సమస్య:

  1. ఏటిక పాములు (ASCARIA) తల్లి గర్భంలో వుండగానే పిండంలోకి ప్రవేశిస్తాయి.
  2. దూడ చిన్న ప్రేగులలో చేరి 10 రోజులలో పెద్దవై గ్రుడ్లు పెట్టటం మొదలు పెడతాయి.
  3. ఈ ఏటిక పాములు దూడల పొట్టలోకి కొన్ని విషపదార్థాలను విరజిమ్ముతాయి.

కారణాలు :

  1. ఏటిక పాములు తెల్లగా, గుండ్రంగా, బారుగా వుంటాయి.
  2. ఏటిక పాముల గుడ్లతో కలుషితమైన ఆహారం తినటం, నీరు త్రాగటం.
  3. త్రాగే నీటి వలన అవి ప్రేగులలో స్థావరం ఏర్పరచుకొని, తిరిగి కొన్ని లక్షల గుడ్లు పెట్టటం ద్వారా వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి.

పేడ పరీక్షించి వ్యాధి నిర్ధారించవచ్చు

పరిష్కారాలు:
హోమియో: ఏదైనా ఒక మందు
కాల్కేరియా కార్బ్ 30 మందు 10 మాత్రలు చొ॥ 2 వారాలకొకసారి తినిపించాలి. లేదా సిన / మెర్క్ సాల్/ సాంటోనినం / నేట్రం ఫాస్ / అబ్రోటనం / టెల్లురియం 30 పొటెన్సీ మందులలో ఏదైనా ఒక మందు 10 మాత్రలు చొప్ప్పున 5 రోజులు తినిపించాలి.

అల్లోపతి:
ఏటిక పాముల నివారణ

  1. మొదటిసారి 8వ రోజున పైపరజిన్ ఆడిపేట్ (PIPERAZINE ADIPATE) 10 గ్రా॥ పొడిని గానీ, 10 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
  2. రెండవ సారి 20 వ రోజున పైపరజిన్ ఆడిపేట్ (PIPERAZINE ADIPATE) 10 గ్రా॥ పొడిని గానీ, 10-15 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
  3. మడవ సారి 40 వ రోజున ఎఫ్ – జోల్ (F-ZOLE) 10 గ్రా॥ పొడిని గానీ, 10 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
  4. నాలుగవ సారి 60 వ రోజున ఎ జోల్ (A-ZOLE) 10 గ్రా॥ పొడిని గానీ, 10 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
  5. అయిదవ సారి 90 వ రోజున ఎఫ్ – జోల్ (F-ZOLE) 10 గ్రా॥ పొడిని గానీ, 15 మి.లీ. ద్రావణం గానీ త్రాగించాలి.
  6. ఆరవ సారి 6 నెలలకు ఆల్బెండజోల్ (ALBENDAZOLE) 150 మి.గ్రా. 2 బిళ్ళలు తినిపించాలి.
  7. లివోమిక్స్ (LIVOMIX) / లివ్ (LIVE) – 52 టానిక్ రోజుకు 50 మి.లీ. చొ॥న 5 రోజులు త్రాగించాలి.

……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.