సాధారణ నామం : బ్లూ పీ / బటర్‌ఫ్లైపీ శాస్త్రీయ నామం : క్లిటోరియా టెర్నేటియా కుటుంబం: ఫాబేసి
శంఖుపుష్పం ఒక బహువార్షిక హెర్బల్ మొక్క. ఆకులు అండాకారంలో ఉంటాయి. ఇది ఒక తీగ లేదా క్రీపర్‌లా పెరుగుతుంది. ఈ మొక్కలో కొట్ట వచ్చినట్లు కనిపించేవి వాటి ముదురు నీలం రంగు పూలు. అవి 4 సెం.మీ. పొడవు, 3 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కొన్ని రకాలు తెలుపు రంగు పూలు పూస్తాయి. కాయలు 5-7 సెం.మీ. పొడవుండి, ప్రతి కాయలో 6 నుండి 10 గింజలుంటాయి. లేత కాయలను తింటారు. దీనిని అలంకరణ మొక్కగా పెంచుతారు. దీని వేర్లు రైజోబియంతో కలిసి జీవిస్తూ పరస్పర సహకారమందించుకుంటాయి.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- వాపు, నొప్పిని తగ్గిస్తుంది.
- రక్తం పడే మొల్లల చికిత్సలో ఉపయోగిస్తారు. మొల్లలను ఆకుల కషాయంతో శుభ్రపరుస్తారు. మొత్తం మొక్క పేస్టుని మొల్లలపై పూస్తారు.
- తలనొప్పి నివారణకు ఆకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేస్తారు.
- రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ చికిత్సలో థామాసాతో మరగించిన నూనెతో మర్ధన చేస్తారు.
- నోటిలోపల వాపుకు ఆకు కషాయంతో పుక్కిలిస్తారు. గాయాలను శుభ్రపరచడానికి కూడా ఈ కషాయాన్ని ఉపయోగిస్తారు. చీము ఏర్పడకుండా నివారిస్తుంది.
- వ్యవసాయరంగంలో
- శంఖుపుష్పం ద్రావణం నుండి తయారు చేసిన మేళనం కీటకనాశక చర్య మరియు / లేదా వికర్షక చర్య మరియు / లేదా పురుగు గుడ్లు పెట్టకుండా నిరోధించడం మరియు / లేదా గుడ్లు పెట్టే స్థానంపై ప్రభావం చూపడం మరియు / లేదా పురుగు మొక్కపై తినకుండా అవరోధించడం వంటి చర్యల ద్వారా పురుగులనరికడుతుంది.
- ఈ మేళనం కీటకనాశక చర్య ద్వారా వ్యవసాయ పంటలనాశించే పెద్ద పురుగులు, లార్వాలను లేదా రసంపీల్చే పురుగులను నివారిస్తుంది. దీనిని ప్రత్తి పంటనాశించే హెలికోవర్మా ఆర్మిజరాపై ఉపయోగించి ప్రయోగాలు చేశారు. (రాబర్ట్ మెన్సా, 2012).
- శంఖు పుష్పం గింజల ద్రావణం రైజోక్టోనియా సొలాని పై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
- ద్రావణంలోని ప్రోటీన్ ఫినోటిన్ చిక్కుడునాశించే ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు శిలీంద్రం, కొల్లెటోట్రైకం లిండముథియానం మరియు బాక్టీరియల్ బ్లెåట్‌కారకం క్ౙాంతో మోనాస్ ఆక్సొనోపొడిస్ ఫేసియోలి; వరి నాశించే బైపొలారిస్ ఒరైజే, పైరిక్యులేరియా గ్రిసియా, బ్రాకియేరియా స్పీ, నాశించే రైజోక్టోనియా సొలానిలపై శిలీంద్రనాశక, బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది. ఈ ప్రోటీన్ జాబ్రోటెస్ సబ్‌ఫాసియేటస్ మరియు అకాంతోసీలిడియస్ ఒబెక్టస్ బ్రూచిడ్ల మొదటి దశ లార్వాలపై అధిక విష ప్రభావాన్ని ప్రదర్శించింది (కెలెము, అతని అనుచరులు, 2004).
- శంఖుపుష్పం ఆకు ద్రావణాలు మలేరియా, ఫైలేరియా జ్వరం, ఎన్సెఫెలైటిస్, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాప్తి చేసే వాహకాలు ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ పెద్ద పురుగుల విడుదలను అరికట్టింది (అరివోలి, అతని అనుచరులు, 2015).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

