ఔషధ మొక్క… ఆవాలు

ఆవాలు సుగంధ ద్రవ్యమొక్క. గింజలు 1 మి.మీ. పరిమాణంలో చిన్నవిగా ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఉంటాయి. మొక్క 2 నుండి 8 అ. ఎత్తు పెరుగుతుంది. పసుపు రంగులో చిన్న పూలు ఏర్పడతాయి. ఆకులు సన్ననూగుతో కప్పబడి ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో పగటిపూట ఆకులు వడలి, రాత్రిపూట తిరిగి పూర్వస్థితికి వస్తాయి. మొక్క అనేక కొమ్మలు కలిగి వేగంగా పెరుగుతుంది. పూలు 7-9 మి.మీ. పొడవుంటాయి. కాయ సన్నగా, పొడవుగా ముక్కు కలిగి ఉంటుంది. ఇది 1-2 సెం.మీ. పొడవుంటుంది.

సాధారణ నామం : బ్లాక్‌మస్టర్డ్ శాస్త్రీయ నామం : బ్రాసికా నైగ్రా కుటుంబం: బ్రాసికేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఔషధ వైద్యంలో ఆవాల గింజల పిండిని ఉడకబెట్టి పుండుపై కట్టుకడతారు. గింజలను నూరి పేస్టు చేసి కీళ్ళ నొప్పులు తగ్గడానికి చర్మంపై పూస్తారు. దీనిని చర్మంపై పూసినపుడు రక్తాన్ని ఆ ప్రదేశంలోకి ప్రసరించేటట్లు చేసి బాధ, నొప్పులను తగ్గిస్తుంది.
  • నలగగొట్టిన గింజలపై వేడి నీరు పోసి కాళ్ళనుంచితే జలుబు, తలనొప్పులు తగ్గుతాయి. పురాతన ఔషధమూలికా వైద్యులు బట్టతల, మూర్ఛరోగం, పాముకాటు, పంటి నొప్పుల చికిత్సకుపయోగించేవారు.
  • గింజలను లోపలికి తీసుకుంటే ఆకలిని పెంచడం, జీర్ణశక్తిని పెంచడం, మూత్రవర్ధకం, వాంతి మందుగా పనిచేస్తుంది. గింజలను మొలాసెస్‌తో కలిపి లోపలికి మింగితే విరేచనకారిగా పనిచేస్తుంది. గింజల కషాయం కాలేయం, స్ల్పీన్ గట్టి పడటాన్ని తగ్గించే చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని కార్సినోమా, గొంతు ట్యూమర్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఆవాలు గింజలను తింటే టానిక్‌గా, ఆకలి పెంచడానికి ఉపయోగపడతాయి.
  • గింజలతో తయారు చేసిన ద్రవంతో పుక్కిలిస్తే ట్యూమర్స్ నివారించబడతాయి. ఆవాల నూనె వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆవాల పిండి యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది.

వ్యవసాయరంగంలో …

  • ఆవపిండిని పశువులకు దాణాగా యిస్తే పాల దిగుబడి పెరుగుతుంది. ఆవాల నూనె చెక్క పంటలకు ఎరువుగా, పురుగు మందుగా పనిచేస్తుంది.
  • ఆవాల ఆకు ద్రావణాన్ని వేడి నీటితో కలిపి పిచికారి చేస్తే జ్యూట్ పంటలో కాండం కుళ్ళు తెగులు నివారించబడుతుంది.
  • ఈ ద్రావణాన్ని వేడి నీటితో కలిపి పిచికారి చేస్తే వరి పంటనాశించే గోధుమ రంగు మచ్చ తెగులు నివారించబడుతుంది. పశ్చిమ బెంగాల్ రైతులు ఈ పద్ధతిని విజయవంతంగా ఆచరిస్తున్నారు. ఆ విధంగా ఈ మొక్కని పర్యావరణహిత సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించవచ్చు. (ఘోష్, 2000).
  • భూమిలో నివసించే వైర్‌వర్మ్స్ లార్వాలు అనేక పంటలను ఆశిస్తాయి. ఆలుగడ్డ పంటలో వీటి నష్టాన్ని బ్రాసికా పచ్చి రొట్ట ఎరువుల్ని పెంచి నివారించవచ్చు. (ఫ్రాస్ట్, 2002).
  • ఆవాల నూనె స్పోడోప్టెరా లిట్టొరాలిస్, స్పోడోప్టెరాలిట్టొరాలిస్ మిమోలిమ్స్‌ను నివారించింది. ఫాట్ బాడిప్రోటీన్ పరిమాణాలను తగ్గించింది (ఖాట్టర్ అండ్ అబుల్ డాబ్, 2010).
  • ఆవాల ఎసెన్షియల్ ఆయిల్ క్యాబేజి లూపర్, ట్రైకోప్లూసియాని అతి సమర్థవంతంగా చంపగలిగింది (యాస్మిన్ అక్తర్, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. అనాస

అనాస ఒక మీటరు వరకు ఎత్తు పెరిగే బహువార్షిక మొక్క. కాండం దృఢంగా ఉండి, ఆకులు పొడవుగా, ముళ్ళు కలిగి ఉంటాయి. పండ్లు ఎరుపు, పసుపు మిశ్రమ రంగు కలిగి, రసంతో నిండి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని పిలకమొక్కలు, క్రౌన్స్ మరియు స్లిప్స్ ద్వారా వ్యాప్తి చేస్తారు.

సాధారణ నామం : పైనాపిల్ శాస్త్రీయ నామం : అనానాస్ కామోసస్ కుటుంబం: అనోనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • అనాస పండ్లు మరియు ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. అనాస పండులో “బ్రోమోలిన” అనే ప్రోటీన్‌ని విడగొట్టే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా పెంపొందిస్తుంది.
  • అనాస పండ్లలో ఎక్కువగా విటమిన్ ‘ఎ’ మరియు ‘సి’ లభిస్తాయి.
  • పక్వానికి రాని పండు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపునొప్పిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది.
  • ఇది మూత్రకోశవ్యాధులకు మంచి ఔషధం, బాగా పండిన పండు చలవ చేస్తుంది.
  • దీనిలోగల అధిక పీచు పదార్థం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పండ్లరసం జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడటమే గాక మూత్రమును కూడా సులువుగా జారీ చేస్తుంది.
  • ఆకులు స్త్రీలలో ఋతుక్రమాన్ని క్రమబద్ధం చేస్తాయి. గుండె జబ్బులు, జ్వరం, కోరింత దగ్గు నివారణలో ఉపయోగపడుతుంది. దీనిని క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More