ఔషధ మొక్క…. సీమ మెట్ట తామర

ఇది సుమారు 1.5 మీ. ఎత్తు పెరిగే ఒక చిన్న పొద. దీని శాఖలు సమాంతరంగా విస్తరిస్తాయి. పత్రములు పక్షవత్ సంయుక్తం. కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. పత్రకములు 8-12 జతలు, వెడల్పుగా, గుండ్రంగా ఉంటాయి. మొదలు వంకరగా ఉంటుంది. కాడలు మరియు పత్రవృంతములు సాధారణంగా ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. పుష్పవిన్యాసం ఆకుల మొదలు నుండి లేదా కొమ్మల చివర్ల నుండి వస్తుంది. నిటారైన పుష్పగుచ్చాలు కల్గి ఉంటుంది. పూలు పసుపు రంగులో ఉంటాయి. కాయలు పొడవుగా కొద్దిగా నొక్కినట్లు ఉండి అంచులు రెక్కలలాగా ఉంటాయి. గింజలు అనేకం ఉండి నలుపు రంగులో ఉంటాయి. తేమ గల ప్రాంతాలలో మరియు సాగు నేలలలోను కలుపుగా బాగా పెరుగుతుంది. అందమైన పూల కొరకు కూడా దీనిని పెంచుతారు. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : రింగ్ వార్మ్ క్యాసియా / వింగ్‌డ్ సెన్నా / కాండిల్ బుష్ శాస్త్రీయ నామం : క్యాసియా అలాట కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు మరియు కాండం ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో ఆంత్రాగ్లూకోసైడ్లు, క్రైసోఫిన్ మరియు రీన్ అనే రసాయనాలు ఉన్నాయి. ఆకులు మరియు కాండమునకు శరీర భాగాలు కుళ్ళిపోకుండా చేసే గుణం ఉంది. విరేచనకారిగా పనిచేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి.
  • దీనిని ఎడిమా, హెపాటైటిస్ మొదలగు జబ్బుల చికిత్సకూ, తామర, గజ్ౙి వంటి చర్మవ్యాదుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • సీమ మెట్ట తామర ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ పీకాలిస్, ఎస్కెరిచియాకోలి, ప్రోటియస్ మిలాబిలిస్‌పై యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (ఇగ్వె అండ్ ఓన్వు, 2015)
  • బెరడు మరియు ఆకుద్రావణాలు సాధారణ నల్ల చీమలు, ఎర్రచీమల పై విష చర్యను ప్రదర్శించాయి (ప్లూక్, 1999).
  • క్యాసియా నైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ తెల్లదోమ, బెమిసియా టబాసి పెద్ద పురుగులపై కీటక నాశక చర్యను, అనోఫెలెస్ గాంబియే దోమల లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అజిర్ౙెస్, అతని అనుచరులు, 2008).
  • దీని ఆకులలోని ఎమోడిన్ యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (అయో, అతని అనుచరులు, 2007).
  • సీమ మెట్టతామర ఆకుల ఎసిటోన్, ఇథనాల్ ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ సీరియస్, ఎస్కెరిచియా కోలి, విబ్రియో కలరా, క్లెబ్సియెల్లా న్యుమోనియేపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి (సకార్కర్, అతని అనుచరులు, 1998).
  • దీని ఆకులలో ఉన్న క్యాసియాక్ౙాంతోన్, కీంప్‌ఫెరాల్, గ్లెåకోసైడ్స్, క్రైసోఫినాల్స్, ఐసోక్రైసోఫినాల్ చీమలను సమర్ధవంతంగా వికర్షించాయి (వాట్ అండ్ బ్రేయర్, 1962, ప్రసాద్, 2007)
  • సీమ మెట్ట తామర మానవులలో వ్యాధులు కలిగించే క్యాండిడా ఆల్బికాన్స్, మైక్రోస్పోరం కానిస్, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైట్స్ శిలీంద్రపెరుగుదలను అరికట్టింది (టమోతి, అతని అనుచరులు, 2012).
  • ఈ మొక్క భాగాలను స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సబ్‌టైలిస్ కలిగించే వ్యాధుల నివారణలో ఉపయోగించవచ్చు. (అలలార్, అతని అనుచరులు, 2012).
  • ఈ మొక్క ఆకుల ఇథనాల్ ద్రావణంతో తయారు చేసిన ఆయింట్‌మెంట్లు పశువులలో డెర్మటోఫైలోసిస్ వ్యాధిని సమర్ధవంతంగా నివారించాయి. (ఆలిఎమ్మాన్యుయెల్, అతని అనుచరులు, 2003).
  • దీని ఆకులు, కాండం, బీన్స్ ద్రావణాలు బలమైన యాంటిబాక్టీరియల్ చర్యను, బలహీనమైన యాంటిఆక్సిడెంట్ చర్యను ప్రదర్శించాయి (వహాల్, అతని అనుచరులు, 2014).
  • సీమ మెట్టతామర మొక్కను అరటి కాండంతొలుచు పురుగు, ఒడోయిపోరస్ లాంగికోల్లిస్ నివారణలో ఉపయోగించవచ్చు.(బాలన్, దయానందన్, 2016).
  • ఈ మొక్క బెరడు పొడి టిక్స్‌ని నాశనం చేస్తుంది (సోరోన్)
  • సీమ మెట్టతామర సాల్వెంట్ ద్రావణాలు కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్‌పై శక్తివంతమైన విష చర్యను ప్రదర్శించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011)
  • దీని కాండం బెరడు ద్రావణంలో ఆల్కలాయిడ్స్, సపానిన్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, గ్లెåకోసైడ్స్ ఉంటాయి (అవంతి అండ్ సుబ్బలక్ష్మి, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. గుగ్గిలం / అండుగం చెట్టు

గుగ్గిలం ఒక మధ్య పరిమాణం నుండి పెద్ద పరిమాణం గల, తేలికగా విస్తరించే క్యానపి, కొద్దిగా వ్రేలాడే కొమ్మలు గల ఆకులు రాల్చే చెట్టు. సాధారణంగా దీని కాండం 3-5 మీ. పొడవుంటుంది. అడవులలో పెరిగేచెట్టు చుట్టుకొలత 1.2-1.8 మీ. ఎత్తు 9-15 మీ. ఉంటుంది. బెరడు చాలా పలుచగా, బూడిదఆకుపచ్చ, బూడిద లేదా ఎరుపు రంగులో ఉండి పలుచని, కాగితం లాంటి పొరలుగా విడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడతాయి. అవి 2.0-4.5 సెం.మీ. పొడవుండి కొమ్మల చివర్లలో గుంపులుగా ఏర్పడతాయి. చిన్న ఆకులు 1.7-3.1 సెం.మీ. పొడవుండి ఒకదానికొకటి ఎదురుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా ఉంటాయి. 1.0-2.0 సెం.మీ. పొడవుంటాయి. పూలు కొమ్మల చివర గుబురుగా ఏర్పడతాయి. కాయలు 1-3 సెం.మీ. పొడవుండి 3 వాల్వులు, 3 గుండె ఆకారం, 1 విత్తనం గల పొరలను కలిగి ఉంటాయి.

సాధారణ నామం : ఇండియన్ ఒలిబానం శాస్త్రీయ నామం : బోస్వెల్లియాసెర్రేట కుటుంబం: బర్సరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేలాది సంవత్సరాల నుండి గుగ్గిలం ద్రావణాన్ని వంటి వాపు, నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీనిని కీళ్ళనొప్పులు, డయేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు కూడా ఉపయోగిస్తారు. గుగ్గిలం ధూపం డిప్రెషన్, ఆందోళనకు ఉపశమనం కల్గిస్తుంది.
  • ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులు, బర్సొటిస్, టెండొనైటిస్‌ల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తారు. దీనిని అల్సరేటివ్‌కోలైటిస్, కడుపునొప్పి, ఉబ్బసం, హేఫీవర్, గొంతునొప్పి, సిఫిలిస్, మహిళలలో రుతు సమయంలో నొప్పులు, మొటిమలు, క్యాన్సర్ నివారణలో ఉపయోగిస్తారు.
  • దీనిని ఉత్తేజికం, మూత్రం పారడం అధికం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. గుగ్గిలం రెసిస్ ఆయిల్, ద్రావణాలను సబ్బులు, కాస్మటిక్స్, ఆహార పదార్థాలు, పానీయాల తయారీలో ఉపయోగిస్తారు. గుగ్గిలం యాంటిక్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంది.

వ్యవసాయరంగంలో

  • గుగ్గిలం ఆకు ద్రావణం (5%, 10%, 15%), ఫ్యుజేరియం మొనిలిఫార్మె, ఫ్యుజేరియం సొలాని, ఆల్టర్నేరియా ఆల్టర్నేట పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది (పెట్కార్, 2013). గుగ్గిలం ఆకు ద్రావణం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది. గుగ్గిలం ఆకుద్రావణాన్ని పంటలలో తెగుళ్ళ నివారణకు జీవశిలీంద్రనాశినిగా ఉపయోగించవచ్చు. ఇది పర్యావరణహితమైనది. పశువులకు, మనుషులకు ఎటువంటి హాని జరగదు.
  • గార్గ్ (1974) ఫ్యుజేరియం మొనిలిఫార్మెపై గుగ్గిలం ఆకు ద్రావణం శిలీంద్రనాశక చర్యను రిపోర్టు చేశాడు. వరి పంటలో పురుగుల నివారణకు గుగ్గిలం ఆకులను పొలంలో వెదజల్లుతారు. గుగ్గిలం బంకని కాల్చి పొగ పెడితే ఈగలు, దోమలు వికర్షింపబడతాయి (శర్మ అండ్ సావంత్, 20120.
  • గుగ్గిలం బెరడు ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను 50% వరకు అరికడుతుంది (మిశ్రా & దుబె, 1994).
  • గుగ్గిలం ఎసెన్షియల్ ఆయిల్ పైన్ వుడ్ నెమటోడ్‌ని గణనీయంగా నివారిస్తుంది (పార్క్, అతని అనుచరులు, 2005, ఆండ్రెస్, అతని అనుచరులు, 2012).
  • గుగ్గిలం బెరడు ఎసెన్షియల్ ఆయిల్ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, ప్రోటియస్ మిరాబిలిస్ బాక్టీరియా పెరుగుదలను గణనీయంగా తగ్గించింది (కసాలి, అతని అనుచరులు, 2000).
Read More

ఔషధ చెట్టు తాటిచెట్టు

తాటిచెట్టు దాదాపు 20-30 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక చెట్టు. ఆకులు మాను చివర గుంపుగా, పొడవైన మట్టలతో వర్తులాకారంలో ఏర్పడతాయి. మట్టల అంచులు నల్లని రంపం వలే ఉంటాయి. ఆడ, మగ పూలు గెలల వలె వేర్వేరు చెట్లపై ఏర్పడతాయి. కాయలు గుండ్రంగా, తియ్యని ముంజెలు కలిగి ఉంటాయి. పండిన కాయలు ఎరుపు రంగు గుజ్ౙుతో నిండిన పీచుగల టెంకలు కలిగి ఉంటాయి. ఈ టెంకల నుండి తేగలు వస్తాయి. ఈ చెట్టుని టెంకల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

సాధారణ నామం : టాడీ పామ్, పామైరా పామ్ శాస్త్రీయ నామం : బొరాసెస్‌ఫ్లాబెల్లిఫర్ కుటుంబం: ఆరికేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • తాటి ఆకులు, వేర్లు, పండ్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. పండ్లలో ఇనుము, ప్రోటీన్లు, సుక్రోస్, గ్లూకోస్, బూడిద, థయమిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ సి, పీచు పదార్థం ఉంటాయి.
  • తాటి చెట్టు శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధుల నివారణకు, సులువుగా మూత్ర విసర్జనకు ఉపయోగపడుతుంది. తాటి ఆకులపై ముక్కు పొడుం రంగులో వచ్చే దూది వంటి నూగును దెబ్బల వల్ల కలిగే గాయాలకు కడితే రక్తస్రావాన్ని ఆపుతుంది.
  • మధుమేహ వ్యాధికి, నొప్పి లేని పుండ్లకి, చర్మవ్యాధులకు, విషానికి విరుగుడుగా ఉపయోగపడుతుంది. కొద్దిగా పులిసిన ద్రవం (నీరా) మూత్రాన్ని సులువుగా జారీ చేయుటకు, విరేచన కారిగా పనిచేస్తుంది.

వ్యవసాయరంగంలో …

  • తాటి చెట్టు తాజారసాన్ని కంబోడియాలో ఆహారధాన్యాలకు బదులుగా ఆహారంగా పందులకు, కోళ్ళకు ఇస్తున్నారు.
  • గ్రామీణ ప్రాంతాలలో తాటి చెట్టు ఆకులను ఇళ్ళు, దడుల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
  • తాటి చెట్ల కాండాన్ని కలపగా ఉపయోగిస్తారు. కొయ్యని ఇళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తారు (కియుబోరిన్, 1998)*

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… పపటాకు

పపటాకు 1.8 మీటర్ల ఎత్తు పెరిగే వార్షిక మొక్క. ఇది విపీరతంగా పెరిగి కలుపు మొక్కలా తయారవుతుంది. ఆకులు వ్యతిరేక దిశలో ఏర్పడి 3 నుండి 5 అండాకారంలో వున్న చిన్న ఆకులు కలిగి వుంటాయి. మొక్క సంవత్సరంలో ఏ సమయంలోనైనా పూయవచ్చు. పూలు పొడవాటి కాడల మీద చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు కొద్దిగా వంకరగా, బిర్రుగా, గరుకుగా, నలుపు కడ్డీలులాగా వుంటాయి. కాయలు నక్షత్రం ఆకారంలో గుండ్రని గరుకైన అంచులు కలిగి సుమారు 1-2 సెం.మీ. వ్యాసంలో వుంటాయి. ఉత్తర భారతదేశంలో లేత ఆకులు, కొమ్మలను చేపల కూరలో చేపలతో కలిపి వండుకు తింటారు.

సాధారణ నామం : బ్లాక్ జాక్ / బెగ్గర్‌టిక్ శాస్త్రీయ నామం : బిడెన్స్ పైలోసా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • పపటాకు ఫార్ములేషన్ యాంటి డయాబెటిక్ డ్రగ్స్‌తో కలిపి వాడితే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులలో డయాబెటిస్ నియంత్రణలో వుంటుంది.
  • చైనాలో, ఈశాన్య ఉత్తర భారతదేశంలో ప్రజలు ఔషధంగా ఉపయోగిస్తారు. మొత్తం మొక్క లేదా వివిధ భాగాలను వాపు, రోగనిరోధక సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, కీళ్ళ నొప్పులు, అంటువ్యాధులు, క్యాన్సర్లు, గాయాలు వంటి 40 జబ్బులకు పైగా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • దక్షిణాఫ్రికాలో దీనిని పందులకు మేతగా ఉపయోగిస్తారు.
  • పపటాకు ఎసిటోన్ ద్రావణాన్ని చిక్కుడు గింజల నిల్వదశలో ఆశించే అకాంతో సెలిడెస్ ఒబ్టెక్టస్, జాట్రోటెస్ సబ్‌సాసియేటస్ పురుగుల నివారణలో మొట్టమొదటిసారిగా ఉపయోగించి 100 శాతం నివారణ సాధించారు. పపటాకు ఒక అద్భుతమైన వృక్ష సంబంధ పురుగుమందు. దీనిని అధిక పరిమాణంలో లెగ్యూమ్ జాతి పంటల ధాన్యాన్ని పురుగులాశించకుండా నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. (రేణుక, ఆమె అనుచరులు, 2014) రసాయన పురుగుమందులకు ఈ కలుపు మొక్క ఒక అద్భుత ప్రత్యామ్నాయం.
  • పపటాకు తాజా ఆకులనుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ బంబార వేరుశనగ నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్‌ను, శిలీంద్రాలు ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, ఫ్యుజేరియం, మ్యూకార్‌లను సమర్థవంతంగా నివారించింది. పపటాకు ఎసెన్షియల్ ఆయిల్ పురుగు, శిలీంద్ర నాశక లక్షణాలు ఈ పరిశోధన ద్వారా విశదమయ్యాయి (అగస్టిన్‌గేడౌమ్, అతని అనుచరులు, 2016)
  • పపటాకు తాజా ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యాన్ని పురుగులాశించకుండా కాపాడుతుంది (ఆగస్టిన్ గేడౌమ్, అతని అనుచరులు, 2016)
  • పేనుబంక, లద్దె పురుగులు, చెదల నివారణకు మొత్తం మొక్క, దాని గింజలనుపయోగించి ఫార్ములేషన్ తయారు చేసుకోవచ్చు. మొదట ముదిరిన గింజలను నీటిలో 10 ని॥ మరిగించాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం నీటితోపాటు చిన్న సబ్బు ముక్క లేదా కొంచెం సబ్బు పొడి కలపాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి నారుమడి, కూరగాయల పం\ల్లో పిచికారి చేయవచ్చు. మొత్తం మొక్కను కూడా బాగా దంచి రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచి, మరునాడు వడపోసి పిచికారి చేసే ముందు చిన్న సబ్బు ముక్క కలిపి పిచికారి చేయవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… ముళ్ళగోరింట

ముళ్ళగోరింట గుబురుగా 50-70 సెం.మీ. వరకు పెరిగే బహువార్షిక పొద. దీని కాండంపైన తెల్లటి ముళ్ళు ఉంటాయి. ఆకులు అండాకారంలో కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. కొమ్మ చివర పూలు, నారింజ పసుపు రంగులో గుత్తులు, గుత్తులుగా ఏర్పడతాయి. ఆకర్షణ పత్రాలకు 2-3 సెం.మీ. పొడవు గల గొట్టం ఉంటుంది. వీటి కాయలు తేమ తగలగానే టప్‌మని శబ్దం చేస్తూ పగులుతాయి. బార్లెరియాస్ట్రెåగోసా నీలిరంగు పూలను, బార్లెరియాక్రిస్టేట తెల్లటి పూలను పూస్తుంది.

సాధారణ నామం : వజ్రదంతి/నీలాంబరం/గొబ్బి/ఎల్లోనెయిల్‌డై శాస్త్రీయ నామం : బార్లేరియా ప్రయోనిటిస్, బార్లేరియా స్ట్రెåగోసా, బార్లేరియా క్రిస్టే కుటుంబం: అకాంథేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొక్కలోని అన్ని భాగాలు, వేర్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
  • మొక్క చేదుగా ఉంటుంది. దీనిని చర్మవ్యాధులు, బొల్లి, నొప్పులు, వాపులు, శ్వాసకోశవ్యాధులు, దంత వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్లను దగ్గునివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • ముళ్ళ గోరింట మిథనాల్ ద్రావణం స్ట్రెప్టోకోకస్‌న్యుమేనియే, స్టెఫైలోకోకస్ ఆరియస్, సూడోమోనాస్ ఈరూజినోసా, స్ట్రెప్టోకోకస్ పయోజెనెస్, హీమోఫైలస్ ఇన్‌ఫ్లుఎంజా, కాండిడాఆల్బికాన్స్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్‌లను గరిష్టంగా అరికట్టింది (అజీత్‌సింగ్ అండ్ నవనీత్, 2016)
  • ముళ్ళగోరింటలో సపానిన్, టానిన్, ఫ్లేవనాయిడ్, ఆల్కలాయిడ్, గ్లెåకోసైడ్, ఫినాలిక్ కాంపౌండ్స్ కలిగి ఉండి సమర్ధవంతమైన యాంటి ఆక్సిడెంట్, యాంటి మైక్రోబియల్, యాంటి ఇన్‌ఫ్లమేటరి, హెపటోప్రొటెక్టివ్, గ్యాస్ట్రోప్రొటెక్టివ్ ఏజంట్ లక్షణాలను కలిగి ఉంటుంది (తాలూక్‌దార్, అతని అనుచరులు, 2015)
  • ముళ్లగోరింట మొక్క ద్రావణంలో ఆల్కలాయిడ్స్, సపోనిన్స్, స్టిరాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లెåకోసైడ్స్, టానిన్స్, రెసిన్స్, ఫినాలిక్ కాంపౌండ్స్ కలిగి ఉంటాయి. ఈ మొక్క క్రూడ్ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్ పెరుగుదలను గరిష్టంగాను, స్ట్రెప్టోకోకస్ పయోజెనెస్ పెరుగుదలను కనిష్టంగాను అరికట్టింది (అజిత్‌సింగ్ అండ్ నవనీత్, 2017).
  • ముళ్ళగోరింట ద్రావణం యాంటి మైక్రోబియల్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. స్ట్రెప్టోకోకస్‌న్యుమోనియే ట స్టెఫైలోకోకసఆరియస్ ట సూడోమోనాస్ ఈరూజినోసా ట స్ట్రెప్టోకోకస్‌పయోజెనెస్ ట హీమోఫిల్లస్ ఇన్‌ఫ్లుయెంజే ట క్యాండిడా ఆల్బికాన్స్ (అజీత్ సింగ్, అతని అనుచరులు, 2016).
  • ముళ్ళగోరింట ద్రావణం జపనీస్ ఎన్‌సిఫలైటిస్ వెక్టర్, క్యూలెక్స్ ట్రైటీనియోరింకస్‌పై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. (జెయశంకర్, అతని అనుచరులు).
  • ముళ్ళగోరింట ఆకు ద్రావణం ద్వారా తయారు చేసిన సిల్వర్‌నానో పార్టికల్స్ పురుగు మందులను రైతులు ప్రస్తుతం పురుగుల నివారణలో సమర్ధవంతంగా ఉపయోగిస్తున్నారు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వ్యాధిని బట్టి వెల్లుల్లి రకం

ప్రకృతి ప్రసాదించిన వెల్లుల్లిలోని ఎలిసిన్‌… అంటువ్యాధులు, శ్వాసకోశ రుగ్మతలపై పనిచేస్తుంది. గంధక ధాతువులు.. అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. సెలీనియం క్యాన్సర్‌ కణాలవ్యాప్తిని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్లు గుండె ధమనులను కాపాడతాయి. యాంటీఆక్సిడెంట్లు మధుమేహం, వృధ్ధాప్యం మీద పనిచేస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. వెల్లుల్లిపై సరికొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. వెల్లుల్లికి ఉన్న ఈ సహజ రోగ నిరోధక లక్షణాలను నానో టెక్నాలజీతో మరింత ఇనుమడింపజేయవచ్చని అలహాబాద్‌ విశ్వవిద్యాలయ ఆచార్యుడు కె.ఎన్‌. ఉత్తమ్‌ నిర్ధారించారు. ఆయన ఆధ్వర్యంలో పరిశోధకులు వెల్లుల్లి మొక్కపై టైటానియం డయాక్సైడ్‌ నానో పార్టికిల్స్‌ను ప్రయోగించారు. ఈ నానో అణువులు వెల్లుల్లిలోని పోషక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. ఫలితంగా వెల్లుల్లిలో గంధకం, భాస్వరం, క్యాల్షియం, జింక్‌, ఇనుము ధాతువులు సాధారణం కన్నా ఎక్కువగా ఏర్పడ్డాయి. యాంటీ ఆక్సిడెంట్లు 30 నుంచి 40 శాతం పెరిగాయి. వెల్లుల్లిలోని ఏ ధాతువు ఏ వ్యాధి చికిత్సకు తోడ్పడుతుందో నిర్ధారించుకుని ఆయా రోగాల చికిత్సకు పరిశోధనశాలలో వేర్వేరు వెల్లుల్లి రకాలను రూపొందించి పొలాల్లో సాగు చేయించాలని ఉత్తమ్‌ బృందం యోచిస్తోంది. ఇలాంటి రకాలకు పేటెంట్లు తీసుకుని రెండేళ్లలో రైతులకు అందించాలనుకుంటున్నమని ఉత్తమ్‌ చెప్పారు.

Read More