ చేస్తే శిలీంద్రాలు ఆశించకుండా కాపాడింది. (జయ, ఆమె అనుచరులు, 2011).
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్‌ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (భానుప్రకాష్ అండ్ డుబె, 2011).
  • వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులను అరికట్టే లక్షణాలను గల 200 మొక్కలను గుర్తించారు. అందులో వాము ఆకు ఒకటి.
  • వాము ఆకు మిథనాల్ ఫ్రాక్షన్ 4 ఈడెస్ ఈజప్టి, అనాఫెలెస్ స్టెఫెన్సి, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై అధిక విషచర్యను ప్రదర్శించింది. 40 పిపియం మిథనాల్ ఫ్రాక్షన్ 4, 100% గుడ్లచావును నమోదు చేసింది, మిథనాల్ ఫ్రాక్షన్ 4 దోమల పెద్ద పురుగులను వికర్షించింది. (మాతలయ్‌ముత్తు, అతని అనుచరులు, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… వడిసె / కడిసె

వడిసె కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ మరల పుట్టించు ఒక చిన్న చెట్టు. బెరడు ముదురు గోధుమ రంగు, ఎరుపు రంగుతో కూడిన నలుపు రంగులో గరుకుగా ఉండి, నలుచదరపు కొయ్య పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడి, రబ్బరులాగా, గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో 1.53 అం. పొడవు, రంగుతో ఆకు మొదలులో గుత్తులుగా ఏర్పడతాయి. క్యాప్సూల్ కొయ్యలాగా తొడిమ లేకుండా, గుండ్రంగా, 3 లేదా 4 చీలిన భాగాలు కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో దీని విషపూరిత స్వభావం ఒక సమస్య.

సాధారణ నామం : గరారి శాస్త్రీయ నామం : క్లిస్టాంతస్ కోల్లినస్ కుటుంబం: ఫిల్లాంతేసి

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • వడిసాకు డికాక్షన్ (50%) వరి నాశించే తాటాకు తెగులు (హిస్పా), ఆకుచుట్టు పురుగు, కాండంతొలుచు పురుగులను నివారించింది. ప్రత్యేకంగా గొట్టం పురుగు (నిమ్‌ఫ్యులా డిపంక్టాలిస్)ని సమర్ధవంతంగా నివారించింది. ఈ ద్రావణాన్ని ఒకసారి పిచికారి చేస్తే అన్ని పురుగులు 12 గంటలలో సంహరించబడ్డాయి.. పంటకోత వరకు పురుగులు ఆశించలేదు (భారతి అహిర్వార్, ఆమె అనుచరులు, 2011).
  • జార్ఖండ్‌లోని రాంచి జిల్లాకి చెందిన రైతులు వరిలో ఉల్లికోడు నివారణకు వడిసాకులను సేకరించి ఎకరానికి 40 కి. చొప్పున వేస్తారు.
  • 100 చ.మీ.కి 5 కి. వడిసె తాజా ఆకులను చల్లి గొట్టం పురుగుని నివారించవచ్చు. (శ్రీవాస్తవ, అతని అనుచరులు, 2009)
  • వడిసె ఆకులోని రసాయనాలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులను, పిండినల్లులను, లద్దె పురుగులు / లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తాయి. దీనిని జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు.(నమ్రతాకుమారి, ఆమె అనుచరులు, 2016).
  • వడిసె మొక్కలోని పాలిఫినాలిక్ పదార్థం పల్స్ బీటిల్, చెదలు, ప్రత్తి ఆకు తినే ఆర్మివర్మ్‌పై కీటకనాశక చర్య ప్రదర్శించింది. అనేక నిల్వ ధాన్యాలనాశించే పురుగుల లార్వాలను సంహరించే శక్తిని ప్రదర్శించింది (పరితోష్ భట్టాచార్య, 2016).
  • తోటకూర పంటపై వడిసె ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి తోటకూర ఆకులను తినే లార్వా (హైమెనియా రికర్వాలిస్)ల సంఖ్యను తగ్గించవచ్చు. (అరివుడైనంబి, అతని అనుచరులు, 2010)
  • వడిసె ఆకు ద్రావణం ప్రయోగశాలలో ప్రత్తికాయతొలుచు పురుగు, హెలికోవర్ప ఆర్మిజరాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (దేశ్‌ముఖ్, అతని అనుచరులు, 2013).
  • వడిసె లేత కొమ్మలను, పొడి ఆకుపొడిని వరి పొలంలో పురుగుల నివారణకు, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు. (సౌమిత్‌బెహరా, అతని అనుచరులు, 2006).
  • వడిసె ఆకులనుపయోగించి హెర్బల్ ద్రావణం తయారు చేసి అనేక పురుగులను నివారించవచ్చు.

హెర్బల్ ద్రావణం తయారు చేసే పద్ధతి :
కావలసిన పదార్థాలు :
వడిసె ఆకులు – 1కి.
ఉమ్మెత్త కాయలు – 1 కి.
మధుక లాంగిఫోలియాపిండి – 1 కి.
గన్నేరు పప్పు – 1 కి.
పొగాకు రద్దు – 500 గ్రా.
సున్నం – 250 గ్రా.
ఆవుమూత్రం – 5 లీ.
మట్టికుండ – 1

తయారు చేసే పద్దతి :

  • ఒక మట్టి కుండలో వడిసె మొక్క ఆకులు, సన్నగా తరిగిన ఉమ్మెత్త కాయల ముక్కలు, గన్నేరు గింజలు అన్నింటినీ నూరి, మధుకలాంగి ఫోలియాపిండి, పొగాకు రద్దు, సున్నం కలిపి 5 లీ. ఆవు మూత్రం పోయాలి.
  • మట్టి పాత్రను మూతతో కప్పి ఎరువు గుంత / మట్టిలో 7 రోజులు పూడ్చి ఉంచాలి.
  • పై మిశ్రమాన్ని వడపోసి 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి పిచికారి చేసి అన్ని పురుగులను నివారించవచ్చు.
  • వడిసె ఆకులు వికర్షక చర్యతో చెదలను అరికడతాయి.
  • వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగు నివారణకు ఎకరానికి 80 కి. వడిసె ఆకులను వేయాలి.
  • పశ్చిమ బెంగాల్‌కి చెందిన పురులియా గ్రామ రైతులు వరి చేలో ఎకరానికి 150 కి. వడిసె ఆకులను వేసి పసుపుపచ్చ కాండంతొలుచు పురుగు, గొట్టపు పురుగు, హిస్పాలను సమర్ధవంతంగా నివారించడమేగాక 20-40% అధిక దిగుబడులను పొందారు (కళ్యాణ్ కెవికె, పశ్చిమబెంగాల్, 2017)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. కర్పూరం

కర్పూరం 3-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక వృక్షం. లేత ఆకులు ఎర్రగా ఉంటాయి. ముదిరిన కొద్దీ ఆకులు పచ్చగా మారతాయి. పసుపుపచ్చ పూలు సువాసన కలిగి ఉంటాయి. కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇదివిత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్కలోని ఆకులు, కొమ్మలు, వేర్లు, ఇతర భాగాల నుండి వెలికి తీయబడు పదార్థాన్నే కర్పూరం అంటారు.

సాధారణ నామం
క్యాంఫర్‌ట్రీ / పచ్చ కర్పూరం / కర్పూర్
శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫొర
కుటుంబం: లారేసి²

ఉపయోగాలు : ఔషధ రంగంలో …

  • ఆకులు, కొమ్మలు, వేర్లు, చెక్క ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఆవిరయ్యేనూనె, కాంఫర్, శాప్రోల్, యూజినాల్, టర్పినియోల్, సిన్నమిక్ ఆల్డిహైడ్, కౌమారిన్ అనబడు రసాయనాలు ఉంటాయి.
  • దీనిని జ్వరాలు, కురుపులు, పొంగులు, కోరింతదగ్గు, శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, కీళ్ళనొప్పులు నివారించుటకు ఉపయోగిస్తారు.
  • ఈ మొక్క నుంచి తయారు చేసిన కర్పూరాన్ని హారతి ఇచ్చుటకు, చర్మ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కర్పూరం మొక్క ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పై బలమైన ఫ్యూమిగెంట్ మరియు కాంటాక్ట్ విష చర్యలను ప్రదర్శించింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో డిక్యామ్ఫర్ (40.54%), వినలూల్ (22.92%), సినియోల్ (11.26%), 3, 7, 11 ట్రైమిథైల3హైడ్రాక్సి6, 10డోడికాడియెన1ఐలఎసిటేట్ (4.50%) ఉంటాయి. సిన్నమోమం క్యామ్‌ఫర్ ఎసెన్షియల్ ఆయిల్, దాని రసాయనాలను లాసియోడెర్మా సెర్రికార్నె నివారణకు సహజ ఫ్యూమిగెంట్స్ మరియు కీటకనాశనులుగా వృద్ధి చేయవచ్చు (చెన్, అతని అనుచరులు, 2014).
  • సిన్న మోమం క్యాంఫొరా వెరైటి లినలూలిఫెరా, సిన్నమోమం క్యాంఫొరావెరైటి హోస్యో ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్స్ సైటోఫిలస్ జియామెయిస్‌పై ప్రయోగశాలలోను, మినిసైలోస్‌లోను వికర్షక చర్యను ప్రదర్శించాయి (కాన్సియన్, అతని అనుచరులు, 2015).
  • కర్పూరం మొక్క ఎసెన్షియల్ ఆయిల్‌లో 36.61% క్యామ్ఫర్ మరియు 30.05% సినియోల్ ఉంటాయి. కర్పూర్ ఎసెన్షియల్ ఆయిల్ రెడ్ ఇంపోర్టెడ్ ఎర్రచీమ (ఆరఐయఫఎ) మైనర్ మరియు మేజర్ వర్కర్స్‌పై ఫ్యూమిగెంట్ విషచర్యను, బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. (ఫు, అతని అనుచరులు, 2015).
  • కర్పూర్ పొడి, ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం గ్రానేరియం, ట్రైబోలియం కాస్టానియంపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (నెనా అండ్ ఇబ్రహీం)
  • కర్పూర్ ఆకుల (100-300) పొడి నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, కాల్లసోబ్రూకస్ రోడిసియానస్ గుడ్లు పెట్టడాన్ని నిరోధించడం, గుడ్లు పొదగడాన్ని గణనీయంగా తగ్గించాయి (రాజపాక్సె అండ్ వాన్‌మ్డెన్, 1997)
  • కర్పూర్ ఆకుల (10-50) పొడి నిల్వ ధాన్యం లోపల లార్వా, ప్యూపా బ్రతికి ఉండటం తగ్గించాయి (ధర్మసేన, అతని అనుచరులు, 1998).
  • కర్పూర్ మిథనాలిన్ ద్రావణాలు పీచ్‌పండు ఈగ బాక్ట్రోసిరా జోనేట ఆడ పురుగులను అదికంగా చంపాయి (సైరాఖాన్, అతని అనుచరులు, 2016).
  • సిన్నమోమం జీలానికం, సిన్నమోమం బుర్మాన్ని, సిన్నమోమం ఇనర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్టెమియ సలిన లార్వాలను అరికట్టాయి (నూర్ ఫెసిహ ఒంటిహసన్, 2011).
  • కర్పూర్ క్ౙెåలం ద్రావణాలు కోరియోలస్ వెర్సికలర్, గ్లియోఫిల్లం ట్రాబియం శిలీంద్రాలపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (లి, అతని అనుచరులు, 2014).
  • సిన్నమోమం జీలానికిం ఎసెన్షియల్ ఆయిల్ మరియు నానోఎమల్షన్ మీల్‌వర్మ్, ఆల్ఫిటోబియస్ డయాపెరినస్‌ని నివారించాయి (వోల్పటొ, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా ప్రిన్సెప్స్ ఆకులు, సిన్నమోమం క్యాంఫొరా గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు, సైటోఫిలస్ ఒరైజె, బ్రూకస్ రూజిమానస్‌లపై మంచి వికర్షక చర్యలను ప్రదర్శించాయి. కాని వాటి మిశ్రమం (1:1) అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (లియు, అతని అనుచరులు, 2005). ఈ రెండు ఆయిల్స్‌ని విడివిడిగా ఉపయోగించినపుడు గోధుమ విత్తనాల మొలక శాతాన్ని తగ్గించాయి. కాని రెండింటిని కలిపి ఉపయోగించినపుడు మొలకశాతం పెరిగింది.
  • రసాయన ఎరువులు, పురుగు మందులనుపయోగిస్తే ఆహార గొలుసులో విషపూరిత అవశేషాలు, జీవ అసమతుల్యత, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు రావచ్చు. వృక్ష సంబంధ పురుగు మందులను రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడితే ఈ సమస్యలను అదిగమించవచ్చు. పేనుబంక ఆశించిన గ్రీన్ ఆల్ఫాల్ఫ నారు మొక్కలను మలైఫాస్ మరియు సహజ ఆయిల్ ద్రావణాల (ఒరిగానో, తైమ్.వేప, కానుగ, కర్పూర్, తేయాకు చెట్టు)తో శుద్ధి చేసినపుడు పేనుబంక పురుగులు నివారింపబడ్డాయి (కస్పిమి, అతని అనుచరులు, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

కీటక, శిలీంద్రనాశినిగా ‘ఇంగువ’

కీటకనాశినిగా ‘ఇంగువ’…. అన్ని రకాల పంటల మీద రసం పీల్చే పురుగుల దాడే తొలుత మొదలవుతుంది. మొక్కల ఎదుగుదలను తొలిదశలోనే స్తంభింపచేయడమే కాక ఇతర రకాల తెగుళ్లకు తివాచీ పర్చి ఆహ్వానం పలుకుతాయి. తొలి దశలోనే పైరుకు ఎదురు దెబ్బగా నిలిచే అన్ని రకాల రసం పీల్చే పురుగులను అరికట్టడానికి ఇంగువ ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది. 200 లీటర్ల నీటిలో పది లీటర్ల ఆవుమూత్రం కలపాలి. దానికి 200 గ్రాముల ఇంగువ ముద్దను గోరు వెచ్చని నీటిలో కరిగించి కలిపి పిచికారి చేస్తే అన్ని రకాల రసం పీల్చే పురుగులు పైరు నుంచి దూరంగా పారిపోతాయి.

ఆకు చుట్టు పురుగు నివారణకు… ఆకు చుట్టు పురుగు ఆశించినప్పుడు అతి స్వల్పకాలంలోనే భారీ నష్టం జరుగుతుంది. ప్రత్యేకించి మునగవంటి సున్నితమైన ఆకులు కలిగిన పంటలో నష్ట తీవ్రత మరింత ఎక్కువ. దీన్ని నివారించడానికి 200 లీటర్ల నీటికి 10 లీటర్ల ఆవు మూత్రం 400గ్రాముల ఇంగువ కలిపి పిచికారి చేసుకోవాలి.

శిలీంద్ర నాశినిగా ఇంగువ : ఇంగువలో బ్యాక్టీరియా వ్యతిరేక, శిలీంద్ర నాశక లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల శిలీంద్ర సంబధిత సమస్యల్లో ఇంగువను వాడవచ్చు. ఆవు మూత్రంతో కలిపి లీటరుకు 2 గ్రాముల ఇంగువ పిచికారి చేసుకుంటే శక్తివంతంగా పనిచేస్తుంది.

ఇంగువ కషాయంతో అగ్గితెగులు నివారణ
ప్రాచీన విజ్ఞానం వరి పంటను అగ్గితెగులుబారినుండి కాపాడింది. అగ్గి తెగులు నివారణకు ఆయా ప్రాంతాల్లో రెండు రకాల కషాయలను వినియోగించారు.

మొదటి విధానం : మూడు కిలోల ఆవు పేడను పది లీటర్ల నీటిలో కలిపి వడకట్టి పక్కన పెట్టుకొండి. ఇప్పుడు సేకరించి శుభ్రపరచిన తాజా మారేడు ఆకులను రెండు లీటర్ల నీటిలో ఉడికించి దించి చల్లార్చి వడకట్టాలి. ఈ రెండింటిని 100 లీటర్ల నీటిలో కలపండి. దానికి మరో 3 లీటర్ల ఆవు మూత్రం కలిపి పిచికారి చేసుకోవాలి.
రెండవ పద్ధతి : మారెడు పత్రి – తులసి – ఇంగువ కషాయం : మారేడు, తులసి 100 గ్రాములు సేకరించి రెండు లీటర్ల నీటిలో ఉడికించి వడకట్టాలి. దానికి మూడు లీటర్ల ఆవు మూత్రం, 3 కిలోల పేడ, పది లీటర్ల నీటిలో కలిపి కల్లాపి నీటిలో కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో కలుపు కోవాలి. దానికి 200 గ్రాముల ఇంగువ కలుపుకొని పిచికారి చేయాలి. ఇది ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ఒరిస్సా రాష్ట్రంలో అగ్గి తెగులు వ్యాపించి భారీగా నష్టం జరిగినప్పుడు ఈ రెండు ద్రావణాలను వినియోగించిన పొలాలు మాత్రమే బతికి బట్టకట్టాయి.

Read More

ఔషధ మొక్క…. చామంతి

క్రైసాన్తిమం సినరరీఫోలియంను డాల్మేషియన్ క్రైసాన్తిమం అంటారు. ఇది ఎక్కువగా సాధారణ డైసీలాగా కనిపిస్తుంది. దీని పూలు తెల్లగా ఉండి మధ్యలో పసుపురంగులో ఉంటాయి. ఇవి అనేక గట్టి కాండాలనుండి ఏర్పడతాయి. మొక్కలు నీలిఆకుపచ్చ రంగు ఆకులు కలిగిఉండి 18 నుండి 39 అంగుళాల ఎత్తు పెరుగుతాయి. ఈ మొక్క సహజ పురుగు మందు కలిగి ఉంటుంది. పూలను దంచి విత్తనాలలో ఉన్న పైరెత్రిన్స్‌ని వేరు చేసి ఓలియోరెసిన్‌గా అమ్ముతారు.

క్రైసాన్తిమం కాక్సినియం ఒక బహుళ వార్షిక మొక్క. ఇది కూడా డైసీలాగానే కన్పిస్తుంది. ఇది పెద్ద తెల్ల, గులాబి లేదా ఎర్రనిపూలు కలిగి ఉంటుంది. ఆకులు ఫెరన్ ఆకులను పోలి ఉండి మొక్క 12 నుండి 24 అంగుళాలు ఎత్తు పెరుగుతుంది.

  సాధారణ నామం : పైరిత్రం  శాస్త్రీయ నామం : క్రైసాన్తిమమ్ కాక్సినియం, క్రైసాన్తిమమ్ సినరరీఫోలియం  కుటుంబం: ఆస్టిరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొక్కలలో పూలు, ఆకులను ఔషధ భాగాలుగా ఉపయోగిస్తారు. వీటిలో ఉండే ప్రదాన పదార్థాలు క్లోరోజెనిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్, విటమిన్ ‘ఎ’, బి6, సి, కె, రైబోఫ్లేవిన్, థయామిన్. కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
  • సైనసైటిస్ లక్షణాలు, జ్వరం, చర్మ సమస్యలు, అధిక రక్తపోటు నివారణకుపయోగిస్తారు. రక్తప్రసరణను పెంచి గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది.
    కాలరీస్ తక్కువగా ఉండి క్రైసాన్తిమం టీ ఊబకాయులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగకరం. జీర్ణశక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • చామంతిలో కీటకనాశన పదార్థాలు రెండు రకాలలో ఉన్నాయి కైసాన్తిమం సినరరీఫోలియం, క్రైసాన్తిమం కాక్సినియం. ఈ రెండింటిలో పైరిథ్రం పదార్థాలు క్రైసాన్తిమం సినరరీఫోలియంలో క్రైసాన్తిమం కాక్సినియం కన్నా అధికంగా ఉన్నాయి.
  • పైరిత్రం పూల ద్రావణం ఆఫ్రికన్ ఆర్మీవర్మ్, ఆఫ్రికన్ బోల్‌వర్మ్, పేనుబంక, ఆకు తినే లార్వాలు, ఎర్రనల్లి, తామర పురుగులు, తెల్లదోమ, మొక్కజొన్న కాండం తొలుచు పురుగు, పొటాటో జాసిడ్‌లను నివారిస్తుంది. ఒక లీటరు వేడినీటిలో 100 గ్రా. ఎండిన పూలను వేసి బాగా కలిపి ఒక గంట నిల్వ ఉంచాలి. తర్వాత వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూలను కోసి ఎండబెట్టి మెత్తగా నూరాలి. ఈ పొడిని పురుగు లపై లేదా మొక్కలపై చల్లాలి (త్రిష్, 2013).

పైరిత్రం పురుగు మందు తయారు చేసే పద్ధతి :

  1. పైరిత్రం పూలను కోసి చల్లని, చీకటి, పొడి ప్రదేశంలో ఆరబెట్టాలి. ఆరిన పూలగుత్తులను గాలిచొరబడని పాత్రలో నిల్వ చేయాలి. అవసరమైనపుడు వీటిని పొడి చేసి కొద్దిగా సబ్బు ద్రావణంతో కలిపి తగినంత నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  2. ఒక కప్పు తాజా పూలగుత్తులను 1/8 కప్పు 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌లో నానబెట్టాలి. పాత్రను రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు మిశ్రమాన్ని పలుచని గుడ్డలో వడపోసి ద్రావణాన్ని గాలి చొరబడని పాత్రలో నిల్వ ఉంచాలి. 4 క్వార్ట్స్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
    నివారించబడే పురుగులు : పేనుబంక, దీపపు పురుగులు, పిండినల్లులు, ఎర్రనల్లి, కంపునల్లి, పొలుసుపురుగులు, తామర పురుగులు, తెల్లదోమలు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… తగిరిస్ / తగరిష చెట్టు

ఇది నిటారుగా పెరిగే ఏకవార్షిక మొక్క. సుమారు 80-90 సెం.మీ. ఎత్తులో వ్యాపించే కొమ్మలు కలిగి ఉంటుంది. సంయుక్త పత్రాలు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకులు 3 జతలుగా ఏర్పడతాయి. ఇవి కోలగా ఉంటాయి. ఇవి 3-4.5 సెం.మీ. పొడవుంటాయి. పూవులు లేత పసుపు రంగులో ఆకుల మొదళ్ళలో జంటలుగా ఏర్పడతాయి. కాయలు తప్పడిగా లేదా 4 కోణాలు కలిగి ఉంటాయి. కాయలు కొడవలి ఆకారంలో 10-15 సెం.మీ. పొడవుండి లోపల 30-50 గింజలు ఉంటాయి. తప్పడిగా ఉండి నల్లగా మెరుస్తుంటాయి. ఇది మెట్ట భూములలో కలుపు లాగా పెరుగుతుంది.

సాధారణ నామం : సికిల్‌పాడ్ / టోర సికిల్‌సెన్న / చాకుండ శాస్త్రీయ నామం : క్యాసియాటోరా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేర్లు, ఆకులు మరియు గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఆకులను కూరగా ఉపయోగిస్తారు. ఉదర సమస్యలు, రక్త సమస్యలు, మలబద్ధకం, ఊబకాయం, వాపులు, సుఖవ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. ఆకులు కణుతులు, రక్తలేమి, ఉబ్బసం, వెక్కిళ్ళు నివారణకుపయోగిస్తాయి.
  • గింజలు కంటి జబ్బులు, చర్మవ్యాధుల చికిత్సకు మరియు విరేచనకారిగా కూడా ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • తగిరిస్ (క్యాసియాటోరా) విత్తనాలను భారతదేశంలో సేంద్రియ క్షేత్రాలలో సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు. తగిరిస్ అనేక పంటలనాశించే పురుగులపై కీటక నాశక లక్షణాలను కలిగి ఉంది. తగిరిస్ గింజల ద్రావణం, దానిలో అధికంగా ఉండే ఆంత్రాక్వీనోన్స్ ఆఫ్రికన్ మలేరియా వెక్టర్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. (ఎమ్‌బాచౌ, అతని అనుచరులు, 2017).
  • క్యాసియానైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ యాంటీమైక్రోబియల్ (అమో, అతనిఅనుచరులు, 2007), తెల్లదోమపెద్ద పురుగులపై కీటకనాశక చర్య, అనోఫెలెస్ గాంబియే పై లార్విసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008), సిట్రియోరోసిన్, ఎమోడిక్‌యాసిడ్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై మస్క్విటోసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008) లను ప్రదర్శించాయి.
  • క్యాసియాటోరా మిథనాల్ ఆకుద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిపై అత్యధిక అడల్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. హెక్సేన్, క్లోరోఫాం, బెంజీన్, అసిటోన్, మిథనాల్ ద్రావణాలను మనిషి ముంజేతిపై రాసినపుడు ఇవి వికర్షణ చర్య ద్వారా దోమల కాట్ల నుండి రక్షణనిచ్చాయి. (అమరేశన్, అతని అనుచరులు, 2012).
  • క్యాసియాటోరా జీవనియంత్రణ చర్య ద్వారా పార్థినియం మిస్టిరోఫోరస్‌ని అరికట్టింది. ఆకు, కాండం నీటి ద్రావణాలు పార్థినియం విత్తనాల మొలకశాతం, లేత మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపింది. 20% ఆకుల ద్రావణం, 30% కాండం ద్రావణం 100% పార్థినియం విత్తనాలు మొలకెత్తడాన్ని అరికట్టాయి (సింగ్ అండ్ దేవి, 2017). క్యాసియాటోరా మొక్కలు స్రవించిన రసాయనాలు పార్థినియంపై ఎల్లెలోపతి ప్రభావాన్ని చూపాయి.
  • క్యాసియాటోరా (25%) ఆకుల నీటి ద్రావణం సోయాబీన్ పంటనాశించే ఆకుమచ్చ తెగులు కారకం, ఆల్టర్నేరియా ఆల్టర్నేటని పర్యావరణహిత పద్ధతిలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (ఖందారె, 2015)
  • క్యాసియాటోర హెక్సేన్ ద్రావణం గోధుమగింజల నిల్వ ధాన్యంలో ఆశించే లెస్సర్ గ్రెయిన్‌బోరర్, రైజోపెర్తా డామినికా నుండి కాపాడింది (అహద్, అతని అనుచరులు, 2016).
  • క్యాసియాటోరా మరియు అరిస్టోలోకియా బ్రాక్టియేట నీటి ద్రావణం మరియు ఇథనాల్ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, స్టెఫైలోకోకస్ ఆల్బస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, స్ట్రెప్టోకోకస్ ఫీకాలిస్, ఎస్కెరిచియాకోలి, క్లెబ్సియెల్లాఈరోజినెస్, ప్రోటియస్ వుల్గారిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, కాండిడా ఆల్బికాన్స్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్‌లపై యాంటీమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించాయి. నీటి ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలలో ఇథనాల్ ద్రావణం బాక్టీరియాపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది (జయసుధ, ఆమె అనుచరులు, 2011).
  • క్యాసియాటోరా, గ్లెåరిసిడియా, కానుగ ఆకులను పచ్చిఆకు ఎరువుగా ఉపయోగించవచ్చు. (మురళి, కెవికె, డిడియస్, జహీరాబాద్)
  • క్యాసియా టోరా జీవ పురుగు మందు వెల్లుల్లి పంటనాశించే తామర పురుగులు, త్రిప్స్ టబాసిని నివారించింది. వెల్లుల్లి దిగుబడులను కూడా గణనీయంగా పెంచింది (సింగ్, అతని అనుచరులు, 2014)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

అన్ని పంటల్లో పురుగుల నివారణకు తూటాకు కషాయం(లొట్టపీసు కషాయం)

వ్యవసాయ పెట్టుబడిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులదే సింహ భాగం. వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో పైరు పెట్టడం కంటే దాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ రంగంలోని సృజనశీలురు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలూ ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తూటేరు (ఐపోమియా ఫిస్టులోసా) లేదా తూటి ఆకుల కషాయం శక్తివంతమైన కీటకనాశినిగా గుర్తించారు.

తూటేరు, లొట్టపీచు, కాంగ్రెస్ కంప, బేషరమ్ అని కూడా తూటి మొక్కను పిలుస్తారు. కంది, మినుము, పత్తి, క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, వంగ తదితర పురుగుల బెడద ఎక్కువగా ఉండే అన్ని పంటల సస్యరక్షణకు ఈ కషాయం వాడుతూ సత్ఫలితాలను పొందుతున్నారు. క్యాబేజీ పంటను తీవ్రంగా నష్టపరిచే డైమండ్ బ్యాక్ మాత్పై తూటేరు కషాయం పిచికారీ చేస్తే పంట నష్టం కేవలం 2 నుండి 3 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.
అదే, రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు పంట నష్టం దాదాపు 11 నుంచి 12 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తూటేరు కషాయ వినియోగం విదర్భ ప్రాంతం అంతటా వ్యాపించింది. కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్ల తోటలు సాగుచేసే రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఆ ప్రాంత రైతుల సామూహిక ప్రయోగాల ఫలితంగా తూటేరు కషాయం పత్తిలో కాయతొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, తలనత్త పురుగు, పచ్చపురుగు, రాగిలద్దె పురుగు, డైమండ్ బ్యాక్ మాత్, గొంగళి పురుగు, ముక్కుపురుగులను, కాండం తొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను నివారించడానికి శక్తివంతంగా పనిచేస్తోందని తేలింది.

తూటాకు కషాయం తయారీ విధానం: ఒక కిలో తూటేరు లేత ఆకులను సేకరించాలి. ఆకులను మెత్తటి ముద్దగా నూరి.. 10 లీటర్ల నీటిలో వేసి 5 లీటర్లకు తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన కషాయానికి మరో అర కిలో తూటేరు ఆకుల ముద్దను కలిపి.. కషాయం సగానికి తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన 2.5 లీటర్ల కషాయాన్ని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. 2.5 లీటర్ల కషాయాన్ని 200 లీటర్లలో కలపాలి.
లీటరు కషాయానికి 0.5 మిల్లీ లీటర్ల చొప్పున ఎమల్సిఫయర్ను కలిపిన తర్వాత పిచికారీ చేసుకోవాలి.

Read More

ఔషధ మొక్క… రేల చెట్టు

రేలచెట్టు ఒక మధ్యమ పరిమాణం గల చెట్టు. ఇది వేగంగా పెరిగే 10-20 మీ. ఎత్తు పెరగే చెట్టు. ఆకులు 15-60 సెం.మీ. పొడవుంటాయి. ప్రతి పెద్ద ఆకులో 3-8 జతల చిన్న ఆకులుంటాయి. ప్రతి చిన్న ఆకు 7-21 సెం.మీ. పొడవు, 4-9 సెం.మీ. వెడల్పు వుంటుంది. పూలు 20-40 సెం.మీ. రెసిమ్‌లో ఏర్పడతాయి. ప్రతి పూవు 4-7 సెం.మీ. వ్యాసము ఉండి 5 పసుపు రంగు ఆకర్షక పత్రాలుంటాయి. కాయ 30-60 సెం.మీ. పొడవు, 1.5-3.5 సెం.మీ. వెడల్పు వుంటుంది. కాయలో గింజలుంటాయి. చెట్టు కొయ్య బలంగా వుండి, దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది.

సాధారణ నామం : గోల్డెన్ షవర్ శాస్త్రీయ నామం : క్యాసియా ఫిస్ట్యులా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చెట్టు యొక్క అన్ని భాగాలు ఔషద గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో సెన్నోసైడ్స్, రీన్ గ్లూకోసైడ్స్, బార్సలాయిన్, ఎలోయిన్, ఫార్మిక్ ఆమ్లం, టానిన్లు, ఆక్సిఆంధ్రాక్వినోన్లు ఉంటాయి.
  • మొక్క భాగాలన్నీ ముఖ్యంగా పండులోని గుజ్ౙు మలబద్ధకాన్ని పోగొట్టి మూలవ్యాధి చికిత్సకు ఉపయోగపడతాయి.
    వేర్లు చర్మవ్యాధులు, సిఫిలిస్ చికిత్సకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో

  • రేల చెట్టు నీటి ద్రావణం (0.25%) రైజోపెర్తా డామినికపై బలమైన యాంటిఫీడెంట్ ప్రభావాన్ని చూపింది (రాజారామ్ శైలజ్, ఆమె అనుచరులు, 2013).
  • రేల చెట్టు ఆకు ద్రావణం సైటోఫిలస్ ఒరైజెపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • క్యాసియాటోరా ఇథైల్ ఎసిటేట్ ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 65% కన్నా ఎక్కువ యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (రాజి, ఆమె అనుచరులు, 2016).
  • రేల చెట్టు ఇథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై అధిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి (చౌహాన్, అతని అనుచరులు, 2011).
  • రేల చెట్టు ద్రావణం పీచ్ పండుఈగ, బాక్ట్రోసిరా జోనేట గణనీయమైన గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది. దీనిని పీచ్ పండుఈగ యాజమాన్యంలో ఉపయోగించవచ్చు. (ఇలియాస్, అతని అనుచరులు, 2017).
  • రేల చెట్టు ద్రావణం రైస్ వీవిల్, సైటోఫిలస్ ఒరైజె చావు, పెద్ద పురుగుల విడుదలను తగ్గించడంపై అధిక ప్రభావాన్ని చూపింది (డెర్బలా, అతని అనుచరులు, 2012).
  • వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వధాన్యంలో ఆశించే పురుగులను నివారించే లక్షణాలు గల 200 మొక్కలను గుర్తించారు. అందులో రేల చెట్టు కూడా ఒకటి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More