శంఖుపుష్పం / దింతెన

సాధారణ నామం : బ్లూ పీ / బటర్‌ఫ్లైపీ శాస్త్రీయ నామం : క్లిటోరియా టెర్నేటియా కుటుంబం: ఫాబేసి

శంఖుపుష్పం ఒక బహువార్షిక హెర్బల్ మొక్క. ఆకులు అండాకారంలో ఉంటాయి. ఇది ఒక తీగ లేదా క్రీపర్‌లా పెరుగుతుంది. ఈ మొక్కలో కొట్ట వచ్చినట్లు కనిపించేవి వాటి ముదురు నీలం రంగు పూలు. అవి 4 సెం.మీ. పొడవు, 3 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కొన్ని రకాలు తెలుపు రంగు పూలు పూస్తాయి. కాయలు 5-7 సెం.మీ. పొడవుండి, ప్రతి కాయలో 6 నుండి 10 గింజలుంటాయి. లేత కాయలను తింటారు. దీనిని అలంకరణ మొక్కగా పెంచుతారు. దీని వేర్లు రైజోబియంతో కలిసి జీవిస్తూ పరస్పర సహకారమందించుకుంటాయి.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వాపు, నొప్పిని తగ్గిస్తుంది.
  • రక్తం పడే మొల్లల చికిత్సలో ఉపయోగిస్తారు. మొల్లలను ఆకుల కషాయంతో శుభ్రపరుస్తారు. మొత్తం మొక్క పేస్టుని మొల్లలపై పూస్తారు.
  • తలనొప్పి నివారణకు ఆకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేస్తారు.
  • రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ చికిత్సలో థామాసాతో మరగించిన నూనెతో మర్ధన చేస్తారు.
  • నోటిలోపల వాపుకు ఆకు కషాయంతో పుక్కిలిస్తారు. గాయాలను శుభ్రపరచడానికి కూడా ఈ కషాయాన్ని ఉపయోగిస్తారు. చీము ఏర్పడకుండా నివారిస్తుంది.
  • వ్యవసాయరంగంలో
  • శంఖుపుష్పం ద్రావణం నుండి తయారు చేసిన మేళనం కీటకనాశక చర్య మరియు / లేదా వికర్షక చర్య మరియు / లేదా పురుగు గుడ్లు పెట్టకుండా నిరోధించడం మరియు / లేదా గుడ్లు పెట్టే స్థానంపై ప్రభావం చూపడం మరియు / లేదా పురుగు మొక్కపై తినకుండా అవరోధించడం వంటి చర్యల ద్వారా పురుగులనరికడుతుంది.
  • ఈ మేళనం కీటకనాశక చర్య ద్వారా వ్యవసాయ పంటలనాశించే పెద్ద పురుగులు, లార్వాలను లేదా రసంపీల్చే పురుగులను నివారిస్తుంది. దీనిని ప్రత్తి పంటనాశించే హెలికోవర్మా ఆర్మిజరాపై ఉపయోగించి ప్రయోగాలు చేశారు. (రాబర్ట్ మెన్సా, 2012).
  • శంఖు పుష్పం గింజల ద్రావణం రైజోక్టోనియా సొలాని పై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
  • ద్రావణంలోని ప్రోటీన్ ఫినోటిన్ చిక్కుడునాశించే ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు శిలీంద్రం, కొల్లెటోట్రైకం లిండముథియానం మరియు బాక్టీరియల్ బ్లెåట్‌కారకం క్ౙాంతో మోనాస్ ఆక్సొనోపొడిస్ ఫేసియోలి; వరి నాశించే బైపొలారిస్ ఒరైజే, పైరిక్యులేరియా గ్రిసియా, బ్రాకియేరియా స్పీ, నాశించే రైజోక్టోనియా సొలానిలపై శిలీంద్రనాశక, బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది. ఈ ప్రోటీన్ జాబ్రోటెస్ సబ్‌ఫాసియేటస్ మరియు అకాంతోసీలిడియస్ ఒబెక్టస్ బ్రూచిడ్ల మొదటి దశ లార్వాలపై అధిక విష ప్రభావాన్ని ప్రదర్శించింది (కెలెము, అతని అనుచరులు, 2004).
  • శంఖుపుష్పం ఆకు ద్రావణాలు మలేరియా, ఫైలేరియా జ్వరం, ఎన్సెఫెలైటిస్, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాప్తి చేసే వాహకాలు ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ పెద్ద పురుగుల విడుదలను అరికట్టింది (అరివోలి, అతని అనుచరులు, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… హార్స్ ఉడ్

ఒక పొద లేదా చిన్న చెట్టు. ఇది 10 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి బెరడు నునుపు దనంతో, పలుచని, గచ్ౘ్కాయ – ఆకుపచ్చ రంగులో ఉండి వయసుతోపాటు గోధుమ రంగుకి మారుతుంది. ఆకులు చిన్న ఆకులతో 30 సెం.మీ. పొడవుంటాయి. పెద్ద ఆకులో 11-37 చిన్న ఆకులుంటాయి. చిన్న ఆకులు కొడి గుడ్డు ఆకారంలో ఉంటాయి. ఆకు ఉపరితలంలో అనేక గ్రంథులుండి సువాసన కలగి ఉంటాయి. పూలు సువాసన కలిగిన పూలు. కాయ అండాకారంలో 3.3 -7.0 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : హార్సఉడ్ శాస్త్రీయ నామం : క్లాసెనా అనిసాట కుటుంబం: రూటేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వివిధ ఆఫ్రికా దేశాలలో ఈ మొక్కని అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. నైజీరియాలో క్లాసెనా అనిసేట, అప్రీగిల్‌పానిక్యులేట, వేప మిశ్రమంతో తయారు చేసిన ‘ఆబ్గో’ అనే కషాయాన్ని మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. టాంజెనియాలో సంప్రదాయ వైద్యులు దీనిని నోటి కాండిడియాసిస్, చర్మవ్యాధుల చికిత్సకుపయోగిస్తారు. టాంజెనియాలో దీనిని మూర్ఛ రోగ చికిత్సలో ఉపయోగిస్తారు. దక్షిణాఫ్రికాలో ఈ మొక్క ఆకులను అధిక రక్తపోటు నివారణకు ఉపయోగిస్తారు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలలో, ఫిలిప్పెåన్స్‌లో దోమలను వికర్షించడానికి తాజా ఆకులను కాలుస్తారు.
  • ఆహారం ద్వారా కలిగే జబ్బులను వ్యాప్తి చేసే కొరినిబాక్టీరియం డిఫ్తీరియా, ఎస్కరిచియా కోలి, సూడోమోనాస్ యీరూజనోసా బాక్టీరియాల నివారణకు ఉపయోగిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • క్లాసెనా అనిసాట ద్రావణం దోమలు, ఈగలు, వీవిల్స్‌ని నివారించింది (ముకండివ, అతని అనుచరులు, 2016).
  • చిక్కుడు గింజలపై బంకమట్టి, ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమం పొడి ఫార్ములేషన్ పూత నిల్వ సమయాలలో గింజలను ఆశించే పురుగు అకాంతోసెలిడస్ ఓబ్టెక్టస్ సంతతి ఉత్పత్తిని నివారించింది. (ఎన్‌డోమ్, అతని అనుచరులు, 2008). సువాసన గల బంకమట్టి పొడి ఎసెన్షియల్ ఆయిల్ కన్నా ఎక్కువ విషపూరిత చర్య కలిగిఉంది. ఎసెన్షియల్ ఆయిల్ మధ్యమ వికర్షణ చర్య, అధిక ఫ్యూమిగెంట్ విషపూరిత చర్య ప్రదర్శించింది.
  • క్లాసెనా అనిసాట ద్రావణం మిడత (జోనోసెరస్ వెరైగేట్స్) నివారణలో ఉపయోగిస్తుంది (ఒకునడె అండ్ ఒలైఫా, 1987).
  • క్లాసెనా అనిసాట ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ జియా మెయిస్ పెద్ద పురుగులను స్పర్శ, ఇన్‌హలేషన్ ప్రక్రియల ద్వారా నివారించింది (గౌడౌమ్, అతని అనుచరులు, 2013).
  • క్లాసినా అనిసాట ఆకుల పొడి మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే ప్రోస్టెఫోనస్ ట్రంకీటస్, సైటోఫిలస్ జియామెయిస్ పురుగులను గణనీయంగా అరికట్టాయి (నూకెనైన్, అతని అనుచరులు, 2010).
  • క్లాసినా ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ మలేరియా వ్యాప్తి చేసే దోమలు క్యూలెక్స్ క్వింక్విఫేసియన్స్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టిఫెన్సిలను గణనీయంగా చంపాయి (గోవింద రాజన్, 2010).
  • సాంప్రదాయకంగా ఆఫ్రికాలోని అనేక కమ్యూనిటీలలో ఈ మొక్కని దోమలు, ఈగలు, వీవిల్స్ వంటి పురుగుల నివారణలో ఉపయోగిస్తున్నారు. క్రూడ్ ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలను అనేక పురుగులపై పరీక్షించి వాటి సమర్ధతను నిరూపించారు. కౌమారిన్లు, కార్బజోల్ ఆల్కలాయిడ్లు, లియొనాయిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి సుమారు 50 మిశ్రమాలను వేరు చేసి గుర్తించారు. వీటిలో కొన్ని పురుగు మందుల లక్షణాలు కలిగి ఉన్నాయని నిరూపించబడ్డాయి (ముకుండివ, అతని అనుచరులు, 2016). ఈ మొక్క ద్రావణం పాలిచ్చే జంతువుల చర్మాన్ని ఆశించే ఈగల లార్వాలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించింది (ముకుండివ, అతని అనుచరులు, 2012).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. బిళ్ల గన్నేరు

సాధారణ నామం : మడగాస్కర్ పెరివింకిల్ / రోజ్‌పెరివింకిల్ శాస్త్రీయ నామం : కాథరాంథస్ రోసియస్ కుటుంబం: అపొసైనేసి²

బిళ్లగన్నేరు దీర్ఘకాలం జీవించే చిన్న పొద లేదా హెర్బల్ మొక్క. ఇది నిలువుగా 30-100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. మొక్క మొదలు చెక్కలాగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాకుతుంది. తెల్లని పాలు కలిగి ఉంటుంది. కాండం గుండ్రంగా నిలువు బోదెలు కలిగి ఉంటుంది. ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఆకులు ఎదురెదురుగా చిన్న ఆకు కాడపై ఏర్పడతాయి. ఆకు కాడలు 2.5 నుండి 9.0 సెం.మీ. పొడవుంటాయి. ఆకులు గుడ్డు ఆకారంలో ఉంటాయి కాని మొదలువైపు సన్నగా ఉంటుంది. ఆకులు ఆకుపచ్చ రంగులో పాలిపోయిన ఈనెలు కలిగి ఉంటాయి. ఆకు చివర గుండ్రంగా ఉంటుంది. కాండం, ఆకులు నూగు కలిగి ఉంటాయి. కొన్నిసార్లు నూగు ఉండదు. పూలు ఆకు మొదలులో ఏర్పడతాయి. ఇవి ఒకటిగా లేదా జంటలుగా అతి చిన్న కాడలపై ఏర్పడతాయి. కాయ 2.0 నుండి 4.7 సెం.మీ. పొడవుండి అనేక గింజలు కలిగి ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొక్క సమూలంగా ఔషధగుణాలు కలిగి ఉంటుంది. దీని ఆకులు క్యాన్సర్‌ని తగ్గించే విన్‌క్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్ అనే ఆల్కలాయిడ్లను కలిగి ఉంటాయి. దీనిలో 70 రకాల ఇండోల్ ఆల్కలాయిడ్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి అజ్మొలిన్, విన్‌బ్లాస్టిన్, విన్‌క్రిస్టిన్, ఆల్‌స్టోనైన్, అజ్మాలినిన్, రెసెర్పిన్. దీనిని కడుపు నొప్పికి, కందిరీగ, తేనెటీగల కాట్లకి, స్త్రీలలో ఋతుసంబంధ నొప్పులకి, నిద్రకలిగించడానికి కూడా ఉపయోగిస్తారు.
  • బిళ్ల గన్నేరు మొక్కని చిరకాలంగా ఆయుర్వేద, యునాని వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో ఆల్కలాయిడ్స్, టానిన్స్ అనే రెండు రిసెర్పిన్ రకాల చురుకైన రసాయన మిశ్రమాలు ఉన్నాయి. ఈ మొక్కలో రెసెర్పిన్ ఉంది. బిళ్ల గన్నేరు రక్తపోటుని తగ్గిస్తుంది. రక్తపోటు తగ్గడానికి అర్ౙున్ క్యాప్సూల్స్ వాడాలి.
  • ఈ మొక్క యాంటిడయాబెటిక్ అని రుజువైంది. హెల్త్‌విట్ జామున్ రసం తీసుకుంటే డయాబెటిస్ బాగవుతుంది. ఈ మొక్క యాంటిక్యాన్సర్ ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో అతి సమర్ధవంతమైనది.
  • దీనిని ల్యుకేమియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది యాంటి బాక్టీరియల్, యాంటివైరల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ మొక్క ద్రావణం డీసెంట్రి, డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు.
  • దీనికి సహజంగా వాపు, నొప్పి తగ్గించే గుణముంది. బిళ్లగన్నేరు మొక్కలోని ఆల్కలాయిడ్ నుండి తయారు చేసిన ఔషధం పిల్ల…లో హోడ్గ్‌కిన్ లింఫోయా చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ పూవు పుష్పదళాలు, గింజలు యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి
  • ఇది ముఖం మీద చిన్న మొటిమలు, ఎక్ౙిమ, డెర్మటైటిస్ వంటి అనేక చర్మ వ్యాధులను నయం చేస్తుంది. దీనిని ముక్కు నుండి రక్త స్రావం, చిగుళ్ళ నుండి రక్తస్రావం, రక్తం స్రవించే మూల వ్యాధి చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఈ మొక్క కషాయం కంటి ఇన్‌ఫెక్షన్, కళ్ల ఇర్రిటేషన్‌కి కూడా ఉపయోగిస్తుంది. మహిళలలో రక్తస్రావ సమస్యను క్రమబద్ధీకరిస్తుంది.
  • ఈ మొక్కని నోటిలో అల్సర్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. డిప్రెషన్, తొలనొప్పి, నాసియా, అలుపు సమయంలో ఈ మొక్క ద్రావణం ఊరడింపునిస్తుంది. బిళ్లగన్నేరు మలేరియా చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది.
  • ఆస్త్మా చికిత్సలో కూడా ఈ మొక్క చాలా ఉపయోగకరం. గాయం నుండి నేరుగా రక్తస్రావాన్ని కూడా ఆపుతుంది. బిళ్లగన్నేరు ఇన్ఫెక్షన్, వాపు నుండి కూడా ఊరడింపు కల్గిస్తుంది. పురుగు కాట్లకు కూడా ఈ మొక్కని ఉపయోగిస్తారు. బిళ్ల గన్నేరు సహజంగా మూత్రవర్థకం, మూత్రాన్ని పెంచుతుంది

వ్యవసాయరంగంలో

  • బిళ్ళగన్నేరు ఆకుల నీటి ద్రావణాలు (1000 పిపియం) హెలికోవర్పా ఆర్మిజరా ।, ॥, ॥।, IV, V, V।వ దశ లార్వాలపై 2.60, 3.94, 7.75, 30.83, 38.53, 63.34% లార్విసైడల్ చర్యలను ప్రదర్శించాయి. బిళ్ళగన్నేరు ఆకుల ద్రావణాన్ని హెలికోవర్ప ఆర్మిజరా యాజమాన్యంలో జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (అలగుచామి అండ్ దేవేంద్రన్, 2016).
  • బిళ్ళగన్నేరు ఆకుల ఇథైల్ అసిటేట్ ద్రావణాలు హెలికోవర్పా ఆర్మిజరా ।, ॥, ॥।, ।V, V, V।వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఇథైల్ అసిటేట్ ఫ్రాక్షన్ ఆకు ద్రావణాన్ని హెలికోవర్పా యాజమాన్యంలో శక్తివంతమైన జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (రమ్య, ఆమె అనుచరులు, 2008).
  • పొగాకు లద్దె పురుగు, స్పోడోప్టెరా లిటూర 4వ దశ లార్వాలపై బిళ్ళగన్నేరు ద్రావణం మరియు బాసిల్లస్ తురింజెన్సిస్‌లను పర్యావరణహిత పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. (పన్నీర్ సెల్వం, అతని అనుచరులు, 2013).
  • బిళ్ళగన్నేరు ద్రావణం (0.5%) స్పోడోప్టెరా లిటూర లార్వాలపై పెరుగుదల క్రమబద్దీకరణ ప్రభావం అధికంగా చూపింది (సమ్మర్‌వార్ అండ్ పాండె, 2018).
  • బిళ్ళగన్నేరు, ఆముదం, బొప్పాయి, సీతాఫలం సేంద్రియ పురుగుమందుల ఆకు ద్రావణాలు తెగులు కారక శిలీంద్రాలయిన ఆస్పర్ౙిల్లస్ నైగర్, ట్రైకోడెర్మా రీసీ, పెనిసిలియం ఫ్యూమిక్సులోసమ్‌లను సమర్ధవంతంగా అరికట్టాయి. కాని వీటిలో బిళ్ళగన్నేరు ద్రావణం గణనీయమైన యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (కునావత్, అతని అనుచరులు, 2016).
  • బిళ్ళగన్నేరు నీటి ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్, ఈడెన్ ఈజిప్టిలార్వాలను పర్యావరణహిత పద్ధతిలో నివారించే సామర్థ్యం కలిగి ఉంది (కామాచి, అతని అనుచరులు, 2016).
  • బిళ్ళగన్నేరు వేరు మరియు ఆకు ద్రావణాలు అనేక లార్వాలపై కీటకనాశక, యాంటిఫీడెంట్ మరియు పెరుగుదలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ ద్రావణాలు వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగును, ప్రత్తి పంటలో నల్లి (బగ్) పురుగులను చంపాయి (రిచర్డ్ విలియం హేప్లూక్, 1999).
  • బిళ్ళగన్నేరు ఆకుల ద్రావణం (2.0%) స్పోడోప్టెరా లిటూర 6వ దశ లార్వాల ప్యూపాలను 73.33% చంపింది (శాండీ అండ్ సమ్మర్‌వార్, 2016).
  • సమగ్ర సస్యరక్షణ పథకంలో మొక్క నుండి వేరుచేసిన ఇన్‌సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్ (ఐజిఆర్) మానవులకు, పర్యావరణానికి సురక్షితం. స్సోడోప్టెరా లిటూర లార్వాలపై బిళ్ళగన్నేరు అసిటోన్ ద్రావణం 84.21% ఐజిఆర్ చర్యను ప్రదర్శించింది. అదే ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 57.14% ఐజిఆర్ చర్యను ప్రదర్శించింది (నెమోలియా, అతని అనుచరులు, 2003).
  • బిళ్ళగన్నేరు నుండి వేరు చేసిన రెండు సిస్టాటిన్స్ ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్‌పై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (శర్మ, అతని అనుచరులు, 2011).
  • బిళ్ళగన్నేరు ద్రావణం హిస్పిన్‌బీటిల్, బ్రోంటిస్పా లాంగిస్సిమాపై ప్రయోగశాలలో అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. సెమీఫీల్డ్‌ట్రయల్‌లో ఈ ద్రావణం పురుగుల సంఖ్యను తగ్గించింది (చాయోజున్, అతని అనుచరులు, 2012).
  • బిళ్ళ గన్నేరు ద్రావణం కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై 50% కి పైగా తక్కువ గాఢత వద్ద గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది (వన్మతి, ఆమె అనుచరులు, 2010)
  • బిళ్ళగన్నేరు, తులసి ద్రావణాలు డిస్టెర్కస్ కోయెనిగీపై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (కాయెస్థ్ అండ్ గుప్తా, 2015).
  • బిళ్ళగన్నేరు పూల మిథనాల్, నీటి ద్రావణాలు సెంటెల్లా మొక్కలలో బాక్టీరియా ఆకుమచ్చ కల్గించే జాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ పాథోవర్ సెంటెల్లే పెరుగుదలను గణనీయంగా అరికట్టాయి (గ్రాసెలిన్, అతని అనుచరులు, 2011).
  • బిళ్ళ గన్నేరు మిథనాల్ (92.33%), ఇథైల్ అసిటేట్ (91.33%), బెంజీన్ (98.33%), అసిటోన్ (0.44%), క్లోరోఫాం (92.33%) ద్రావణాలు టమాట ఎండుతెగులు శిలీంద్రకారకం, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం పెరుగుదల నరికట్టాయి. (చౌగులె అండ్ అండోజి, 2016).
  • బిళ్ల గన్నేరు, తులసి ఆకు ద్రావణాలు పొగాకు లద్దె పురుగు, స్పోడోప్టెరా లిటూర 4వ దశ లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి. తులసి ఆకు ద్రావణం బిళ్లగన్నేరు ఆకు ద్రావణం కన్నా అధిక యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (సుధ సమ్మర్ వార్ అండ్ జ్యోత్స్న పాండె, 2015).
  • బిళ్ల గన్నేరు ఆకుల క్రూడ్ ద్రావణం బెండకాండం, కాయతొలుచు పురుగు, ఈరియాస్ విట్టెల్లాపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. దీనిని జీవపురుగు మందుగా ఉపయోగించవచ్చు. (పవన్‌రాజ్, అతని అనుచరులు, 2016).
  • బిళ్ల గన్నేరు ఆకుల నీటి, మిథనాల్ ద్రావణాలు మలేరియా వాహకం అనాఫెలిస్ స్టెఫిన్సి, బోదకాలు వాహకం, క్యులెక్స్ క్వింక్విఫాసియేటస్‌లను లార్విసైడల్, ప్యూపిసైడల్ చర్యల ద్వారా నియంత్రించే అద్భుత శక్తి కలిగి ఉన్నాయి (సెల్లాదురై సుబారాణి, ఆమె అనుచరులు, 2013).
  • బిళ్లగన్నేరు సేంద్రియ ద్రావణం ట్రైకోడెర్మా రీసీ, పెనిసిలియం ఫ్యూమిక్యులోసం శిలీంద్రాలపై గణనీయమైన యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది (కుమవట్, అతని అనుచరులు, 2016).
  • బిళ్లగన్నేరు పెట్రోలియం ఈదర్ ద్రావణం, బాసిల్లస్ తురింజన్సిస్, అనోఫెలస్ స్టెఫెన్సి వాహకాల నియంత్రణ కార్యక్రమంలో పర్యావరణహిత కారకాలుగా ఉపయోగించడానికి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని కలిపిన మిశ్రమం అనోఫెలిస్‌స్టెఫెన్సిపై అద్భుత లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (పన్నీర్ సెల్వం, అతని అనుచరులు, 2013).
  • బిళ్ల గన్నేరు, బంతి, క్లీరోడెండ్రాన్ ఫిల్లోమెడిస్ ద్రావణాల మిశ్రమం డెంగ్యు వాహకం స్టెగోమియ ఈజిప్టీని సమర్ధవంతంగా నివారించింది. (కోకిల, ఆమె అనుచరులు, 2016).
  • బిళ్ల గన్నేరు పూల ద్రావణం అనోఫెలిస్‌స్టెఫెన్సి (మలేరియా వాహకం) లార్వాలను సమర్ధవంతంగా చంపాయి. బిళ్లగన్నేరు పూల ద్రావణాన్ని సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమంలో ఉపయోగించవచ్ౘ్ు (ప్రసాద్, అతని అనుచరులు, 2014).
  • బిళ్లగన్నేరు కాండం ద్రావణం జీవ సేంద్రియ శిలీంద్రనాశినిగా మిరప నారు మొక్కల నాశించే ఫ్యుజేరియం ఆక్సిస్పోరమ్ పెరుగుదల నరికట్టింది. ఈ ద్రావణం గ్రీన్‌హౌస్‌లో మిరపనారు మొక్కలను ఫ్యుజేరియం ఆక్సిస్పరం ఆశించి నష్టపరచకుండా కాపాడింది. ఇది పర్యావరణ హిత పద్ధతి (జహారి అండ్ హలిమూన్, 2014).
  • బిళ్లగన్నేరు వేరు, ఆకు ద్రావణాలు అనేక లార్వాలపై కీటకనాశక, యాంటిఫీడెంట్, పెరుగుదల నరికట్టే లక్షణాలను ప్రదర్శించాయి. ఈ ద్రావణాలు వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగుని, ప్రత్తినాశించే నల్లి పురుగులను చంపుతుంది (ఫ్లూక్, అతని అనుచరులు, 2001).
  • బిళ్లగన్నేరు, తులసి, లాంటానా ఇథనాల్ ద్రావణాల ప్రభావాన్ని ప్రత్తి పంటనాశించు రెడ్ కాటన్ బగ్, డిస్టెర్కస్ కోయినిగిపై “సీడ్‌డిప్ పద్ధతి” ద్వారా పరీక్షించారు. తులసి, లాంటానా ద్రావణాలు బిళ్లగన్నేరు ద్రావణం కంటే అధిక యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి. 5వ దశ పురుగులను తులసి, లాంటానా ద్రావణాల కన్నా బిళ్లగన్నేరు ద్రావణం ఎక్కువగా చంపింది (కాయెస్థ్ అండ్ గుప్తా, 2016).
  • బిళ్లగన్నేరు మొక్కని “సేంద్రియ సాధారణ బహుళ పంటల వ్యవసాయ పురుగుమందు” తయారీలో ఉపయోగిస్తారు.

కావలసిన పదార్థాలు :

  • పసుపు, వేప, మిరప, అల్లం, వెల్లుల్లి, జిల్లేడు (కెలాట్రోపిస్ జైగాంటియా), జిల్లేడు (కెలోట్రాపిస్‌ప్రోసెర), బొప్పాయి, దానిమ్మ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, నిమ్మగడ్డి, అకలైఫా ఇండిక, ఆముదం, బిళ్లగన్నేరు, గన్నేరు, వావిలాకు, ఉల్లి, నల్ల మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.

ప్రయోజనాలు :

  • అన్ని రకాల పంటలకు అతి శక్తివంతమైన పురుగుమందు / కీటకనాశినిగా పనిచేస్తుంది. మొక్కలకు బాక్టీరియా, శిలీంద్రాలు, వైరస్‌లను తట్టుకునే శక్తినిస్తుంది. హానికర సూక్ష్మ జీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. ఫంగిసైడ్, లార్విసైడ్, జెర్మిసైడ్, వర్మిసైడ్, బాక్టీరిసైడ్, నెమటిసైడ్, మొల్లస్కిసైడ్‌గా పని చేస్తుంది. ఇది అన్ని పంటలలో సంపూర్ణ పురుగు మందు. దీనినుపయోగిస్తే ఏ ఇతర పురుగు మందును వాడనవసరం లేదు.
    మోతాదు : 3% (30 మి.లీ. / 1 లీ. నీటిలో) ద్రావణం పిచికారి చేయాలి. ఒక ఎకరంలోని పంటపై ఒకసారి పిచికారి చేయడానికి 35 లీ. అవసరం.
    నిల్వ : 36 నెలలు (శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్).
  • బిళ్లగన్నేరు ఆకు ద్రావణం (0.5%) 44.16% స్పోడోప్టెరా లిటూర రెండవ దశ లార్వాలను చంపింది (సుధ సుమ్మర్వార్ అండ్ జ్యోత్స్న పాండె, 2015).
  • బిళ్లగన్నేరు ఆకు ద్రావణం కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడిస్ (72.5), ఫ్యుజేరియం మొనిలిఫార్మె (70.1), ఆల్టర్నేరియా ఆల్టర్నేట (73.0) లపై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… తగిరిస్ / తగరిష చెట్టు

ఇది నిటారుగా పెరిగే ఏకవార్షిక మొక్క. సుమారు 80-90 సెం.మీ. ఎత్తులో వ్యాపించే కొమ్మలు కలిగి ఉంటుంది. సంయుక్త పత్రాలు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకులు 3 జతలుగా ఏర్పడతాయి. ఇవి కోలగా ఉంటాయి. ఇవి 3-4.5 సెం.మీ. పొడవుంటాయి. పూవులు లేత పసుపు రంగులో ఆకుల మొదళ్ళలో జంటలుగా ఏర్పడతాయి. కాయలు తప్పడిగా లేదా 4 కోణాలు కలిగి ఉంటాయి. కాయలు కొడవలి ఆకారంలో 10-15 సెం.మీ. పొడవుండి లోపల 30-50 గింజలు ఉంటాయి. తప్పడిగా ఉండి నల్లగా మెరుస్తుంటాయి. ఇది మెట్ట భూములలో కలుపు లాగా పెరుగుతుంది.

సాధారణ నామం : సికిల్‌పాడ్ / టోర సికిల్‌సెన్న / చాకుండ శాస్త్రీయ నామం : క్యాసియాటోరా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేర్లు, ఆకులు మరియు గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఆకులను కూరగా ఉపయోగిస్తారు. ఉదర సమస్యలు, రక్త సమస్యలు, మలబద్ధకం, ఊబకాయం, వాపులు, సుఖవ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. ఆకులు కణుతులు, రక్తలేమి, ఉబ్బసం, వెక్కిళ్ళు నివారణకుపయోగిస్తాయి.
  • గింజలు కంటి జబ్బులు, చర్మవ్యాధుల చికిత్సకు మరియు విరేచనకారిగా కూడా ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • తగిరిస్ (క్యాసియాటోరా) విత్తనాలను భారతదేశంలో సేంద్రియ క్షేత్రాలలో సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు. తగిరిస్ అనేక పంటలనాశించే పురుగులపై కీటక నాశక లక్షణాలను కలిగి ఉంది. తగిరిస్ గింజల ద్రావణం, దానిలో అధికంగా ఉండే ఆంత్రాక్వీనోన్స్ ఆఫ్రికన్ మలేరియా వెక్టర్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. (ఎమ్‌బాచౌ, అతని అనుచరులు, 2017).
  • క్యాసియానైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ యాంటీమైక్రోబియల్ (అమో, అతనిఅనుచరులు, 2007), తెల్లదోమపెద్ద పురుగులపై కీటకనాశక చర్య, అనోఫెలెస్ గాంబియే పై లార్విసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008), సిట్రియోరోసిన్, ఎమోడిక్‌యాసిడ్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై మస్క్విటోసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008) లను ప్రదర్శించాయి.
  • క్యాసియాటోరా మిథనాల్ ఆకుద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిపై అత్యధిక అడల్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. హెక్సేన్, క్లోరోఫాం, బెంజీన్, అసిటోన్, మిథనాల్ ద్రావణాలను మనిషి ముంజేతిపై రాసినపుడు ఇవి వికర్షణ చర్య ద్వారా దోమల కాట్ల నుండి రక్షణనిచ్చాయి. (అమరేశన్, అతని అనుచరులు, 2012).
  • క్యాసియాటోరా జీవనియంత్రణ చర్య ద్వారా పార్థినియం మిస్టిరోఫోరస్‌ని అరికట్టింది. ఆకు, కాండం నీటి ద్రావణాలు పార్థినియం విత్తనాల మొలకశాతం, లేత మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపింది. 20% ఆకుల ద్రావణం, 30% కాండం ద్రావణం 100% పార్థినియం విత్తనాలు మొలకెత్తడాన్ని అరికట్టాయి (సింగ్ అండ్ దేవి, 2017). క్యాసియాటోరా మొక్కలు స్రవించిన రసాయనాలు పార్థినియంపై ఎల్లెలోపతి ప్రభావాన్ని చూపాయి.
  • క్యాసియాటోరా (25%) ఆకుల నీటి ద్రావణం సోయాబీన్ పంటనాశించే ఆకుమచ్చ తెగులు కారకం, ఆల్టర్నేరియా ఆల్టర్నేటని పర్యావరణహిత పద్ధతిలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (ఖందారె, 2015)
  • క్యాసియాటోర హెక్సేన్ ద్రావణం గోధుమగింజల నిల్వ ధాన్యంలో ఆశించే లెస్సర్ గ్రెయిన్‌బోరర్, రైజోపెర్తా డామినికా నుండి కాపాడింది (అహద్, అతని అనుచరులు, 2016).
  • క్యాసియాటోరా మరియు అరిస్టోలోకియా బ్రాక్టియేట నీటి ద్రావణం మరియు ఇథనాల్ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, స్టెఫైలోకోకస్ ఆల్బస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, స్ట్రెప్టోకోకస్ ఫీకాలిస్, ఎస్కెరిచియాకోలి, క్లెబ్సియెల్లాఈరోజినెస్, ప్రోటియస్ వుల్గారిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, కాండిడా ఆల్బికాన్స్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్‌లపై యాంటీమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించాయి. నీటి ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలలో ఇథనాల్ ద్రావణం బాక్టీరియాపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది (జయసుధ, ఆమె అనుచరులు, 2011).
  • క్యాసియాటోరా, గ్లెåరిసిడియా, కానుగ ఆకులను పచ్చిఆకు ఎరువుగా ఉపయోగించవచ్చు. (మురళి, కెవికె, డిడియస్, జహీరాబాద్)
  • క్యాసియా టోరా జీవ పురుగు మందు వెల్లుల్లి పంటనాశించే తామర పురుగులు, త్రిప్స్ టబాసిని నివారించింది. వెల్లుల్లి దిగుబడులను కూడా గణనీయంగా పెంచింది (సింగ్, అతని అనుచరులు, 2014)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

అసాధారణ వాతావరణ పరిస్థితులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశ వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం పై ఆధారపడి ఉంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని చేరుకొని, క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా జూన్ మొదటి లేదా రెండవ వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రైతులు ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని ఖరీఫ్ పంటల సాగును ప్రారంభిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నైరుతి రుతుపవనాల రాక ఒకటి నుండి మూడు వారాల వరకు ఆలస్యమవుతోంది. దీని కారణంగా విత్తనాల మొలక ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, నేలలో తేమ కొరత ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా, వర్షపాతం ఆలస్యంగా ప్రారంభమవడం, ఒకేసారి అధిక వర్షపాతం నమోదవడం, పంట పెరుగుదల మధ్యలో పొడి విరామాలు (డ్రై స్పెల్స్) ఏర్పడడం, తుఫానులు, వడగాల్పులు మరియు ఉష్ణోగ్రతలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పంటల పెరుగుదల మరియు దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను మరియు తక్కువ వ్యవధిలో పరిపక్వత చెందే పంట రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తే సమయాల్లో అవసరమైన మార్పులు, స్వల్పకాలిక పంట రకాల వినియోగం, నేలలో తేమ మరియు నీటి సంరక్షణ చర్యల అమలు, అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
  1. వర్షాకాలం ఆలస్యమైనప్పుడు
    వర్షాలు జూన్ నెలలో ప్రారంభం కాక జూలై లేదా ఆగస్టు వరకు ఆలస్యం అయితే సాధారణంగా సాగు చేసే దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలి. పెసర, మినుము, ఉలవలు, నువ్వులు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలు తక్కువ వ్యవధిలో పూర్తవుతాయి మరియు తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
  2. మధ్యలో పొడి విరామం ఏర్పడినప్పుడు
    వర్షాలు ప్రారంభమైన తరువాత కొన్ని వారాలు వర్షాభావం ఏర్పడితే నేలలో తేమను కాపాడటం అత్యంత ముఖ్యం. కలుపు నివారణ చేయడం, నేలపై మల్చింగ్ చేయడం, అంతరకృషి నిర్వహించడం, అవసరమైతే జీవరక్షక నీటిపారుదల ఇవ్వడం ద్వారా పంటను రక్షించవచ్చు. ఆకుల ద్వారా పోషకాలు అందించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
  3. అధిక వర్షాలు కురిసినప్పుడు
    భారీ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే బయటకు వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి. నీరు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు, శిలీంధ్ర వ్యాధులు మరియు పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైన మొక్కల సంరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి.
  4. వర్షాలు ముందుగానే ముగిసినప్పుడు
    వర్షాకాలం త్వరగా ముగిసి నేలలో తేమ తగ్గినప్పుడు తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలు లేదా రబీ సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలి. నేలలో తేమను సంరక్షించేందుకు మల్చింగ్, కన్జర్వేషన్ టిల్లేజ్ వంటి పద్ధతులు ఉపయోగించాలి.
  5. దీర్ఘకాలిక కరవు పరిస్థితులు: పంట ఎదుగుదల దశలో వర్షాలు ఆగిపోతే, మొక్కల సంఖ్యను తగ్గించి, కలుపును తీసివేసి వాటిని నేలపై కప్పి ఉంచడం ద్వారా తేమను కాపాడుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను (అలసందలు) వంటివి సాగు చేయడం మేలు.

ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన పంటలు
• వేరుశెనగకు బదులుగా – పెసర, నువ్వులు, ఉలవలు
• వరికి బదులుగా – జొన్న, సజ్జ, రాగులు
• పత్తికి బదులుగా – పెసర, మినుము, నువ్వులు
• మొక్కజొన్నకు బదులుగా – జొన్న, కొర్రలు, సజ్జ

రైతులు పాటించాల్సిన ముఖ్య సూచనలు
• వాతావరణ శాఖ సూచనలను ప్రతిరోజూ గమనించాలి.
• స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలి.
• ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి.
• వర్షపు నీటిని సంరక్షించే చర్యలు చేపట్టాలి.
• పంటల బీమా పథకాలలో నమోదు చేసుకోవాలి.
• సమగ్ర పంటల నిర్వహణ పద్ధతులను అనుసరించాలి.

నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల మొక్కల ఎదుగుదల మెరుగుపడి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకుని మంచి దిగుబడిని ఇస్తాయి.
• వేసవి దుక్కి: వేసవిలో లోతుగా దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు మరియు కొన్ని కీటకాల సమస్య కూడా తగ్గుతుంది.
• వాలు ప్రాంతాల్లో భూమి సమోన్నత రేఖలకు అనుగుణంగా దున్నడం వల్ల వర్షపు నీటి ప్రవాహం తగ్గి నేల కోత నివారించబడుతుంది.
• పొలాన్ని చిన్న చిన్న గట్లుగా విభజించడం ద్వారా వర్షపు నీరు పొలంలోనే నిలిచి నేలలోకి ఇంకుతుంది.
• మల్చింగ్: పంట అవశేషాలు, గడ్డి లేదా ప్లాస్టిక్ మల్చ్ను నేలపై పరచడం ద్వారా నేల నుంచి నీటి ఆవిరీభవనం తగ్గి తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది.
• అంతరకృషి: పంటల మధ్య తేలికగా దున్నడం వల్ల నేలపై ఏర్పడే గట్టి పొర తొలగి నీటి చొరబాటు మెరుగుపడుతుంది మరియు తేమ నష్టం తగ్గుతుంది.
• సమయానికి కలుపు నివారణ: కలుపు మొక్కలు నేలలోని తేమను ఎక్కువగా వినియోగిస్తాయి. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా ప్రధాన పంటకు తేమ ఎక్కువగా అందుతుంది.
• వెడల్పు వరుసల సాగు: నీరు సులభంగా చొరబడేలా వెడల్పు బెడ్లు మరియు కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిల్వ, పారుదల రెండూ మెరుగుపడతాయి.
• సేంద్రీయ పదార్థాల వినియోగం పశువుల ఎరువు, కంపోస్ట్, పంట అవశేషాలను నేలలో కలపడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది.

ప్రస్తుతం వాతావరణ మార్పులు వ్యవసాయానికి ప్రధాన సవాలుగా మారాయి. అయితే అసాధారణ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, వాతావరణ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు.

ఇ. ప్రియాంకబాయి, రిసెర్చ్ అసోసియేట్, యాజమాన్య విభాగము,
వ్యవసాయ పరిశోధన స్థానం, కదిరి, ఫోన్ : 7674886210

Read More

రైతు క్షేత్ర మరియు గృహ సంబంధిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి బయోగ్యాస్ (గోబర్ గ్యాస్)

భారత దేశం బలమైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచ ఖ్యాతి పొందినది. కారణం భారత ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ మోతాదులో ప్రత్యక్షంగా వ్యవసాయం ద్వారా మరియు పరోక్షం గాను వ్యవసాయ ఆధారిత ఉత్పతుల ఎగుమతులు, వాణిజ్య పంటల ద్వారా ఎక్కువ మూలధనం అందేది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద ఎప్పుడూ స్ధిరంగా ఉండేది. ఇటు రైతులు మరియు వ్యవసాయ అనుబంధ కార్మికుల ఆర్థికపరమైన ప్రగతి పెరగడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కర్మాగారాలు ప్రారంభించి పెట్టుబడి పెట్టి ఇటు ఉపాది కల్పనతో పాటు మంచి ఆర్ధిక ప్రగతిని సాధించేవారు. అంతే కాకుండా వ్యవసాయానికి పశు సంపదకు సంబందం వీడదీయలేనిది. కావున పాల ఉత్పత్తుల సంస్దలను ఏర్పాటు చేసి పాడి రైతులకు చేయూత అందించి ఇటు పశు పోషణలో గణనీయమైన అభివృద్ది సాధించారు. ప్రపంచమంతా ఆర్ధిక మాంధ్యంలో చిక్కుకొని పోయి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఆర్ధిక పురోగతి దెబ్బ తిని ఆ దేశాల ప్రజలు విల విల లాడారు. అటు వంటి సమయంలో భారత ఆర్ధిక వ్యవస్ద దెబ్బ తినకుండా నిల్చొని ప్రపంచదేశాలకు ధీటుగా జవాబు ఇచ్చింది. దానికి ప్రధాన కారణాలు పైన పేర్కొన్న అంశాలే కానీ ప్రస్తుతం అంతా విరుద్ధంగా మారింది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గించి ఎక్కువమంది పట్టణాల వైపు తరలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ వ్యయo పెరగడంతో పాటు నష్టాలు పెరగడంతో అధిక శారరిక శ్రమ, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారడం వల్ల పూర్తిగా విఫలమయింది. దీనికి తోడు రైతుకు చేదోడు వాదోడు వుండే పశుపోషణ వ్యవస్దను పూర్తిగా నిర్లక్ష్య పరచడం కూడా ఒక ప్రధాన కారణం. నేల ఫల శక్తికి మూల కారణం అయిన సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, కేవలం పశుపోషణ ద్వారా సాధ్యం అయ్యేది, ఈ పశుపోషణ ద్వారా వచ్చే సేంద్రియ పదార్దం నేలను సుదీర్గకాలం పదిలంగా ఉండేలా చేస్తుంది. కానీ ప్రస్తుత రైతులు సేంద్రియ ఎరువులు పూర్తిగా వదిలేసి కేవలం వాణిజ్య రసాయనిక ఎరువుల పైనే చొరవ చూపడం వల్ల నేలలో సేంద్రియ పదార్దం స్థితిగతులు పూర్తిగా తగ్గిపోయి నేల జీవ శక్తి క్షీణించి రసాయనిక ఎరువుల వల్ల నేల కలుషిత మై బీడు భూములుగా మారి పోయాయి. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వంట చెరకు నిమిత్తం వృక్ష సంపద పైన మాత్రమే ఆధారపడే వారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతవాసుల వలే వంట గ్యాస్ కు పూర్తిగా అలవాటు పడినారు. ఒక వైపు శిలాజ ఇంధనాల ద్వారా వచ్చే గ్యాస్ వాడుక వల్ల వాటి ధరలు పెరగడంతో పాటు ప్రక్క దేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్థితికి చేరగా శిలాజ ఇంధనాల తరుగుదల వలన, వివిధ దేశాల మధ్య యుద్ద వాతవరణాల వలన వంట గ్యాస్ ధరలు ఆకాశానికి అందేలా మారి ఇటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వాసులకు అదనపు భారంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద అభివృద్దికి సహకరించే సేంద్రియ ఎరువుల అవసరాన్ని తీర్చి నేల సారాన్ని పెంచే అధిక ఖర్చులతో కూడిన గ్యాస్ వంట బదులుగా పంట సంబంధిత వ్యర్దాలను, మరియు పశు వ్యర్ధాలతో అవాయు పరిస్దితులలో కుళ్ళింప చేసి అటు వంటకు గ్యాస్ మరియు ఇటు పోలానికి సేంద్రియ ఎరువును అందించవచ్చు. ఏమిటి ఆ పక్రియ అంటే బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ తయారీ విదానం. బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమగు అవాయు పరిస్దితుల్లో పని చేసే డైజెస్టర్ 1859లో ముoబై నగరంలో ఏర్పాటు చేసినప్పటికీ ఈ విదానం మొట్టమొదట జర్మన్ శాస్త్రవేత్తలు రెండవ ప్రపంచ యుద్ద సమయంలో బయోగ్యాస్ విధానాన్ని ఆధునికరణం చేసి సులభంగా వాడేలా చేశారు. ఒకప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తిలో అగ్ర స్ధానంలో జెర్మనీ ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చైనా దానిని అధికమించి అగ్రగామిగా ముందుకు వెళుతుంది. దానికి కారణం ఆ విధానంలో వున్న అధిక ఉపయోగాలే. మన దేశంలో కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం బయోగ్యాస్ అభివృద్దికి అనేక పరిశోధనలు చేసి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంస్ద ద్వారా ప్రజలకు సలహలు, సూచనలు, అవగహన కల్పిస్తున్నారు మరియు ప్రోత్సహిస్తున్నారు.

  1. బయోగ్యాస్ ప్లాంట్ మొత్తం అన్నీ విభాగాలను చూపించే నమూనా పటం

బయోగ్యాస్ తయారీ విధానం మరియు ముఖ్య విభాగాలు : బయోగ్యాస్ తయారీలో ముఖ్యంగా రెండు ప్రధాన విభాగాలు కలవు అవి ఒకటి వ్యర్ద పదార్థాలను సంగ్రహించే విభాగం, రెండవది వ్యర్ద పదార్థాలను అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేసి బయోగ్యాస్ ఉత్పత్తి జరిపే డైజెస్టర్

కలిపే విభాగం (సంగ్రహణ విభాగం) :  ఈ విభాగం డైజెస్టర్ కు ప్రక్కన ఉండే భాగం. ఈ విభాగం ద్వారా బయోగ్యాస్ తయారీ కి అవసరం అగు వివిధ వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్దలను లోపలకి వేసి అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేయడానికి పశువుల పేడ నాలుగు భాగాలు మరియు  ఐదు భాగాలు నీరు (4 : 5) కలిపి లోపలికి పోయాలి . ఈ విధంగా పోసిన (4 : 5)  నిష్పత్తి కలిపిన పశువుల పేడ మరియు నీరు డైజెస్టర్ల లో స్టార్టర్ పదార్దంగా పనిచేసి లోపలి వ్యర్ద పదార్థాలు మిధనోకోకస్, మిధనో బాసిల్లాస్ వంటి బ్యాక్టిరియా సూక్ష్మజీవుల వలన  అవాయు పరిస్ది తుల్లో కిణ్వవణ పక్రియ ద్వారా కుళ్ళింపజేసి మీథేన్ (బయోగ్యాస్)  విడుదల అగును. 
  1. ఒకటవ రకమైన కదిలే ఢ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  2. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  3. మూడవ రకమైన దీన బంధు బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం

డైజెస్టర్ : బయోగ్యాస్ (గోబర్ గ్యాస్) తయారీలో ముఖ్యమైన ప్రధాన విభాగం డైజెస్టర్ లేదా పేర్మెంటర్. బయోగ్యాస్ విభాగంలో ఇది మధ్యన ఉండి బయోగ్యాస్ తయారీకి సహకరించే అత్యంత కీలక విభాగం. సాధరణంగా బయోగ్యాస్ తయారీలో వాడే డైజెస్టర్ లేదా పేర్మెంటర్ ను మూడు రకాలుగా వర్గీకరించారు, అవి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ అభివృద్ది పరిచినది. ఈ రకపు డైజెస్టర్ ముడి ఇనుము లేదా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడి పరిమాణం పరంగా మధ్యస్థంగా ఉండును. సాధారణంగా భారత దేశంలో ఈ రకపు డైజెస్టర్లు ఎక్కువగా వాడుకలో కలవు. ఈ డైజెస్టర్ కు ఉన్న గొప్ప లక్షణం ఎటువంటి నష్టం లేకుండా మరొక ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు మరియు మార్చుకోవచ్చు.
సాధారణంగా ఈ డైజెస్టర్ నేలలో 3.5 నుంచి 6.5 మీటర్ల లోతు మరియు 1.2 నుంచి 1.6 మీటర్ల వ్యాసార్దం గుంతను తవ్వి అందులో అమర్చాలి. పైన పేర్కొన్న కొలతలు సామాన్యంగా వాడేవి. ఈ కొలతలను బయోగ్యాస్ పరిమాణాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ బయోగ్యాస్ డైజెస్టర్ లో రెండు గదులు కలవు. అవి మిశ్రమ విభాగం ద్వారా వేసే వ్యర్ద పదార్థాలు, వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్థాలను కుళ్ళింప జేసె డైజెస్టర్ . రెండవ గది డైజెస్టర్ ను రంద్రాలు కలిగిన గోడ ద్వారా వేరు చేయబడి కిణ్వన పక్రియ పూర్తి అయి బయోగ్యాస్ విడుదల జరిగిన తరువాత మిగిలిన పదార్దం ఆ రంద్రాల ద్వారా బయటకు వచ్చి చేరుకొనును. దీనిని మనం సేంద్రియ ఎరువుగా పాడి పంటలకు వాడుకోవచ్చు. డైజెస్టర్ పై భాగం కొద్దిగా వంపుగా వుండి ప్రెజర్ వాల్వుని కలిగి ఉండి వాలు కలిగిన పైపు ద్వారా వంట గదికి అమర్చుకొని వంట గ్యాస్ గా వాడుకోవచ్చు. ఈ పక్రియలో మొదట మిశ్రమ విభాగం ద్వారా వేసిన వ్యర్ద పదార్థాలు 4: 5 నిష్పత్తిలో వేసిన పేడ మరియు నీరు మిశ్రమం వల్ల కిణ్వన ప్రక్రియ జరిగి అవాయు పరిస్దితుల్లో మీథేన్ వాయువు అణువులు విడుదల అయి వంపు కలిగిన డైజెస్టర్ పై భాగాన్ని డీ కొని తడనం చెందడం ద్వారా పీడనం పెరిగి అన్నీ అణువులు ఒకదానికొకటి కలిసి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ను విడుదల చేయును. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన జనతా రకం దీనిని చైనా దేశం వాళ్ళు అబివృద్ది పరిచినారు. దీనిని సాధరణంగా ఇటుక మరియు కాంక్రీట్ మిశ్రమంతో నేల లోపల నిర్మిస్తారు. ఇది పరిమాణం పరంగా పెద్దది ఎక్కువ బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును. దీని జీవన కాల పరిమితి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మూడవ డైజెస్టర్ రకం దీనబంధు బయోగ్యాస్ దీనిని 1984లో ఎ. ఎఫ్. పి. ఆర్. ఓ అను నూడిల్లీకి చెందిన ఒక స్వచ్చంధ సంస్ద అభివృద్ది పరిచింది. ఇది కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చితే సగం ధరలో తయారీ అగును. నిరుపేద ప్రజలకు భాగా అనుకూలం అగు డైజెస్టర్

బయోగ్యాస్ వలన కలిగే ఉపయోగాలు:

  • పశువుల పేడ మిశ్రమ ద్రావణం మరియు విచ్ఛిన్నం అగు వివిధ పదార్ధాల ద్వారా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను ఇంటి వంటకు వాడుకోవచ్చు
  • కాంతి కోసం వాడే లాంతర్లలో నింపుకొని వాడుకోవచ్చు
  • రైతులకు సేంద్రియ ఎరువు లోటుని తీర్చి కావలసినంత సేంద్రియ ఎరువును సమకూర్చి ఆర్ధిక భారాన్ని తగ్గించి నేల ఆరోగ్యానికి కాపాడుటలో సహయపడును
  • పశుపోషణ అభివృద్దికి ప్రత్యక్షంగా ఉపయోగపడును. ఎలా అనగా బయోగ్యాస్ తయారీకి వాడే వ్యర్ధ పదార్ధాలలో అధిక భాగం పశువుల వ్యర్ధాలను వాడుతున్నారు. అంతే కాకుండా స్టార్టర్ పదార్ధంగా కూడా పశువుల పేడను వాడుట గమనించదగ్గ విషయం
  • విచ్చిన్నం అగు వ్యర్ధ పదార్ధాలను కుళ్ళింపజేయుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుటలో ఉపయోగపడును
  • సాధారణ పశువుల ఎరువుతో పోల్చుకుంటే బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో ఎక్కువగా పోషకాలు ఉండును. అందులో నత్రజని (2-2.5 %), భాస్వరం ( 1.5%), పోటాషియం (1 %) .
  • బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో అధికంగా సేంద్రియ కర్బనం మరియు హ్యూమస్ ఉండి నేలలో వివిధ జీవరాశుల అభివృద్దికి దోహదపడును.
  • ఎటువంటి నష్టం లేకుండా ఉష్ణశక్తి మరియు విద్యుత్ శక్తి పునరుద్దరణకు సహకరించును.
  • శిలాజ ఇంధనాల వాడుకను తగ్గించి వాటి స్ధానంలో బయోగ్యాస్ వాడుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడును.
  • వాయు కాలుష్యాన్ని తగ్గించి హరితగృహ వాయువుల ఉద్గారాల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించును.
  • మిగతా సేంద్రియ ఎరువులలాగా కాకుండా చెడు వాసన లేకుండా వుండును,
  • బయోగ్యాస్ ఈగలు మరియు దోమల పునరుత్పత్తిని తగ్గించును

బయోగ్యాస్ తయారీలోన అధిగ మించవలసిన సవాళ్లు :

  • బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి అనగా డైజెస్టర్ మరియు సంగ్రహణ విభాగం తయారీ అధిక ఖర్చులతో కుడికున్నది.
  • ప్రతి రోజు పశువుల పేడ మరియు ఇతర విచ్ఛిన్నం అయ్యే వ్యర్ధాలు సేకరణ శ్రమతో పాటు స్వల్ప ఆర్ధికపరమైన ఇబ్బందితో కూడుకున్నది.
  • సాధారణ వంట గ్యాస్ తో పోల్చుకుంటే బయోగ్యాస్ తక్కువ శక్తి కలిగిన ఇంధనంగా ఉపయోగపడును
  • ఉష్ణోగ్రత తక్కువ ఉన్నట్లయితే బయోగ్యాస్ తయారీకి చాలా ఎక్కువ సమయం తీసుకొనును.
  • బయోగ్యాస్ ను తయారీ దగ్గర మాత్రమే వాడుకోవాలి. దీని నిల్వ మరియు రవాణా అధిక వ్యయంతో కూడుకున్న అంశాలు
  • బయోగ్యాస్ తో పాటుగా కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్పేట్ వంటి వాయువులను వాడుకకు ముందు తొలగించాల్సిన అవసరం తప్పనిసరి
  • బయోగ్యాస్ ప్లాంట్ కు తగిన యాజమాన్య పద్దతులు పాటించకపోవడం వల్ల మీధేన్ వాయువు బయటకు విడుదల వలన హరిత వాయువుల మోతాదును పెంచడంతో పాటు మండే లక్షణం ఉండుట వలన అగ్ని ప్రమాదాలకు కారణం అగును
  • నైపుణ్యం కలిగిన వ్యక్తుల పర్యవేక్షణ మరియు శిక్షణ కలిగిన వ్యక్తులు ఉండి తగిన యాజమాన్య పద్దతులు పాటించుట వలన బయోగ్యాస్ తయారీలోని అవరోధాలను అధిగమించవచ్చు.

బయోగ్యాస్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. 60 ఘనపు అడుగులు లేదా 2 మీటర్3 పరిమాణం కలిగిన బయోగ్యాస్ తయారీకి రోజుకి కనీసం 45-55 కేజీల పేడ అవసరం అంటే దీని కోసం 5 ఆవులు లేదా 5 గేదెలు అవసరం
  2. మానవ విసర్జన పదార్ధాలను (నైట్ సాయిల్) రోజుకి 60 కేజీలు హోటల్స్ మరియు హాస్టల్స్ , ప్రజల మరుగుదొడ్డి నుంచి సంగ్రహించి కూడా బయోగ్యాస్ తయారు చేయవచ్చు.
  3. ఒక పశువుల పేడే కాకుండా పందుల, కోళ్ళ విసర్జక పదార్దలను కూడా బయోగ్యాస్ తయారీలో వాడవచ్చు.
  4. బయోగ్యాస్ తయారికీ వాడే డైజెస్టర్ కి సూర్యరశ్మి సరిపడ తగిలేలా చూసుకోవాలి దీనివలన డైజెస్టర్ అంతర భాగంలో కిణ్వన ప్రక్రియ త్వరగా జరిగి ఇటు మీధేన్ వాయువు తయారీలో మరియు సేంద్రియ ఎరువు తయారీలో ఎంత గానో ఉపయోగపడును,
  5. బయోగ్యాస్ ప్లాంట్ కు మరియు వంట గదికి మధ్య దూరం 20 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.
  6. బయోగ్యాస్ ప్లాంట్ ను మరియు వంట గదిని కలిపే పైపును కొద్దిగా వాలుగా వుండేటట్లు చూసుకోవాలి.
  7. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు గట్టిగా ఉండే నేలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం
  8. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు వాడే నేలలో నీటి ముంపు లేకుండా చూసుకోవాలి.
  9. బయోగ్యాస్ డైజస్టర్ ఇనుముతో తయారీ చేసినది అయితే అది త్రుప్పు పట్టకుండా రంగును వేసుకోవాలి.
  10. శీతకాలంలో డైజస్టర్ లో ఉష్ణ నష్టం జరగకుండా నివారించుటకు పైన వరి గడ్డి వేసుకోవాలి.
  11. పేడ ద్రావణం మరియు ఇతర పదార్థాల ద్వారా డైజెస్టర్లోనికి ఇసుక చేరకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
  12. భాగా కుళ్లిన ఎక్కువ మొలాసిస్ ను శీతకాలంలో వేయరాదు, ఎందుకు అనగా దీని వలన సరిగా మండని బయోగ్యాస్ విడుదల అగును.
  13. అరటి మరియు గుర్రపు డెక్కలను 5 – 10 సెం,మీ కత్తిరించుకొని సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  14. నీలగిరి లేదా యూకలిప్టస్ ఆకులను 5 రోజులు నీటిలో నానబెట్టిన మిశ్రమాన్ని పేడ ద్రావణం వేయడానికి ముందుగా వేసుకోవాలి.
  15. విచ్ఛిన్నం అగు గృహ మరియు ఇతర వ్యర్ధ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించికుని, వరి మరియు అరటి కాండం ముక్కలను పశువుల పేడ ద్రావణంతో కలిపి సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  16. పశువుల పేడ ద్రావణం మిట్ట మధ్యాహ్నం డైజస్టర్ లోకి సంగ్రహణ విభాగం ద్వారా పంపుకోవాలి.
  17. ఉదయం మరియు సాయంత్రం బయోగ్యాస్ విడుదల అగు గొట్టం ద్వారా దేని సహయంతో నైనా డైజస్టర్ లోపలి భాగంలోని చెత్తను 50 సార్లు బాగా కలుపుకోవాలి. దీనివలన డైజెస్టర్ లో పేరుకు పోయిన తెట్టును సులభంగా తొలగించి బయోగ్యాస్ విడుదలకు సహకరించును. పై విధంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు బయోగ్యాస్ తయారీ విధానాన్ని అనుసరించుట వలన ఇంటికి కావలసిన వంట గ్యాస్ అందించుట తో పాటు రైతుకు కావల్సిన సేంద్రియ ఎరువు అందించుట వలన నేల ఆరోగ్యాన్ని కాపాడుటతో పాటు బయోగ్యాస్ తయారీకి పశువుల ఎరువు పశువుల నుంచి సంగ్రహించుట ద్వారా పశుపోషణ ప్రోత్సహించి రైతులు ఆర్ధికంగా ప్రగతికి ఉపయోగపడుతూ పరిసరాలలో వ్యర్ద పదార్దాల కాలుష్యం నుంచి కాపాడుతుంది. ఈ విధంగా రైతుకు అన్నీ రకాలుగా చేయూతను ఇవ్వడం వలన బయోగ్యాస్ ను రైతు క్షేత్ర మరియు గృహ సంబందిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి అని పిలవడంలో అతిశయోక్తి లేదు.

టి. రాజశేఖర్, సిహెచ్. సీత రామ లక్ష్మి, ఎ. శీరిష, ఎమ్. చారుమతి, ఎన్ . భారతి, టి. శ్రీలత, ఎమ్. ముకుందరావు
వ్యవసాయ పాలిటెక్నిక్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, అనకాపల్లి
ఫోన్: 6304852859

Read More

ఔషధ మొక్క… కసివింద

కసివింద ఎక్కువగా ఎర్రనేలలు, గరువు భూములు, రోడ్ల ప్రక్కన, కొండల దిగువ భాగంలో గట్ల మీద ఉంటుంది. సుమారు 60-90 సెం.మీ. ఎత్తు పెరిగి బలమైన వేర్లతో పొదవలే వ్యాపించి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కలు విపరీతంగా వ్యాప్తి చెంది ఇతర మొక్కలను రాకుండా చేస్తాయి. ఆకులు బలిష్టంగా చింతాకుల వలె ఉంటాయి. పూవులు పసుపు పచ్ౘ్రంగులో కొమ్మల సందులలో గుచ్ఛాలు వలె ఉంటాయి. వీటి విత్తనాలకు మొలకెత్తే శక్తి చాలా కాలం వరకు ఉంటుంది. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : కాఫీసెన్న శాస్త్రీయ నామం : క్యాసియా ఆక్సిడెంటాలిస్ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, వేర్లు, గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో సెన్నోసైడ్లు, నాఫ్తలిన్ గ్లెåకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఆవిరయ్యే నూనె, క్రైసోఫినాల్, ఎమోడిన్, క్రూడ్‌ఫైబర్, కాల్షియం, ఇనుము, నియోసిన్ మొదలగునవి ఉంటాయి.
  • ఈ మొక్క వేరును మిరియాలతో కలిపి పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం కుష్టువ్యాధి చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
  • మొక్క సమూలంగా కోరింత దగ్గు, వ్రణాలు, బొల్లి, మూత్రకోశ వ్యాధులు, మూర్ఛవ్యాధి, హిస్టీరియా వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కసివింద పెట్రోలియం ఈదర్ మరియు ఎన్‌బ్యుటనాల్ ద్రావణాలు (200 మరియు 300 పిపియం) క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను 100% చంపాయి. దీనిని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దీపక్ కుమార్, అతని అనుచరులు, 2014).
  • కసివింద ఆకుల క్రూడ్ ఇథనాలిక్ ద్రావణం 80 మైక్రోగ్రాములు / మి.లీ. మోతాదుకు పైన రైపిసిఫాలస్ మాన్యులేటస్ గుడ్లు పొదగడాన్ని అకారిసైడల్ చర్య ద్వారా పూర్తిగా నివారించింది. (సునీల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద జీవపురుగుమందు మొక్కజొన్న పంటలో అత్యధిక పెరుగుదలనిచ్చింది. (పంగ్నాకోర్న్, అతని అనుచరులు, 1999). అదనంగా కసివింద మొక్కజొన్న పంటనాశించే పేనుబంక, రొఫాలోసైఫం మెయిడిస్, మొక్కజొన్న తొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫ్యూమకాలిస్, ఆర్మివర్మ్, మితిమ్న సపరేటస్‌లను అత్యంత సమర్ధవంతంగా నివారించింది.
  • కసివింద ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తా డామినిక, ట్రైబోలియం కాస్టానియం, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, లైపోసెలిస్ పీటాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (వాకిల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద ఆకుల నీటి ద్రావణం పునరుత్పత్తి చర్యను, చన్న పంక్టేటస్ చేపలలో యాంటిఇన్‌ఫ్లమేటరి చర్యను ప్రదర్శిస్తుంది. (మనె, అతని అనుచరులు, 2012).
  • కసివింద ద్రావణం గోధుమ గింజలనాశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగు చావు మరియు పెద్ద పురుగుల సంతతిపై అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది (దెర్బాలా, 2012).
  • మొక్క రక్షణ వ్యవస్థలో ప్లాంట్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్ (పిపిఐ) ఒక ముఖ్యభాగం. పిపిఐ మొక్కలనాశించే పురుగులు, సూక్ష్మజీవులపై చురుకుగా పనిచేస్తుంది. క్యాసియా స్పీసీస్ యాంటి ఇన్‌సెక్టిసైడల్ మరియు యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కసివింద ఆకుల నుండి ఫిస్టులన్ అనే పిపిఐని వేరు చేశారు. ఈ పిపిఐ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియాకోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లా న్యుమోనియాలను స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్‌కి సమానంగా అరికట్టింది (అరుల్ పాండి అండ్ సంగీత, 2012).
  • కసివింద పూల ఇథైల్ అసిటేట్ ద్రావణం నుండి వేరు చేసిన రీన్ (1,8డైహైడ్రాక్సిఆంత్రాక్వినోన3కార్బాక్సిలిక్ యాసిడ్) 1000 పిపియం హెలికోవర్పా ఆర్మిజెరాపై 76.13% యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. రీన్ హెలికోవర్పా ఆర్మిజెరా (67.5%), స్పోడోప్టెరా లిటోర (36.25)లపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. బ్రతికిన లార్వాలు రూపం మారిన పెద్ద పురుగులనుత్పత్తి చేశాయి (దురైపాండియన్, అతని అనుచరులు, 2010).
  • క్యాసియాపెన్నా ద్రావణం అత్యంత సమర్ధవంతంగా గోధుమ గింజల నాశించే ట్రోగోడెర్మా గ్రానేరియంని అరికట్టింది. ఈ ద్రావణంలో కీటకనాశక చర్యగల వివిధ జీవ చర్యలు గల కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ ద్రావణాన్ని గోధుమగింజలను ఈ పురుగు నుండి కాపాడటానికి రసాయన పురుగుమందులకు ఒక సురక్షిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దెర్బలా, 2017).
  • చక్రపాణి మిశ్రా విశ్వవల్లభ (అధ్యాయం 8, శ్లోకం 39)లో పురుగుల నివారణకు కసివింద, శాపిండస్ ఎమార్ౙినేటస్, కానుగ, ఆల్‌స్టోనియా స్కాలరిస్, ఎంబెలియా రైబ్స్ బెరడు పొడిని ఆవుమూత్రంలో రాత్రంతా నానబెట్టి చెట్లలో ఆశించిన భాగాలపై పేస్టుగా పూయాలని సిఫారసు చేశారు (సాథేల్, 2004)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… రేల చెట్టు

రేలచెట్టు ఒక మధ్యమ పరిమాణం గల చెట్టు. ఇది వేగంగా పెరిగే 10-20 మీ. ఎత్తు పెరగే చెట్టు. ఆకులు 15-60 సెం.మీ. పొడవుంటాయి. ప్రతి పెద్ద ఆకులో 3-8 జతల చిన్న ఆకులుంటాయి. ప్రతి చిన్న ఆకు 7-21 సెం.మీ. పొడవు, 4-9 సెం.మీ. వెడల్పు వుంటుంది. పూలు 20-40 సెం.మీ. రెసిమ్‌లో ఏర్పడతాయి. ప్రతి పూవు 4-7 సెం.మీ. వ్యాసము ఉండి 5 పసుపు రంగు ఆకర్షక పత్రాలుంటాయి. కాయ 30-60 సెం.మీ. పొడవు, 1.5-3.5 సెం.మీ. వెడల్పు వుంటుంది. కాయలో గింజలుంటాయి. చెట్టు కొయ్య బలంగా వుండి, దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది.

సాధారణ నామం : గోల్డెన్ షవర్ శాస్త్రీయ నామం : క్యాసియా ఫిస్ట్యులా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చెట్టు యొక్క అన్ని భాగాలు ఔషద గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో సెన్నోసైడ్స్, రీన్ గ్లూకోసైడ్స్, బార్సలాయిన్, ఎలోయిన్, ఫార్మిక్ ఆమ్లం, టానిన్లు, ఆక్సిఆంధ్రాక్వినోన్లు ఉంటాయి.
  • మొక్క భాగాలన్నీ ముఖ్యంగా పండులోని గుజ్ౙు మలబద్ధకాన్ని పోగొట్టి మూలవ్యాధి చికిత్సకు ఉపయోగపడతాయి.
    వేర్లు చర్మవ్యాధులు, సిఫిలిస్ చికిత్సకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో

  • రేల చెట్టు నీటి ద్రావణం (0.25%) రైజోపెర్తా డామినికపై బలమైన యాంటిఫీడెంట్ ప్రభావాన్ని చూపింది (రాజారామ్ శైలజ్, ఆమె అనుచరులు, 2013).
  • రేల చెట్టు ఆకు ద్రావణం సైటోఫిలస్ ఒరైజెపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • క్యాసియాటోరా ఇథైల్ ఎసిటేట్ ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 65% కన్నా ఎక్కువ యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (రాజి, ఆమె అనుచరులు, 2016).
  • రేల చెట్టు ఇథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై అధిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి (చౌహాన్, అతని అనుచరులు, 2011).
  • రేల చెట్టు ద్రావణం పీచ్ పండుఈగ, బాక్ట్రోసిరా జోనేట గణనీయమైన గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది. దీనిని పీచ్ పండుఈగ యాజమాన్యంలో ఉపయోగించవచ్చు. (ఇలియాస్, అతని అనుచరులు, 2017).
  • రేల చెట్టు ద్రావణం రైస్ వీవిల్, సైటోఫిలస్ ఒరైజె చావు, పెద్ద పురుగుల విడుదలను తగ్గించడంపై అధిక ప్రభావాన్ని చూపింది (డెర్బలా, అతని అనుచరులు, 2012).
  • వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వధాన్యంలో ఆశించే పురుగులను నివారించే లక్షణాలు గల 200 మొక్కలను గుర్తించారు. అందులో రేల చెట్టు కూడా ఒకటి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

తీగజాతి కూరగాయల్లో పందిరి సాగు – అధిక దిగుబడికి మార్గం

తీగజాతి కూరగాయలు మన రైతులు విస్తృతంగా సాగు చేస్తున్న ముఖ్యమైన కూరగాయ పంటలు. దోసకాయ, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, చిక్కుడు వంటి పంటలను సాధారణంగా నేలపై పాకే విధానంలో సాగు చేస్తారు. అయితే పందిరి సాగు విధానం ద్వారా తీగలను పైకి పెంచడం వల్ల పంటలో గాలి, వెలుతురు ప్రసరణ మెరుగుపడి, కాయల నాణ్యత పెరగడంతో పాటు కోత, పంట సంరక్షణ పనులు సులభతరం అవుతాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు పందిరి సాగు రైతులకు అధిక దిగుబడి మరియు మెరుగైన ఆదాయాన్ని అందించే అవకాశం ఉంది.

పందిరి సాగు అంటే ఏమిటి?
తీగజాతి కూరగాయల తీగలను నేలపై పాకనివ్వకుండా, వెదురు, ఇనుప స్తంభాలు, జీఐ వైర్లు, ప్లాస్టిక్ లేదా నైలాన్ తాళ్ల సహాయంతో ఒక ఎత్తైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దానిపై తీగలను పెంచే విధానాన్ని పందిరి సాగు అంటారు. పంటను బట్టి పందిరి ఎత్తు, స్తంభాల మధ్య దూరం మరియు ఉపయోగించే వస్తువులు నిర్ణయించాలి.

పందిరి సాగుకు అనుకూలమైన పంటలు
బీరకాయ, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను పందిరి విధానంలో విజయవంతంగా సాగు చేయవచ్చు. పంట స్వభావం, తీగల పెరుగుదల మరియు కాయల బరువును బట్టి పందిరి నిర్మాణాన్ని బలంగా ఏర్పాటు చేయాలి.

పందిరి సాగు వల్ల ప్రయోజనాలు

  1. మొక్కలకు మంచి గాలి, వెలుతురు
    తీగలు నేలపై పాకకుండా పైకి పెరగడం వల్ల మొక్కల మధ్య గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. తగినంత సూర్యకాంతి అందడంతో మొక్కల పెరుగుదల చురుకుగా ఉంటుంది.
  2. తెగుళ్ల ఉధృతి తగ్గే అవకాశం
    మొక్కల భాగాలు నేలతో నేరుగా సంబంధం లేకపోవడం వల్ల అధిక తేమ కారణంగా వచ్చే కొన్ని శిలీంధ్ర తెగుళ్ల సమస్యను తగ్గించవచ్చు. అయితే సమగ్ర పంట సంరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి.
  3. కాయల నాణ్యత మెరుగుదల
    పందిరిపై వేలాడుతూ పెరిగే కాయలు నేలను తాకకుండా ఉండటం వల్ల కాయలపై మచ్చలు, వంకరలు మరియు నేలతో సంబంధం వల్ల వచ్చే నాణ్యత లోపాలు తగ్గుతాయి. తద్వారా మార్కెట్లో మంచి ధర పొందే అవకాశం ఉంటుంది.
  4. కోత సులభతరం
    పందిరిపై కాయలు స్పష్టంగా కనిపించడం వల్ల కోత సమయంలో కాయలను గుర్తించడం సులభంగా ఉంటుంది. దీనివల్ల కోతకు పట్టే సమయం మరియు శ్రమ తగ్గుతుంది.
  5. భూమి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది
    తీగలు పైభాగంలో విస్తరించడం వల్ల నేలపై అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సరైన పంట మరియు అంతర పంట ప్రణాళికతో భూమి వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు.

పందిరి నిర్మాణంలో జాగ్రత్తలు
పందిరి సాగులో విజయానికి బలమైన పందిరి నిర్మాణం చాలా ముఖ్యమైనది. పందిరి నిర్మించేటప్పుడు మంచి నాణ్యత కలిగిన వెదురు కర్రలు లేదా తగిన స్తంభాలను ఉపయోగించాలి. తీగలు, కాయల బరువును తట్టుకునే విధంగా ప్రధాన స్తంభాలను బలంగా పాతాలి.

పందిరిపై తీగలను పట్టుకునేందుకు బలమైన వైరు లేదా నైలాన్ తాళ్లను ఉపయోగించాలి. పందిరి నిర్మాణం గాలి వేగానికి తట్టుకునే విధంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో అధిక గాలులు, భారీ వర్షాల వల్ల పందిరి కూలిపోకుండా ముందుగానే తగిన బలపరిచే చర్యలు చేపట్టాలి.

నేల మరియు నాటే విధానం
నీరు నిల్వ ఉండని, మంచి నీటి పారుదల కలిగిన నేలలు తీగజాతి కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటాయి. పొలాన్ని బాగా దున్ని, సేంద్రియ ఎరువును తగిన మోతాదులో కలపాలి. విత్తనాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పంటను బట్టి గోతులు లేదా ఎత్తైన మడులు ఏర్పాటు చేసి విత్తనాలను నాటాలి. మొక్కల మధ్య దూరాన్ని పంట రకం, తీగల పెరుగుదల మరియు పందిరి నిర్మాణాన్ని బట్టి నిర్ణయించాలి.

ఎరువుల యాజమాన్యం
పందిరి సాగులో మొక్కలు వేగంగా పెరిగి అధికంగా తీగలను, ఆకులను మరియు కాయలను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల సమతుల్య పోషక యాజమాన్యం అవసరం. నేల పరీక్ష ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించడం ఉత్తమం.

నీటి యాజమాన్యం
తీగజాతి కూరగాయల్లో నీటి యాజమాన్యం చాలా కీలకం. నీటి కొరత వల్ల మొక్కల పెరుగుదల, పూత మరియు కాయల అభివృద్ధి దెబ్బతినవచ్చు. అదే సమయంలో అధిక నీరు ఇవ్వడం వల్ల వేర్ల వద్ద తేమ ఎక్కువై తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.

బిందు సేద్యం ద్వారా మొక్కలకు అవసరమైనంత నీటిని అందించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా పూత మరియు కాయల అభివృద్ధి దశల్లో నీటి లభ్యతలో హెచ్చుతగ్గులు లేకుండా చూడాలి.

తీగల శిక్షణ మరియు నిర్వహణ
పందిరి సాగులో తీగలను సక్రమంగా పందిరిపైకి ఎక్కించడం చాలా ముఖ్యం. మొక్కలు పెరుగుతున్న కొద్దీ తీగలను మృదువైన తాళ్ల సహాయంతో పందిరిపైకి చేర్చాలి.

అవసరం లేని, బలహీనమైన లేదా వ్యాధి సోకిన భాగాలను తొలగించడం ద్వారా మొక్కలో గాలి ప్రసరణను మెరుగుపరచవచ్చు. అయితే కత్తిరింపు పద్ధతులు పంట రకాన్ని బట్టి మారుతాయి. కాబట్టి సంబంధిత పంటకు సిఫారసు చేసిన విధానాన్ని మాత్రమే అనుసరించాలి.

చీడపీడలు మరియు తెగుళ్ల యాజమాన్యం
పందిరి సాగులో మొక్కలకు మంచి గాలి, వెలుతురు లభించడం వల్ల కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ చీడపీడలు పూర్తిగా నివారించబడవు. కాయతొలుచు పురుగులు, పేనుబంక, తెల్లదోమ, ఎర్రనల్లి వంటి పురుగులను ఎప్పటికప్పుడు గమనించాలి.

అదేవిధంగా బూజు తెగుళ్లు, వడల తెగుళ్లు మరియు ఇతర వ్యాధుల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి. పొలాన్ని తరచుగా పరిశీలిస్తూ సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులు (IPM) పాటించాలి.

పుష్పించే దశలో ప్రత్యేక శ్రద్ధ
తీగజాతి కూరగాయల్లో మంచి కాయ దిగుబడికి పుష్పించే దశ చాలా కీలకం. పుష్పాలు వచ్చే సమయంలో మొక్కలకు తగినంత నీరు, పోషకాలు అందేలా చూడాలి. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత లేదా అధిక తేమ వంటి వాతావరణ పరిస్థితులు పూత మరియు కాయల ఏర్పాటుపై ప్రభావం చూపవచ్చు.

తేనెటీగలు వంటి పరాగసంపర్క కీటకాల పాత్ర ముఖ్యమైన పంటల్లో, పుష్పించే సమయంలో వాటి సంచారాన్ని దెబ్బతీసే చర్యలను తగ్గించడం మంచిది.

కోత మరియు మార్కెటింగ్
కూరగాయలను పంటకు అనుగుణమైన సరైన పరిపక్వ దశలో కోయాలి. ఆలస్యంగా కోయడం వల్ల కాయల నాణ్యత తగ్గడంతో పాటు తదుపరి కాయల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడవచ్చు.

పందిరి సాగులో కాయలు స్పష్టంగా కనిపించడం వల్ల సరైన పరిమాణంలో ఉన్న కాయలను ఎంపిక చేసి కోయడం సులభం. కోత అనంతరం కాయలను నాణ్యత ఆధారంగా వేరు చేసి, శుభ్రమైన ప్యాకింగ్లో మార్కెట్కు తరలిస్తే మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుంది.

రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు
పందిరి సాగులో అధిక దిగుబడి పొందడానికి కేవలం పందిరి ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదు. నాణ్యమైన విత్తనం, సరైన మొక్కల సాంద్రత, బలమైన పందిరి, సమతుల్య ఎరువుల యాజమాన్యం, క్రమబద్ధమైన నీటి సరఫరా, తీగల శిక్షణ, సమగ్ర చీడపీడల యాజమాన్యం మరియు సరైన సమయంలో కోత వంటి అన్ని అంశాలను సమన్వయంతో పాటించాలి.

తీగజాతి కూరగాయల్లో పందిరి సాగు పద్ధతి రైతులకు నాణ్యమైన దిగుబడి, మెరుగైన కాయల నాణ్యత, కోతలో సౌలభ్యం మరియు భూమి వినియోగ సామర్థ్యం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రారంభ దశలో పందిరి నిర్మాణానికి కొంత అదనపు పెట్టుబడి అవసరమైనప్పటికీ, సరైన పంట యాజమాన్యంతో దీర్ఘకాలంలో మెరుగైన దిగుబడి మరియు ఆదాయం పొందే అవకాశం ఉంది.

అందువల్ల మార్కెట్ డిమాండ్, స్థానిక వాతావరణ పరిస్థితులు మరియు సాగు వనరులను పరిగణనలోకి తీసుకుని తీగజాతి కూరగాయల్లో పందిరి సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడం రైతులకు లాభదాయకమైన సాగు విధానంగా నిలుస్తుంది.

డా. టి. థామ్సన్, డా. టి. తేజస్విని, డా. వి. సుధావాణి
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం. ఫోన్ 9494963291

Read More

పార్థీనియంను నిర్మూలిద్దాం

పార్థీనియంను శాస్త్రీయంగా పార్థేనియం హిస్టరోఫోరస్ అని పిలుస్తారు. ఇది మెక్సికో ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం భారతదేశం అంతటా విస్తరించి, వ్యవసాయం, పర్యావరణం మరియు ప్రజారోగ్యానికి తీవ్రమైన సమస్యగా మారింది. 1950లలో దిగుమతి సరుకుల ద్వారా ఇది అనుకోకుండా భారతదేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. దేశంలోకి వచ్చిన తరువాత ఇది వేగంగా వ్యాపించి పర్యావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 21 వ పార్థీనియం అవగాహన వారోత్సవం 16 ఆగష్టు నుండి 22 ఆగష్టు,2026 వరకు నిర్వహించబడింది.

పార్థీనియం దేశంలో అత్యంత సమస్యాత్మకమైన కలుపు మొక్కలలో ఒకటి. ఇది సుమారు 3.5 కోట్ల హెక్టార్ల భూమిలో వ్యాపించినట్లు అంచనా. తేలికపాటి నుంచి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వరకు వివిధ ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దీని సమస్య ఎక్కువగా ఉంది. మొదట రహదారులు, కాలువలు మరియు ఖాళీ ప్రదేశాల్లో కనిపించిన ఈ కలుపు, తరువాత పంట పొలాలు, అటవీ ప్రాంతాలు మరియు రక్షిత ప్రాంతాలకు కూడా వ్యాపించింది. జాతీయ ఉద్యానవనాల్లో గడ్డి కొరతకు కారణమై శాకాహార జంతువుల మనుగడను ప్రభావితం చేస్తోంది. పశుగ్రాస భూములను ఆక్రమించడం ద్వారా పశువులకు లభించే మేతను కూడా తగ్గిస్తోంది.

  1. పర్యావరణంపై ప్రభావాలు
  • వేగవంతమైన వ్యాప్తి: పార్థీనియం వేగంగా పెరిగి వివిధ వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలదు. అందువల్ల వ్యవసాయ భూముల నుంచి నీటి వనరుల పరిసరాల వరకు వివిధ ప్రాంతాలను ఆక్రమిస్తుంది.
  • జీవ వైవిధ్య నష్టం: స్థానిక మొక్కలతో పోటీ పడి వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. దీని వల్ల సహజ ఆవాసాల్లో జీవ వైవిధ్యం తగ్గుతుంది.
  1. వ్యవసాయంపై ప్రభావాలు
  • పంటలతో పోటీ: పార్థీనియం పంటలతో పోటీ పడి నీరు, పోషకాలు మరియు సూర్యకాంతిని వినియోగిస్తుంది. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది.
  • అల్లెలోపతి ప్రభావం: ఇది విడుదల చేసే కొన్ని రసాయనాలు ఇతర మొక్కల విత్తనాలు మొలకెత్తడం మరియు పెరుగుదలను అడ్డుకుంటాయి.
  1. ఆరోగ్య సమస్యలు
  • అలెర్జీ: పార్థీనియం పుప్పొడి తీవ్రమైన అలెర్జీని కలిగించవచ్చు. శ్వాసకోశ సమస్యలు, చర్మ అలెర్జీలు మరియు ఉబ్బసం వంటి సమస్యలు రావచ్చు.
  • వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదం: పార్థీనియం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం లేదా చెత్త తొలగింపు వంటి పనులు చేసే వారికి దీర్ఘకాలికంగా ఈ కలుపుతో సంబంధం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
  1. పశువులపై ప్రభావాలు
  • విషపూరిత ప్రభావం: పార్థీనియం పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కలుషితమైన మేతను తినడం వల్ల చర్మ సమస్యలు, సూర్యకాంతికి అధిక సున్నితత్వం మరియు శ్వాసకోశ ఇబ్బందులు కలగవచ్చు.

పార్థీనియం నియంత్రణ
పార్థీనియం వేగంగా పెరగడం మరియు వివిధ పరిస్థితులకు తట్టుకోవడం వల్ల దీని నియంత్రణ సవాలుగా ఉంటుంది. అందువల్ల ఒకటి కంటే ఎక్కువ నియంత్రణ పద్ధతులను కలిపి ఉపయోగించడం ఉత్తమం.

  1. చేతితో తొలగింపు
  • చేతితో పీకడం: చిన్న స్థాయిలో ఉన్న పార్థీనియం మొక్కలను వేర్లతో సహా చేతితో పీకడం సమర్థవంతమైన పద్ధతి. ఇది శ్రమతో కూడుకున్నప్పటికీ స్థానికంగా ఉన్న కలుపును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
  1. జీవ నియంత్రణ
  • కీటకాల ద్వారా నియంత్రణ: పార్థీనియంను తినే కొన్ని ప్రత్యేక కీటకాలను ఉపయోగించడం ద్వారా దీని పెరుగుదలను తగ్గించవచ్చు. ఉదాహరణకు, పార్థీనియం ఆకులను తినే Calligrapha bicolorata అనే బీటిల్ను జీవ నియంత్రణలో ఉపయోగిస్తారు.
  1. సాంప్రదాయ పద్దతులతో నియంత్రణ
  • పంట మార్పిడి: పంటలను మారుస్తూ సాగు చేయడం ద్వారా పార్థీనియం జీవచక్రాన్ని భంగపరచి వ్యవసాయ భూముల్లో దాని వ్యాప్తిని తగ్గించవచ్చు.
  • పోటీ పంటలు: పార్థీనియంతో పోటీ పడగల మరియు వేగంగా పెరిగే పంటలను ప్రోత్సహించడం ద్వారా ఈ కలుపు పెరుగుదలను తగ్గించవచ్చు.
  1. నివారణ చర్యలు
  • నిర్బంధ చర్యలు: పార్థీనియం కొత్త ప్రాంతాలకు వ్యాపించకుండా కలుషితమైన సరుకులు మరియు వాహనాల ద్వారా విత్తనాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
    పరిశుభ్రమైన వ్యవసాయ పద్ధతులు: వ్యవసాయ యంత్రాలు మరియు పరికరాలను పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా పార్థీనియం విత్తనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాపించకుండా నివారించవచ్చు.
  1. యాంత్రిక పద్దతులతో నియంత్రణ
  • కోత మరియు తుంచడం: పార్థీనియం మొక్కలను క్రమం తప్పకుండా కోయడం లేదా తుంచడం ద్వారా వాటి ఎత్తును నియంత్రించి విత్తన ఉత్పత్తిని తగ్గించవచ్చు. అయితే దీనివల్ల కలుపు పూర్తిగా నిర్మూలించబడకపోవచ్చు.
  1. ప్రజల్లో అవగాహన
  • అవగాహన కార్యక్రమాలు: పార్థీనియం వల్ల కలిగే హానికర ప్రభావాలు మరియు దాని నియంత్రణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా దీని వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
  1. పరిశోధన మరియు పర్యవేక్షణ
  • నిరంతర పరిశోధన: పార్థీనియం కోసం కొత్త మరియు మరింత సమర్థవంతమైన నియంత్రణ పద్ధతులను అభివృద్ధి చేయడానికి నిరంతర పరిశోధన అవసరం.
  • పర్యవేక్షణ కార్యక్రమాలు: పార్థీనియం వ్యాప్తిని గమనించడం మరియు అమలు చేస్తున్న నియంత్రణ చర్యల ప్రభావాన్ని అంచనా వేయడం సమర్థవంతమైన నిర్వహణకు అవసరం.

పార్థీనియం అవగాహన వారోత్సవం
భారతదేశంలో పార్థీనియం విస్తరణ సమస్యను పరిష్కరించడంలో ICAR–Directorate of Weed Research (DWR) ముందంజలో ఉంది. పార్థీనియంపై విస్తృత అవగాహన మరియు సమష్టి చర్యల అవసరాన్ని గుర్తించి, DWR 2004లో ‘పార్థీనియం అవగాహన వారోత్సవం’నిర్వహణను ప్రారంభించింది. ఈ వారోత్సవం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ICAR సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs), వ్యవసాయ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs) మరియు ఇతర సంస్థలను ఒక వేదికపైకి తీసుకువస్తుంది.

పార్థీనియం అవగాహన వారోత్సవం లక్ష్యాలు

  • సమాజంలో అవగాహన కల్పించడం: పార్థీనియం వల్ల వ్యవసాయం, పర్యావరణం మరియు ప్రజారోగ్యంపై కలిగే హానికర ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేయడం. దీని ఆక్రమణ స్వభావం, జీవ వైవిధ్యంపై ప్రభావం మరియు ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన పెంచడం.
  • సమగ్ర కలుపు నిర్వహణ (IPM)ను ప్రోత్సహించడం: ప్రాంతానుసారంగా చేతితో తొలగింపు, రసాయన, జీవ మరియు సాంస్కృతిక నియంత్రణ పద్ధతులను సమన్వయంతో ఉపయోగించాల్సిన అవసరాన్ని తెలియజేయడం.
  • సమష్టి సహకారాన్ని పెంపొందించడం: పార్థీనియం సమస్యను పరిష్కరించడానికి పరిశోధనా సంస్థలు, వ్యవసాయ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు స్థానిక ప్రజల మధ్య సహకారాన్ని పెంచడం.
  • ఉత్తమ పద్ధతులను ప్రచారం చేయడం: పార్థీనియం నియంత్రణలో సమర్థవంతమైన పద్ధతులు, నివారణ చర్యలు మరియు పరిశుభ్రమైన వ్యవసాయ పద్ధతులను ప్రజలకు చేరవేయడం.

డా. కే. శేఖర్, సహాయ ఆచార్యులు (సేద్య విభాగం), వ్యవసాయ కళాశాల, హైద్రాబాద్
ఫోన్ : 9032128124

Read More