లేగ దూడలు తెల్లగా, జిగురుగా పారుట (CALF Scours)
సమస్య:
తెల్లగా, పచ్చగా విరేచనాలు
జిగురుగా పారటం
పేడ భరించరాని దుర్వాసన
జ్వరం వుండవచ్చు.
కారణాలు:
పాలు జీర్ణం కాక పోవటం,
అపరిశుభ్ర పొదుగు, పరిసరాలు,
E.COLI; SALMONELLA సూక్ష్మక్రిముల వల్ల,
పాలు ఎక్కువ తక్కువగా వదలటం, త్రాగటం
పశువైద్యుని సంప్రదించాలి. వ్యాధి భేదాత్మక పరిశీలన అవసరం.
ఈ వ్యాధిని అంతర పరాన్న జీవుల భారం, పాలు మిక్కుటంగా త్రాగటం, E.COLI; Salmonellosis; Coccidiosis; Cryptospordium; streptococcusలుగా భ్రమించే అవకాశం వుంది.
పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం:
- చింతపండు పులుసు 15 గ్రా॥, ఉప్పు 15 గ్రా॥ కలిపి ఒకే పర్యాయం త్రాగించాలి.
- కొర్ర పిండి 50 గ్రా॥, పసుపు 5 గ్రా॥, వెన్న 5 గ్రా॥ కలిపి 2 రోజులు తినిపించాలి.
- మజ్జిగ అరలీటరులో 10 గ్రా॥ పసుపు కలిపి రోజుకు 2 సార్లు త్రాగించాలి.
- పాలు పలుచగా చేసి గోరు వెచ్చగా త్రాగించాలి.
- ఉప్పు 5 గ్రా॥, సోడా ఉప్పు 5 గ్రా॥, గ్లూకోజు 25 గ్రా॥, ఒక లీటరు గోరు వెచ్చని నీటిలో కరిగించి ఈ విధంగా తయారు చేసిన ద్రవాన్ని రోజుకు 2,3 పర్యాయాలు త్రాగించాలి. లేదా ఒక లీటరు నీళ్ళలో 50 గ్రా॥ ఉప్పు, 10 గ్రా॥ల బెల్లం లేదా పంచదార కలిపి రోజుకు 2,3 పర్యాయాలు త్రాగించాలి.
- వాము 10 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥ కలిపి తినిపించాలి.
పెరటివైద్యం:
- గుప్పెడు దానిమ్మ, తంగేడు చిగుళ్లు 100 గ్రా॥ పెరుగులో కలిపి తినిపించాలి
- 10 ఆకులు గోంగూర, గాడిదగడపాకు, 50 మి.లీ. ఆముదం కలిపి తినిపించాలి.
ఓషధులు:
- ఇప్ప చెక్క లేదా పాల చెక్క 10 గ్రా॥ పసుపు 10 గ్రా॥ ముద్ద చేసి, పెరుగులో కలిపి తినిపించాలి.
- బలుసు, నేరేడు, తంగేడు ఆకులు ఒక్కొక్కటి 20 గ్రా॥ దంచి, ముద్ద చేసి 2,3 రోజులు తినిపించాలి.
- వెదురాకు పసరు 10 మి.లీ., పసుపు 5 గ్రా॥ కలిపి త్రాగించాలి.
- మామిడి జీడి, నేరేడు గింజలు సమపాళ్ళలో నూరి, ఆ పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
- కొడిసెపాల చెట్టు చిగుళ్ళు 5-10 గ్రా॥ నూరి, మజ్జిగతో కలపి రెండు పర్యాయాలు త్రాగించాలి.
మూలికావైద్యం:
- గంధ కఛూరాలు, గుగ్గిలం, పటిక బెల్లం సమపాళ్ళలో నూరిన పొడి 10 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
- శొంఠి, బూరుగు బంక, దానిమ్మ గింజలు, సోంఫు, జీలకర్ర, ధనియాలు సమపాళ్ళలో నూరి, ఆ పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి ఉదయం, సాయంత్రం త్రాగించాలి.
- మారేడు కాయ గుజ్జు 50 గ్రా॥, గంధ కఛూరాలు 50గ్రా॥, తుంగ ముస్తలు 50 గ్రా॥, యాలకులు 10 గ్రా॥, పటిక బెల్లం 100 గ్రా॥ నూరిన పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
- యాలకులు, పటిక బెల్లం, ఉసిరికాయ సమపాళ్ళలో నూరిన పొడి 20 గ్రాములు నీళ్ళలో కలిపి త్రాగించాలి.
హోమియో: క్రింది మందులలో ఏదైనా ఒక మందు
- మెర్క్ కార్ 200 లేదా మెర్క్ సాల్ 200 లేదా పోడోఫైలం 200 లేదా ఆర్సెనికం ఆల్బం 200 పూటకు 5 మాత్రలు చొ॥న ఉదయం, సాయంత్రం 3 రోజులు తినిపించాలి.
పై మందులకు తగ్గకపోతే, - చైన 30 + నేట్రం ఫాస్ 30 + ఆంటిమోనియం క్రూడం 30 పూటకు 5 మాత్రలు చొ॥న ఉదయం, సాయంత్రం 3 రోజులు ద్రవ సమతుల్యత పునరుద్ధరించబడే వరకు తినిపించాలి.
- వ్యాధి నిరోధక టీకా: సైకోటిక్ కో 30 / స్ట్రెప్టోకోకినం 30 / ఈ. కొలై నోసోడ్ 30 ఏదైనా ఒక మందు దూడ పుట్టిన వెంటనే మొదటి మోతాదు, అప్పటి నుండి 24 గంటలకు 2వ మోతాదు, 48 గంటలకు 3వ మోతాదు, 72 గంటలకు 4 వ మోతాదు చొప్పున తినిపించాలి. 4. వెరాట్రం ఆల్బం / కార్బో వెజ్ / పైరోజెన్ / డల్కమార / కాంఫొరా / కాల్కేరియా ఫాస్ / రూస్ టాక్స్ 30 లలో ఏదైనా ఒక మందు 5 మాత్రలు చొప్పున ఉదయం, సాయంత్రంగా 5 రోజులు తినిపించాలి.
- బయో కెమికల్ సముదాయం: నేట్రం ఫాస్ 3X + కాల్కేరియా ఫాస్ 3X + ఫెర్రం ఫాస్ 3X + కాలి ఫాస్ 3X + కాలి సల్ఫ్ 3X + నేట్రం సల్ఫ్ 3X ఈ ఔషధాల మిశ్రమం 10 మాత్రలు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా 10 రోజులు తినిపించాలి.
అల్లోపతి:
- హాల్‌క్వినాల్ (HALQUINOL) 1-2 బిళ్ళలు తినిపించాలి.
- 50 గ్రా॥ల పంచదారను 9 గ్రా॥ ఉప్పుతో కలిపి 1 లీటరు నీటిలో కరిగించి త్రాగించాలి.
- రాగి లేదా నూకల జావకు గ్లూకోజు, ఉప్పు కలిపి లేదా ఎలక్ట్రాల్ (ELECTRAL) పొడి కలిపి త్రాగించాలి.
- హిస్టానిల్ (HISTANIL) ఇంజక్షను చేయించాలి.
- అవసరాన్ని బట్టి రింగర్స్ లాక్టేట్ (RINGER’S LACTATE) మరియు డెక్స్‌ట్రోజ్ నార్మల్ సెలైన్ (DEXTROSE NORMAL SALINE) ఇంజక్షను రక్తంలోకి (।/V గా) ఎక్కించాలి.
జాగ్రత్తలు:
జున్నుపాలు పుష్కలంగా త్రాగనివ్వాలి.
క్రమపద్ధతిలో అంతరపరాన్న జీవులను నిర్మూలించాలి.
మట్టి తినకుండా మతికి బుట్ట కట్టాలి.
పరిసరాలు శుభ్రంగా వుంచాలి, తల్లి పొదుగు పొటాషియం పర్మాంగనేట్ లోషన్‌తో శుభ్రపరచాలి.
…………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

