జాఫ్రా 4-5 మీ. ఎత్తు పెరిగే చిన్న చెట్టు. గులాబి రంగు పూలు కొమ్మల చివర్లో గుత్తులుగా ఏర్పడతాయి. ముదురు ఎరుపు రంగులో పండ్లు ముళ్ళతో నిండి, అండాకారంలో కొంచెం నొక్కినట్లు ఉంటాయి. గింజలు ముక్కోణాకారంతో ముదురు నారింజ రంగులో 3-4 మి.మీ. పరిమాణం కలిగి ఉంటాయి. ఇవి సామాన్యంగా ఫిబ్రవరి – మే మాసాల్లో లభిస్తాయి. దాదాపు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు ఫలసాయం పొందవచ్చు.
సాధారణ నామం : అనాటో / సింధూర శాస్త్రీయ నామం : బిక్సా ఒరెల్లానా కుటుంబం: బిక్సేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
బెరడు, విత్తనాలు, గుజ్జు, ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
గింజలలో “బిక్సిన్” అనే రసాయనముంటుంది.
గింజల గుజ్జులో రంగును కలుగచేసే కెరోటినాయిడ్ ఉంటుంది.
దీని బెరడును గనేరియా వ్యాధి, తరచూ వచ్చే జ్వరాల నివారణకు పయోగిస్తారు.
గింజల గుజ్జును బంక విరేచనాల నివారణకు ఉపయోగిస్తారు.
ఆకులను కామెర్ల వ్యాధి నివారణకు, పాముకాటుకు ఉపయోగిస్తారు.
వైద్యపరంగానే గాక గింజల నుండి తీసిన సహజ రంగును ఆహార పదార్థాలలో విరివిగా వాడతారు.
వ్యవసాయరంగంలో …
జాఫ్రా గింజల ద్రావణం శాండ్ ఫ్లై, లుట్జోమియా లాంగిపాల్పిస్ చావు శాతాన్ని పెంచింది. బలమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. (డిఆరియాస్, అతని అనుచరులు, 1992).
జాఫ్రా ఆకులు జీవపురుగు మందు సామర్థ్యం కలిగి ఉన్నాయి (కేల్, అతని అనుచరులు, 2012).
జాఫ్రా ఇథనాల్ ఆకు ద్రావణం గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్య ప్రదర్శించింది.
జాఫ్రా గింజల ద్రావణం టిక్స్‌పై పురుగు వికర్షక, పారసైట్ నాశక, దోమవికర్షక చర్యలను ప్రదర్శించింది (డి బోయిర్, అతని అనుచరులు, 2010)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
సాధారణ నామం : సంబరేణి మొక్క /నీర్ బ్రహ్మి శాస్త్రీయ నామం : బాకోపా మాన్నియెరి కుటుంబం: స్క్రోఫులేరియేసి
ఇది నేలబారుగా పెరిగే ఒక బహువార్షిక మొక్క. నీటి ఆధారం బాగా ఉన్న చోట ఎక్కువగా కనబడుతుంది. కణుపుల వద్ద అనేక వేర్లు తొడుగుతుంది. ఆకులు ఒక్కో కణుపు వద్ద రెండు చొప్పున వస్తాయి. ఆకులు మొదట సన్నగా ఉండి పోను పోను వెడల్పుగా మారతాయి. ఆకులు మందంగా ఉండి కనపడని ఈనెలతో ఉంటాయి. పూవులు లేత నీలం రంగు లేదా తెలుపు వర్ణంలో ఉండి ఆకుల మొదళ్ళ నుండి ఒక్కొక్కటిగా వస్తాయి. కాయలు చిన్నగా గుండ్రంగా లేదా అండాకారంలో ఉండి రెండు గదులు కలిగి ఉంటాయి. కాయలలో అనేక గింజలు సూక్ష్మంగా ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో
మొక్క సమూలంగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
దీనిలో బ్రాహ్మైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.
ఈ మొక్క నుండి బి1 ఆక్టలేట్, బి2 ఆక్టలేట్ మరియు బి3 క్లోరోప్లాటినేట్ లభిస్తాయి. అంతేకాక హెర్పిస్టెన్, సాపోనిన్, బాకోసైడ్ ‘ఎ’ మరియు బాకోసైడ్ ‘బి’, మొన్నియరిన్ మొదలైన ఆల్కలాయిడ్స్ కూడా లభిస్తాయి.
జలబ్రహ్మి వాతం, కఫరోగం నివారణకు, నరాల వ్యాధులకు, నొప్పి, మూర్ఛవ్యాధి, పిచ్చి, కణుతులు, పుండ్లు, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బసం, బ్రాంకైటిస్, కుష్టు, ల్యూకోడెర్మా, బోదకాలు, నపుంసకత్వం, జ్వరం, సాధారణ బలహీనత మొదలగు వాటి చికిత్సలో ఉపయోగపడుతుంది.
ఇది జ్ఞాపకశక్తి పెంచుటకు కూడా ఉపయోగపడుతుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
శతావరి ఆకురాల్చే అడవులలో తరుచుగా చెట్ల క్రింద పెరుగుతూ కనబడుతుంది. ముళ్ళ పొదలు లేదా ఇతర పొదల మీద ప్రాకుతూ బహువార్షికంగా పెరిగే ముళ్ళ తీగ. ఆకులు సూదులలా ఉంటాయి. చిన్న, చిన్న కొమ్మలు గుంపులుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా 0.2 సెం.మీ. పొడవు కలిగి ఆకుల మొదళ్ళ నుండి గుత్తులుగా ఏర్పడతాయి. కాడలు కలిసి ఉంటాయి. పండ్లు గుండ్రంగా 0.4þ0.4 సెం.మీ. పరిమాణం కలిగి ఎర్రగా ఉంటాయి. వేర్లు సుమారు 100 వరకు ఉండి కండ కలిగి గుత్తులుగా తయారవుతాయి.
సాధారణ నామం : సీతమ్మజడ / ఆస్పరాగస్/పిల్లితీగలు / పిల్లిపీచర గడ్డలు / చందమామగడ్డలు శాస్త్రీయ నామం : ఆస్పరాగస్ రెసిమోసస్ కుటుంబం: లిలియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో స్టిరాయిడ్లు, గ్లెåకోసైడ్స్ (ఆస్పరాగోసైడ్స్), బిట్టర్ గ్లెåకోసైడ్, ఆస్పరాజిన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దుంపలలో పిండిపదార్థం, మ్యూసిలేజ్ కూడా ఉంటాయి.
దీనిని బలవర్థకంగా, మూత్రం సులువుగా జారీ చేయడానికి ఉపయోగిస్తారు. వీర్యాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. తేనెతో తాజావేరు రసాన్ని కలిపి అజీర్ణ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల వ్యాధుల చికిత్సకు వాడే తైలాలలో దీనిని ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో…
శతావరి ఆకు మిథనాల్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీ. పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (నుస్రా అండ్ హరూన్, 2016).
శతావరి ఆకుల నీటి, అసిటోన్, ఇథనాల్ ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్లడ్‌సుగర్, ట్రైహలోస్‌పై విష ప్రభావాన్ని చూపాయి (గంగ, ఆమె అనుచరులు, 2017)
శతావరి ఆకుల ద్రావణం ఈడెసఈజిప్టీపై మస్క్యిటోసైడల్ ప్రభావాన్ని చూపింది. 65% వికర్షక చర్యను ప్రదర్శించింది (కండాగిల్ అండ్ సోమవర్షి, 2016).
శతావరి వేరు ద్రావణాలు పర్యావరణహిత పద్ధతిలో అనోఫిలస్ స్టెఫెన్సీ, ఈడిస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటస్ దోమలను వికర్షక చర్య ద్వారా నివారించాయి (గోవింద రాజన్ అండ్ శివశంకర్, 2015)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
మాచిపత్రి నేలబారుగా పెరిగే నిటారైన శాఖలు గల బహువార్షిక మొక్క. ఆకులు చామంతి ఆకుల వలే ఉండి, కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. అంచుల నుండి ఈనెల వరకు వివిధ పరిమాణాలలో నొక్కులు కలిగి ఉంటాయి. పూవులు పసుపుఛాయ కలిగి అతి చిన్న ముద్ద వలె ఏర్పడతాయి. దీనిని పిలక మొక్కలు మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు.
సాధారణ నామం : ఇండియన్ వర్మ్‌వుడ్ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా వుల్గారిస్ కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
ఆకులలో ఆవిరయ్యే నూనె, సెస్క్యిటెర్పిన్స్, లాక్టోన్స్, ఫ్లేవనాయిడ్స్, కౌమారిన్స్, ట్రైటెర్పిన్ మొదలైన రసాయనాలుంటాయి.
మాచిపత్రి వాతం, చర్మవ్యాధులు, కంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
దీనిని వీర్యవృద్ధికి, క్రిమిసంహారిణిగా, కడుపునొప్పి, ఉబ్బసం, నరాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
మహిళలు ఋతుక్రమాన్ని సక్రమంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఆకలిని వృద్ధి చేయడానికి, మలేరియా నివారణకు కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో…
మాచిపత్రి (ఆర్టెమిసియా జుడైకా) ఎసెన్షియల్ ఆయిల్ అలసంద వీవిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా కీటకనాశక చర్య ద్వారా నివారించింది (అబ్డఎల్‌హాడి, 2012).
మాచిపత్రి (ఆర్టెమిసియా వుల్గారిస్) ఆకు (1500 పిపియం) మరియు పూల (4000 పిపియం) క్రూడ్ ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి 3, 4 వ దశ లార్వాలపై బలమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ దోమకాటుకు అధిక స్థాయిలో రక్షణ కల్పించింది (మాంగ్ మాండ్ మైయ, అతని అనుచరులు, 2016).
మాచిపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియం, రైజోపెర్తా డామినిక, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లను ప్యూమిగెంట్ విష చర్య ద్వారా నివారించింది (షారిఫియాన్, అతని అనుచరులు, 2012).
మాచిపత్రి (ఆర్టెమిసియా స్కోపారియా) ఎసెన్షియల్ ఆయిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియంలను సమర్ధవంతంగా నివారించింది. ఈ ఫలితాలు సేంద్రియ ఆహార ఉత్పత్తిలో మాచిపత్రి సామర్థ్యాన్ని నిరూపించాయి (నెగాబాన్, అతని అనుచరులు, 2006).
మాచిపత్రి కాండం నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి లార్వాలను తక్కువ మోతాదులో సమర్ధవంతంగా అరికట్టింది (సుజాత అండ్ రంజిత, 2013).
ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో 500 ఆర్టెమిసియా జాతులున్నాయి. ఆర్టిమిసియా హెర్బాఆల్బా, ఆర్టెమిసియా ఆబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రైబోలియం కాస్టానియం, ఒరైజోఫిలస్ సురినానెన్సిస్ పెద్ద పురుగులపై విష చర్యను ప్రదర్శించాయి (జెమా, 2014)
ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ ద్రాక్ష పండ్లను ఆశించి కుళ్ళజేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ శిలీంద్రాల పెరుగుదలను 100% అరికట్టింది. ఆయిల్ అఫ్లాటాక్సిన్, ఆక్రాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌ని అరికట్టింది. మైకోటాక్సిన్ స్రవాన్ని పూర్తిగా అరికట్టింది. ఆయిల్‌తో ఫ్యూమిగేట్ చేస్తే 1కి. ద్రాక్ష పండ్లను ఈ శిలీంద్రాల నుండి కాపాడి నిల్వ కాలాన్ని 9 రోజులు పెంచింది (సోంకర్, అతని అనుచరులు, 2015)
ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ రైజోక్టోనియా సొలాని, స్ల్కీరోషియం రాల్ఫ్సి, మాక్రోఫోమినా ఫేసియోలినా వంటి పంట…లో వేరుకుళ్ళు కలిగించే శిలీంద్రాలను అరికట్టింది. ఈ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫ్రాగేరియే, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటంలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది. ఆర్టెమిసియా సీరూలెసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్, ఆల్టర్నేరియా, ఫ్యుజేరియం శిలీంద్రాలను అరికట్టింది (పెట్రెట్టో, అతని అనుచరులు, 2013; స్టాప్పెన్, అతని అనుచరులు, 2014).
ఆర్టిమిసియా అబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యుజేరియం ఆక్సిస్ఫోరం, ఫ్యుజేరియం సొలాని శిలీంద్రాలపై గణనీయమైన యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది (బెయిలెన్, అతని అనుచరులు, 2013)
అర్టెమిసియా జుడైకా ఎసెన్షియల్ ఆయిల్ నుండి వేరు చేసిన ట్రాన్సఇథైల్ సిన్నమేట్, పైపర్‌టోన్‌కన్నా శక్తివంతంగా స్పొడోప్టెరా లిట్టురాలిస్‌ని పూర్తిగా తిండి తినకుండా చేసింది (అబ్డెల్లలీల్, అతని అనుచరులు, 2008).
మాచిపత్రి ద్రావణం ట్రైబోలియం కాస్టానియం లార్వాలను అత్యధిక శాతంలో చంపింది. (పుగజ్‌వెండన్, అతని అనుచరులు, 2012).
మాచిపత్రి ఆకు మిథనాల్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను వేరు, కాండం ద్రావణాల కన్నా గణనీయంగా అధికంగా చంపాయి (ఇలాహి అండ్ ఉల్లా, 2013)
మాచిపత్రి ఆకునీటి ద్రావణం (10%) తేయాకు పంటలో ఎర్రనల్లి కలిగించే నష్టాన్ని తగ్గిస్తుంది (మామున్ అండ్ అహ్మద్, 2011)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
సముద్రపాల అడవిలో ఇతర పొదలపై లేదా చెట్లపై ప్రాకే పెద్ద తీగ. దాదాపు 10-15 మీ. వరకు ప్రాకుతుంది. దాదాపు మొక్కలోని అన్ని భాగాలు తెల్లని రోమాలతో కప్పబడి ఉంటాయి. కొమ్మలు కత్తిరించినపుడు తెల్లని పాలవంటి జిగట పదార్థం వస్తుంది. ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో ప్రతికణుపు వద్ద ఒకటి చొప్పున వస్తాయి. ఆకుల అడుగు భాగాన నూగు ఉంటుంది. పూలు పెద్దవిగా, గంట ఆకారంలో లేత వంగపండు రంగు లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి రక్షణ పత్రావళిలో కప్పబడి ఉంటాయి.
సాధారణ నామం : చంద్రపాల / కొక్కిత తీగ / ఎలిఫెంట్ క్రీపర్ శాస్త్రీయ నామం : ఆర్ౙిరీయా నెర్వోసా కుటుంబం: కన్వోల్యులేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వేర్లు, ఆకులు, లేతకాండాలను, గింజలను ఔషధాలుగా ఉపయోగిస్తారు.
గింజలలో అరజైన్, ఐసోఅరజైన్, పెన్నిక్లావైన్ అనే రసాయనాలున్నాయి.
ఆకులు మరియు లేత కాండాలను అజీర్ణం, మలబద్ధకం నివారణలో ఉపయోగిస్తారు.
ఆకుల నుండి తయారు చేసిన మాత్రలను మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో :
సముద్రపాల కాయలలో స్టీరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాల్స్, టెర్పినాయిడ్స్ ఉంటాయి. వీటిలో లైసర్గమైడ్, స్టిగ్మాస్టన3, 5డైయిన్, ఎర్గాటమైన్ అనే మొక్కలకు పర్యావరణపరంగా ఉపయోగపడే ముఖ్యమైన జీవ చురుకుదనం గల పదార్థాలుంటాయి. వీటిని ఔషధాలు, డ్రగ్స్ ఫార్ములేషన్‌లో ఉపయోగిస్తారు (ఎకడె అండ్ మానిక్, 2015).
సముద్రపాల ఇథనాల్ ద్రావణాలు టెట్రోసైక్లిన్‌కి సమానంగా యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి. (మోడి, అతని అనుచరులు, 2010).
భారతదేశంలో సముద్ర పాల రసాన్ని, సమాన పరిమాణంలో నువ్వుల నూనె, కొంచం డిల్ గింజల పొడితో కలిపి స్కాబీస్ నివారణకు పైపూతగా పూస్తారు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
సాధారణ నామం : కొండగన్నేరు / విసాగ్ని శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా వెనెనేట; కుటుంబం: అపోసైనేసి
తెల్లగన్నేరు సుమారు 6 మీ. ఎత్తు వరకు పెరిగే చిన్న లేదా మధ్య రకం చెట్టు. చెట్టు బెరడు బూడిద రంగుతో కూడిన గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు చిక్కటి పసుపు రంగులో ఉండి గట్టిగా కర్రలాగా ఉంటుంది. ప్రతి కణుపు వద్ద 3-6 ఆకులు చుట్టూ అమరి ఉంటాయి. ఆకులు పలుచగా, బళ్ళెం ఆకారంలో ఉండి, అంచులు అలల్లాగా ఉంటాయి. ఆకు కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. అనేక ఈనెలు దగ్గర దగ్గరగా, సమాంతరంగా ఉండి ఆకుల చివర్ల నుండి పుట్టిన సన్నని దారంలాంటి ఈనెలతో కలపబడి ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. కాయలు కాడ కలిగి రెండు చివర్లు కొనదేలి ఉంటాయి. అనేక విత్తనాలు బల్లపరుపుగా, రెండు చివర్లలో వెంట్రుకలు కలిగి ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
తెల్లగన్నేరు వేర్లు, పండ్లు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి.
వీటిలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ అధికంగాను, ఆల్‌స్టోవినైన్, వినినాటైన్, రిసర్పెåన్ మొదలైన రసాయనాలు ఉంటాయి.
వేర్లను చర్మవ్యాధులు, కుష్టు, చెవిపోటుల చికిత్సలో ఉపయోగిస్తారు.
వీటిని పాము కాటు, ఇతర విషపు పురుగుల కాట్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
మూర్ఛ రోగం, ఆయాసం, జ్వరం మొదలగు వాటి చికిత్సకు, పుండ్లు, సిఫిలిస్, పిచ్చి వంటి జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
ఆల్‌స్టోనియా బూనీ ఆకులు మరియు కాండం బెరడు ద్రావణాలు గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియాకెలామిస్టిస్ లార్వాలపై విషపూరిత చర్యను, పెరుగుదలనరికట్టే చర్యను ప్రదర్శించాయి. వీటిని గులాబి రంగు కాండంతొలుచు పురుగు నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (ఆయిజయాన్‌గ్బె, అతని అనుచరులు, 2007).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ కాండం బెరడు మరియు ఆకుల నీటి ద్రావణాలు, పాక్షికంగా శుద్ధి చేసిన ద్రావణాలు లిమ్నేయ అక్యూమినేట (నత్త)పై మొల్లస్కిసైడల్ మరియు యాంటికోలినెస్టరేజ్ చర్యలను ప్రదర్శించాయి. కాండం బెరడు ద్రావణాలు ఆకు ద్రావణాల కన్నా బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించాయి. (సింగ్ అండ్ ఇసంగ్, 2003).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ మొక్క అసిటోన్ లేటెక్స్ ద్రావణాలు లాబియో రోహిత (చేప)పై నీటి ద్రావణాలకన్నా 23 రెట్లు అధిక విషపూరిత చర్యను ప్రదర్శించాయి (సింగ్ అండ్ సింగ్, 2010).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకుద్రావణాలు ఈడెస్ ఆల్బోపిక్టస్ 3వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి.
ఆల్‌స్టోనియా స్కాలారిస్ 100% ఆకుల ద్రావణాన్ని 15 రోజుల వయసు పార్థినియం మొక్కలపై 5 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే, మొదటి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత వేర్లు మరియు కాండం జీవపదార్థం గణనీయంగా తగ్గింది. ఆకుల నీటి ద్రావణంలో ఉన్న కలుపు నాశక పదార్థాలు పార్థినియం నివారణకుపయోగిస్తాయి (జావైద్, అతని అనుచరులు, 2010).
వస మొక్క మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది తేమ ప్రదేశంలో బహువార్షిక మొక్క. ఆకులు దళసరిగా రెండు వరుసలలో అమరి ఉంటాయి. ఈ మొక్క దుంప నేలలో ఉంటుంది. లేత పసుపు రంగు పూవులు ఒక దొప్పలో అమరిఉంటాయి. గోదావరి జిల్లా అటవీ ప్రాంతాలలోను, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే ఇది సాగు చేయబడుతుంది. ఈ మొక్క వేరును వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఆకులను, దుంపలను వ్యవసాయంలో కీటకనాశనిగా ఉపయోగించవచ్చు. ఈ మొక్క వేర్లలో ఎకోరిన్, కెలామిన్, యూజినాల్, ఆల్ఫాఎసరోన్ వంటి రసాయనాలు ఉంటాయి.
సాధారణ నామం : స్వీట్ ఫ్లాగ్ శాస్త్రీయ నామం : అకోరస్ కలామస్ కుటుంబం : అకోరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
వేరును ఆయుర్వేద మందులు తయారీలో ఉపయోగిస్తారు.
వ్యవసాయంలో కీటకనాశనిగా, తెగుళ్ళ నివారిణిగా….
ఆకులు, వేర్లలో ఉన్న రసాయనాలకు కీటకనాశని లక్షణాలు ఉన్నాయని శాస్త్రపరిశోధనలో తేలింది. పురుగులు, తెగుళ్ళ నివారణలో ఈ రసాయనాలెంతగానో ఉపయోగపడతాయి.
వ్యవసాయరంగంలో …
విత్తన నిల్వలలో ఆశించే పురుగులు : విత్తన నిల్వలలో ఆశించే పురుగుల నియంత్రణకు 3 గ్రాముల వస చూర్ణాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి ఉంచడం ద్వారా సుమారు 3 నెలల వరకూ విత్తనాలను పురుగులబారినుండి కాపాడుకోవచ్చు. వరి ధాన్యాన్ని ఆశించే ముక్కుపురుగు, పప్పుధాన్యాలను (కంది, పెసర, మినుము, శనగ మొదలైనవి) ఆశించే పుచ్చు పురుగుల నుండి విత్తనాన్ని రక్షించుకోవచ్చు. వస దుంపల పొడికి ఉండే ఘాటైన వాసనకు పురుగులు వికర్షించబడతాయి.
దుంప కషాయం తయారు చేసే పద్ధతి (శ్రీధర్, అతని అనుచరులు, 2002)
ఎండిన దుంపలను దంచి 20 గ్రాముల పొడిని కుండలోని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజు నిల్వ ఉంచాలి. తర్వాత వడపోసి 8 మి.లీ. సబ్బు నీరు కలిపి మరుసటి రోజు ఉదయం పంటపై పిచికారి చేయాలి.
విత్తన శుద్ధి (విత్తనాల నాశించే పురుగులు, తెగుళ్ళ నివారణ) (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1998)
ఒక మట్టి కుండలో 2.5 లీటర్ల నీరు పోసి మరిగించాలి. చల్లారిన తర్వాత 1 లీటరు ఆవుమూత్రం 50 గ్రా. దుంపపొడి కలిపి కర్రతో త్రిప్పాలి. విత్తనాలను ఈ ద్రావణంలో కలపాలి. పైకి తేలిన విత్తనాలను తొలగించి 15 నిమిషాలు ఉంచి ఆరబెట్టి విత్తాలి.
అక్కల కర్ర ఒక చిన్న, నిలువుగా పెరిగే పూల మొక్క. ఇది వేగంగా పెరిగి బంగారం రంగు, ఎరుపురంగు పూలగుత్తులను కలిగి ఉంటాయి. దీని ఆకులు, పూల గుత్తులు పళ్ళనొప్పులను తగ్గించే బాధ నివారణ కారకం కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని అలంకరణ మొక్కగా, ఔషధ మొక్కగా పెంచుతారు. కాండాలు నిలువుగా లేదా నేలపై ప్రాకుతూ ఎరుపు రంగులో నూగు లేకుండా ఉంటాయి. ఆకులు వెడల్పుగా అండాకారం నుండి ముక్కోణాకారంలో ఉంటాయి. ఆకులు 5-11 సెం.మీ. పొడవు, 4-8 సెం.మీ. వెడల్పుండి అంచులు మొనతేలిన పళ్ళు కలిగిఉంటాయి. పూల గుత్తులు ఒకటిగా ఎకీన్లు (కాయలు) నల్లగా, 2-2.5 మి.మీ. పొడవుంటాయి.
సాధారణ నామం: టూతేక్‌ప్లాంటే, పారాక్రెస్ శాస్త్రీయ నామం: ఆక్మెల్లా ఒలరేసియ కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
అక్కలకర్రను విస్తృతంగా పంటినొప్పి, గొంతు, చిగుళ్ళ చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తాజా పూలగుత్తులు లేదా ఎండబెట్టి పొడిచేసిన పూలగుత్తులను ఉపయోగిస్తారు. కాని వేర్లు, ఆకులను కూడా సిఫారసు చేస్తున్నారు.
డిసెంట్రి, కీళ్ళనొప్పుల చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది.
లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే జ్వరం నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకులను బాక్టీరియా, శిలీంద్రాల వల్ల కలిగే చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
గాయాలను త్వరగా నయం చేస్తుంది. జలుబు, ఫ్లూ రోగాల నుండి కాపాడుతుంది.
వ్యవసాయరంగంలో …
అక్కలకర్ర ఆకుల డైక్లోరోమిథేన్ ద్రావణం పరీక్షించిన అన్ని బాక్టీరియాలపై యాంటిబాక్టీరియాల్ చర్యని ప్రదర్శించింది. ఎస్కెరిచియా కోలై > స్టెఫైలోకోకస్ ఆరియస్ > ప్రోటియస్ వుల్గారిస్ > బాసిల్లస్ సబ్‌టైలిస్ > క్లెబ్సియెల్లా న్యుమోనియాపై ఈ క్రమంలో యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. డైక్లోరోమిథేన్ ద్రావణం అసిటోన్, నీటి ద్రావణాల కన్నా వంగకాయతొలుచు పురుగు, ల్యూసినాయిడెస్ ఆర్బొనాలిస్‌పై అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణం ఆల్కలాయిడ్స్, టెర్పెనాయిడ్స్, ఫైటోస్టిరాల్స్, సపోనిన్స్, స్టీరాయిడ్, టానిన్స్, ఫినాలిక్ కాంపౌండ్స్‌ని కలిగి ఉంది (పవున్‌రాజ్, అతని అనుచరులు, 2014)..
అక్కలకర్రక్రూడ్ హెక్సేన్‌ద్రావణం టూటా ఆబ్సల్యూటపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణాన్ని టమాట పంటనాశించే టూటాఅబ్సల్యూట పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. ఈ ద్రావణం నుంచి వేరు చేసిన ఆల్కమైడ్స్ టూటా ఆబ్సల్యూట నివారణ కార్యక్రమాలలో పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. వీటిలో స్పైలాంతాల్ ముఖ్యమైనది. ఇది అత్యధిక కీటకనాశక చర్య కలిగి, బదనిక, సోలెనాప్సిస్ సీవిస్సిమకు ఎటువంటి హాని కలిగించదు. (మోరినో, అతని అనుచరులు, 2011)
స్పైజలాంతాల్ యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, లార్విసైడల్ లక్షణాలను కలిగి ఉంది (శర్మ, అతని అనుచరులు, 2010).
అక్కలకర్ర ద్రావణాలు ఈడెసఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సి, అనోఫెలెస్ క్యూలిసిఫేసీస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అమర్ అండ్ మెహిహోర్మ్, 2006; పాండె, అతని అనుచరులు, 2007; సరాఫ్ అండ్ దీక్షిత్, 2002).
స్పెలాంతాల్ ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌పై ఫంగిస్టాట్ మరియు ఫంగిసైడల్ చర్య ప్రదర్శించింది (కౌటిన్‌హా, అతని అనుచరులు, 2006).
స్పైలాంతాల్ అనేక జీవ చర్యలను కలిగి ఉంది (డుబే, అతని అనుచరులు, 2013)
స్పైలాంతాల్ యాంటిఫంగల్ (డూబే, అతని అనుచరులు, 2013), బాక్టీరియోస్టాటిక్ (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004), ఇన్‌సెక్టిసైడల్ (కడిర్, అతని అనుచరులు, 1989; శర్మ, అతని అనుచరులు, 2012; మోరెనో, అతని అనుచరులు, 2012); యాంటిమలేరియల్ (శర్మ, అతని అనుచరులు, 2012); ఈడెసఈజిప్టి, హెలికోవర్పా జియానియోనేట్స్‌పై యాంటిలార్విసైడల్ చర్యలు (రామ్‌సేవక్, అతని అనుచరులు, 1999) ప్రదర్శించింది.
హెచ్. లాంగిపెస్‌వేర్ల నుండి వేరు చేసిన స్పైలాంతాల్ మరియు ఇతర ఆల్కమైడ్లు స్ల్కీరోషియం రాల్ఫిసి, స్ల్కీరోటినియాసెపివొరం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్, రైజోక్టోనియా సొలాని ఎజి3 మరియు ఎజి5 శిలీంద్రాల పెరుగుదలనరికట్టాయి (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతాల్ బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కరిచియా కోలి, శకారోమైసిస్ సెరెవిసియా పెరుగుదలను కూడా అరికట్టింది (మోలినొటోర్రెస్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతస్ క్యాల్వ లోని స్పైలాంతాల్ ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైటెస్ పై యాంటిఫంగల్ చర్య ప్రదర్శించింది (రాయ్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతాల్ కీటకనాశినిగా కూడా ఉపయోగపడుతంది (కడిర్, అతని అనుచరులు, 1989; స్పెల్‌మన్, అతని అనుచరులు, 2011; శర్మ, అతని అనుచరులు, 2012). బ్రోకోలి వంటి క్యాబేజి జాతి కూరగాయల పంటలనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని చంపింది (శర్మ, అతని అనుచరులు, 2012). సొలనేసి జాతి మొక్కలనాశించే టమాట లీఫ్‌మైనర్, టూట ఆబ్సల్యూటని కూడా చంపింది. (మోరెనో, అతని అనుచరులు, 2012).
స్పైలాంతాల్ నత్త, ఫైసా ఆక్సిడెంటాలిస్‌పై బలమైన మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (జాన్స్, అతని అనుచరులు, 1982).
అక్కలకర్ర మొక్కపొడి (3%, 5%), మొక్కజొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ వీవిల్స్ మరణ శాతాన్ని పెంచి, విడుదలయ్యే పెద్దపురుగుల శాతాన్ని తగ్గించి గింజలను కాపాడుతుంది. గింజల మొలకశాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపదు (ఓగ్బాన్, అతని అనుచరులు, 2015).
చండ్ర / సండ్ర ఒక అతి ప్రసిద్ధి చెందిన చిన్న ఆకులు, ముళ్ళు కలిగిన ప్రయోజనకర ఆయుర్వేద ఔషధ మొక్క. ఈ చెట్టు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కనబడుతుంది. దీని హార్ట్ ఉడ్ నుండి తీసిన రసాన్ని కదిరసారమంటారు. దీనిని లవంగడవటి వంటి అనేక ఔషధాల్లో ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు. దీని రసం ఎరుపు రంగులో వుంటుంది. దీనిని దంత ధావనంలో టూత్ బ్రష్‌గా ఉపయోగిస్తారు. ఈ చెట్టు కొయ్యని యజ్ఞాలు, హోమాలు వంటి ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంధనంగా వాడతారు.
సాధారణ నామం : బ్లాక్ కెటచు / ఖదిర శాస్త్రీయ నామం : అకేసియా కెటచు కుటుంబం: మైమోసేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద చర్మ టానిక్ ఖదిరారిష్టను ఈ మొక్కను ప్రధాన పదార్థంగా ఉపయోగించి తయారు చేస్తారు. ఇది రోగాన్ని తగ్గించి శరీరానికి స్థిరత్వమిస్తుంది.
చండ్ర ఔషధ గుణాలు : గుణం : లఘు,రూష్ట రసం: వగరు, కషాయం రుచి : కారంగా శక్తి : చల్లదనం కలిగిస్తుంది
చర్మ వ్యాధులను నయం చేసే ఔషధ మొక్కలన్నింటిలో చండ్ర అతి గొప్పది. చండ్ర కషాయాన్ని స్నానం చేయడానికి, త్రాగడానికి ఉపయోగిస్తారు. ఖదిర కషాయాన్ని డయాబెటిస్, మూత్రాశయ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
కత్తాని తమలపాకు, పాన్ తయారీలో ఒక భాగంగా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
కెటచిన్ ఆధారిత పురుగు మందు ఉత్పత్తి నిల్వ ధాన్యంలో ఆశించే ట్రైబోలియం కన్‌ఫ్యూసం, ట్రైబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ కైనెన్పిస్, సైటోఫిలస్ ఒరైజే పురుగులను అరికట్టింది (ఖటున్, అతని అనుచరులు, 2011)
బ్లాక్ కెటచు నుండి వేరు చేసిన ఎపికెటచిన్ లెపిడోప్టెరా లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యని ప్రదర్శించింది (శ్రీమన్నారాయణ్ అండ్ రావు, 1985).
చండ్రచెదలను నివారించే గుణం కలిగి వుంది (హెచ్‌డిఆరఎది ఆర్గానిక్ ఆర్గనైజేషన్, సెలిమ్‌సేన్, అతని అనుచరులు, 2017)