ఒక పొద లేదా చిన్న చెట్టు. ఇది 10 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి బెరడు నునుపు దనంతో, పలుచని, గచ్ౘ్కాయ – ఆకుపచ్చ రంగులో ఉండి వయసుతోపాటు గోధుమ రంగుకి మారుతుంది. ఆకులు చిన్న ఆకులతో 30 సెం.మీ. పొడవుంటాయి. పెద్ద ఆకులో 11-37 చిన్న ఆకులుంటాయి. చిన్న ఆకులు కొడి గుడ్డు ఆకారంలో ఉంటాయి. ఆకు ఉపరితలంలో అనేక గ్రంథులుండి సువాసన కలగి ఉంటాయి. పూలు సువాసన కలిగిన పూలు. కాయ అండాకారంలో 3.3 -7.0 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.
సాధారణ నామం : హార్సఉడ్ శాస్త్రీయ నామం : క్లాసెనా అనిసాట కుటుంబం: రూటేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- వివిధ ఆఫ్రికా దేశాలలో ఈ మొక్కని అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. నైజీరియాలో క్లాసెనా అనిసేట, అప్రీగిల్పానిక్యులేట, వేప మిశ్రమంతో తయారు చేసిన ‘ఆబ్గో’ అనే కషాయాన్ని మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. టాంజెనియాలో సంప్రదాయ వైద్యులు దీనిని నోటి కాండిడియాసిస్, చర్మవ్యాధుల చికిత్సకుపయోగిస్తారు. టాంజెనియాలో దీనిని మూర్ఛ రోగ చికిత్సలో ఉపయోగిస్తారు. దక్షిణాఫ్రికాలో ఈ మొక్క ఆకులను అధిక రక్తపోటు నివారణకు ఉపయోగిస్తారు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలలో, ఫిలిప్పెåన్స్లో దోమలను వికర్షించడానికి తాజా ఆకులను కాలుస్తారు.
- ఆహారం ద్వారా కలిగే జబ్బులను వ్యాప్తి చేసే కొరినిబాక్టీరియం డిఫ్తీరియా, ఎస్కరిచియా కోలి, సూడోమోనాస్ యీరూజనోసా బాక్టీరియాల నివారణకు ఉపయోగిస్తుంది.
వ్యవసాయరంగంలో
- క్లాసెనా అనిసాట ద్రావణం దోమలు, ఈగలు, వీవిల్స్ని నివారించింది (ముకండివ, అతని అనుచరులు, 2016).
- చిక్కుడు గింజలపై బంకమట్టి, ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమం పొడి ఫార్ములేషన్ పూత నిల్వ సమయాలలో గింజలను ఆశించే పురుగు అకాంతోసెలిడస్ ఓబ్టెక్టస్ సంతతి ఉత్పత్తిని నివారించింది. (ఎన్డోమ్, అతని అనుచరులు, 2008). సువాసన గల బంకమట్టి పొడి ఎసెన్షియల్ ఆయిల్ కన్నా ఎక్కువ విషపూరిత చర్య కలిగిఉంది. ఎసెన్షియల్ ఆయిల్ మధ్యమ వికర్షణ చర్య, అధిక ఫ్యూమిగెంట్ విషపూరిత చర్య ప్రదర్శించింది.
- క్లాసెనా అనిసాట ద్రావణం మిడత (జోనోసెరస్ వెరైగేట్స్) నివారణలో ఉపయోగిస్తుంది (ఒకునడె అండ్ ఒలైఫా, 1987).
- క్లాసెనా అనిసాట ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ జియా మెయిస్ పెద్ద పురుగులను స్పర్శ, ఇన్హలేషన్ ప్రక్రియల ద్వారా నివారించింది (గౌడౌమ్, అతని అనుచరులు, 2013).
- క్లాసినా అనిసాట ఆకుల పొడి మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే ప్రోస్టెఫోనస్ ట్రంకీటస్, సైటోఫిలస్ జియామెయిస్ పురుగులను గణనీయంగా అరికట్టాయి (నూకెనైన్, అతని అనుచరులు, 2010).
- క్లాసినా ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ మలేరియా వ్యాప్తి చేసే దోమలు క్యూలెక్స్ క్వింక్విఫేసియన్స్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టిఫెన్సిలను గణనీయంగా చంపాయి (గోవింద రాజన్, 2010).
- సాంప్రదాయకంగా ఆఫ్రికాలోని అనేక కమ్యూనిటీలలో ఈ మొక్కని దోమలు, ఈగలు, వీవిల్స్ వంటి పురుగుల నివారణలో ఉపయోగిస్తున్నారు. క్రూడ్ ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలను అనేక పురుగులపై పరీక్షించి వాటి సమర్ధతను నిరూపించారు. కౌమారిన్లు, కార్బజోల్ ఆల్కలాయిడ్లు, లియొనాయిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి సుమారు 50 మిశ్రమాలను వేరు చేసి గుర్తించారు. వీటిలో కొన్ని పురుగు మందుల లక్షణాలు కలిగి ఉన్నాయని నిరూపించబడ్డాయి (ముకుండివ, అతని అనుచరులు, 2016). ఈ మొక్క ద్రావణం పాలిచ్చే జంతువుల చర్మాన్ని ఆశించే ఈగల లార్వాలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించింది (ముకుండివ, అతని అనుచరులు, 2012).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

