రైతుల ఖాతాలలోకి రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన పీయం మోడి
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 18వ విడత నిధులను, మహారాష్ట్రలోని వాషిమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలలో 20 వేల కోట్లు పంపిణీ చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా నిధులను జమ చేశారు. అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయి. www.pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే కొన్ని ఆఫ్షన్లు కనిపిస్తాయి. ఇందులో బెనిఫిషరీ లిస్ట్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్ చేస్తే ఆ గ్రామంలోని లబ్దిదారుల జాబితా వస్తుంది. ఆ జాబితాలో పేరు ఉందంటే ఆ రైతు బ్యాంకు ఖాతాలో 2000 రూపాయల డబ్బులు జమ అవుతాయి.



