ఔషధ మొక్క…. జలబ్రహ్మి

సాధారణ నామం : సంబరేణి మొక్క /నీర్ బ్రహ్మి శాస్త్రీయ నామం : బాకోపా మాన్నియెరి కుటుంబం: స్క్రోఫులేరియేసి

ఇది నేలబారుగా పెరిగే ఒక బహువార్షిక మొక్క. నీటి ఆధారం బాగా ఉన్న చోట ఎక్కువగా కనబడుతుంది. కణుపుల వద్ద అనేక వేర్లు తొడుగుతుంది. ఆకులు ఒక్కో కణుపు వద్ద రెండు చొప్పున వస్తాయి. ఆకులు మొదట సన్నగా ఉండి పోను పోను వెడల్పుగా మారతాయి. ఆకులు మందంగా ఉండి కనపడని ఈనెలతో ఉంటాయి. పూవులు లేత నీలం రంగు లేదా తెలుపు వర్ణంలో ఉండి ఆకుల మొదళ్ళ నుండి ఒక్కొక్కటిగా వస్తాయి. కాయలు చిన్నగా గుండ్రంగా లేదా అండాకారంలో ఉండి రెండు గదులు కలిగి ఉంటాయి. కాయలలో అనేక గింజలు సూక్ష్మంగా ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో

  • మొక్క సమూలంగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
  • దీనిలో బ్రాహ్మైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.
  • ఈ మొక్క నుండి బి1 ఆక్టలేట్, బి2 ఆక్టలేట్ మరియు బి3 క్లోరోప్లాటినేట్ లభిస్తాయి. అంతేకాక హెర్పిస్టెన్, సాపోనిన్, బాకోసైడ్ ‘ఎ’ మరియు బాకోసైడ్ ‘బి’, మొన్నియరిన్ మొదలైన ఆల్కలాయిడ్స్ కూడా లభిస్తాయి.
  • జలబ్రహ్మి వాతం, కఫరోగం నివారణకు, నరాల వ్యాధులకు, నొప్పి, మూర్ఛవ్యాధి, పిచ్చి, కణుతులు, పుండ్లు, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బసం, బ్రాంకైటిస్, కుష్టు, ల్యూకోడెర్మా, బోదకాలు, నపుంసకత్వం, జ్వరం, సాధారణ బలహీనత మొదలగు వాటి చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఇది జ్ఞాపకశక్తి పెంచుటకు కూడా ఉపయోగపడుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. శతావరి

శతావరి ఆకురాల్చే అడవులలో తరుచుగా చెట్ల క్రింద పెరుగుతూ కనబడుతుంది. ముళ్ళ పొదలు లేదా ఇతర పొదల మీద ప్రాకుతూ బహువార్షికంగా పెరిగే ముళ్ళ తీగ. ఆకులు సూదులలా ఉంటాయి. చిన్న, చిన్న కొమ్మలు గుంపులుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా 0.2 సెం.మీ. పొడవు కలిగి ఆకుల మొదళ్ళ నుండి గుత్తులుగా ఏర్పడతాయి. కాడలు కలిసి ఉంటాయి. పండ్లు గుండ్రంగా 0.4þ0.4 సెం.మీ. పరిమాణం కలిగి ఎర్రగా ఉంటాయి. వేర్లు సుమారు 100 వరకు ఉండి కండ కలిగి గుత్తులుగా తయారవుతాయి.

సాధారణ నామం : సీతమ్మజడ / ఆస్పరాగస్/పిల్లితీగలు / పిల్లిపీచర గడ్డలు / చందమామగడ్డలు శాస్త్రీయ నామం : ఆస్పరాగస్ రెసిమోసస్ కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో స్టిరాయిడ్లు, గ్లెåకోసైడ్స్ (ఆస్పరాగోసైడ్స్), బిట్టర్ గ్లెåకోసైడ్, ఆస్పరాజిన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దుంపలలో పిండిపదార్థం, మ్యూసిలేజ్ కూడా ఉంటాయి.
  • దీనిని బలవర్థకంగా, మూత్రం సులువుగా జారీ చేయడానికి ఉపయోగిస్తారు. వీర్యాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. తేనెతో తాజావేరు రసాన్ని కలిపి అజీర్ణ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల వ్యాధుల చికిత్సకు వాడే తైలాలలో దీనిని ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • శతావరి ఆకు మిథనాల్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీ. పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (నుస్రా అండ్ హరూన్, 2016).
  • శతావరి ఆకుల నీటి, అసిటోన్, ఇథనాల్ ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్లడ్‌సుగర్, ట్రైహలోస్‌పై విష ప్రభావాన్ని చూపాయి (గంగ, ఆమె అనుచరులు, 2017)
  • శతావరి ఆకుల ఇథనాల్ ద్రావణం బాసిల్లస్ ప్యుమిలిస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియాకోలి, సూడోమోనాస్ ఈరూజినోసా, ప్రోటియస్‌వుల్గారిస్, స్టెఫైలోకోకసఆరియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కాండిడా ఆల్బికాన్స్ పెరుగుదలను అరికట్టింది (బిట్టు అండ్ కుమార్, 2010).
  • శతావరి ఆకుల ద్రావణం ఈడెసఈజిప్టీపై మస్క్యిటోసైడల్ ప్రభావాన్ని చూపింది. 65% వికర్షక చర్యను ప్రదర్శించింది (కండాగిల్ అండ్ సోమవర్షి, 2016).
  • శతావరి వేరు ద్రావణాలు పర్యావరణహిత పద్ధతిలో అనోఫిలస్ స్టెఫెన్సీ, ఈడిస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటస్ దోమలను వికర్షక చర్య ద్వారా నివారించాయి (గోవింద రాజన్ అండ్ శివశంకర్, 2015)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… సముద్రపాల

సముద్రపాల అడవిలో ఇతర పొదలపై లేదా చెట్లపై ప్రాకే పెద్ద తీగ. దాదాపు 10-15 మీ. వరకు ప్రాకుతుంది. దాదాపు మొక్కలోని అన్ని భాగాలు తెల్లని రోమాలతో కప్పబడి ఉంటాయి. కొమ్మలు కత్తిరించినపుడు తెల్లని పాలవంటి జిగట పదార్థం వస్తుంది. ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో ప్రతికణుపు వద్ద ఒకటి చొప్పున వస్తాయి. ఆకుల అడుగు భాగాన నూగు ఉంటుంది. పూలు పెద్దవిగా, గంట ఆకారంలో లేత వంగపండు రంగు లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి రక్షణ పత్రావళిలో కప్పబడి ఉంటాయి.

సాధారణ నామం : చంద్రపాల / కొక్కిత తీగ / ఎలిఫెంట్ క్రీపర్ శాస్త్రీయ నామం : ఆర్ౙిరీయా నెర్వోసా కుటుంబం: కన్వోల్యులేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేర్లు, ఆకులు, లేతకాండాలను, గింజలను ఔషధాలుగా ఉపయోగిస్తారు.
  • గింజలలో అరజైన్, ఐసోఅరజైన్, పెన్నిక్లావైన్ అనే రసాయనాలున్నాయి.
  • ఆకులు మరియు లేత కాండాలను అజీర్ణం, మలబద్ధకం నివారణలో ఉపయోగిస్తారు.
  • ఆకుల నుండి తయారు చేసిన మాత్రలను మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో :

  • సముద్రపాల కాయలలో స్టీరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాల్స్, టెర్పినాయిడ్స్ ఉంటాయి. వీటిలో లైసర్గమైడ్, స్టిగ్మాస్టన3, 5డైయిన్, ఎర్గాటమైన్ అనే మొక్కలకు పర్యావరణపరంగా ఉపయోగపడే ముఖ్యమైన జీవ చురుకుదనం గల పదార్థాలుంటాయి. వీటిని ఔషధాలు, డ్రగ్స్ ఫార్ములేషన్‌లో ఉపయోగిస్తారు (ఎకడె అండ్ మానిక్, 2015).
  • సముద్రపాల ఇథనాల్ ద్రావణాలు టెట్రోసైక్లిన్‌కి సమానంగా యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి. (మోడి, అతని అనుచరులు, 2010).
  • భారతదేశంలో సముద్ర పాల రసాన్ని, సమాన పరిమాణంలో నువ్వుల నూనె, కొంచం డిల్ గింజల పొడితో కలిపి స్కాబీస్ నివారణకు పైపూతగా పూస్తారు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క…. అడవి సీతాఫలం

అడవి సీతాఫలం అనోనేసి కుటుంబంలోని ఒక పూల మొక్క. ఈ మొక్కని సెనెగల్ నుండి సేకరించారు. ఇది ఒక పొద లేదా చిన్న చెట్టు. ఈ మొక్క 2 నుండి 6 మీ. ఎత్తు పెరుగుతుంది. బెరడు నున్నగా లేదా గరుకుగా గ్రే సిల్వర్ లేదా గ్రే బ్రౌన్ రంగులో ఉంటుంది. కొత్త కొమ్మలు మందమైన గ్రే, గోధుమ రంగు లేదా పసుపు రంగుతొడుగు కలిగి ఉంటుంది. తర్వాత వయసుతో పాటు ఊడిపోతుంది. ఆకులు ఆకుపచ్చ లేదా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపై వైపున నూగు ఉండదు. అడుగువైపున నూగు ఉంటుంది. పూవ్వు 3 సెం.మీ. వ్యాసం కలిగి ఉండి 2 సెం.మీ. కాడపై ఏర్పడతాయి. కాయలు అనేక కలిసిపోయిన మెత్తని, ఉబ్బెత్తు 2.5-5.0 సెం.మీ. అండాకారం లేదా గుండ్రని పుష్పపు గర్భకోశాలు కలిగి ఉంటాయి.

సాధారణ నామం : వన్యసీతాఫలం / ఆఫ్రికన్ సీతాఫలం శాస్త్రీయ నామం : అనోనాసెనెగలెన్సిస్ కుటుంబం: అనోనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పండులోని తెల్లని గుజ్జు ఆహ్లాదకరమైన అనాస పండు వాసనలో ఆప్రికాట్ రుచి కలిగి ఉంటుంది.
  • ఆకులను కొన్నిసార్లు కూరగా వండుకుని తింటారు. పూలను సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు.
  • విచ్చుకోని పూల మొగ్గలను సూపులో ఉపయోగించుతారు.
  • మొక్క బెరడుని డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, పాముకాటు, పళ్ళనొప్పి, శ్వాసకోశ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • బెరడుని కొరికి గాయలపై లేపనంగా పూస్తారు. బెరడు, వేర్లను కలిపి నూరి పాము కాటు గాట్లపై పూస్తారు.
  • బెరడు నుండి కారే బంకను తెగిన చోట, గాయాలపై పూస్తారు.
  • ఆకులను న్యుమోనియా చికిత్సలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి టానిక్‌గా ఉపయోగిస్తారు.
  • వేర్లను కడుపునొప్పి, సుఖవ్యాధులు, రొమ్ము జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • కాయలను డయేరియా, డిసెంట్రి, వాంతుల నివారణకుపయోగిస్తారు.
  • అనేక మొక్క భాగాలను కలిపి చర్మ వ్యాధులు, క్షయ వల్ల కలిగే సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • అడవి సీతాఫలం గింజలు, బెరడుని పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.
  • రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌లో వన్య సీతాఫలం తాజా ఆకులను కోళ్ళగూళ్ళలో పరచి అవి ఎండే వరకు ఉంచుతారు. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేసి ఫ్లీస్, నల్లులను నివారిస్తారు.
  • వన్యసీతాఫలంలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, సపానిన్స్, ఆల్కలాయిడ్స్, గ్లెåకోసైడ్లు, స్టీరాయిడ్లు, ఆవిరైపోయే నూనెలు, యాంథోసయనిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, ప్లాటినం, క్రోమియం వంటి ఖనిజాలతో పాటు ఆస్కార్బిక్ యాసిడ్, అమినో యాసిడ్లు కూడా ఉంటాయి. అందువలన అది ఒక ముఖ్య పోషక మూలం. దీని కాండం బెరడులో ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది. కాంగో అనే శాస్త్రవేత్త ఈ మొక్క ఆకులు, కాండం బెరడు, వేరు బెరడు, ఎపికార్ప్, మీసోకార్ప్‌లో ఎసెన్షియల్ ఆయిల్‌ని కనుగొన్నారు. దీని భాగాల నుండి వేరు చేసిన రసాయనాలు యాంటి మైక్రోబియల్ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి.
  • కాండం, బెరడు ఇథనాల్ ద్రావణం బెండ, జొన్న, టమాట గింజల నాశించి మొలక శాతాన్ని తగ్గించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, శిలీంద్రాలను నివారించింది. (అక్పోర్, అతని అనుచరులు, 2015)
  • వన్య సీతాఫలం జీవ పురుగు మందు. అలసంద పంటలో పేనుబంక పురుగులను నివారించింది (కోలో, అడము, 2016)
  • వన్య సీతాఫలం బెరడు, ఆకు పొడి, ద్రావణం మిరియాల పంటనాశించే వేరు బుడిపె నులి పురుగు (మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట)ల సంఖ్యను తగ్గించాయి (అగాఒ, ఫావోల్, 2015).
  • వన్య సీతాఫలం ఎండు ఆకులను ధాన్యం గింజలకు కలిపి నిల్వ సమయంలో ఆశించే పురుగులను నివారించవచ్చు. (థాకర్, 2002).
  • వన్యసీతాఫలం ద్రావణం కొన్ని జీవ చర్య మిశ్రమాలను కలిగి ఉండి, కీటక నాశక మరియు యాంటీ ఫీడెంట్ చర్యలతో నిల్వ ధాన్యంలో ఆశించే రెడ్ ఫ్లోర్ బీటిల్ (ట్రైబోలియం కాస్టానియం)ని అరికట్టింది (ఒసెని, అతని అనుచరులు, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… జీడి మామిడి

జీడిమామిడిని భూసారం తక్కువగా ఉన్న నేలల్లో భూమి కోతను తగ్గించడానికి సాగు చేస్తారు. జీడిమామిడి మధ్యస్త పరిమాణంలో ఉండే చెట్టు. ఇది ఎల్లప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉండి, అనేక కొమ్మలు విస్తరించి ఉండి 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రథమ వేరు ప్రస్ఫుటంగా ఉండి అనేక ప్రక్క వేర్లు, సింకర్ వేర్ల వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు ఒకదానిని విడిచి ఇంకొకటిగా ఏర్పడి, అండాకారంలో, లేత ఆకుపచ్చ రంగులో గుండ్రని చివర్లు కలిగి 10-18 x 8-15 సెం.మీ. పరిమాణంలో చిన్న ఆకు తొడిమ కలిగి వుంటాయి. లేత ఆకులు ఎరుపు రంగు, ముదురు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. జీడిమామిడి 3-5 సంవత్సరాలలో పూతకు వస్తుంది. పూగుచ్ఛం గుత్తిలో అనేక మగపూలు, ద్విలింగ పుష్పాలు ఏర్పడతాయి. జీడికాయ ఎండి, విషపూరిత గుల్లలో పెద్ద, వంపు తిరిగిన గింజ (2.5 సెం.మీ.) కలిగి ఉంటుంది. జీడి కాయ పసుపు రంగులో పలుచని చర్మంతో, మెత్తని కండతో, అధిక రసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : కాష్య్ణు, శాస్త్రీయ నామం : అనకార్డియం ఆక్సిడెంటేల్, కుటుంబం: అనకార్డియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • జీడిమామిడి సిరప్ దగ్గు, జలుబులకు మంచి మందు, జీడిమామిడి రసం సిఫిలిస్ చికిత్సలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • పాతజీడిమామిడి లిక్కర్ తక్కువ మోతాదులో కడుపునొప్పి తగ్గిస్తుంది, జీడిమామిడి గుల్ల నుండి తీసిన నూనెని గ్రామస్థులు కాలి మడమ పగుళ్ళను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
  • జీడిమామిడిని కలరా, మూత్రపిండ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • జీడిమామిడి పెంకు నుండి తీసిన నూనెని విరేచనకారిగా, మధుమేహం, కిడ్నీ సమస్యలు, కాలి మడమ పగుళ్ళ, ఆనెల నివారణలో ఉపయోగిస్తారు.
  • జీడి పప్పుని డయేరియా అరికట్టడానికుపయోగిస్తారు, మొగ్గలు, లేత ఆకులను చర్మవ్యాధులను నయం చేయడానికుపయోగిస్తారు.
  • గింజల రసాన్ని మానసిక సమస్యలకు, కీళ్ళనొప్పులకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • జీడిమామిడి పెంకు ద్రావణం ధాన్యం నిల్వలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని నివారిస్తుంది, నత్తల నివారణలో ఉపయోగపడుతుంది.
  • జీడికాయ, పెంకులు బంబారా వేరుశనగ నిల్వలలో ఆశించే కాల్లసోబ్రూకస్ సబిన్నోటేటస్‌ని నివారిస్తాయి (ఒపరేక్, బన్ని, 2006)
  • జీడి మామిడి కాయ రసం (20%) కొబ్బరిలో ఎర్రముట్టె పురుగు (రెడ్‌పామ్ వీవిల్)ని కాండానికి ఇంజక్ట్ చేయడం, మొవ్వులో పోయడం ద్వారా సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది రసాయన పురుగుమందు కార్బరిల్‌కి ప్రత్యామ్నాయం.
  • జీడిమామిడి పెంకు ద్రవం నిల్వ ధాన్యాలను ఆశించే సైటోఫిలా ఒరైజే బీటిల్‌ని సమర్ధవంతంగా నివారిస్తుంది (బక్ట్సన్, అతని అనుచరులు, 2017).
  • జీడిమామిడి చెట్టు అన్ని భాగాల ద్రావణాలు కీటకనాశక, పురుగు వికర్షక లక్షణాలు కలిగి చెద పురుగులు, కాఫీ గింజలను తొలిచే తెల్ల పురుగులను నివారించాయి. గింజల నుండి తీసిన నూనె ప్రత్తిలో రెడ్ కాటన్ బగ్, పొగాకులద్దె పురుగులను అరికట్టాయి (రిచర్డ్ విలియం హే ఫ్లూక్, 1999)
  • జీడిమామిడి ద్రావణం (నీటిలో కలిపిన) అనేక చెట్లకు నష్టం కలిగించే మాక్రోటెరిమస్ చెద పురుగుని నివారించింది (ఓసిపిటన్, & ఓసెవేమి, 2012).
  • జీడిమామిడి ఆకు పొడి చెద పురుగు ఒడొంటో టెర్మెస్ ఒబెసస్‌ని 53.33% నివారించాయి (రంజిత్, అతని అనుచరులు, 2017).
  • జీడిమామిడి పెంకు ద్రవం శనగ పచ్చ పురుగు లార్వాలను నివారించింది (మహాపాత్రో, 2010).
  • జీడి మామిడి గింజల పొడి, ద్రావణం అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ అలసంద బ్రూచిడ్)ని సమర్ధవంతంగా నివారించాయి (ఇలెకి, 2012).
  • జీడిమామిడి గింజల నూనె (3%) బెండ కాండం మరియు కాయతొలుచు పురుగు లార్వాలను 87.4% నివారించింది (ప్రవీణ; ఆమె అనుచరలు, 2012).
  • జీడి మామిడి గింజల పొడి ద్రావణం జొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు (సైటోఫిలస్ ఒరైజె)ని నివారించింది (ఇలెకి, అతని అనుచరులు, 2013)
  • జీడిమామిడి క్రూడ్ మిథనాల్ ద్రావణం క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్‌ని నివారించింది. (మున్సెమన & ఆల్బర్టో, 2017).
  • జీడిమామిడి బంక ద్రావణం కొన్ని శిలీంద్రాలు, బాక్టీరియా పెరుగుదల నరికట్టింది. కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ (బ్రూచిడ్) పెద్ద పురుగుల సంఖ్యను తగ్గించింది. (మార్క్వెస్, అతని అనుచరులు, 1992)
  • జీడిమామిడి ద్రావణం క్షేత్రస్థాయిలో మాక్రోటెర్మస్ బెల్లికోసస్ (చెదపురుగు)ని పర్యావరణహిత పద్ధతిలో నివారించింది (ఓస్పిటాన్, ఒసెయెమి, 2012).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క – పిండిదొండ

సాధారణ నామం : కొండపిండి/పిండికూర శాస్త్రీయ నామం : ఏర్వ లానాట కుటుంబం: అమరాంథేసి

పిండి దొండ కొయ్యలాంటి కాండం కలిగి భూమిపై ప్రాకే మొక్క లేదా మెత్తగా వుండే బహువార్షిక మొక్క. కొన్నిసార్లు మొక్క మొదటి సంవత్సరంలోనే పూతకు వస్తుంది. పిండిదొండ సాధారణంగా భారతదేశంలో అన్ని చదరపు ప్రాంతాలలో పెరిగే కలుపు మొక్క. దీనివేరు కర్పూరం వంటి వాసన కలిగి ఉంటుంది. దీని ఎండిన పూలను బ్యూకల్లాన్, బూర్‌పేర్లతో అమ్ముతారు. దశపుష్పాలు అనే పవిత్ర పూలలో ఇది ఒకటి. ఇది కొమ్మలు, కొయ్యలాంటి వేరు వ్యవస్థ కలిగిన వార్షిక మొక్క. కాండాలు ఎక్కువగా పక్కకు ప్రాకుతూ దూరంగా విస్తరిస్తాయి. కొన్నిసార్లు 6 అ. పొడవు వరకు విస్తరిస్తాయి. కాడలు లేని ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. అవి కోడిగుడ్డు ఆకారంలో 0.5 అం. నుండి 1.5 అం. పొడవుంటాయి. ఆకు ఆండానికి అతికి వుండేచోట నుండి రెండు లేదా మూడు పూలతో చిన్న గుత్తులు ఏర్పడతాయి. పూలు 0.1 అం. పొడవుతో పింక్, ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులలో ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేర్లతో సహా మొక్క అన్ని భాగాలు వివిధ ఉపయోగాలు కలిగి ఉన్నాయి., ఇది మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
  • మొక్క ఆకులు సూప్ తయారీలో లేదా ఆకుకూరగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క పశువులు, కోళ్ళకు మేతగా పనికి వస్తుంది. ఈ మొక్క యాంటి మైక్రోబియల్ లక్షణాలు కలిగి చర్మవ్యాధుల కారకాల నుండి రక్షిస్తుంది., మూత్ర వర్థకంగా పనిచేస్తుంది.
  • నొప్పి, వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపులోని పరాన్నజీవి నులి పురుగులను నివారిస్తుంది.
  • మొలల నుండి రక్తం స్రవించడాన్ని అరికడుతుంది. మూత్ర పిండాలు, గాల్‌బ్లాడర్‌లోని రాళ్ళను తొలగిస్తుంది. ఈ మొక్క ఒక ఔషధ టానిక్‌లా ఉపయోగపడుతుంది. జ్ఞానశక్తిని పెంచుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, జీర్ణ సమస్యల చికిత్సకుపయోగిస్తారు. మెడ, వెన్నునొప్పులు, జ్వరం, మూత్ర సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • హెపటైటిస్, లివర్ వాపులను సమర్ధవంతంగా నివారిస్తుంది. అనీమియా, ఆల్ౙిమర్, ఆర్థ్రెåటిస్, కొలెస్టరాల్, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తప్రసరణ వంటి ఆరోగ్య సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • పిండి దొండ ఆకుల బెంజీన్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది. పూల బెంజీన్ ద్రావణం ట్రైకోస్పరా అసాహిపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. వేరు అసిటోన్ ద్రావణం కాండిడా పారాప్సిలాసిస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ట్రైకోస్పరా అసాహి, మ్యూకార్ ఇండికస్‌పై ఆకులు, పూల ద్రావణాల కన్నా అధిక యాంటి ఫంగల్ చర్యలను ప్రదర్శించింది (విద్య అండ్ ఉదయకుమార్, 2017).
  • పిండిదొండ, అకలైఫా ఇండికా, ఫిల్లాంతస్ అమర ఆకుల మిథనాల్ ద్రావణాలు పంటలలో బాక్టీరియా తెగుళ్ళు కల్గించే క్ఖా0తోమోనాస్ కాంపెస్ట్రిస్, మానవులలో వ్యాధులు కలిగించే యూరోనోమస్ హైడ్రోపిలా బాక్టీరియాల పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి (బ్రిట్టో, అతని అనుచరులు, 2011).
  • పిండిదొండ వేరు ద్రావణం శనగ పంటనాశించే రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటాపై నెమటిసైడల్ చర్యను ప్రదర్శించింది (మురుగేశ్వరి, ఆమె అనుచరులు, 2016).
  • పిండిదొండ, అబుటిలాన్ ఇండికం, అకలైఫా ఫ్రక్టికోసా, అకిరాంథస్ ఆస్పెరా, అడతోడ జీలానిక, మారేడు, ఆల్బిజియా అమర్, ఆండ్రోగ్రాఫిస్ లినియేట, ఆండ్రాగ్రాఫిన్ పానిక్యులేట, వేప, బుడ్డకాకర, క్యాసియా టోరా, బిళ్ళగన్నేరు, ఉమ్మెత్త, జిమ్నెమ సిల్వెస్టర్, తురకవేప, ఆసిమం కానమ్, ఆసిమం సాంక్టమ్, పెర్గులేరియండీమియా, ప్లెక్ట్రాంతస్ కోలియాయిడెస్ సొలానంనైగ్రం, సొలానం సురెట్రెన్స్, సొలానం ట్రైలోబేటం, ట్రిబ్యులస్ టెర్రెస్ట్రిస్, వావిలాకుల నీటి ద్రావణాలను శనగపచ్చ పురుగు, హెలికోవర్పా ఆర్మిజెరా 6వ దశ లార్వాలపై యాంటీఫీడెంట్ చర్యను పరీక్షించారు. 6వ దశ లార్వాలో చావు శాతం ఈ క్రమంలో ఉంది. తురకవేప > వేప > సొలానం ట్రైలోబేటం > నేలవేము > మారేడు > ఆండ్రోగ్రాఫిస్ లీనియేట > సొలానం సురెట్రెన్స్ > బిళ్ళగన్నేరు > అడతోడ జీలానిక > అకలైఫా ఫ్రక్టికోసా > ఉమ్మెత్త > సొలానం నైగ్రం > ఆసిమం కానమ్ > ప్లెక్ట్రాంతస్ కోలియాయిడెస్ > ఆసిమం సాంక్టం > పెర్గులేరియా డీమియా > ఆల్బిజియా అమర > జిమ్మెమ సిల్వెస్టర్ > బుడ్డకాకర > వావిలాకు > వేప > కాసియా టోర > ట్రిబ్యులెస్ టెర్రెస్ట్రిస్ > ఉత్తరేణి > పిండిదొండ (రమ్య అండ్ జయకుమార్ రాజ్, 2009).
  • పిండిదొండ ద్రావణం చెరకు పంటలో నారు మొక్కల మాడుతెగులు, విత్తన మొలక శాతం తగ్గించే కర్వులేరియాల్యునేటని సమర్ధవంతంగా నివారించింది (నందిని అండ్ అంజనా, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు 9676797777కు సంప్రదించండి

Read More