ఈ వ్యాధి ఐమీరియా (EIMERIA) అనే ఏకకణ పరాన్న జీవి వల్ల కలుగుతుంది. గాలి ఆడని ఇరుకైన, అపరిశుభ్రమైన పశుశాలలో వుంచే 2-3 నెలల దూడలకు ఈ వ్యాధి శీఘ్రంగా సోకుతుంది.

జిగురుతో కూడిన రక్త విరేచనాలు కలుగుతాయి. దూడ నీరసిస్తుంది.
సూక్ష్మదర్శిని ద్వారా పేడ పరీక్ష చేయించి వ్యాధి నిర్ధారించవచ్చు.

పరిష్కారాలు:
హోమియో:

  1. ఫెర్రం ఫాస్ 30 / కాలి ఫాస్ 30 / కాలి మర్ 6X / మాగ్ ఫాస్ 30 / మెర్క్ కార్ 30 మందులలో ఏదైనా ఒక మందు 10 మాత్రలు చొ॥న 5 రోజులు తినిపించాలి.
  2. పేడలో జిగురు, రక్తం ఉంటే బయో కెమికల్ సముదాయం: నేట్రం ఫాస్ 3X + కాల్కేరియా ఫాస్ 3X + ఫెర్రం ఫాస్ 3X + కాలి ఫాస్ 3X + కాలి సల్ఫ్ 3X + నేట్రం సల్ఫ్ 3X ఈ ఔషధాల మిశ్రమం 10 మాత్రలు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా 10 రోజులు తినిపించాలి.

అల్లోపతి:
పశువైద్యుని సంప్రదించి, పేడ పరీక్ష అనంతరం వారి సలహామేరకు

  1. డైరోలిన్-ఎల్ (DIROLIN-L) బిళ్ళలో సగం చొప్ప్పున 3 రోజులు తినిపించాలి. లేదా బయో సల్ఫా + మెట్రోనిడజోల్ 1 మాత్ర చొ॥న 3 రోజులు తినిపించాలి.
  2. లివ్ (LIV) 52 వంటి లివర్ టానిక్ (LIVER TONIC) రోజుకు 15 మి.లీ. చొ॥న త్రాగించాలి.

దూడల అంతర పరాన్న జీవులు (Internal Parasites) –
ఏకకణ పరాన్న జీవి – క్రిప్టోస్పొరిడియోసిస్ (CRYPTOSPORIDIOSIS)
అప్పుడే పుట్టిన దూడలకు (15 రోజులలోపు వయస్సు) ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. ఇది అంటువ్యాధి.

సమస్య:
పారటం, నీరసం, చనిపోవటం

కారణాలు:
క్రిప్టోస్పొరిడియా (CRYPTOSPORIDIA) అనే ఏకకణ పరాన్నజీవి సోకటం
రోగనిరోధకశక్తి తగ్గటం, పేడ ద్వారా ఒక దూడ నుండి మరొక దూడకు వ్యాపిస్తుంది.

సూక్ష్మదర్శిని ద్వారా పేడ పరీక్ష చేసి వ్యాధి నిర్ధారించవచ్చు.

పరిష్కారాలు:
హోమియో: ఆర్సెనికం ఆల్బం 200 + చైన 200 మందులు కలిపి 10 మాత్రల చొప్పున రోజుకు 3 పర్యాయాలుగా 3 రోజులు తినిపించాలి.

అల్లోపతి:
హాల్‌క్వినాల్ (HALQUINOL) బిళ్ళలు ఉదయం 1, సాయంత్రం 1 చొ॥న 3 రోజులు తినిపించాలి.
……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.