సముద్రపాల అడవిలో ఇతర పొదలపై లేదా చెట్లపై ప్రాకే పెద్ద తీగ. దాదాపు 10-15 మీ. వరకు ప్రాకుతుంది. దాదాపు మొక్కలోని అన్ని భాగాలు తెల్లని రోమాలతో కప్పబడి ఉంటాయి. కొమ్మలు కత్తిరించినపుడు తెల్లని పాలవంటి జిగట పదార్థం వస్తుంది. ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో ప్రతికణుపు వద్ద ఒకటి చొప్పున వస్తాయి. ఆకుల అడుగు భాగాన నూగు ఉంటుంది. పూలు పెద్దవిగా, గంట ఆకారంలో లేత వంగపండు రంగు లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి రక్షణ పత్రావళిలో కప్పబడి ఉంటాయి.
సాధారణ నామం : చంద్రపాల / కొక్కిత తీగ / ఎలిఫెంట్ క్రీపర్ శాస్త్రీయ నామం : ఆర్ౙిరీయా నెర్వోసా కుటుంబం: కన్వోల్యులేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- వేర్లు, ఆకులు, లేతకాండాలను, గింజలను ఔషధాలుగా ఉపయోగిస్తారు.
- గింజలలో అరజైన్, ఐసోఅరజైన్, పెన్నిక్లావైన్ అనే రసాయనాలున్నాయి.
- ఆకులు మరియు లేత కాండాలను అజీర్ణం, మలబద్ధకం నివారణలో ఉపయోగిస్తారు.
- ఆకుల నుండి తయారు చేసిన మాత్రలను మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో :
- సముద్రపాల కాయలలో స్టీరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాల్స్, టెర్పినాయిడ్స్ ఉంటాయి. వీటిలో లైసర్గమైడ్, స్టిగ్మాస్టన3, 5డైయిన్, ఎర్గాటమైన్ అనే మొక్కలకు పర్యావరణపరంగా ఉపయోగపడే ముఖ్యమైన జీవ చురుకుదనం గల పదార్థాలుంటాయి. వీటిని ఔషధాలు, డ్రగ్స్ ఫార్ములేషన్‌లో ఉపయోగిస్తారు (ఎకడె అండ్ మానిక్, 2015).
- సముద్రపాల ఇథనాల్ ద్రావణాలు టెట్రోసైక్లిన్‌కి సమానంగా యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి. (మోడి, అతని అనుచరులు, 2010).
- భారతదేశంలో సముద్ర పాల రసాన్ని, సమాన పరిమాణంలో నువ్వుల నూనె, కొంచం డిల్ గింజల పొడితో కలిపి స్కాబీస్ నివారణకు పైపూతగా పూస్తారు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

